
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్ బ్రేక్ చేసి గీతూ తనకు నచ్చిన విధంగా గేమ్ ఆడి హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపిస్తుంది. చివరగా ఆమె స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అయింది అన్నది బిగ్‌బాస్ సీజన్-6 17వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం.
బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్,ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, , రాజ్‌లు పోలీసులుగా వ్యవహరించగా,వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య,రేవంత్, ఆరోహి, సుదీప, , అర్జున్‌లు దొంగలుగా వ్యవహరించారు. గీతూ అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా వ్యవహరించింది. ఇందులో బజర్ సౌండ్‌ని బట్టి దొంగలు అడవిలో దొంగతనం చేయడం, రైడ్ చేసి వాళ్లని పట్టుకోవడం పోలీసుల వంతు. ఇక ఈ గేమ్‌లో ఇనయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది.
ఇనయా నోరుజారి వాళ్లను వాడు, వీడు అని అనడంతో మాటలు జాగ్రత్త.. ఇంట్లొ మ్యానర్స్ నేర్పలేదా అంటూ రేవంత్ ఫైర్ అవుతాడు. తర్వాత ఇనయా సారీ చెప్పడంతో శ్రీహాన్ కూల్ అవుతాడు. ఇదిలా ఉండగా దొంగల నుంచి బొమ్మలు కొనుక్కోవాలని రూల్ బుక్‌లో ఉన్నా.. నా గేమ్ నా ఇష్టం అన్నట్లు గీతూ వ్యవహరించింది. ఆల్రెడీ దొంగలు తీసుకున్న బొమ్మలను వారికి తెలియకుండా దొంగతనం చూసి రూల్స్ బ్రేక్ చేస్తుంది గీతూ. ఎవరెన్ని చెప్పినా అది తన గేమ్ స్ట్రాటజీ అంటూ గీతూ నచ్చినట్లు మాట్లాడుతుంది.
ఇక దొంగలతో డీల్ కుదుర్చుకునే క్రమంలో ఒక్కో బొమ్మకు 200అని పైసా కూడా ఎక్కువ ఇవ్వనంటూ గీతూ ఆర్డర్ వేస్తుంది. మొదటగా శ్రీహాన్ ఆమెకు బొమ్మలు అమ్మాడు. ఇక టైం ఎక్కువగా లేకపోవడంతో టాస్క్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు బిగ్‌బాస్ ఆదేశించాడు. మరి ఈ టాస్కులో ఎవరు గెలిచారన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment