టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత | TFCC Announced TMAA Vice-President as Poojitha | Sakshi
Sakshi News home page

టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత

Aug 17 2020 8:31 AM | Updated on Aug 17 2020 8:48 AM

TFCC Announced TMAA Vice-President as Poojitha - Sakshi

నియామక పత్రం అందుకుంటున్న పూజిత

సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ మూవీ  ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (టీ మా) ఉపాధ్యక్షురాలిగా నటి జె.పూజిత నియమితులయ్యారు. ఈ మేరకు ‘తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆదివారం ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఎఫ్‌సీసీ అనుబంధమైన టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజితను నియమించామని, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకూ ఆమె ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతారని అన్నారు.  

పూజిత మాట్లాడుతూ...  ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు.బాధ్యతగా పనిచేసి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని అన్నారు. కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్, కార్యదర్శి కాచం సత్యనారాయణ, టీమా అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement