Bigg Boss 6 Telugu 27th Episode Highlights: Keerthi Become Captain, Arjun In Jail - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్‌.. ఒక్క చాన్స్ అంటూ విజ్ఞప్తి

Published Sat, Oct 1 2022 10:23 AM | Last Updated on Sat, Oct 1 2022 10:57 AM

Bigg Boss 6 Telugu: Keerthi Become Captain, Episode 27 Highlights - Sakshi

ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో ముగ్గురు కెప్టెన్లు అయ్యారు. తొలివారం బాలాదిత్య, రెండోవారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డిలు కెప్టెన్ అయ్యారు. ఇక నాలుగోవారం కెప్టెన్సీ రేస్‌లో కీర్తి, బిగ్‌బాస్‌ ఇంట్లో ఎట్టకేలకు ఓ మహిళా కెప్టెన్‌ అయ్యారు. గత మూడువారాల్లో మొదట బాలాదిత్య, రెండోవారం రాజ్‌, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్‌ అయ్యారు. దీంతో నాలుగో వారంలో అయినా మహిళా కెప్టెన్‌ కావాలని హౌస్‌లోని లేడీస్‌ పట్టుపట్టారు.

అనుకున్నట్లే కెప్టెన్సీ రేసులో చివరకు కీర్తి, సుదీప, శ్రీసత్యలు మిగిలారు. ఈ ముగ్గురికి ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో గెలిచి కీర్తి కెప్టెన్‌ సింహాసనంపై కూర్చుంది. ఇక టాస్క్‌లో అలిసిపోయి పక్కనే కూర్చున్న శ్రీసత్యకు కాళ్లు నొక్కుతూ ఓదార్చాడు అర్జున్‌. కెప్టెన్‌ టాస్క్‌ పూర్తయిన వెంటనే వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌ని ఎంచుకోవాలని సూచించాడు బిగ్‌బాస్‌. ఈ వారంలో చెత్త ఆటగాడు ఎవరు అని భావిస్తున్నారు వారి పేరు కాగితంపై రాసి గార్డెన్‌ ఏరియాలో ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలని చెప్పాడు. 

ఎక్కువ మంది అర్జున్‌ పేరు  రాస్తూ..అతను హోటల్‌ వర్సెస్‌ హోటల్‌ టాస్క్‌ని సరిగా ఆడలేదని, తన కోసం కాకుండా సత్య కోసం అతను ఆట ఆడుతున్నారని చెప్పారు.  ఇంటి సభ్యుల్లో ఏడుగురు అర్జున్‌కి ఓట్లు వేయడంతో అతడినే ఈ వారం వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా  ప్రకటిస్తూ జైలుకు పంపాడు బిగ్‌బాస్‌. తనకు సపోర్ట్‌ చేయడం వల్లే అర్జున్‌ జైలు పాలు అయ్యాడని శ్రీసత్య వాపోయింది.

అంతేకాదు జైల్లో ఉన్న అర్జున్‌ దగ్గరకు వెళ్లి..‘అసలు నువ్వు బిగ్‌బాస్‌లోకి ఎందుకు వచ్చావ్‌ అర్జున్‌? నా కోసం వచ్చావా? టైటిల్‌ గెలవడానికి వచ్చావా? అని అడిగితే..అర్జున్‌ చిన్నగా నవ్వాడు. దీంతో పక్కనే ఉన్న సుదీప మౌనం అర్థాంగికారం అనడంతో.. శ్రీసత్య మరోసారి ‘చెప్పు అర్జున్‌ ఎవరి కోసం వచ్చావ్‌?’ అని గట్టిగా అడిగింది. అప్పుడు మనోడు  ‘నాకోసమే వచ్చాను’అని మెల్లిగా చెప్పాడు.

ఆ తర్వాత జైలులో ఉన్న కెమెరా వైపు చూస్తూ..‘నాకు ఒక్క చాన్స్‌ ఇవ్వండి. నా ఆట ఏంటో చూపిస్తా. ఇన్ని రోజులు జెన్యూన్‌గా ఆడాను. అమ్మాయిలను జైలుకు వెళ్లడం ఎందుకని లాస్ట్‌ వీక్‌ నేనే జైలుకు వెళ్లాను. కానీ వాళ్లే ఇప్పుడు నన్ను మళ్లీ జైలుకు పంపారు. ఈ ఒక్కవారం సేవ్‌ చేయండి.. వందశాతం ఆట ఆడుతాను. ప్లీజ్‌ సేవ్‌ మీ’అని ఆడియన్స్‌కి విజ్ఞప్తి చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement