vimala raman
-
'దృశ్యం' పాప గ్లామర్.. రకుల్ ప్రీత్ వయ్యారాలు!
చీరలో ఓరకంట కల్యాణి ప్రియదర్శన్ వయ్యారాలుహనీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లిన నటుడు కాళిదాస్ఒకప్పటి హీరోయిన్ విమలా రామన్ చీరలో సోయగాలుఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ శుభశ్రీకేరళలోని రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న 'దృశ్యం' పాపమోడ్రన్ డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల విందుఆసనాలతో అదరహో అనిపిస్తున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeeprajfilms) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
రీల్ విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?
టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ గురించి మరోసారి బయటపడిపోయింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి పక్కా అనిపిస్తుంది. ఇంతకీ రీల్ విలన్-హీరోయిన్ జోడీ సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఆస్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్.. 2006లో తమిళ మూవీతో నటిగా మారింది. ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగా ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. గతేడాది రిలీజైన 'గాండీవధారి అర్జున' చిత్రంలో చివరగా కనిపించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)విమలా రామన్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్‌తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.(ఇదీ చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
ఈమె తెలుగు హీరోయిన్, ఆ విలన్‌తో ప్రేమ-త్వరలో పెళ్లి.. గుర్తుపట్టారా?
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది వందలాది మంది హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. క్లిక్ అయితే స్టార్స్ అవుతారు. లేదంటే కొన్నాళ్ల పాటు మూవీస్ చేసేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోతుంటారు. ఈ భామ కూడా అలానే. కాకపోతే కొన్నేళ్లుగా హీరోయిన్గా చేసింది. ఇప్పుడేమో ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఓ విలన్‌తో ప్రేమలో పడింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ విమలా రామన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు గెస్ చేసింది నిజమే. 2009లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ప్రారంభంలో హీరోయిన్గా చేసింది. కానీ గ్లామర్ బాగుందని మెచ్చుకున్నారు. కానీ హిట్స్ పడకపోయేసరికి ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) ఈ ఏడాది రిలీజైన 'అశ్విన్స్', 'గాండీవధారి అర్జున' లాంటి మూవీస్ చేసింది. 'రుద్రంగి' అనే సినిమాలు మంచి రోల్ చేసింది. కానీ బ్యాడ్ లక్. ఇవేవి విమలా రామన్‌కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం. ఈమెది మన దేశం కాదు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. 2004లో 'మిస్ ఇండియా ఆస్ట్రేలియా' విన్నర్ అయిన తర్వాత సినిమా ఛాన్సులు వచ్చాయి. అలా ఇక్కడే ఉండిపోయింది. ఈమె వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమెకి ఇప్పుడు 41 ఏళ్లు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉండటం, ఛాన్సులొస్తుండటం వల్ల పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ నటుడు వినయ్ రాయ్‌తో గత కొన్నాళ్లు ముందు ప్రేమలో పడింది. ఆ విషయం నేరుగా చెప్పలేదు గానీ ఇన్ స్టాలో అతడితో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో విమలా-వినయ్ రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి బహుశా ఈ ఏడాదిలోనే విమలా రామన్ పెళ్లి చేసేసుకోవచ్చేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
‘లెజెండ్’ సినిమాను గుర్తుచేసుకున్న జగపతిబాబు
'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు. -
'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు'
'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్’ అన్నారామె' అని డైరెక్టర్ అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను. తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
వయసు పెరిగినా వన్నె తగ్గని విమలా రామన్ గ్లామర్ (ఫొటోలు)
-
Asvins Review: ‘అశ్విన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్విన్స్ నటీనటులు: సంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: తరుణ్ తేజ సంగీతం: విజయ్ సిద్ధార్థ్ విడుదల తేది: జూన్ 23, 2023 థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మీడియా కోసం ఈ మూవీ ప్రివ్యూ వేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో రివ్యూలో చూద్దాం. అశ్విన్స్ కథేంటంటే.. అర్జున్(వసంత్ రవి), రీతు, రాహుల్, గ్రేస్, వరుణ్..ఐదుగురు యూట్యూబర్స్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని లండన్‌లోని ఓ దీవిలో ఉన్న భవంతికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడి వెళ్లిన ఓ 15 మందిని ఆమే చంపేసిందనే ప్రచారం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ టీమ్.. ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. మరి అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏంటి? ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది. ఓ రైతుకు అశ్వినీదేవతలు ఇచ్చిన వరం ఏంటి? ఆ వరాన్ని రాక్షస ఆత్మ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంది. అశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మలు కనుగొన్న తర్వాత ఆర్తి రాజగోపాల్ ఎదురైన సమస్యలు ఏంటి? తనవాళ్లను కాపాడుకోవడానికి అర్జున్ చేసిన సాహసం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్విన్స్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు అనే రెండు పర్శ్వాలుంటాయి. బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. ఎంతో నిగ్రహంతో మన మనసుని మార్చుకొని బుద్దితో మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది. మంచి.. చెడు ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంటుందనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు తరుణ్ తేజ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని ఐదు చాప్టర్లు( Two deaths,Two voices, Two curses, The mind of two worlds, The world of two minds) చూపించారు. రైతు ఇద్దరు కుమారు చనిపోవడం.. అశ్వినీదేవతలు ప్రత్యేక్షమై వరం ఇవ్వడం.. రాక్షస ఆత్మ ఆశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మల్లో ఒకదానిని దొంగిలించి.. భూమి మీదకు రావడం..ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా రొటీన్ హారర్ చిత్రాల్లాగే సాగుతుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ విచిత్రమైన సౌండ్లతో ఆడియన్స్‌ని భయపెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్)నేపథ్యంతో అసలు సినిమా స్వభావం ఏంతో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను భయపెట్టడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు కథను వెల్లడించి థ్రిల్లింగ్‌కు గురి చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తంగా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఓ మంచి సందేశాన్ని అందించారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రలో వసంత్ రవి ఒదిగిపోయాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన రవి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఇక రవి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విమలా రామన్‌ది. ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్‌గా ఆమె చక్కగా నటించి మెప్పించింది.మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ సిద్ధార్థ్ అందించిన నేపథ్య సంగీతం. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని భయపెట్టాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం సౌండ్స్‌తోనే థ్రిల్లింగ్‌కి గురి చేశాడు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్
‘మై నేమ్ ఈజ్ భీం రావ్ దేశ్‌ముఖ్..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్గాడు ఖతం కావాలె(మమతా మోహన్ దాస్) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
కొంటె చూపు, క్యూట్ స్మైల్‌తో ఫిదా చేస్తున్న విమలా రామన్ (ఫొటోలు)
-
కోలీవుడ్ విలన్‌తో ప్రేమలో హీరోయిన్..త్వరలోనే పెళ్లి!
కోలీవుడ్ నటుడు వినయ్, హీరోయిన్ విమలారామన్ ప్రేమలో ఉన్నట్టు తాజా సమాచారం. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయకుడిగా నటించిన వినయ్ ప్రస్తుతం ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా నటి విమలరామన్ కథానాయకగా పలుభాషల్లో నటించారు. ఈమె తెలుగులోనూ ఎప్పుడైనా ఎక్కడైనా, గాయం-2, చట్టం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ మిస్ ఇండియా, ఆస్ట్రేలియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన విమలరామన్ను దర్శకుడు కే.బాలచందర్ పొయ్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. ఆ తర్వాత చేరన్ దర్శకత్వంలో రామన్ తేడియ సీతై చిత్రాల్లో నటించి ఆ తర్వాత మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఏడాది నుంచి వినయ్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇటీవల ఈ అమ్మడు పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకలు ఆమె కుటుంబసభ్యులతో పాటు వినయ్ కూడా పాల్గొనడం విశేషం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందన్న ప్రచారం హోరెత్తుతోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోసుకోబోతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
40ఏళ్లలోనూ గ్లామరస్ లుక్‌లో మతిపోగొడుతున్న విమలా రామన్ (ఫొటోలు)
-
కోలీవుడ్ విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
మోడల్‌గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగింది విమలా రామన్. మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనూ అనేక చిత్రాలు చేసింది. ఎవరైనా ఎపుడైనా, కులుమనాలి, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చట్టం వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో కమ్ విలన్ వినయ్రాయ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విమల త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా కొన్నేళ్లుగా వినయ్-విమల లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే! తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. ఆ మధ్య మాల్దీవులు వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. వినయ్ రాయ్ విషయానికి వస్తే అతడు 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన ఈ హీరో జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై వంటి పలు హిట్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు) చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం అతడు హీరో సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్' సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Vinay Rai (@vinayrai79) View this post on Instagram A post shared by Vinay Rai (@vinayrai79) View this post on Instagram A post shared by Vinay Rai (@vinayrai79) View this post on Instagram A post shared by Vinay Rai (@vinayrai79) చదవండి: Bharti Singh: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్ -
లాయర్ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?
నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్‌ఫుల్‌గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం. ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’ వంటి బయోపిక్ కావొచ్చు, ‘గుడ్‌లక్ సఖి’ వంటి స్పోర్ట్స్ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్‌గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్‌ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్‌గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్‌ని విడుదల చేశారు. ఇక కీర్తీ సురేష్ అన్నయ్యకు ఓ లాయర్‌గా హెల్ప్ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్ స్క్రీన్ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్‌గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. లాయర్ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్’ చిత్రం తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్గా నటించిన శ్రుతీహాసన్ లాయర్ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్’లో తమన్నా లాయర్‌గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్‌ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్’ కోసం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్‌గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ గడప తొక్కారు హీరోయిన్ విమలా రామన్. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్ కెరీర్ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. తన లాయర్ లుక్‌ను విమలా షేర్ చేశారు. అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్ హిట్ మూవీ ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేయనున్నారని టాక్. తమిళంలో ఇన్స్పెక్టర్ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదగా విజయ్ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్. తమిళంలో తీసిన పుష్కర్ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్ భార్య అంటే లాయర్‌గా హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు. -
ఈసారైనా లక్కు దక్కేనా?
అవకాశాలు మళ్లీ మళ్లీ వచ్చినా అదృష్టం మాత్రం అరుదుగానే వస్తుంది. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కోలీవుడ్‌లో అలాంటి అదృష్టం కోసం నటి విమలారామన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. నిజానికి ఈ మలయాళీ అమ్మడికి అవకాశం చాలా కలం క్రితమే వచ్చింది. రామన్ తేడియ సీతై చిత్రంతో తమిళ చిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ప్రజాదరణనే పొందింది. అంతే కాదు ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్ దర్శకత్వంలో పొయ్ అనే చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే కోలీవుడ్ విమలారామన్‌ను దూరంగా పెట్టేసింది. దీంతో టాలీవుడ్, మాళీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ రౌండ్లు కొట్టేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విమలారామన్‌ను మరచిపోయారు. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం తలుపు తట్టిందన్నది సినీ వర్గాల సమాచారం. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్ర కథను ఆయన నటి త్రిష కోసం తయారు చేసుకున్నారట. అయితే ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్న త్రిష అడిగిన పారితోషికానికి ఈ చిత్ర దర్శక నిర్మాతలకు మూర్ఛ వచ్చినంతపనైందట. దీంతో మరో ఆప్షన్‌గా నటి విమలారామన్ కనిపించడంతో ఆమెను నటింపజేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇది యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. ఈ చిత్రంతోనైనా నటి విమలారామన్‌కు లక్కు దక్కేనా? లేక కిక్కే ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. మొత్తం మీద చాలా గ్యాప్ తరువాత విమలారామన్ కోలీవుడ్ తెరపై మెరవనున్నారన్న మాట. -
నాగ్ సరసన!
అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరై 30 ఏళ్లయింది. ‘విక్రమ్’తో తెరంగేట్రం చేసిన నాగ్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఓం నమో వెంకటేశ’కు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. ఇందులో హథీరామ్ బాబాగా కనిపించడానికి నాగ్ సిద్ధమవుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం అనుష్క,‘ కంచె’ ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్‌లను ఎంపిక చేసుకున్నారట. మరో పాత్ర కోసం విమలా రామన్‌ను తీసుకున్నారని సమాచారం. ‘ఎవరైనా ఎప్పుడైనా’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన విమలా రామన్ ఆ తర్వాత జగపతిబాబు, శ్రీకాంత్, తరుణ్ తదితర హీరోల సరసన నటించారు. 2013లో విడుదలైన ‘చక్కనైన అబ్బాయి-చుక్కలాంటి అమ్మాయి’ సినిమా తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. నాగ్‌తో నటించనున్న చిత్రంతో విమలా రామన్ రీ-ఎంట్రీ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. -
డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఆశ
చెన్నైలో డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఉందని నటి విమలా రామన్ పేర్కొన్నారు. పొయ్చిత్రం ద్వారా తెర మీదకు వచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, నిలదొక్కుకోలేక పోయింది. అటుపై టాలీవుడ్లో అందాలను ఆరబోసినా ఫలితం లేదు. ప్రస్తుతం మలయాళం, కన్నడం భాషలపై దృష్టి పెట్టారు. భారత నాట్యంలో ప్రావీణ్యం పొందిన విమలా రామన్ త్వరలో చెన్నైలో డ్యాన్స్ అకాడమీ నెలకొల్పే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆమె పేర్కొంటూ, మయూరి, సాగర సంగమంలాంటి కొన్ని సంగీత భరిత చిత్రాలను చూసి స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. స్వతహాగా నృత్య కళాకారిణి కావడంతో ఆ చిత్రాలు తనకు క్యాష్నెట్గా మారాయన్నారు. దేశ విదేశాల్లో 200కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఈ మధ్య సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ రోజున తన నృత్య కార్యక్రమం జరిగిందని తెలిపారు. త్వరలో చెన్నైలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కన్నడంలో పొన్ కుమరన్(లింగ చిత్ర కథరచయిత) దర్శకత్వంలో రాజా రవీంద్ర చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇది 1920లో జరిగిన యథార్థ గాథకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో తనది రాయల్ ఫ్యామిలీకి చెందిన యువతి పాత్రగా పేర్కొన్నారు. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. అదే విధంగా మలయాళంలో టర్నింగ్ పాయింట్ చిత్రంలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు. -
వెళ్లామా.. ఓటేసేమా.. వచ్చామా కాదు!
పోలింగ్ బూత్‌కి వెళ్లామా.. ఓటేసేమా.. వచ్చామా.. ఈ మాదిరి కాదు.. ఎవరికి ఓటేస్తున్నాం.. ఎలాంటి వాళ్లను ఎన్నుకుంటున్నాం... మన జీవితాలను, దేశ, రాష్ట్రాల ప్రగతిని ప్రభావితం చేసే సమర్థులైన నేతలనే ఎన్నుకుంటున్నామా.. అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. డబ్బు, ప్రలోభాలకు ఓటును అమ్మేసి మన భవిష్యత్తును పణంగా పెట్టొద్దు. ఇక ఓటేసేందుకు ఎండలో బయటకేం వెళ్తాం అనుకుని పోలింగ్ నాడు సెలవురోజుగా భావించి ఇంట్లో పిల్లాపాపలతో, టీవీ, ఇంటర్నెట్లతో కాలక్షేపం చేసే బాపతు చాలామంది ఉంటారు.. అలాంటి వారి పట్ల విదేశాల్లో కఠినంగా వ్యవహరించే చట్టాలున్నాయి. కానీ మన వద్ద లేవు. అలాంటి చట్టాలకు మన భారత్‌లో పని లేకుండా దేశ పౌరులుగా కనీస కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు ముందుకు కదలాలి. - విమలా రామన్, హీరోయిన్