Actor Ravi Krishna Gives Clarity About His Love With Navya Swamy - Sakshi
Sakshi News home page

Ravi Krishna : నవ్యస్వామితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు

May 8 2023 8:45 PM | Updated on May 8 2023 8:53 PM

Actor Ravi Krishna Clarity About His Love With Navya Swamy - Sakshi

బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్‌లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్‌ సంథింగ్‌ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్‌ ఏంటని యాంకర్‌ ప్రశ్నించగా.. సీరియల్‌లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు.

అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్‌ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రీసెంట్‌గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement