సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్ | Tollywood Singers Anurag Kulkarni And Ramya Behara Married Secretly, Wedding Photo Trending On Social Media | Sakshi
Sakshi News home page

Anurag-Ramya Behara Marriage: సింగర్స్ రమ్య-అనురాగ్ కులకర్ణి ప్రేమ పెళ్లి?

Published Sat, Nov 16 2024 9:33 AM | Last Updated on Sat, Nov 16 2024 10:16 AM

Singers Anurag Kulkarni And Ramya Behara Wedding

తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ వేడుక జరిగింది. ఇది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీళ్ల వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తజంటకు తోటీ గాయనీగాయకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: అలాంటి పాటలు పాడొద్దు.. ప్రముఖ సింగర్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు)

'కేరాఫ్ కంచరపాలెం'లోని 'ఆశా పాశం', 'ఆర్ఎక్స్ 100'లోని 'పిల్లా రా' లాంటి పాటలతో అనురాగ్ కులకర్ణి బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు సూపర్ సింగర్ 8వ సీజన్‌ విజేతగా నిలవడంతో ఇతడికి గుర్తింపు వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా ఉన్నాడు.

రమ్య బెహరా విషయానికొస్తే.. సూపర్ సింగర్ 4లో పాల్గొంది. ఈమెను కీరవాణి.. టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి తదితర సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈమె తోటి సింగర్‌నే పెళ్లి చేసుకోవడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. రీసెంట్‌గా వీళ్లిద్దరూ కలిసి పాడిన పాట 'హే రంగులే'. ఇది ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

(ఇదీ చదవండి: వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్‌ దంపతులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement