కోలీవుడ్ నటుడు వినయ్, హీరోయిన్ విమలారామన్ ప్రేమలో ఉన్నట్టు తాజా సమాచారం. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయకుడిగా నటించిన వినయ్ ప్రస్తుతం ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా నటి విమలరామన్ కథానాయకగా పలుభాషల్లో నటించారు. ఈమె తెలుగులోనూ ఎప్పుడైనా ఎక్కడైనా, గాయం-2, చట్టం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ మిస్ ఇండియా, ఆస్ట్రేలియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన విమలరామన్‌ను దర్శకుడు కే.బాలచందర్ పొయ్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. ఆ తర్వాత చేరన్ దర్శకత్వంలో రామన్ తేడియ సీతై చిత్రాల్లో నటించి ఆ తర్వాత మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.
ఇలా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఏడాది నుంచి వినయ్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇటీవల ఈ అమ్మడు పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకలు ఆమె కుటుంబసభ్యులతో పాటు వినయ్ కూడా పాల్గొనడం విశేషం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందన్న ప్రచారం హోరెత్తుతోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోసుకోబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment