Arjun Kalyan
-
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా..
బిగ్‌బాస్ 8వ సీజన్లో వచ్చినంత మంది గెస్టులు మరే సీజన్లోనూ వచ్చి ఉండరు. ఫ్యామిలీ వీక్ దగ్గరి నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. రెండువారాల క్రితం పాత సీజన్ కంటెస్టెంట్లు, గత వారం సెలబ్రిటీలు రాగా ఇప్పుడు బుల్లితెర తారలు హౌస్‌లోకి వస్తున్నారు.బిగ్‌బాస్ హౌస్‌లో అర్జున్ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. త్వరలో ప్రారంభమవుతున్న కొత్త సీరియల్ జంటను లోనికి తీసుకొచ్చారు. నటి పెద్దగా పరిచయం లేదేమో కానీ అర్జున్ కళ్యాణ్ మాత్రం ఇదివరకే తెలిసిన వ్యక్తి! అతడు గతంలో బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.ఫైనలిస్టులతో గేమ్ఈ సీరియల్ జంటతో పోటీపడి గెలిస్తే ప్రైజ్‌మనీలో కొంత డబ్బు యాడ్ చేస్తానన్నాడు బిగ్‌బాస్. అలాగే మరో సీరియల్ జంట ప్రభాకర్, ఆమని కూడా వచ్చారు. వీళ్లు కూడా కంటెస్టెంట్లతో కలిసి గేమ్స్ ఆడారు. ఫినాలే వీక్ కాబట్టి ఈ వారం గొడవలు గట్రా ఏమీ ఉండవు. కేవలం ఇలాంటి ఫన్ గేమ్స్, ఎమోషనల్ ఏవీ జర్నీ వీడియోలు మాత్రమే ఉండనున్నాయి. చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్ -
విడుదలకు సిద్ధమైన ‘బాబు’
అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్గా రాబోతోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్లు. -
నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్
బిగ్ బాస్ సీజన్-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని కేవలం ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఆమె మెరుగ్గానే ఆటలో తన సత్తా చూపినప్పటికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో చాలామంది ప్రేక్షకులు నయని పావని ఎలిమినేషన్‌ను ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. అమెను హౌస్ నుంచి పంపించడం చాలా అన్యాయం అని పలువురు కామెట్లు చేయగా.. యాంకర్ శివ కూడా ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తెలిపాడు. ఓటింగ్‌కు, ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు తాజాగా బిగ్‌బాస్- 6 కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కూడా నయని పావని ఎలిమినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు. నయని పావని ఎలిమినేట్ కావడంపై అర్జున్ కల్యాణ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా స్పందించాడు. నయని పావనీని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో విలువను కోల్పోయింది అన్నాడు. ఆమె ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, అది తనను ఎంతగానో బాధించిదని తెలిపాడు. ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇలా జరగడం కరెక్ట్ కాదని చెప్పాడు. దీంతో బిగ్‌బాస్ క్రెడిబిలిటీ దెబ్బతినడమే కాకుండా షో నిర్వాహుకులకు భారీ నష్టమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రేక్షకులు వేసే ఓటింగ్‌కు, కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరాడు. బిగ్‌బాస్ అన్ని సీజన్స్ కి సంబంధించిన ఓటింగ్, ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిల్ దాఖలు చేయాలని అర్జున్ కల్యాణ్ పేర్కొన్నాడు. కోర్టులు ఖాళీగా లేవు దీంతో అర్జున్ కల్యాణ్‌కు పలువురు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు సందించారు. ఇలాంటి పిల్స్ తీసోకోవడానికి కోర్టులు ఖాళీగా లేవని ఒకరు రాసుకొచ్చారు. దీంతో అర్జున్ ఇలా తిరిగి రిప్లై ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలామంది తెలుగువారు ఈ షో చూస్తున్నారు. ఆపై ఓట్లు కూడా వేస్తున్నారు. కానీ వారి ఓట్లకు విలువ లేకుండా ఇలాంటి నిర్ణయాల తీసుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురౌతున్నారు. దీంతో కంటెస్టెంట్స్ కూడా నష్టపోతున్నారు. (ఇదీ చదవండి: అమర్ దీప్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. లండన్‌లో స్టడీస్, పొలిటికల్ ఫ్యామిలీ ఇంకా మరెన్నో..) కేవలం ఓట్ల వల్లే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతూ ఇలాంటి తప్పుడు చర్యలతో బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఎలిమినేషన్స్ వల్ల వారికి కావాల్సిన టీఆర్పీ వస్తుంది. మా సీజన్లో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. అలా బిగ్‌బాస్‌పై బజ్ క్రియేట్ చేశారు. ఈ కారణాలు చాలవా పిల్ ఫైల్ చేయడానికి.' అంటూ అర్జున్ అభిప్రాయం చెప్పాడు. బిగ్‌బాస్ అగ్రిమెంట్ సీక్రెట్ ఇదే ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరో నెటిజన్ ప్రశ్నించాడు. మీ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అర్జున్ను తప్పుపట్టారు. దీంతో ఆయన ఇలా తిరిగి సమాధానం ఇచ్చాడు. ' నేను ఎలిమినేషన్ సమయంలో బిగ్‌బాస్ వారు ఇచ్చిన అగ్రిమెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్నాను. నేను ఎలిమినేషన్ అయిన తర్వాత అసలు విషయం తెలిసింది. బిగ్‌బాస్ -6లో నేను ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు. ఇదే విషయం నాకు ఎంతో ఆలస్యంగా తెలిసింది. బిగ్‌బాస్ అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది. హౌస్‌లోని ఒక కంటెస్టెంట్‌ను ఎప్పుడైనా, ఎలాగైనా, ఎటువంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేసే అధికారం షో నిర్వాహుకులకు ఉంటుంది.' అని అర్జున్ సెన్సేషనల్ విషయాన్ని తెలిపాడు. ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ వల్ల మాత్రమే జరగవు. హౌస్‌లో వాళ్లు ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు అనే విషయంపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్ అసలు గుట్టు ఇదా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ కల్యాణ్ వ్యాఖ్యలకు బిగ్‌బాస్ టీమ్ ఏమైన సమాధానం చెబుతుందేమో తెలియాల్సి ఉంది. Felt really bad for #NayaniPavani. She didn't deserve it for sure. Huge loss for the show and their credibility. Hope ppl realize now that there is no link between voting and eliminations. Somebody should file a PIL to show the votings of all seasons and eliminations.… — Arjun Kalyan (@ArjunKalyan) October 15, 2023 @ArjunKalyan meeru eliminate ayinappudu enduku adagaledu evariki enni votes vachayo chupinchamani..if you remember BB season 3 Ali Reza ane contestant ki voting motham chupincharu ani tane last lo unnadu ani tane cheppadu..meeku guts leva adagadaniki appudu?? — Jagadeesh Bandaru (@NenuJagadeesh) October 15, 2023 -
బేబి సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ డైరెక్టర్ ఆ మాటనడంతో బాధేసింది!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్ కల్యాణ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్‌బాస్‌కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్ చేసింది. డైరెక్టర్ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్ చేశాడు. ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్‌బాస్ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్ లేకపోయినా సరే.. నా టాలెంట్ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్ కల్యాణ్. చదవండి: జైలర్ సినిమాకు షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో.. -
ముద్దు పెట్టుకోబోయిన నాగ్, మెలికలు తిరిగిన ఫైమా
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఓ ఐదు అవార్డులను ప్రవేశపెట్టిన నాగ్ వాటికి ఎవరు అర్హులో చెప్పాలని ఫైనలిస్టులను ఆదేశించాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డును ప్రవేశపెట్టాడు. ఇది మెరీనాకు సరిగ్గా సూటవుతుందన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే తను గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు. చదవండి: పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి బిగ్‌బాస్ 6 గ్రాండ్ ఫినాలే.. లైవ్ అప్డేట్స్ -
అర్జున్ కల్యాణ్‌కు నేనంటే ప్రేమ.. వీడియో చూసి షాకైన శ్రీసత్య
గ్రాండ్ ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన శ్రీసత్యకు బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఫినాలేకు చేరకుండానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆమెను బయటకు పంపించేశాడు. దీంతో హౌస్‌ను వీడలేక వీడి వచ్చేసింది శ్రీసత్య. తాజాగా ఆమె బిబి కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముందుగా యాంకర్ శివ మాట్లాడుతూ.. శ్రీహాన్ మారిపోయాడంటున్నావేంటి అని అడిగాడు. అందుకు శ్రీసత్య.. అతడు మారడం తప్పనట్లేదు. కానీ సడన్‌గా ఫ్లిప్ అయ్యాడని చెప్పింది. వెంటనే అందుకున్న శివ.. ఫ్లిప్పింగ్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావా? అని సెటైర్ వేశాడు. గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను ఫుడ్ మీద కోపం చూపించలేదని బదులిచ్చింది. అలాగే ఓసారి శ్రీహాన్, నేను కావాలనే ఇనయను రెచ్చగొట్టామంది. కాకపోతే అది గేమ్‌లో భాగంగానే స్పష్టం చేసింది. శ్రీహాన్, నువ్వు, రేవంత్ కావాలని బ్యాచ్‌గా ఏర్పడినట్లు అనిపించిందన్న శివ.. మీరు కావాలని గొడవలు పెట్టుకుంటారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అవాక్కైన శ్రీసత్య.. ఫ్రెండ్సంటే కొట్టుకుంటారు కదా, అందులో తప్పేముందన్నట్లుగా ఫేస్ పెట్టింది. దీనికి శివ స్పందిస్తూ ఫ్రెండ్స్ తప్పులను వారి వెనకాల వెళ్లి చెప్పడం ఫ్రెండ్షిప్ కానే కాదని కుండ బద్ధలు కొట్టాడు. తర్వాత అర్జున్ కల్యాణ్ గురించి అడగ్గా డీసెంట్ బాయ్ అని చెప్పింది శ్రీసత్య. తనకు తెలిసినంతవరకు అతడికి నేనంటే ఇష్టం, ప్రేమ ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇంతలో శివ ఓ వీడియో చూపించాడు. అందులో అర్జున్.. ఎలాగో నేను శ్రీసత్య వెనకాల తిరుగుతున్నాను. నువ్వు నా వెనక పడితే కంటెంట్‌కు మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేది కదా అంటూ వాసంతితో మాట్లాడాడు. ఈ వీడియో చూపించిన శివ.. అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్ అని చెప్పగా శ్రీసత్యకు నోట మాట రాక షాక్‌లో ఉండిపోయింది. చదవండి: శ్రీసత్య ఎలిమినేట్, క్షమించని వేడుకున్న శ్రీహాన్ శ్రీసత్య పారితోషికం ఎంతో తెలుసా? -
'బిగ్‌బాస్' తర్వాత ట్రాక్ మారిందా? అర్జున్‌కు ముద్దు పెట్టేసిన వాసంతి
బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా లవ్ ట్రాక్‌లు ప్రతి సీజన్లో హైలైట్‌గా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6లోనూ సత్య-అర్జున్ కల్యాణ్‌ల లవ్ యాంగిల్ ప్రత్యేకంగా నిలిచింది. తన గేమ్ ఆడటం కూడా మర్చిపోయి సత్య ప్రేమలో పడిపోయిన అర్జున్ 7వ వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. హౌస్‌లో ఉన్నంతసేపూ సత్య-సత్య అంటూ తిరిగిన అర్జున్ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ప్లేట్ మార్చిసినట్లు కనిపిస్తుంది. మరో కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్‌తో ఈమధ్య షికార్లు చేస్తున్న అర్జున్ రీసెంట్గా ఓ షోలో పాల్గొన్నాడు. ఇదే షోకు వాసంతి కూడా వచ్చింది. అయితే టాస్క్‌లో భాగంగా వాసంతి కాకరకాయ జ్యూస్ తాగాల్సి రాగా, తను తాగకుండా అర్జున్‌కు తాగమని ఇస్తుంది. వాసంతి కోసం అర్జున్ కరేలా జ్యూస్ తాగుతాడు. దీనికి ఇంప్రెస్ అయిన వాసంతి వెంటనే అతడి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
సినిమాలు, సిరీస్‌లతో అర్జున్ కల్యాణ్ బిజీబిజీ!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో అడుగుపెట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో అర్జున్ కల్యాణ్ ఒకరు. అయితే ఆటకు అదృష్టం కూడా తోడైతేనే హౌస్‌లో ఉండగలరు. ఈ రెండూ అతడికి కలిసి రాకపోవడంతో ఏడో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు అర్జున్. ఒకసారి అతడి నేపథ్యం ఏంటో చూసేద్దాం.. అర్జున్ కల్యాణ్ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమమ్, వరుడు కావలి, ప్లే బాక్ వంటి సినిమాలలో అర్జున్ చేసిన పాత్రలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి వంటి వెబ్ సిరీస్‌లతో మరింత ఆదరణ లభించింది. ప్రస్తుతం అతడు మాటే మంత్రము, బాబు - నెంబర్ 1 బుల్ షిట్ గయ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమాతో పాటు ఓ వెబ్‌సిరీస్ చర్చల దశలో ఉంది. ఇలా నటుడిగా ఆదరణ పొందుతున్న సమయంలో బిగ్‌బాస్ షో అర్జున్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ షోలో తనను ఎంతగానో ఆదరించిన ఆడియన్స్ మున్ముందు తాను చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లను కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాడు అర్జున్. చదవండి: మచ్చలేని మనిషి.. రోహిత్‌కు దండాలు పెడుతున్న ఆడియన్స్ ప్రముఖ నటి కన్నుమూత, రాష్ట్రపతి సంతాపం -
నువ్వు కన్నింగ్.. యాంకర్ మాటకు షాకైన అర్జున్
బిగ్‌బాస్ కోసం శ్రీసత్య సినిమా ఛాన్స్ వదులుకుంది. కానీ శ్రీసత్య కోసం అన్నీ వదులుకుని బిగ్‌బాస్ షోకి వచ్చాడు అర్జున్ కల్యాణ్. నిత్యం ఆమె నామస్మరణలోనే ఉంటూ ఆటను పక్కనపెట్టేశాడు. తను ఛీ కొట్టినా ఏం పర్లేదని దులిపేసుకుంటూ తన వెనకాలే పడ్డాడు. ఆమె మీద చూపించిన ఇంట్రస్ట్ గేమ్ మీద పెడితే బాగుంటుందని ఎంతమంది చెప్పినా తను మాత్రం శ్రీసత్యకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే గేమ్ ఆడటం కూడా మొదలుపెట్టాడు. కానీ అప్పటికే చాలా లేటయింది. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిపోయిన జనాలు హౌస్ నుంచి పంపించేశారు. ఏడోవారంలో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన అర్జున్ తాజాగా బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ముందుగా యాంకర్ శివ మాట్లాడుతూ.. జనాల ప్రేమ, ఆదరణ పొందడానికి బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని మొదటి రోజు చెప్పావు, కానీ వచ్చేరోజు మాత్రం శ్రీసత్యకోసమే వెళ్లానన్నావు. అంటే జనాలను మోసం చేశావా? అని అడిగాడు. దానికతడు జనాల ప్రేమ పొందడమే నాకు మొదట కావాల్సింది అని ఆన్సరిచ్చాడు. కానీ నువ్వు ఆమె ప్రేమ మాత్రమే గెల్చుకున్నావని కౌంటరిచ్చాడు యాంకర్. ఇక రేవంత్ మనుషులను తక్కువ చేసి మాట్లాడతాడని, గేలి చేస్తాడని విమర్శించాడు అర్జున్. ఇనయ భూచక్రం అని, సూర్య చిచ్చుబుడ్డి, శ్రీహాన్ రాకెట్, శ్రీసత్య థౌజండ్‌వాలా అని ట్యాగులిచ్చాడు. రేవంత్‌తో మంచిగా ఉంటూనే అతడి గురించి అందరి దగ్గరా మాట్లాడావు, మరి నిన్ను కన్నింగ్ అనకూడదా? అని ప్రశ్నించగా అది నా గేమ్ అని కవర్ చేశాడు అర్జున్. -
నేను బిగ్‌బాస్‌కు రావడానికి ప్రధాన కారణం శ్రీసత్య: అర్జున్
Bigg Boss 6 Telugu, Epsiode 50: బిగ్‌బాస్ షోలో ఒకరోజు ముందుగానే దీపావళి వేడుకలు జరిగాయి. హీరోయిన్ల డ్యాన్సులు, శ్రీరామచంద్ర పాటలు, హైపర్ ఆది పంచులు.. సెలబ్రిటీ గెస్టులు అంజలి, కార్తీల రాకతో నేటి ఎపిసోడ్ సందడిగా మారింది. మరి ఆ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎలిమినేషన్ గురించి పూర్తిగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తర్వాత కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విడగొట్టాడు నాగ్. ఫైమా-రేవంత్, ఇనయ- శ్రీహాన్, శ్రీసత్య- సూర్య, మెరీనా- రోహిత్, కీర్తి-రాజ్, వాసంతి- అర్జున్, గీతూ-ఆదిరెడ్డిలు జోడీగా ఆటలాడారు. ఈ తరుణంలో ఓటీటీ సిరీస్ ఝాన్సీ ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి బిగ్‌బాస్ షోకి వచ్చి సందడి చేసింది. ఆమెను చూడగానే రేవంత్ అంజలి పాట పాడి హీరోయిన్ను ఫిదా చేశాడు. ఆమె సమక్షంలో జంటలతో డ్యాన్స్ చేయించాడు నాగ్. అది కూడా ఇచ్చిన వస్తువును ఎక్కువగా వాడుతూ స్టెప్పులేయాలన్నాడు. ఇందులో తక్కువ మార్కులు పడ్డ ఇనయ- శ్రీహాన్ గేమ్ నుంచి ఔట్ అయ్యారు. రెండో లెవల్లో అమ్మాయిలు తమ జోడీ అయిన అబ్బాయిలను లేడీస్‌గా మార్చేశారు. మీసం, గడ్డాలతో చీర కట్టులో కనిపించిన మేల్ కంటెస్టెంట్లను చూసి తట్టుకోలేకపోయాడు నాగ్. అయినా సరే తప్పక వారితో క్యాట్‌వాక్ చేయించాడు. ఈ రౌండ్లో వాసంతి- అర్జున్ కల్యాణ్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత కీర్తి, శ్రీసత్య సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం సైంటిస్ట్‌ను పిలుస్తున్నానంటూ హైపర్ ఆదిని స్టేజీ మీదకు ఆహ్వానించాడు నాగ్. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్ల మీద పంచుల వర్షం కురిపించాడు. ముందుగా గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అలా ఒక్కొక్కరి గురించి సవివరంగా చెప్తూనే సెటైర్లు వేశాడు. ఫైనల్‌గా.. ఈ సీజన్లో కంటెస్టెంట్లు టాస్కులు ఎలా ఆడదామనేదానికంటే కూడా ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అని ఎదురు చూస్తున్నారని, నామినేషన్స్ సిల్లీగా ఉంటున్నాయని వారి పరువు తీశాడు ఆది. అందరి బండారాలు బయటపెట్టిన తర్వాత బిగ్‌బాస్ షో నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. హీరోయిన్ అవికాగోర్ స్టెప్పులేయడం ముగియగానే సర్దార్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ, దర్శకుడు మిత్రన్, హీరోయిన్ రజీషా స్టేజీపై సందడి చేశారు. సర్దార్ మూవీ చూశాక చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగేందుకు భయపడుతున్నారన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. ఇక నుంచి నేను కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగను అని శపథం చేశాడు. తర్వాత కార్తీ.. ప్రేమ లేదని, ప్రేమించరాదని అని తెలుగులో అద్భుతంగా పాడాడు. హౌస్మేట్స్ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చానని చెప్పాడు. రోహిత్, బాలాదిత్యను సేఫ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. మూడో లెవల్‌కు వచ్చేసరికి మూడు జంటలే మిగిలాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ జోడీకి స్వీట్లు తినిపించాలనే టాస్కులో మెరీనా- రోహిత్, ఫైమా- రేవంత్, శ్రీసత్య- సూర్య పాల్గొన్నారు. సత్య ఎక్కువ స్వీట్లు తినడంతో ఆమె జంట విజయం సాధించగా వారికి దీపావళి కానుక అందింది. చివరగా వాసంతి, అర్జున్ నామినేషన్లో ఉండగా వీరిలో అర్జున్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో ఒక్కసారిగా సత్య, శ్రీహాన్, రేవంత్ షాక్‌లోకి వెళ్లిపోయారు. రేవంత్, సత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశారు. సత్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయిన అర్జున్ తనూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం అర్జున్‌తో ఐదు ఆటంబాంబులు, ఐదు తుస్సుబాంబులు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు నాగ్. శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమా ఆటంబాంబులు అన్నాడు. కాకపోతే రేవంత్.. ఆటంబాంబు కంటే ఎక్కువ పేలుతున్నాడు, ఫిజికల్ అవ్వకు, ఏది పడితే అది మాట్లాడి గేమ్ పాడు చేసుకోకు అని అతడికి సలహా ఇచ్చాడు. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయ, బాలాదిత్య తుస్సుబాంబులు అని చెప్పాడు. చివరగా అర్జున్ తాను బిగ్‌బాస్‌లోకి రావడానికి ప్రధాన కారణం సత్య అన్న విషయాన్ని బయటపెట్టాడు అర్జున్. శ్రీసత్యను ఒక సినిమాకు రిఫర్ చేస్తే ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పింది. ఎందుకని అడిగితే బిగ్‌బాస్‌కు వెళ్తున్నానంది. వెంటనే నేను బిగ్‌బాస్‌కు అప్లై చేశాను, వచ్చింది. ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మొదట సత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పుకొచ్చాడు అర్జున్. ఈ విషయం ఇప్పటిదాకా తనకూ తెలియదంది శ్రీసత్య. చదవండి: కొత్త కారు కొన్న హిమజ, వీడియో చూశారా? ఉదయ్‌కిరణ్‌తో ఐదు సినిమాలు చేసేదాన్ని, కానీ అంతలోనే -
బిగ్‌బాస్ విన్నర్ ఎవరో హింట్! అందరికంటే వరస్ట్ ఆమేనట!
Bigg Boss 6 Telugu, Episode 49: బిగ్‌బాస్ టైటిల్ ఎవరు గెలిచే ఆస్కారం ఉందన్న ప్రశ్నకు ఈరోజు ఎపిసోడ్ కొంచెం క్లూ ఇచ్చినట్లైంది. ఇంట్లో ఉండేందుకు ఎవరికి ఎక్కువ అర్హత ఉంది? ఎవరు అసలు ఉండాల్సిన అవసరమే లేదు? చెప్పాలని గేమ్ ఆడించాడు నాగ్. ఈ క్రమంలో ఊహించని పేర్లు డిజర్వ్ కేటగిరీలోకి రావడం విశేషం. మరి ఎవరు ఏ జాబితాలో ఉన్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే పప్పు గొడవను ప్రస్తావించాడు. అంటే ఈరోజు రేవంత్‌కు గట్టిగానే వాయింపులు ఉంటాయని హింటిచ్చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది? అని శ్రీసత్యను అడిగాడు నాగ్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్లు ఏమనుకున్నా ఓకే, కానీ గేమ్‌లో ఉన్నప్పుడు అతడిని నువ్వు ఉండ్రా పప్పు అని చిన్నచూపు చూడటం తప్పు. అందరిముందు అలా అనేసరికి అర్జున్ నువ్వేం మాట్లాడవా? అని అడిగానంది. మరి సత్య స్టాండ్ తీసుకునేదాకా నువ్వెందుకు గొడవపడలేదని అర్జున్ను నిలదీశాడు నాగ్. దానికతడు అది సరైన సమయం కాదేమోనని మొదట గొడవకు దిగలేదన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. అలా అందరి ముందు అనడం తప్పు, కానీ చనువుతోనే ఆ మాట అన్నానని రేవంత్ తన మాటకు అర్థవివరణ ఇచ్చాడు. దీంతో నాగ్.. పప్పు, పకోడి, దొబ్బేయ్.. ఇలా ఏది పడితే అది అనకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. ఇక నాగ్.. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హులెవరు? అనర్హులెవరు? అనేది కంటెస్టెంట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన శ్రీహాన్.. గీతూ అర్హురాలు, రోహిత్ అనర్హుడు అని చెప్పాడు. ► మెరీనా, వాసంతి.. సూర్య డిజర్వ్, రాజ్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నారు. ►గీతూ.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పింది. ►రేవంత్, శ్రీసత్య, అర్జున్, ఇనయ, బాలాదిత్య.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పేశారు. ►ఫైమా.. రేవంత్ డిజర్వ్డ్, మెరీనా అన్డిజర్వ్డ్ అని అభిప్రాయపడ్డారు. ►రోహిత్.. బాలాదిత్య డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని చెప్పాడు. ►రాజ్.. శ్రీహాన్ డిజర్వ్, రేవంత్ అన్‌డిజర్వ్ అని తెలిపాడు. ►సూర్య.. గీతూ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ►కీర్తి.. రేవంత్ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ కంటెస్టెంట్‌గా పేర్కొంది. ►ఆదిరెడ్డి.. శ్రీహాన్ డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ఫైనల్‌గా ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, వాసంతి, అర్జున్, మెరీనా అనర్హులుగా, సూర్య, శ్రీహాన్, గీతూ, రేవంత్ అర్హులుగా నిలిచారు. ఏ జాబితాలోనూ పేర్లులేని వారంతా తటస్థులని పేర్కొన్నాడు నాగ్. మొత్తానికి అర్హులలో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని హౌస్మేట్స్ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత శ్రీసత్య గేమ్ గురించి మాట్లాడాడు హోస్ట్. టీమ్ లీడర్‌గా శ్రీసత్య ఫెయిర్గేమ్ ఆడాలని సూక్తులు చెప్పింది, మరి తను పాటించిందా? అని ప్రశ్నించాడు. మళ్లీ తనే అందుకుంటూ.. చీటీల్లో ఎవరి పేరు వస్తే వారు నామినేట్ అన్నారు. అందులో శ్రీసత్య పేరొచ్చింది. తెల్లారేసరికి ఆమె చీటీలు వద్దు, ఓటింగ్ అనేసింది. అంటే ఆమె అందరినీ మానిప్యులేట్ చేసి ఓటింగ్ వేయడం అవసరమా? అని అడిగాడు. దానికామె చీటీలాట ఆడి తిట్టించుకోవడం ఎందుకని ఓటింగ్‌కు వెళ్లామని కవర్ చేసింది. ముందు చీటీలు అని చెప్పి తర్వాత ఓటింగ్‌కు వెళ్లడం కరెక్టా? కాదా? అని ఆమె టీమ్‌నే అడగ్గా గీతూ మాత్రమే అందులో తప్పేముంది? కరెక్టేనంటూ సత్యకు సపోర్ట్ చేసింది. మిగతావారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో నాగ్.. నీ టీమ్‌ను నువ్వు మానిప్యులేట్ చేశావన్నాడు. రూ.5 లక్షలు గెలుచుకునే అవకాశం బిగ్‌బాస్ 6 స్టైలిస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచినవారికి రూ.5 లక్షలు లభిస్తాయని లెన్స్‌కార్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీకు ఇష్టమైన లెన్స్‌కార్ట్ స్టైలిష్ హౌస్‌మేట్‌కు ప్రతివారం ఓటు వేసి టైటిల్ గెలిచేలా చేయాలి. ఎక్కువసార్లు విన్ అయిన కంటెస్టెంట్ రూ.5 లక్షలు గెలుస్తారు. ప్రేక్షకులు లెన్స్‌కార్ట్ యాప్ లేదా వెబ్సైట్లో వారికి ఓటేయాల్సి ఉంటుంది. చదవండి: తమ్మీ.. నీకు అడుక్కు తిందామన్నా దొరకదు కన్ఫ్యూజన్ మాస్టర్ ఎలిమినేటెడ్! -
బిగ్‌బాస్: కన్ఫ్యూజన్ మాస్టర్ ఎలిమినేట్!
చూస్తుండగానే బిగ్‌బాస్ షో ఏడోవారం ముగింపుకు చేరుకుంది. అంటే ఇంట్లో నుంచి మరొకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది. సండే ఎపిసోడ్ షూటింగ్ ఈరోజే జరుగుతుంది కాబట్టి ఎప్పటిలాగే లీకువీరులు ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని లీక్ చేసేశారు. అర్జున్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడని చెప్తున్నారు. నామినేషన్, ఎలిమినేషన్ అన్నీ వాళ్లు చెప్పినట్లే జరుగుతోంది. ఈ లెక్కన అర్జున్ ఎలిమినేషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి అర్జున్ మాట్లాడటంలో తడబడ్డా ఆటలో మాత్రం తడబడడు. ఇప్పుడిప్పుడే శ్రీసత్య వెనకాల తిరగడం మానేసి ఆట మీద దృష్టి పెట్టాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. జరగరాని నష్టం జరిగిపోయింది. ఒక మాట మీద నిలబడలేని ఈ కన్ఫ్యూజన్ మాస్టర్ ఈ వారం రేవంత్‌తో గొడవకు దిగాడు. ఒక్క ఈ వారమేంటి, చాలాసార్లు తన ఫ్రెండ్ రేవంత్‌తోనే గొడవపడ్డాడు. కాకపోతే ఈసారి శ్రీసత్య ఉసిగొల్పడంతో కావాలని కయ్యానికి కాలు దువ్వాడు, చివరికి చేతులు కాల్చుకుని తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేస్తున్నాడు. చదవండి: మాట మార్చిన శ్రీసత్య, ఆమె ప్లాన్‌కు వాసంతి బలి రేవంత్‌కు క్లాస్ పీకిన నాగ్ -
మాటమార్చిన శ్రీసత్య, టార్గెట్ వాసంతి!
Bigg Boss Telugu 6, Episode 48: బిగ్‌బాస్ హౌస్‌లో బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఈరోజు కూడా కొనసాగింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీసత్య(బ్లూ) టీమ్‌పై ఇనయ(రెడ్) టీమ్ పైచేయి సాధించింది. తర్వాత బిగ్‌బాస్ బ్లూ టీమ్ వదిలేసిన గ్లవ్స్ పంపించాడు. ఆ గ్లవ్స్ సాయంతో గెలిచిన టీమ్‌లో నుంచి ఒకరితో స్వాప్ చేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. భలే ఛాన్స్ దొరికిందనుకున్న శ్రీసత్య వెంటనే స్వాప్ చేసుకోవచ్చా అని అడిగింది. అయితే టాస్క్‌లో ఆ గ్లవ్స్‌ను లెక్కించకుండా వదిలేసినందున బ్లూ టీమ్ ఆ ఆఫర్ కోల్పోయిందని చెప్పాడు. దీంతో ముఖం వేలాడేసుకుని ఆ గ్లవ్స్‌ను లోపల పెట్టేసింది శ్రీసత్య. ఇక ఓడిన టీమ్‌లో నుంచి ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్‌బాస్ ముందే చెప్పాడు. ఈ క్రమంలో రాత్రిపూట బ్లూ టీమ్ మీటింగ్ పెట్టింది. టాస్కులో టీమ్ సభ్యులమందరం వంద శాతం ఇచ్చాం కాబట్టి చీటీలు వేసుకుందామంది శ్రీసత్య. చీటీలో ఎవరు పేరు వస్తే వారు నామినేషన్లోకి వెళ్లాలంది. ఆ చీటీలో తన పేరే రావడంతో నామినేషన్‌కు సై అంది శ్రీసత్య. కానీ తెల్లారేసరికి మళ్లీ మాట మార్చింది. అందరం చర్చించుకుని ఎక్కువ ఓట్లు వచ్చినవారిని నామినేషన్లోకి పంపిద్దామంది. ఈ క్రమంలో శ్రీసత్య.. అర్జున్ ఒకరి పేర్లు మరొకరు చెప్పుకున్నారు. కానీ శ్రీసత్య నొచ్చుకోవడంతో అర్జున్.. తన ఓటు వెనక్కు తీసుకుని దాన్ని మెరీనాకు వేశాడు. మెరీనా, వాసంతి.. గీతూకు ఓటేశారు. రాజ్.. వాసంతి పేరెత్తడంతో ఆమె శివాలెత్తింది. ఎంత ఆడినా కూడా ఆడలేదని నామినేట్ చేస్తే ఎంత బాధేస్తుందని కంటతడి పెట్టుకుంది. మెజారిటీ టీమ్ మేట్స్ వాసంతినే టార్గెట్ చేయడంతో ఆమె నెక్స్ట్ వీక్ నేరుగా నామినేట్ అయింది. అనంతరం సరిగా ఆడనివారికి డిజాస్టర్ బ్యాచ్‌లు పెట్టమని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా అర్జున్ మాట్లాడుతూ.. గేమ్‌లో లైన్ క్రాస్ చేసి తిట్టావంటూ రేవంత్‌కు డిజాస్టర్ బ్యాచ్ తగిలించాడు. వాసంతి.. నాకంటే తక్కువ గేమ్ ఆడావంటూ గీతూకు బ్యాడ్జ్ పెట్టింది. బిగ్‌బాస్ రూల్స్ పాటించట్లేదంటూ రేవంత్‌కు బ్యాడ్జ్ పెట్టింది శ్రీసత్య. రేవంత్‌ను కావాలని కొట్టడం తప్పని వాసంతి డిజాస్టర్ అన్నాడు సూర్య. మెరీనా.. గీతూను, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి.. వాసంతిని, రాజ్, శ్రీహాన్, ఫైమా.. మెరీనాను, ఇనయ.. సూర్యను డిజాస్టర్‌గా పేర్కొన్నారు. మెజారిటీ ఇంటిసభ్యులు వాసంతిని డిజాస్టర్‌గా ఎన్నుకోవడంతో బిగ్‌బాస్ ఆమెను జైలుకు పంపించాడు. గీతూ అందరినీ మానిప్యులేట్ చేసి తనను నామినేషన్లోకి పంపిందని అభిప్రాయపడింది వాసంతి. తర్వాత జరిగిన నెయిల్ పాలిష్ ఛాలెంజ్‌లో సూర్య, వసంతి జంట గెలుపొందింది. చదవండి: ప్రిన్స్ రివ్యూ, జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా? కార్తికేయ 2తో డైరెక్టర్ సాహసం చేశాడు: పరుచూరి -
కష్టానికి దక్కని ప్రతిఫలం.. బలి పశువుగా మారిన వాసంతి!
హౌస్‌మేట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నాడు బిగ్‌బాస్. మొదట ఫుడ్ కట్ చేసి ముప్పు తిప్పలు పెట్టిన బిగ్‌బాస్ ఫుడ్ కోసం, ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడాలని చెప్పాడు. వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు రకరకాల టాస్కులు పెట్టాడు. అయితే ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడే క్రమంలో ఇంటిసభ్యులు బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఆడారు. ఇందులో ఇనయ టీమ్ గెలవగా శ్రీసత్య టీమ్ ఓడినట్లు తెలుస్తోంది. దీంతో ఓడిన టీమ్‌లో నుంచి ఒకరిని తర్వాతి వారానికి నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో శ్రీసత్య, అర్జున్ ఒకరి పేర్లను మరొకరు సూచించారు. మెరీనా, వాసంతి.. గీతూను సూచించారు. రాజ్.. వాసంతి పేరును ఎత్తడంతో ఆమె ఒంటికాలిపై లేచింది. 'ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు, అయినా సరే తీసుకొచ్చి లీస్ట్‌లో నిలబడితే ఎంత బాధుంటుంది' అని ఏడ్చేసింది. ఫైనల్‌గా వాసంతిని నామినేషన్లోకి పంపించారు. చదవండి: ఆదిరెడ్డిన కొట్టేసిన వాసంతి, అనుకోకుండా అంటూ కవరింగ్ -
రేవంత్‌ను నామినేట్ చేసినా వేస్ట్, టాప్ 5, ఫిక్స్: శ్రీసత్య
Bigg Boss 6 Telugu, Episode 47 Highlights: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. బిగ్‌బాస్ వార్నింగ్‌లు, టాస్కులతో ఎపిసోడ్స్‌లో కొంత ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. కడుపు మాడితే ఎలా ఉంటుందో చూపించిన బిగ్‌బాస్ ఇప్పుడు హౌస్‌లో ఉండటానికి హౌస్మేట్స్ తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలంటూ టాస్క్ ఇచ్చాడు. మరోవైపు శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. మరి ఆ విశేషాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో వివరంగా చదివేద్దాం.. ప్రతిరోజు ఏదైనా హుషారెత్తించే పాటతో నిద్రలేపే బిగ్‌బాస్ ఈరోజు మాత్రం కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లు ఉలిక్కిపడేలా చేశాడు. కాసేపటికే హౌస్మేట్స్ ఆకలి అంటూ అలమటిస్తుండటంతో తిరిగి ఫుడ్ పంపించాడు బిగ్‌బాస్. కానీ దీనికంటే ముందుగా హౌస్మేట్స్ ఇకమీదట 100 శాతం ఎఫర్ట్స్ పెడతామని ప్రతిజ్ఞ చేశారు. మెరీనా అయితే టాస్క్ ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి కచ్చితంగా కంటెంట్ ఇస్తానని శపథం చేసింది. మౌనవ్రతం వీడిన బిగ్‌బాస్.. ఇంట్లో ఉండే అర్హత కోసం పోటీపడాలని సూచించాడు. పిట్ట గోలకు ఫుల్స్టాప్ చెప్పి ఇనయ, శ్రీహాన్ కలిసిపోవడంతో వారిని మిగతా హౌస్మేట్స ఆటపట్టించారు. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయకు మాత్రమే బాగున్నావని ఎలా కాంప్లిమెంట్ ఇస్తావ్ అంటూ శ్రీహాన్ మీద మూకుమ్మడిగా దాడి చేసింది హౌస్‌లోని మహిళా లోకం. దీంతో ఇలా బుక్కైపోయానేంట్రా బాబూ అని తల గోక్కున్నాడతడు. తర్వాత శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా ఇనయ దగ్గరుండి కేక్ మీద చోటు అని రాయించి హార్ట్ సింబల్ వేయించింది. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి మొదట ఇనయకు తినిపించాడు. వీరి సడన్ ఫ్రెండ్షిప్ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం బిగ్‌బాస్ బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిన్నటి టీమ్సే కొనసాగుతాయన్నాడు. రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి రెడ్ టీమ్ కాగా ఇనయ ఆ టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. మిగిలినవారంతా బ్లూ టీమ్ కాగా దానికి శ్రీసత్య లీడర్‌గా కొనసాగింది. ఈ గేమ్‌లో శ్రీహాన్.. శ్రీసత్య చేతిలో నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో ఆమె కింద పడింది. ఇక రేవంత్ ఏం చేసినా శ్రీసత్య పాయింట్ అవుట్ చేస్తూ రెచ్చగొట్టడంతో అతడు సహనం కోల్పోయి ఫైర్ అయ్యాడు. అలా వీరిద్దరూ టాస్క్‌లో ఒకరినొకరు విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అర్జున్.. నిన్ను వెక్కిరించినందుకు అతడిని నామినేట్ చేయ్ అని శ్రీసత్యకు సలహా ఇచ్చాడు. అయితే శ్రీసత్య మాత్రం.. అతడిని నామినేట్ చేసినా బయటకు వెళ్లడు, టాప్ 5 కంటెస్టెంట్, ఫిక్స్ అయిపోవాల్సిందే అని అని చెప్పింది. ఈ గేమ్ రెండో లెవల్లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ను రేవంత్, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. హింస ఉండకూడదు అని సత్య నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: దమ్ముంటే అడ్డుకో, ఎత్తిపడేసిన శ్రీహాన్ -
దమ్ముంటే అడ్డుకో.. అర్జున్ను ఎత్తిపడేసిన శ్రీహాన్
బిగ్‌బాస్ వార్నింగులు, ఇంట్రస్టింగ్ టాస్కులతో షో రంజుగా మారింది. మొదట ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా బిగ్‌బాస్ తీసుకెళ్లిపోగా టాస్కులు గెలిచి దాన్ని తిరిగి సంపాదించుకున్నారు హౌస్మేట్స్. ఈ క్రమంలో ఇంటిసభ్యులు శ్రీహాన్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. విచిత్రంగా ఇనయ దగ్గరుండి ఆ పనులు చూసుకోవటం గమనార్హం. ఇదే విషయంపై శ్రీహాన్‌ను ఆటపట్టించారు మిగతా హౌస్మేట్స్. మరోవైపు ఇనయ కేక్‌పై చోటు అని రాయించి హార్ట్ సింబల్ పెట్టించింది. ఇదేదో నా కొంప ముంచేలా ఉందంటూనే శ్రీహాన్ కేక్ కట్ చేసి ఇనయకు తినిపించాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో వీరి పిట్ట గోల ముగిసినట్లైంది. ఆహారం కోసం పోట్లాడిన హౌస్మేట్స్ ఇంట్లో ఉండేందుకు కావాల్సిన అర్హత కోసం ఫైట్ చేయండంటూ పూల టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో కూడా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జున్, శ్రీహాన్‌కు గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. అర్జున్ను ఎత్తి పడేసిన శ్రీహాన్ దమ్ముంటే అడ్డుకో అంటూ తొడకొట్టి సవాలు విసిరాడు. మరి ఈ టాస్క్‌లో ఏ టీమ్ గెలిచింది? అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆదిరెడ్డి బయటకు పోతావ్, వేరేవాళ్లు పోతే ఫీలవుతా: గీతూ -
విన్నర్దాకా పోకు, టాప్ 5లో ఉంటావంతే: గీతూ తండ్రి
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌తో ఇంటిసభ్యులకు మంచి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ టాస్క్‌లో భాగంగా శ్రీహాన్, ఆది రెడ్డి, సుదీపలు బ్యాటరీలో 95 శాతం వాడుకోవడంతో 5 శాతమే మిగిలింది. తిరిగి బ్యాటరీ రీచార్జ్ చేయాలంటే ఇంట్లోని చక్కెర మొత్తాన్ని త్యాగం చేయాలని లేదంటే బాలాదిత్యను స్మోకింగ్ మానేయమని ఒప్పించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో గీతూ దొరికిందే ఛాన్సని ఆదిత్యతో పొగ తాగడం మానేలా చేద్దామనుకుంది. వెంటనే ఇంటిసభ్యుల దగ్గరికి వెళ్లి బిగ్‌బాస్ చెప్పింది కాకుండా తనకు నచ్చిన పాయింట్‌ను యాడ్ చేసింది. అందరూ తిండి మానేస్తే 70 శాతం చార్జ్ అవుతుందని, ఒకవేళ బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తే 90 శాతం చార్జ్ అవుతుందని చెప్పింది. దీంతో అతడు మారుమాట్లాడకుండా తన వ్యసనమైన సిగరెట్లను త్యాగం చేశాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గీతూ ఆడియో కాల్(15) ఎంచుకుంది. తర్వాత అర్జున్.. తనకోసం కాకుండా సత్యకు వీడియో కాల్ ట్రాన్స్ఫర్ చేయండన్నాడు. అది కుదరదని బిగ్‌బాస్ చెప్పడంతో వీడియో మెసేజ్ (35) సెలక్ట్ చేసుకున్నాడు. ఇక గీతూకు తన తండ్రి ఫోన్ చేసి చాలానే మాట్లాడాడు. ఇప్పుడే విన్నర్ అని ఊహించుకోకు. కానీ ప్రస్తుతానికైతే టాప్ 5లో ఉంటావు. కొంచెం యాటిట్యూడ్ మార్చుకో. ప్రతి ఆడపిల్ల కూడా గీతూలా ఉండాలి అనిపించేలా చేయు. కానీ కొన్ని మార్చుకుంటేనే అందరికీ రోల్ మోడల్ అవుతావు అని సూచనలిచ్చాడు ఆమె తండ్రి. తర్వాత అర్జున్ తండ్రి వీడియో మెసేజ్ చూసి ఇంటిసభ్యులంతా ఎమోషనలయ్యారు. మరోపక్క ఇనయ.. తనకు ఫైమాతో ఉంటే అమ్మతో, సూర్యతో ఉంటే నాన్నతో, రాజ్‌తో ఉంటే ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు ఉందని చెప్తూ ఎమోషనలైంది. అంతలోనే ఆమెను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలవడంతో ఉన్నదాంట్లో తక్కువైన ఫొటో ఫ్రేమ్(25)ను సెలక్ట్ చేసుకుంది. గీతూ, ఇనయ, అర్జున్ వాడుకోగా మిగిలిన బ్యాటరీ 5 శాతమే ఉండటంతో దాన్ని మళ్లీ రీచార్జ్ చేయడానికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్‌లో సినిమాల గురించి చెప్తుంటే అదేం సినిమానో ఇంటిసభ్యులు గెస్ చేయాలి. ఆ టాస్క్ విజయవంతంగా పూర్తి కావడంతో బ్యాటరీ మళ్లీ రీచార్జ్ అయింది. తర్వాత శ్రీసత్య 35 శాతం ఉన్న వీడియో కాల్ సెలక్ట్ చేసుకుంది. వీడియో కాల్లో తల్లిదండ్రులను చూడగానే సత్య భావోద్వేగానికి లోనైంది. తర్వాత బాలాదిత్య 50 శాతం ఉన్న ఆడియోకాల్ ఎంచుకుని భార్య, కుమార్తెతో తనివితీరా మాట్లాడాడు. అయితే అందరికీ ఛాన్స్ రావాలని తక్కువ రీచార్జ్ ఉన్న ఫుడ్ ఆప్షన్ ఎంచుకుని పేరెంట్స్‌తో మాట్లాడలేకపోయాడు శ్రీహాన్. ఇలా బ్యాటరీ రీచార్జ్ చేసే ఆప్షన్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదంటూ ఓ మూలకెళ్లి కూర్చుని ఒక్కడే ఏడ్చేశాడు. ఇదిలా ఉంటే మెరీనా మైక్ ధరించనప్పుడు, రేవంత్ పడుకున్నప్పుడు కలిపి పది శాతం వరకు చార్జ్ తగ్గిపోయింది. ఈ లెక్కన వీళ్లకు నామినేషన్స్‌లో ఇదే కారణం చెప్పి ఓట్లు గుద్దడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి మహేశ్‌బాబును అలా చూడటం ఇదే మొదటిసారి -
తిండైనా మానేయండి, లేదా అతడితో ఆ పనైనా చేయించండి!
బిగ్‌బాస్ షో మొదలై ఆరు వారాలైందో లేదో అప్పుడే ఇంటిసభ్యుల మీద వరాల జల్లు మొదలైంది. కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యుల మీద బెంగను తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే శ్రీహాన్ తన తల్లి వండిన మటన్ బిర్యానీని ఆరగించగా ఆదిరెడ్డి భార్యాబిడ్డలతో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ రోజు మిగతా హౌస్‌మేట్స్‌కు సర్ప్రైజ్లు ఇస్తూనే అదే సమయంలో వారి నుంచి కొన్ని త్యాగాలు కోరుతున్నాడు బిగ్‌బాస్. ఈ మేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో పెద్ద తిరకాసే పెట్టాడు. ఇంటిసభ్యులందరూ ఏమీ తినకూడదు లేదంటే బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలి.. అప్పుడే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. అందరూ ఇబ్బందిపడేకంటే తనే సిగరెట్ మానేస్తానన్నాడు బాలాదిత్య. అతడు స్మోక్ చేయకుండా చూడాల్సిన బాధ్యత కెప్టెన్‌దేనని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇకపోతే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన అర్జున్.. తనకిచ్చిన మూడు ఆప్షన్లు ఎంచుకోకుండా.. సత్య గురించి తెగ ఆలోచించాడు. తనకే ఆప్షనూ వద్దని వీలైతే సత్య తన తల్లితో మాట్లాడేలా చూడండని వేడుకున్నాడు. కానీ అది కుదరదనడంతో తండ్రితో వీడియోకాల్ ఎంచుకున్నాడు. తండ్రిని చూడగానే అర్జున్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరోవైపు గీతూ తనకు పిల్లి బొచ్చు, ఆడియో కాల్ రెండూ కావాలని కోరింది. మరి బిగ్‌బాస్ గీతూ అడిగిన రెండు కోరికలను నెరవేరుస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఘోరమైన బూతు, అదేంటో తెలిస్తే ఇనయ చెప్పుతో కొడుతుంది -
బిగ్‌బాస్‌కు చంటి గుడ్‌బై! ఫ్లాప్ కంటెస్టెంట్లు వీళ్లే..
Bigg Boss Telugu 6, Episode 35: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మరొకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. అయితే ఆ ఒక్కరిని పంపించేముందు కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఫన్ టాస్కులు ఆడిస్తాడన్న విషయం తెలిసిందే కదా! కాకపోతే ఈరోజు హిట్, ఫ్లాప్ అనే టాస్క్ ఆడించాడు నాగ్. మరి అది ఎలా సాగింది? ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నాగార్జున వచ్చీరాగానే రేవంత్ కెప్టెన్సీలోని కొన్ని పొరపాట్లను సరిదిద్దాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో హిట్, ఫ్లాప్ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా నాగ్ ఇద్దరిద్దరినీ పిలిచి బోనులో నిలబెడతాడు. వారిద్దరూ తాము ఎందుకు హిట్ అనేది చెప్పాలి. అయితే హౌస్మేట్స్ అంతిమంగా ఆ ఇద్దరిలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్ అనేది నిర్ణయిస్తారు. ముందుగా నాగ్.. ఇనయ, సూర్యలను పిలిచాడు. సూర్యతో కలిపి పిలవడంతో ఇనయ తెగ మెలికలు తిరిగింది. బోనులోకి రాగానే సూర్య మాట్లాడుతూ.. ఇనయ వాంటెడ్‌గా కెమెరాల ముందు కంటెంట్ ఇస్తుంది. కాబట్టి తను ఫ్లాప్ అన్నాడు సూర్య. ఇంటిసభ్యులందరు కూడా అతడితో ఏకీభవిస్తూ సూర్యను హిట్, ఇనయను ఫ్లాప్‌గా తేల్చారు. తర్వాత ఆదిరెడ్డి, గీతూ బోనులో నిల్చున్నారు. గీతూ మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ఇద్దరం సేమ్, కానీ నా గేమ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కాబట్టి నేను హిట్ అని చెప్పింది గీతూ. కానీ ఇంటిసభ్యులందరు మాత్రం ఆదిరెడ్డిని హిట్ అన్నారు.అనంతరం సుదీప, చంటి బోనులోకి వచ్చారు. సుదీప మాట్లాడుతూ.. అందర్నీ కలుపుకుపోతున్న తాను హిట్, ఎవ్వర్నీ కలుపుకోలేకపోతున్న చంటి ఫ్లాప్ అని చెప్పింది. చంటి కూడా తాను ఫ్లాప్ అని ఒప్పేసుకున్నాడు. దీంతో ఇంటిసభ్యులు కూడా సుదీపకే మద్దతిస్తూ ఆమెకు హిట్ ఇచ్చారు. కెప్టెన్ రేవంత్‌ను హౌస్మేట్స్ హిట్‌గా నిర్ధారించారు. వాసంతి, అర్జున్‌లు బోనులో నిలబడగా వాసంతి హిట్ అని హౌస్మేట్స్ నిర్ధారించారు. తర్వాత ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య వరుసగా సేవ్ అయ్యారు. ఇక శ్రీసత్య- శ్రీహాన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్ చూపించగా అందులో అర్జున్ ముఖం వేలాడేసుకోవడం చూసి హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు.ఫైనల్ హిట్ - ఫ్లాప్ గేమ్‌లో బాలాదిత్య, మెరీనా, కీర్తి, శ్రీహాన్‌లు హిట్ కంటెస్టెంట్లుగా, ఇనయ, ఫైమా, గీతూ, రోహిత్, చంటి, సత్య, అర్జున్, రాజ్ ఫ్లాప్ కంటెస్టెంట్లుగా తేలారు. ఫ్లాప్ లిస్టులో ఉన్నవారు గన్నీ బ్యాగులు వేసుకోవాలని నాగార్జున శిక్ష విధించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం చలాకీ చంటి ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: థియేటర్లో టపాసులు కాల్చిన సల్లూభాయ్ ఫ్యాన్స్, వీడియో ఇదిగో పస్తులుంటున్న ఆ కంటెస్టెంట్ అవుట్! -
నేను వెళ్లిపోతా..: బిగ్‌బాస్‌నే బెదిరించిన చంటి
Bigg Boss 6 Telugu, Epiosde 34 Highlights: మొన్నటిదాకా బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో సరదాగా సాగింది షో. అయితే కెప్టెన్సీ టాస్క్‌తో నిన్నటి నుంచి హౌస్‌లో కొంచెం గంభీరం కనిపించింది. ఈసారైనా కెప్టెన్‌గా అవతరించాలని ఎంతోమంది ప్రయత్నించినా ఎట్టకేలకు అది రేవంత్‌ను వరించింది. మరి రేవంత్‌కు ఎవరెవరు సపోర్ట్ చేశారు? అసలు హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి.. బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్ ఎక్కితే ఎపిసోడ్లో కనిపించడం ఖాయం అనుకుంటున్నారో ఏమో కానీ అర్జున్, సూర్య, ఇనయ కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక బయట లవర్స్‌ను కలపడం, విడగొట్టడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది వాసంతి. దీంతో అర్జున్ కల్పించుకుంటూ.. నేను శ్రీసత్య వెనకాల తిరిగితే, నువ్వు నా వెనక తిరగొచ్చు కదా, అప్పుడది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేది, మంచి కంటెంట్ ఉండేదన్నాడు. అంటే కంటెంట్ కోసమే అతడు అమ్మాయిల వెనకాల తిరుగుతున్నట్లు మాట్లాడాడు. మొన్నటిదాకా ఆరోహినే ప్రపంచం అన్నట్లుగా ఉన్న సూర్య ఆమె వెళ్లిపోగానే ఇనయకు క్లోజయ్యాడు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవల్లో గెలిచిన బాలాదిత్య, రేవంత్, సూర్యలు రెండో లెవల్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికి ఎక్కువ పూలదండలు పడితే అతడు కెప్టెన్‌గా నిలుస్తాడని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురు ఇంటిసభ్యులను కాకా పట్టే పనిలో పడ్డారు. కానీ సూర్య కెప్టెన్‌గా నిలిచేది తనే అని ఎంతో ధీమాగా ఉన్నాడు. అతడి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ప్రక్రియ మొదలవ్వగానే మొదటగా గీతూ సూర్యకు మద్దతిస్తూ అతడి మెడలో పూలమాల వేసింది. కీర్తి, రోహిత్, చంటి.. సూర్యకు; గీతూ, సుదీప, శ్రీసత్య, ఫైమా.. బాలాదిత్యకు; వాసంతి, అర్జున్, ఇనయ, మెరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి.. రేవంత్‌కు పూలదండలు వేశారు. ఎక్కువ మాలలు పడిన రేవంత్ కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం బిగ్‌బాస్.. వీఐపీ బాల్కనీలోకి ఇంటిసభ్యులరందరికీ ప్రవేశం కల్పించాడు. అటు చంటి మాత్రం ఎంటర్టైన్ చేయడం తగ్గించేసి ఎందుకో డల్‌గా కనిపిస్తున్నాడు. ఈరోజైతే ఏకంగా నేను వెళ్లిపోతా అంటూ ఒకరకంగా బిగ్‌బాస్‌నే బెదిరించాడు. తర్వాత బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీహాన్, అర్జున్, రాజశేఖర్‌లకు కొంత గాయాలయ్యాయి. వెంటనే శ్రీసత్య వెళ్లి శ్రీహాన్ దెబ్బతగిలిందా అని అతడిమీద ప్రేమ కురిపించింది. ఆ తర్వాత అర్జున్.. ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీసింది. నాకోసం చివర్లో అడుగుతావా? అని అర్జున్ తెగ ఫీలయ్యాడు. అటు శ్రీసత్య మాత్రం ఎలాగైనా రేపటిలోపు అర్జున్ను ఏడిపించాల్సిందేనని శపథం చేసి కూర్చుంది. ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముగిసే సమయానికి బాలాదిత్య, గీతూ పోట్లాటకు దిగడంతో రేవంత్ కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో అర్జున్ కల్యాణ్ ప్రేమాయణం ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వీడియో చూశారా? -
ఆ హీరోయిన్ను ప్రేమించిన అర్జున్ కల్యాణ్!
బిగ్‌బాస్ షోలో కొట్లాటలు, పోట్లాటలతో పాటు ప్రేమాయణాలు కూడా నడుస్తుంటాయి. కానీ ఈ సీజన్లో అదేమీ పెద్దగా వర్కవుట్ అవ్వట్లేదు. అర్జున్ కల్యాణ్ తన గేమ్ పక్కన పెట్టి మరీ శ్రీసత్య జపం చేసినా ఆమె కరుణించట్లేదు. తను కన్నెత్తి చూస్తే చాలు, నవ్వుతూ మాట్లాడితే అంతకన్నా ఏం కావాలి అన్నట్లుగా ఆమె వెనకాలే తిరుగుతున్నాడు అర్జున్. కానీ ఆమె మాత్రం తన మీద చూపిస్తున్న శ్రద్ధ గేమ్ మీద చూపించు, బాగుపడతావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది. అటు ప్రేక్షకులు కూడా మనోడు గేమ్ ఆడటానికి వెళ్లాడా? లేక లవ్వాయణం నడపడానికి వెళ్లాడా? అని తల గోక్కుంటున్నారు. ఇప్పుడిలా సైలెంట్‌గా ఉంటున్న అర్జున్ కల్యాణ్‌కు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కాలం కలిసిరాలేదో మరేంటో కానీ వాళ్ల ప్రేమ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రేమ కహానీని బయటపెట్టింది హీరోయిన్ పూజిత పొన్నాడ. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'అర్జున్, నేను కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం. మొదటగా తనే ప్రపోజ్ చేశాడు. ఇద్దరం డేటింగ్ చేశాం. కానీ మా ప్రేమ వర్కవుట్ కాలేదు. మేము విడిపోయి చాలా కాలమైంది. కానీ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు, కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా' అని చెప్పుకొచ్చింది పూజిత. మరి ఆల్రెడీ బ్రేకప్ అయిన అర్జున్.. ప్రియుడు ఉన్న శ్రీసత్య వెనక తిరగడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు: గీతూ -
Bigg Boss 6: నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వు సిరి.. శ్రీహాన్ ఎమోషనల్
బిగ్‌బాస్-6లో ఎంటర్టైన్మెంట్తో పాటు బోలెడం ఎమోషనల్ జర్నీ కూడా కనిపిస్తుంది. ఈవారం బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ బిగ్‌బాస్ కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నించారు.దీంతో హౌస్మేట్స్ కోరికలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ తమ కోరికలను బయటపెట్టారు. సిరి..షూట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారైనా మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కో అని చెబుతూ శ్రీహాన్ ఎమోషనల్ అవుతాడు. ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వమని బిగ్‌బాస్ వేదికగా అడుగుతాడు. ఇక సుదీప తన భర్తను మిస్ అవుతున్నానని, అతని ఫోటోతో పాటు టీషర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంది. ఇక తన తండ్రి గురించి చెబుతూ అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. డాడీలా నిన్ను చూసుకోలేను కానీ డాడీ లేని లోటు చూసుకుంటానంటూ ఇనయా బాగా ఎమోషనల్ అవుతుంది. మొత్తంగా ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతుంది. మరి హౌస్మేట్స్ అందరి కోరికలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ -
Bigg Boss 6: సత్యతో శ్రీహాన్ రొమాంటిక్ డ్యాన్స్... ఫీలైన అర్జున్
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్‌ను కూల్ చేసేందుకు ఎంటర్టైన్మెంట్ను ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హౌస్మేట్స్ తమ టాలెంట్‌తో బిగ్‌బాస్‌ను మెప్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటగా సూర్య మిమిక్రీ చేసి అదరగొట్టాడు. ఒక ఆ తర్వాత సత్య, శ్రీహాన్‌లు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఇద్దరూ డ్యూయెట్ చేస్తుంటే అర్జున్ ముఖం మాత్రం మాడిపోయింది. వాళ్లను చూసి బాగానే హర్ట్ అయినట్లున్నాడు. అసలే నామినేషన్స్‌లో సత్యతో వాదించడం రాక సెల్ఫ్ నామినేట్ అయిన అర్జున్ ఈరోజు ఎపిసోడ్లో అయినా కాసింత ఎంటర్టైన్మెంట్ చేసి మెప్పిస్తాడేమో చూడాలి. ఇక గీతూకు బిగ్‌బాస్ చికెన్ తినే అవకాశం ఇచ్చాడు. ఇందుకు బదులుగా ఆమె హౌస్‌లో మాంచి గాసిప్ చెప్పాల్సి ఉంటుంది. అయితే మొదటి రెండుసార్లు గాసిప్ చెప్పడంలో గీతూ ఫెయిల్ కావడంతో చికెన్ వాసన చూసే అవకాశం మాత్రమే ఇస్తున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ బర్త్‌డే సందర్భంగా ఎవరెవరు ఎలా ఎంటర్టైన్ చేయనున్నారో చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: అర్జున్‌కు షాకిచ్చిన సత్య.. రోహిత్ కోసం మెరీనా త్యాగం
బిగ్‌బాస్ సీజన్-6 ఇప్పుడు ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యే భలే ఫిట్టింగు పెట్టాడు. ఇద్దరి చేతులకి సంకెళ్లు వేసి ఇద్దరిలో ఎవరు నామినేట్ కావాలో వాళ్లనే డిసైడ్ చేసుకోమని చెప్పడంతో అప్పటిదాకా ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ల మధ్య కూడా వైరం మొదలైంది. ఇక ఈ నామినేషన్స్‌లో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ కూడా పెట్టాడు. జంటగా హౌస్‌లోకి వచ్చిన మెరీనా అండ్ రోహిత్‌లకు షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈసారి నుంచి ఎవరి ఆట వాళ్లు ఆడాలని పేర్కొన్నాడు. దీంతో మెరీనా రోహిత్ కోసం నామినేషన్‌ను త్యాగం చేసింది. నేను వెళ్లిపోయినా సరే, నువ్వు ఉండాలి అంటూ భర్తకు సపోర్ట్ చేసింది. ఇక సుదీప, వాసంతిలలో ఈవారం సుదీప్ సేవ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు సత్య కోసం అర్జున్ నామినేట్ అయినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. లాస్ట్ వీక్ నీకు హెల్ప్ చేశాను.. నువ్వు నామినేషన్స్‌లో ఉన్నా సేవ్ అవుతావ్ అని అర్జున్ బ్రతిమిలాడినా సత్య మాత్రం అందుకు ససేమీరా అనేసింది. నామీద పెట్టుకున్న నమ్మకం ఏదో నీమీద పెట్టుకో అంటూ సైలెంట్‌గానే షాకిచ్చింది. ఇక శ్రీహాన్, ఇనయాల మధ్య మళ్లీ నామినేషన్స్ చిచ్చు రేపగా, రేసు నుంచి తప్పుకోవడానికి శ్రీహాన్ నిరాకరించాడు. దీంతో సరే నేనే నామినేషన్స్‌లో ఉంటా. టైటిల్ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.