నువ్వు కన్నింగ్‌.. యాంకర్‌ మాటకు షాకైన అర్జున్‌ | Bigg Boss 6 Telugu: Arjun Kalyan Exit Interview With Anchor Shiva | Sakshi
Sakshi News home page

Arjun Kalyan: జనాల ప్రేమ కాదు సత్య ప్రేమ మాత్రమే గెల్చుకున్నావ్‌.. యాంకర్‌

Published Mon, Oct 24 2022 2:39 PM | Last Updated on Wed, Oct 26 2022 7:26 PM

Bigg Boss 6 Telugu: Arjun Kalyan Exit Interview With Anchor Shiva - Sakshi

జనాల ప్రేమ, ఆదరణ పొందడానికి బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని మొదటి రోజు చెప్పావు, కానీ వచ్చేరోజు మాత్రం శ్రీసత్యకోసమే వెళ్లానన్నావు. అంటే జనాలను మోసం చేశావా? అని అడిగాడు.

బిగ్‌బాస్‌ కోసం శ్రీసత్య సినిమా ఛాన్స్‌ వదులుకుంది. కానీ శ్రీసత్య కోసం అన్నీ వదులుకుని బిగ్‌బాస్‌ షోకి వచ్చాడు అర్జున్‌ కల్యాణ్‌. నిత్యం ఆమె నామస్మరణలోనే ఉంటూ ఆటను పక్కనపెట్టేశాడు. తను ఛీ కొట్టినా ఏం పర్లేదని దులిపేసుకుంటూ తన వెనకాలే పడ్డాడు. ఆమె మీద చూపించిన ఇంట్రస్ట్‌ గేమ్‌ మీద పెడితే బాగుంటుందని ఎంతమంది చెప్పినా తను మాత్రం శ్రీసత్యకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే గేమ్‌ ఆడటం కూడా మొదలుపెట్టాడు. కానీ అప్పటికే చాలా లేటయింది. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిపోయిన జనాలు హౌస్‌ నుంచి పంపించేశారు. ఏడోవారంలో అర్జున్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అర్జున్‌ తాజాగా బిగ్‌బాస్‌ కెఫెలో యాంకర్‌ శివకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ముందుగా యాంకర్‌ శివ మాట్లాడుతూ.. జనాల ప్రేమ, ఆదరణ పొందడానికి బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని మొదటి రోజు చెప్పావు, కానీ వచ్చేరోజు మాత్రం శ్రీసత్యకోసమే వెళ్లానన్నావు. అంటే జనాలను మోసం చేశావా? అని అడిగాడు. దానికతడు జనాల ప్రేమ పొందడమే నాకు మొదట కావాల్సింది అని ఆన్సరిచ్చాడు. కానీ నువ్వు ఆమె ప్రేమ మాత్రమే గెల్చుకున్నావని కౌంటరిచ్చాడు యాంకర్‌. ఇక రేవంత్‌ మనుషులను తక్కువ చేసి మాట్లాడతాడని, గేలి చేస్తాడని విమర్శించాడు అర్జున్‌. ఇనయ భూచక్రం అని, సూర్య చిచ్చుబుడ్డి, శ్రీహాన్‌ రాకెట్‌, శ్రీసత్య థౌజండ్‌వాలా అని ట్యాగులిచ్చాడు. రేవంత్‌తో మంచిగా ఉంటూనే అతడి గురించి అందరి దగ్గరా మాట్లాడావు, మరి నిన్ను కన్నింగ్‌ అనకూడదా? అని ప్రశ్నించగా అది నా గేమ్‌ అని కవర్‌ చేశాడు అర్జున్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement