
తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్
Bigg Boss Telugu 6, Episode 88: ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే కొట్టాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్‌మేట్స్. అయితే మొదట్లోనే ఆటలో అవుట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయలకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. 'రంగు పడితే రివైవల్' గేమ్‌లో గెలిచినవారు తిరిగి రేసులో పాల్గొంటారని చెప్పాడు. ఈ గేమ్‌లో ముగ్గురమ్మాయిలు పోటాపోటీగా ఆడగా కీర్తి గెలిచి తిరిగి రేసులో నిలబడింది.
అనంతరం శ్రీసత్య, ఇనయ మినహా పోటీలో ఉన్న మిగతా ఆరుగురు 'జెండాల జగడం' అనే గేమ్‌లో పాల్గొన్నారు. ఈ ఆటలో రేవంత్, ఆదిరెడ్డి తొలి రెండు స్థానాల్లో, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనే నలుగురి సభ్యులు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో హౌస్‌మేట్స్ డీలా పడ్డారు. ఎంతో కీలకమైన టికెట్ టు ఫినాలే గేమ్‌లో ఏకాభిప్రాయం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.
నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తే మాత్రం ఏ ఒక్కడినీ గెలవనివ్వను అని శ్రీహాన్ వార్నింగ్ ఇవ్వగా నాదీ అదే మాట అంటూ వంత పాడాడు రేవంత్. ఆడి ఓడిపోయినా సర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల అసలు ఆటనే ఆడకపోవడం తట్టుకోలేమన్నాడు రోహిత్. దీంతో బిగ్‌బాస్.. ఆటలో లేని ఇనయ, శ్రీసత్యలను ఎవరు గేమ్‌లో ఉండాలి? ఎవరు గేమ్ నుంచి తప్పుకోవాలో డిసైడ్ చేయమన్నాడు. దీంతో వాళ్లు గత గేమ్‌లో చివరి ర్యాంకింగ్‌లో ఉన్న కీర్తి, రోహిత్‌లను ఆటలో నుంచి తొలగించారు. వారి నిర్ణయంపై కీర్తి రుసరుసలాడింది. ఇనయ వెళ్లి తనతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా అది కాస్తా గొడవగా మారింది. దీంతో అటు కీర్తి, ఇటు ఇనయ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రోహిత్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకోవడంతో శ్రీసత్య అతడి నిజాయితీని పొగడకుండా ఉండలేకపోయింది.
ఇక బ్యాలెన్స్ ద స్కోర్స్ గేమ్‌లో ఫైమా మొదట అవుట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్ మార్కుల పట్టికను విడుదల చేశాడు. ఇందులో ఆదిరెడ్డికి 9, రేవంత్‌కు 8, శ్రీహాన్‌కు 6, ఫైమా 5 పాయింట్స్‌తో వరుస స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
చదవండి: నన్ను సైడ్ చేస్తే ఎవ్వడినీ గెలవనివ్వను: శ్రీహాన్
పుష్ప సినిమా చూశా.. కానీ ఆ హీరో ఎవరో తెలియదు: నటి