రమ్య బెహరా, సింగర్
నా దృష్టిలో వినాయకుడిని కోర్కెలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నాకు ఏం ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. అందుకే పండుగ రోజు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు చేశాను.. కానీ కోర్కెలు కోరలేదు. మనం ఆయన్ని ప్రత్యేకించి ఇది కావాలి, అది కావాలి అని అడిగి ఆయన ఇచ్చే బోలెడుఅదృష్టాలను కోల్పోయినవారం కూడా అవ్వొచ్చు. నిమజ్జనం రోజు నాకు రికార్డింగ్ ఉంది, కానీ నేను ఎప్పటికప్పుడు నిమజ్జనం లైవ్ అప్‌డేట్స్‌ని మాత్రం ఫాలో అవుతా.
– రమ్య బెహరా, సింగర్
నిమజ్జనం అంటే...తీన్‌మార్ డ్యాన్స్‌లే
చిన్నప్పటి నుంచి వినాయకచవితి అంటే అమితమైన ఇష్టం. నవరాత్రులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించేవాళ్లం. నిమజ్జనోత్సవంలో తీన్‌మార్ డ్యాన్స్‌లు వేసేదాన్ని. ప్రతీపనికి మొదటి దేవుడు వినాయకుడు. అలాంటి వినాయకుడిని చిన్నప్పటి నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నాం .
– భానుశ్రీ, హీరోయిన్
ఆయన కృపతో అంతా మంచే...
మా ఇంట్లో వినాయకచవితిని బాగా చేస్తాం. ఉదయం, సాయంత్రం కుటుంబసభ్యులతో పూజలు చేసి ప్రసాదాన్ని పంచేదాన్ని. వినాయకుడిని పూజిస్తే సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడున్నా గణనాథుడిని మనసులో తలచుకుంటూ పూజిస్తూ నా జీవనాన్ని సాగిస్తాను.
– పూజిత పొన్నాడ, హీరోయిన్
నిమజ్జనం మిస్సవుతున్నా..
సిటీకి చాలా దూరంలో ఉన్నాను. ఫెస్టివల్‌కు ముందే వెళ్లడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి ఏటా సిటీలో ఉన్నప్పుడు కొద్దిసేపైనా నిమజ్జనంలో పాల్గొని ఎంజాయ్ చేసేవాడ్ని. కానీ ఈసారి సిటీలో లేకపోవడం వల్ల నిమజ్జనాన్ని మాత్రం చాలా మిస్సవుతున్నాను. నిమజ్జనం వేడుకల్లో అందరూ పాల్గొని, విజయంతం చేయాలని కోరుతున్నా.
– బెల్లంకొండ శ్రీనివాస్, సినీహీరో
Comments
Please login to add a commentAdd a comment