Bigg Boss Telugu 6: 8th Week Nomination List | Bigg Boss 6 Telugu Episode 51 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: లవ్‌ స్టోరీకి చెక్‌ పెట్టిన ఇనయ, సూర్యతో దోస్తానా కట్‌!

Published Mon, Oct 24 2022 11:59 PM | Last Updated on Thu, Oct 27 2022 3:56 PM

Bigg Boss Telugu 6: 8th Week Nomination List - Sakshi

Bigg Boss Telugu 6, Episode 51: ఈ వారం సర్‌ప్రైజింగ్‌ నామినేషన్స్‌ జరిగాయి. ఓ జంట వాళ్లలో వాళ్లే పోట్లాడుకోగా, గొడవలకు చెక్‌ పెట్టి కలిసిపోయారనుకున్నవాళ్లు మళ్లీ నామినేట్‌ చేసుకున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

శ్రీసత్య నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గురించి శ్రీహాన్‌తో మనసు విప్పి మాట్లాడింది. 'నా లైఫ్‌లో ఫస్ట్‌ ఫంక్షన్‌ ఎంగేజ్‌మెంట్‌. ఎంత ఇష్టంతో చేసుకున్నానో! అప్పటిదాకా అతడి గురించి ఎవరేం చెప్పినా శత్రువులా చూసేదాన్ని. రిలేషన్‌లోకి వెళ్లాక అమ్మాయిగా మారిపోయాను. పక్కవాళ్ల ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది. కానీ అతడు నిశ్చితార్థం రోజు స్టేజీమీదే తిట్టాడు. ఒక నెల రోజుల తర్వాత కొందరు అమ్మాయిలు అతడి స్క్రీన్‌షాట్లు చూపించారు. ఆ తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ ఆస్పత్రిపాలవడంతో మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది' అని తన పాత జ్ఞాపకాలను పంచుకుంది.

అనంతరం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరి ఫొటోలను మంటల్లో వేయాలన్నాడు బిగ్‌బాస్‌.

శ్రీసత్య.. సూర్య, మెరీనా
ఆదిరెడ్డి.. ఇనయ, మెరీనా
గీతూ.. ఇనయ, మెరీనా
బాలాదిత్య.. శ్రీసత్య, గీతూ
కీర్తి.. రేవంత్‌, శ్రీసత్య
సూర్య.. ఇనయ, శ్రీసత్య
రోహిత్‌.. గీతూ, శ్రీసత్య
ఇనయ.. శ్రీహాన్‌, సూర్య
ఫైమా.. శ్రీసత్య, మెరీనా
రాజ్‌.. ఇనయ, రేవంత్‌
మెరీనా.. ఫైమా, రాజ్‌
రేవంత్‌.. కీర్తి, గీతూ
వాసంతి.. ఆదిరెడ్డి, సూర్య
శ్రీహాన్‌.. మెరీనా, బాలాదిత్యను నామినేట్‌ చేశాడు.

రేవంత్‌ను అన్న అన్నందుకు నాకు నేను థూ అనుకుంటానంది కీర్తి. అలాగైతే నేను థూథూ అనుకోవాలని కౌంటరిచ్చాడు రేవంత్‌. ఇక రేవంత్‌ చాలాసార్లు దొంగతనం చేసి తిన్నాడని ఆరోపించింది గీతూ. నువ్వే దొంగవి, పెద్ద గొప్ప అని ఫీలైపోకు, నువ్వు నాకు నథింగ్‌ అంటూ మండిపడ్డాడు రేవంత్‌.

ఇక ఇనయ.. సూర్యకు,శ్రీహాన్‌కు చెక్‌ పెట్టేసింది. నీకూ, నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. నాగ్‌ సర్‌ నీకు బుజ్జమ్మ ఉందని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు మనం క్లోజ్‌గా ఉండటం కరెక్ట్‌ కాదు. మన స్నేహం వేరేలా బయటకు వెళ్తున్నప్పుడు నేను నీతో ఉండటం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది ఇనయ.

దీనికి సూర్య స్పందిస్తూ... బుజ్జమ్మది, నాది స్నేహం కంటే ఎక్కువ. మనది స్నేహమని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అందరూ ఏదో అంటున్నారని మన ఫ్రెండ్‌షిప్‌ను కట్‌ చేస్తానంటున్నావా? అని అడిగాడు సూర్య. దానికి ఇనయ అవునని తలూపుతూ ఇప్పటినుంచి కేవలం హౌస్‌మేట్‌గానే చూస్తానని తేల్చేసింది. అటు శ్రీహాన్‌ను నామినేట్‌ చేస్తూ అందరూ మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చట్లేదని చెప్పింది. ఫైనల్‌గా ఈ వారం రోహిత్‌, వాసంతి, మెరీనా, శ్రీసత్య, ఇనయ, గీతూ, రేవంత్‌, ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్య, కీర్తి, రాజ్‌, ఫైమా, శ్రీహాన్‌ నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌.

చదవండి: బాత్రూమ్స్‌ క్లీన్‌ చేసినందుకు బాగా డబ్బులిచ్చేవారు: నటుడు
నా ముందు నువ్వు నథింగ్‌: రేవంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement