Bigg Boss Telugu: Nagarjuna Insults Shrihan, Sri Satya Game - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: అసలు నువ్వు ఫెమినిస్ట్‌వేనా? సూర్యను నిలదీసిన నాగ్‌

Oct 29 2022 7:49 PM | Updated on Oct 29 2022 9:21 PM

Bigg Boss Telugu: Nagarjuna Insults Shrihan, Sri Satya Game - Sakshi

శ్రీహాన్‌- శ్రీసత్య కలిసి ఆడారా? లేదా వేరే జంటల సాయం తీసుకున్నారా? అని అడిగాడు. ఇందుకు వాళ్లు కాస్త అనుమానంగానే తలూపుతూ కలిసే ఆడామన్నారు. నాగ్‌ మాత్రం గీతూ దయాదాక్షిణ్యాల మీదే మీ గేమ్‌ ఆధారపడిందని పరువు తీశాడు.

చాలా రోజుల తర్వాత ఫుల్‌ ఫైర్‌ మీదున్నాడు నాగార్జున. ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరినీ వాయించేస్తున్నాడు. ఆఖరికి కెప్టెన్‌ అయినందుకు శ్రీహాన్‌ను ప్రశంసిస్తాడనుకుంటే అతడిని కూడా విమర్శించాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్‌.. చేపల చెరువు టాస్క్‌లో శ్రీహాన్‌- శ్రీసత్య కలిసి ఆడారా? లేదా వేరే జంటల సాయం తీసుకున్నారా? అని అడిగాడు. ఇందుకు వాళ్లు కాస్త అనుమానంగానే తలూపుతూ కలిసే ఆడామన్నారు. నాగ్‌ మాత్రం గీతూ దయాదాక్షిణ్యాల మీదే మీ గేమ్‌ ఆధారపడిందని పరువు తీశాడు.

ఇక చీటీలు వేసుకుని కెప్టెన్సీ కంటెండర్లు కావడమేంటని అడిగాడు హోస్ట్‌. దీనికి వాసంతి మాట్లాడుతూ.. ముగ్గురు అమ్మాయిల కన్నా నువ్వు ఫిజికల్‌గా తక్కువ అనేసరికి షాక్‌లో ఉండిపోయానంది. నువ్వో ఫెమినిస్ట్‌ అని చెప్పుకుంటావు, మరి ఫిజికల్‌గా తక్కువ అంటూ అనడం.. ఫెమినిస్ట్‌ మాట్లాడాల్సిన మాటలేనా? అని నాగ్‌.. సూర్యను నిలదీయడంతో అతడు సిగ్గుతో తల దించాడు. కామెడీకి హద్దు ఉంటుందని మర్చిపోతున్నావంటూ ఫైమాను హెచ్చరించాడు. గేమ్‌లో రేవంత్‌ మిగతావారిని ఇష్టమొచ్చినట్లు నెట్టేసిన వీడియోను చూపించిన నాగ్‌.. ఒక ఉన్మాదిలా ఆడుతున్నావని తిట్టిపోశాడు. అనంతరం ఈరోజు డైరెక్ట్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని చెప్పాడు. వెళ్లిపోయేది మరెవరో కాదు, సూర్య అని సోషల్‌ మీడియాలో ఆల్‌రెడీ లీకైన విషయం తెలిసిందే!

చదవండి: నువ్వేంది ఆడించేది? బిగ్‌బాస్‌ లేడా?: నాగార్జున
వాళ్లు సేఫ్‌, అతడు ఎలిమినేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement