టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్‌లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్‌లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్‌గా ఉన్న నదియాతో సురేశ్ లవ్‌లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)
ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్‌తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్‌తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్‌గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.
తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.
సురేశ్ సినీప్రస్థానం..
ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్‌లో పలు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment