రీల్ విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే? | Vimala Raman Relationship With Vinay Rai Latest Pics | Sakshi
Sakshi News home page

Vimala Raman: బంధం గురించి ఓపెన్ అయిపోయిన హీరోయిన్!

Published Sat, May 11 2024 4:42 PM | Last Updated on Sat, May 11 2024 5:03 PM

Vimala Raman Relationship With Vinay Rai Latest Pics

టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ గురించి మరోసారి బయటపడిపోయింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి పక్కా అనిపిస్తుంది. ఇంతకీ రీల్ విలన్-హీరోయిన్ జోడీ సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

ఆ‍స్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్.. 2006లో తమిళ మూవీతో నటిగా మారింది. ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగా ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. గతేడాది రిలీజైన 'గాండీవధారి అర్జున' చిత్రంలో చివరగా కనిపించింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)

విమలా రామన్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్‌తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.

(ఇదీ చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement