Bigg Boss 6 Telugu: Contestants feel that Keerthi will get eliminate - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: కీర్తిని తక్కువ అంచనా వేస్తున్న కంటెస్టెంట్లు, ఝలక్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్‌

Published Fri, Dec 16 2022 3:42 PM | Last Updated on Fri, Dec 16 2022 4:10 PM

Bigg Boss 6 Telugu: Contestants Feel That Keerthi Will Get Eliminate - Sakshi

ఏ బుధవారమో, గురువారమో మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ జరుగుతుందనుకుంటే దాన్ని శుక్రవారం దాకా లాక్కొచ్చాడు బిగ్‌బాస్‌. కానీ ఎలిమినేట్‌ కానుంది ఎవరో ఆల్‌రెడీ సోషల్‌ మీడియాలో లీకైంది. శ్రీసత్య ఈరోజు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పెట్టాబేడా సర్దుకుని రావడం ఖాయమని తెలిసిపోయింది. కానీ బిగ్‌బాస్‌ మాత్రం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో గెస్‌ చేయండని ఇంటిసభ్యులను అడిగాడు.

ఇందుకు శ్రీహాన్‌.. రోహిత్‌ పేరు చెప్పగా, ఆదిరెడ్డి, శ్రీసత్య.. కీర్తి వెళ్లిపోతుందని, కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్‌ అవుతాడేమోనని అభిప్రాయపడ్డారు. 'మెజారిటీ ఇంటిసభ్యులందరూ కీర్తిని టాప్‌ 5కి అనర్హురాలుగా భావించారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో ఎలిమినేట్‌ కానుంది ఎవరంటే...' అన్న సస్పెన్స్‌తో ప్రోమో ముగించాడు బిగ్‌బాస్‌. ఇక హౌస్‌మేట్స్‌కు ఝలక్‌ ఇస్తూ కీర్తికి బదులుగా శ్రీసత్యను ఎలిమినేట్‌ చేయనున్నారు. అప్పుడు కంటెస్టెంట్ల ఎక్స్‌ప్రెషన్‌ ఏంటో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ చూసేయాల్సిందే!

చదవండి: నా తప్పులు క్షమించి విన్నర్‌ను చేయండి: శ్రీసత్య
ఇనయకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్‌ అవుతున్న ఫోటో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement