బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా లవ్ ట్రాక్‌లు ప్రతి సీజన్‌లో హైలైట్‌గా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6లోనూ సత్య-అర్జున్ కల్యాణ్‌ల లవ్ యాంగిల్ ప్రత్యేకంగా నిలిచింది. తన గేమ్ ఆడటం కూడా మర్చిపోయి సత్య ప్రేమలో పడిపోయిన అర్జున్ 7వ వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు.
హౌస్‌లో ఉన్నంతసేపూ సత్య-సత్య అంటూ తిరిగిన అర్జున్ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ప్లేట్ మార్చిసినట్లు కనిపిస్తుంది. మరో కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్‌తో ఈమధ్య షికార్లు చేస్తున్న అర్జున్ రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్నాడు. ఇదే షోకు వాసంతి కూడా వచ్చింది. అయితే టాస్క్‌లో భాగంగా వాసంతి కాకరకాయ జ్యూస్ తాగాల్సి రాగా, తను తాగకుండా అర్జున్‌కు తాగమని ఇస్తుంది.
వాసంతి కోసం అర్జున్ కరేలా జ్యూస్ తాగుతాడు. దీనికి ఇంప్రెస్ అయిన వాసంతి వెంటనే అతడి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment