‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment