poojitha
-
తల్లి మందలించడంతో ఇంటర్ యువతి తీవ్ర విషాదం..
నల్గొండ: తల్లి మందలించిందనే కారణంతో గడ్డిమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల యాదయ్య, సైదమ్మల నాలుగో కుమార్తె పూజిత(17) సూర్యాపేటలోని సాయిగౌతమి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో పూజిత శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. చదువు విషయమై తల్లి సైదమ్మ కూతురు పూజితను మందలించింది. ఈ కారణంతో పూజిత వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గడ్డి మందు సేవించింది. చుట్టుపక్కల వారు చూసి సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి.అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
జోరుగా హుషారుగా మూవీ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
‘బేబి’ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజిత ΄÷న్నాడ కథానాయిక. నిరీష్ తిరువీధుల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కృష్ణ చైతన్య, పలువురు ΄ాత్రికేయులు విడుదల చేశారు. అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. యువ తరానికి నచ్చే అంశాలతో అన్ని భావోద్వేగాలతో రూ΄÷ందించిన చిత్రం ఇది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’అన్నారు. -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
పూజిత పొన్నాడ లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
నిజామాబాద్: గుండెపోటుతోనే కెనడాలో కన్నుమూత
సాక్షి, నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిందని భావించిన నిజామాబాద్ యువతి పూజితారెడ్డి మృతికి కారణం తెలిసింది. విద్యార్థిని మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకురాగా.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఆమె గుండెపోటుతోనే కన్నుమూసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామం పూజితారెడ్డిది. ఆమె తండ్రి మల్కాపూర్ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి. పెద్ద కొడుకు కెనడాలో స్థిరపడ్డారు. పూజితారెడ్డి(24) ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. పీజీ కోసం ఈ ఏడాది జనవరి 26న కెనడా వెళ్లింది. అన్నయ్య ఇంట్లో వారం ఉండి, అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్లో చేరింది పూజిత. అయితే.. పది రోజుల కిందట గుండెపోటుకు గురై ఆకస్మాత్తుగా హాస్టల్ గదిలోనే కుప్పకూలింది. స్నేహితులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ మధ్య పెరిగి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. గుండెపోటుతో చిన్నవయసులోనే హఠాన్మరణం చెంది.. విగతజీవిగా తిరిగి వచ్చిన పూజితను చూసి ఊరంతా కంటతడి పెట్టింది. -
హీరోయిన్ పూజిత పొన్నాడ గ్లామర్ ఫోటోలు
-
ఆ హీరోయిన్ను ప్రేమించిన అర్జున్ కల్యాణ్!
బిగ్‌బాస్ షోలో కొట్లాటలు, పోట్లాటలతో పాటు ప్రేమాయణాలు కూడా నడుస్తుంటాయి. కానీ ఈ సీజన్లో అదేమీ పెద్దగా వర్కవుట్ అవ్వట్లేదు. అర్జున్ కల్యాణ్ తన గేమ్ పక్కన పెట్టి మరీ శ్రీసత్య జపం చేసినా ఆమె కరుణించట్లేదు. తను కన్నెత్తి చూస్తే చాలు, నవ్వుతూ మాట్లాడితే అంతకన్నా ఏం కావాలి అన్నట్లుగా ఆమె వెనకాలే తిరుగుతున్నాడు అర్జున్. కానీ ఆమె మాత్రం తన మీద చూపిస్తున్న శ్రద్ధ గేమ్ మీద చూపించు, బాగుపడతావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది. అటు ప్రేక్షకులు కూడా మనోడు గేమ్ ఆడటానికి వెళ్లాడా? లేక లవ్వాయణం నడపడానికి వెళ్లాడా? అని తల గోక్కుంటున్నారు. ఇప్పుడిలా సైలెంట్‌గా ఉంటున్న అర్జున్ కల్యాణ్‌కు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కాలం కలిసిరాలేదో మరేంటో కానీ వాళ్ల ప్రేమ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రేమ కహానీని బయటపెట్టింది హీరోయిన్ పూజిత పొన్నాడ. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'అర్జున్, నేను కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం. మొదటగా తనే ప్రపోజ్ చేశాడు. ఇద్దరం డేటింగ్ చేశాం. కానీ మా ప్రేమ వర్కవుట్ కాలేదు. మేము విడిపోయి చాలా కాలమైంది. కానీ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు, కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా' అని చెప్పుకొచ్చింది పూజిత. మరి ఆల్రెడీ బ్రేకప్ అయిన అర్జున్.. ప్రియుడు ఉన్న శ్రీసత్య వెనక తిరగడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు: గీతూ -
హీరోయిన్‌తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
ఆకాశ వీధుల్లో నుంచి 'శిలగా మిగిలా' సాంగ్ వచ్చేసింది
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, సింగర్ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. -
ఈసారి ఇఫీలో గతం
గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫీ) ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘గతం’కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమా విభాగంలో ‘గతం’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో ఈ ఏడాది ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా ఇది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాను శనివారం ప్రకటించారు. వచ్చే జనవరి 16 నుంచి 24 వరకు జరగనున్న ఈ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఇండియన్ పనోరమా విభాగం కింద భారత్ నుంచి హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ సహా ఇతర భాషల చిత్రాలు 23 ఎంపికయ్యాయి. ఇక, మెయిన్ స్ట్రీమ్ విభాగంలో తమిళ చిత్రం ‘అసురన్’ (తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’కు మూలం), మలయాళ చిత్రం ‘కప్పేలా’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ చిత్రం ‘ఛిఛోరే’ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ‘గతం’ విషయానికి వస్తే... భార్గవ పోలుదాసు, రాకేష్ గలేభే, పూజిత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కిరణ్ కొండమడుగుల తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, సృజన్ ఎర్రబోలు, హర్షవర్థన్ ప్రతాప్ నిర్మించారు. మొత్తం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. ఇండియన్ పనోరమాకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం -
టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (టీ మా) ఉపాధ్యక్షురాలిగా నటి జె.పూజిత నియమితులయ్యారు. ఈ మేరకు ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆదివారం ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఎఫ్‌సీసీ అనుబంధమైన టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజితను నియమించామని, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకూ ఆమె ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతారని అన్నారు. పూజిత మాట్లాడుతూ... ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు.బాధ్యతగా పనిచేసి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని అన్నారు. కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్, కార్యదర్శి కాచం సత్యనారాయణ, టీమా అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్మా తినేసింది.. హీరోయిన్ అయ్యింది..
ఎన్ని కష్టాలు పడితేగానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం రాదు.. అలాంటిది ఆమెకు మాత్రం ఈజీగా వచ్చింది. పుట్టింది వైజాగ్‌లో.. చదివింది ఢిల్లీ–చెన్నైలో.. బీటెక్ పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది హైదరాబాద్‌లో.. తన పని తాను చేసుకుంటుండగా ఓ షార్ట్‌ఫిలింలో అవకాశం వచ్చింది. కాదనకుండా నటించాల్సి వచ్చింది. అది కాస్తా సినిమా ఆఫర్లను తెచ్చిపెట్టింది. అందం.. అభినయం తోడవడంతో సినిమాల్లో హీరోయిన్గా బిజీగా మారిపోయింది. నటనా ప్రతిభతో తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది మన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఈ సందర్భంగా ఆమె తనఅనుభవాలను ‘సాక్షి’తో పంచుకుంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు.. నాన్న బిజినెస్మెన్.. అమ్మ గృహిణి.. పుట్టింది వైజాగ్.. కానీ చదివింది ఢిల్లీ– చెన్నైలో.. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేశా.. ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్‌ఫిలింతో పరిచయమయ్యా. నా మొదటి సినిమా సుకుమార్ రైటింగ్స్‌లో వచ్చిన ‘దర్శకుడు’. అనంతరం రామ్‌చరణ్ రంగస్థలం, బ్రాండ్ బాబు, కల్కిలాంటి చిత్రాల్లో నటించాను. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాను. తెలుగులో ఆది, తరుణ్ హీరోగా నటిస్తున్న ‘కథ కంచికి.. మనం ఇంటికి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. మూడు చిత్రాలు విడుదలకు సిద్ధం తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం బాగా మాట్లాడతా.. ఈ సంవత్సరంలో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘బాయ్స్’ మూవీలో హీరోగా నటించిన హీరో భరత్‌తో పాటు హీరోలు విమల్, అరిల చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నాను. మూడు చిత్రాలు మూడు విభిన్న కోణాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు ఆహా వెబ్ యాప్‌లో వెబ్‌సిరీస్‌ను హీరో నవదీప్‌తో కలిసి చేశాను. వెబ్ సిరీస్‌లలో అవకాశాలు చాలా వస్తున్నాయి. హిందీలో ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నిజమేంటో.. సినీ పరిశ్రమకు తెలుసు.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. అంతేగాకుండా దర్శకుడు సుకుమార్‌తో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. తెలుగులో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించేందుకు నా వంతు కృషిచేసి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాపై పలు రూమర్స్ కూడా వచ్చాయి.. వాటిని నేను పట్టించుకోను. నిజం ఏంటో సినీ పరిశ్రమకు తెలుసు. పరిశ్రమలో కష్టపడితే తప్పకుండా ఫలితం లభిస్తుంది. సాధించాలనే తపన, నిజాయితీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. -
కోరుకున్నది ఇస్తాడు..
నా దృష్టిలో వినాయకుడిని కోర్కెలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నాకు ఏం ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. అందుకే పండుగ రోజు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు చేశాను.. కానీ కోర్కెలు కోరలేదు. మనం ఆయన్ని ప్రత్యేకించి ఇది కావాలి, అది కావాలి అని అడిగి ఆయన ఇచ్చే బోలెడుఅదృష్టాలను కోల్పోయినవారం కూడా అవ్వొచ్చు. నిమజ్జనం రోజు నాకు రికార్డింగ్ ఉంది, కానీ నేను ఎప్పటికప్పుడు నిమజ్జనం లైవ్ అప్డేట్స్ని మాత్రం ఫాలో అవుతా. – రమ్య బెహరా, సింగర్ నిమజ్జనం అంటే...తీన్మార్ డ్యాన్స్‌లే చిన్నప్పటి నుంచి వినాయకచవితి అంటే అమితమైన ఇష్టం. నవరాత్రులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించేవాళ్లం. నిమజ్జనోత్సవంలో తీన్మార్ డ్యాన్స్‌లు వేసేదాన్ని. ప్రతీపనికి మొదటి దేవుడు వినాయకుడు. అలాంటి వినాయకుడిని చిన్నప్పటి నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నాం . – భానుశ్రీ, హీరోయిన్ ఆయన కృపతో అంతా మంచే... మా ఇంట్లో వినాయకచవితిని బాగా చేస్తాం. ఉదయం, సాయంత్రం కుటుంబసభ్యులతో పూజలు చేసి ప్రసాదాన్ని పంచేదాన్ని. వినాయకుడిని పూజిస్తే సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడున్నా గణనాథుడిని మనసులో తలచుకుంటూ పూజిస్తూ నా జీవనాన్ని సాగిస్తాను. – పూజిత పొన్నాడ, హీరోయిన్ నిమజ్జనం మిస్సవుతున్నా.. సిటీకి చాలా దూరంలో ఉన్నాను. ఫెస్టివల్‌కు ముందే వెళ్లడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి ఏటా సిటీలో ఉన్నప్పుడు కొద్దిసేపైనా నిమజ్జనంలో పాల్గొని ఎంజాయ్ చేసేవాడ్ని. కానీ ఈసారి సిటీలో లేకపోవడం వల్ల నిమజ్జనాన్ని మాత్రం చాలా మిస్సవుతున్నాను. నిమజ్జనం వేడుకల్లో అందరూ పాల్గొని, విజయంతం చేయాలని కోరుతున్నా. – బెల్లంకొండ శ్రీనివాస్, సినీహీరో -
మార్చి 15న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’
గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్‌పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ఈ సినిమాను కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 15న సినిమా భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా... చిత్ర సమర్పకుడు గురునాథ రెడ్డి నిర్మాతలు ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ ‘రాయ్‌లక్ష్మీగారు ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న మా వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేస్తున్నాం. రాయ్ లక్ష్మీగారు నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే ప్రవీణ్, మధునందన్ పాత్రలు చాలా ఎంటర్టైనింగ్గా సాగుతాయి. అలాగే రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ మూవీ ఇది. హరి గౌరగారు అందించిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏమాయ చేసిందో ఏమంత్రం వేసిందో, అత్తిలిపాప పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి అంచనాలున్నాయి’ అన్నారు. -
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్
-
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు ఈ రోజు (గురువారం) విడుదల చేసారు. అమలాపురంలో 20 రోజుల షూటింగ్ తరువాత ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. తరువాత మరో షెడ్యూల్ 10రోజులు అమలాపురంలో షూట్ చేయనున్నారు. సినిమాను దీపావళి రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి లక్ష్మీరాయ్ మాట్లాడుతూ... ‘ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. మాస్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ పాట హైలెట్‌గా నిలుస్తుంది. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు. -
చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య
శామీర్‌పేట్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఓ కుమార్తె పూజిత మృతదేహం లభ్యం కాగా, తండ్రి అర్జున్, కొడుకు ధనుష్ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు నగరంలోని సికింద్రాబాద్ రసూల్పూర్ వాసులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.