సాక్షి, నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిందని భావించిన నిజామాబాద్ యువతి పూజితారెడ్డి మృతికి కారణం తెలిసింది. విద్యార్థిని మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకురాగా.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఆమె గుండెపోటుతోనే కన్నుమూసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామం పూజితారెడ్డిది. ఆమె తండ్రి మల్కాపూర్ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి. పెద్ద కొడుకు కెనడాలో స్థిరపడ్డారు. పూజితారెడ్డి(24) ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. పీజీ కోసం ఈ ఏడాది జనవరి 26న కెనడా వెళ్లింది. అన్నయ్య ఇంట్లో వారం ఉండి, అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్‌లో చేరింది పూజిత. అయితే..
పది రోజుల కిందట గుండెపోటుకు గురై ఆకస్మాత్తుగా హాస్టల్ గదిలోనే కుప్పకూలింది. స్నేహితులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ మధ్య పెరిగి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. గుండెపోటుతో చిన్నవయసులోనే హఠాన్మరణం చెంది.. విగతజీవిగా తిరిగి వచ్చిన పూజితను చూసి ఊరంతా కంటతడి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment