నేను వెళ్లిపోతా..: బిగ్‌బాస్‌నే బెదిరించిన చంటి | Bigg Boss 6 Telugu: Chalaki Chanti Want To Step Out From BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: అర్జున్‌ను ఎలాగైనా ఏడిపిస్తా.. శపథం పూనిన శ్రీసత్య

Oct 7 2022 11:31 PM | Updated on Oct 7 2022 11:31 PM

Bigg Boss 6 Telugu: Chalaki Chanti Want To Step Out From BB House - Sakshi

శ్రీసత్య వెళ్లి శ్రీహాన్‌ దెబ్బతగిలిందా అని అతడిమీద ప్రేమ కురిపించింది. ఆ తర్వాత అర్జున్‌.. ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీసింది. నాకోసం చివర్లో అడుగుతావా? అని అర్జున్‌ తెగ ఫీలయ్యాడు.

Bigg Boss 6 Telugu, Epiosde 34 Highlights: మొన్నటిదాకా బిగ్‌బాస్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో సరదాగా సాగింది షో. అయితే కెప్టెన్సీ టాస్క్‌తో నిన్నటి నుంచి హౌస్‌లో కొంచెం గంభీరం కనిపించింది. ఈసారైనా కెప్టెన్‌గా అవతరించాలని ఎంతోమంది ప్రయత్నించినా ఎట్టకేలకు అది రేవంత్‌ను వరించింది. మరి రేవంత్‌కు ఎవరెవరు సపోర్ట్‌ చేశారు? అసలు హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి..

బిగ్‌బాస్‌ షోలో లవ్‌ ట్రాక్‌ ఎక్కితే ఎపిసోడ్‌లో కనిపించడం ఖాయం అనుకుంటున్నారో ఏమో కానీ అర్జున్‌, సూర్య, ఇనయ కంటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక బయట లవర్స్‌ను కలపడం, విడగొట్టడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది వాసంతి. దీంతో అర్జున్‌ కల్పించుకుంటూ.. నేను శ్రీసత్య వెనకాల తిరిగితే, నువ్వు నా వెనక తిరగొచ్చు కదా, అప్పుడది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అయ్యేది, మంచి కంటెంట్‌ ఉండేదన్నాడు. అంటే కంటెంట్‌ కోసమే అతడు అమ్మాయిల వెనకాల తిరుగుతున్నట్లు మాట్లాడాడు. మొన్నటిదాకా ఆరోహినే ప్రపంచం అన్నట్లుగా ఉన్న సూర్య ఆమె వెళ్లిపోగానే ఇనయకు క్లోజయ్యాడు.

ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌ మొదటి లెవల్‌లో గెలిచిన బాలాదిత్య, రేవంత్‌, సూర్యలు రెండో లెవల్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికి ఎక్కువ పూలదండలు పడితే అతడు కెప్టెన్‌గా నిలుస్తాడని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురు ఇంటిసభ్యులను కాకా పట్టే పనిలో పడ్డారు. కానీ సూర్య కెప్టెన్‌గా నిలిచేది తనే అని ఎంతో ధీమాగా ఉన్నాడు. అతడి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ప్రక్రియ మొదలవ్వగానే మొదటగా గీతూ సూర్యకు మద్దతిస్తూ అతడి మెడలో పూలమాల వేసింది.

కీర్తి, రోహిత్‌, చంటి.. సూర్యకు; గీతూ, సుదీప, శ్రీసత్య, ఫైమా.. బాలాదిత్యకు; వాసంతి, అర్జున్‌, ఇనయ, మెరీనా, శ్రీహాన్‌, ఆదిరెడ్డి.. రేవంత్‌కు పూలదండలు వేశారు. ఎక్కువ మాలలు పడిన రేవంత్‌ కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం బిగ్‌బాస్‌.. వీఐపీ బాల్కనీలోకి ఇంటిసభ్యులరందరికీ ప్రవేశం కల్పించాడు. అటు చంటి మాత్రం ఎంటర్‌టైన్‌ చేయడం తగ్గించేసి ఎందుకో డల్‌గా కనిపిస్తున్నాడు. ఈరోజైతే ఏకంగా నేను వెళ్లిపోతా అంటూ ఒకరకంగా బిగ్‌బాస్‌నే బెదిరించాడు.

తర్వాత బిగ్‌బాస్‌ లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో శ్రీహాన్‌, అర్జున్‌, రాజశేఖర్‌లకు కొంత గాయాలయ్యాయి. వెంటనే శ్రీసత్య వెళ్లి శ్రీహాన్‌ దెబ్బతగిలిందా అని అతడిమీద ప్రేమ కురిపించింది. ఆ తర్వాత అర్జున్‌.. ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీసింది. నాకోసం చివర్లో అడుగుతావా? అని అర్జున్‌ తెగ ఫీలయ్యాడు. అటు శ్రీసత్య మాత్రం ఎలాగైనా రేపటిలోపు అర్జున్‌ను ఏడిపించాల్సిందేనని శపథం చేసి కూర్చుంది. ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ముగిసే సమయానికి బాలాదిత్య, గీతూ పోట్లాటకు దిగడంతో రేవంత్‌ కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. 

చదవండి: ఆ హీరోయిన్‌తో అర్జున్‌ కల్యాణ్‌ ప్రేమాయణం
ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వీడియో చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement