ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు ఈ రోజు (గురువారం) విడుదల చేసారు.
అమలాపురంలో 20 రోజుల షూటింగ్ తరువాత ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. తరువాత మరో షెడ్యూల్ 10రోజులు అమలాపురంలో షూట్ చేయనున్నారు. సినిమాను దీపావళి రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నటి లక్ష్మీరాయ్ మాట్లాడుతూ... ‘ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. మాస్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ పాట హైలెట్‌గా నిలుస్తుంది. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment