Bigg Boss 6 Telugu: Arjun Kalyan Breakup Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌, అర్జున్‌ కల్యాణ్‌ బ్రేకప్‌ స్టోరీ!

Published Fri, Oct 7 2022 4:38 PM | Last Updated on Mon, Oct 10 2022 6:15 PM

Bigg Boss 6 Telugu: Arjun Kalyan Breakup Love Story In Telugu - Sakshi

బిగ్‌బాస్‌ షోలో కొట్లాటలు, పోట్లాటలతో పాటు ప్రేమాయణాలు కూడా నడుస్తుంటాయి. కానీ ఈ సీజన్‌లో అదేమీ పెద్దగా వర్కవుట్‌ అవ్వట్లేదు. అర్జున్‌ కల్యాణ్‌ తన గేమ్‌ పక్కన పెట్టి మరీ శ్రీసత్య జపం చేసినా ఆమె కరుణించట్లేదు. తను కన్నెత్తి చూస్తే చాలు, నవ్వుతూ మాట్లాడితే అంతకన్నా ఏం కావాలి అన్నట్లుగా ఆమె వెనకాలే తిరుగుతున్నాడు అర్జున్‌. కానీ ఆమె మాత్రం తన మీద చూపిస్తున్న శ్రద్ధ గేమ్‌ మీద చూపించు, బాగుపడతావ్‌ అని గట్టిగానే క్లాస్‌ పీకింది.

అటు ప్రేక్షకులు కూడా మనోడు గేమ్‌ ఆడటానికి వెళ్లాడా? లేక లవ్వాయణం నడపడానికి వెళ్లాడా? అని తల గోక్కుంటున్నారు. ఇప్పుడిలా సైలెంట్‌గా ఉంటున్న అర్జున్‌ కల్యాణ్‌కు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కాలం కలిసిరాలేదో మరేంటో కానీ వాళ్ల ప్రేమ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రేమ కహానీని బయటపెట్టింది హీరోయిన్‌ పూజిత పొన్నాడ.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'అర్జున్‌, నేను కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం. మొదటగా తనే ప్రపోజ్‌ చేశాడు. ఇద్దరం డేటింగ్‌ చేశాం. కానీ మా ప్రేమ వర్కవుట్‌ కాలేదు. మేము విడిపోయి చాలా కాలమైంది. కానీ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. అతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నాడు, కాబట్టి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నా' అని చెప్పుకొచ్చింది పూజిత. మరి ఆల్‌రెడీ బ్రేకప్‌ అయిన అర్జున్‌.. ప్రియుడు ఉన్న శ్రీసత్య వెనక తిరగడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: రేవంత్‌ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు: గీతూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement