
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే.
విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.
ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment