Nadhiya
-
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. -
ఆ హీరోయిన్‌తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్‌లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్‌తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు. -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
పవర్ఫుల్ దేవి
పవర్ఫుల్, స్టైలిష్ అత్త–అమ్మ పాత్రలంటే నదియానే చేయాలన్నంతగా ఆమె ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించారు. తమిళంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘తిరైక్కు వరాద కథై’ అనే చిత్రం ‘దేవి’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డి.తులసిదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైనవి సమర్పణలో సువర్ణ తెలుగులోకి అందిస్తున్నారు. సువర్ణ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యం లో హారర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ఇది. నదియా పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేశారు. ఆమె పాత్ర సినిమాకే హైలెట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయను న్నాం. తమిళంలో 15 కోట్లు వసూ లు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ధనుష్, కార్తీలతో నదియా ఢీ
స్టార్ హీరోలు ధనుష్, కార్తీలతో సీనియర్ నటి నదియా ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల విడుదల సమయంలో వాటికి పోటీగా విడుదల చేయడానికి ఇతర చిత్రాల దర్శక నిర్మాతలు సాహసం చేయరు. అలాంటిది నదియా తన సహ నటీమణులు, యువ నాయికలతో పోటీకి సై అంటుండడం విశేషం. వివరాల్లోకెళితే నటుడు ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన కొడి, కార్తీ త్రిపాత్రాభినయం చేసిన కాష్మోరా చిత్రాలు దీపావళికి తెరపైకి రానున్నాయి. వాటికి పోటీగా నదియా, కోవైసరళ, ఇనియ,ఆర్తి, ఈడన్, హారతి మొదలగు నాటి నేటి ప్రముఖ తారామణులు నటించిన చిత్రం తిరైక్కు వరాద కథై. ఈ చిత్రంలో ప్రధాన విశేషం ఏమిటంటే ఒక్క నటుడు కూడా మచ్చుకైనా కనిపించడు. అందరూ తారామణులతో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. నటి నదియా ఇందులో పోలీస్ అధికారిగా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. చాలా కాలం తరువాత ఆమె నటించిన తమిళ చిత్రం ఇది. మలయాళంలో సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారితో చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు తులసిదాస్ రూపొందించిన చిత్రం తిరైక్కు వరాద కథై. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంజేడీ ప్రొడక్షన్స్ పతాకంపై కే.మణికంఠన్ భారీ ఎత్తున నిర్మించారు. కళాశాలలో చదువుకుంటూ హాస్టల్లో నివసించే స్నేహితుల ఇతివృత్తంగా రూపొందిన ఇందులో ఇంతకు ముందు పెద్ద వివాదానికి దారి తీసిన హిందీ చిత్రం ఫైర్ తరహా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసే పాశ్చాత్య దేశాల సంస్కృతికి అద్దం పట్టే విధంగా తిరైక్కు వరాద కథై చిత్రంలో కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రేమ, ఈర్ష్య కారణంగా స్నేహితురాళ్ల మధ్య జరిగే పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందనే కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు,కన్నడం,మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగులో కొన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు హక్కులను అడుగుతున్నారని, వారితో చర్చలు జరుగుతున్నాయని నిర్మాత మణికంఠన్ చెప్పారు. -
తిరైకి వరాద కథైలో నదియా
ఒక నాటి మేటి నాయకి నదియా తమిళంలో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహలక్ష్మీ చిత్రం ద్వారా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. అయితే క్యారెక్టర్ పాత్రలకు మారిన తరువాత నదియా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేశారన్నది గమనార్హం. అలాంటిది చాలా గ్యాప్ తరువాత నదియా నటించిన తమిళ చిత్రం తిరైకి వరాద కథై. ఇందులో కోవై సరళ, ఇనియ, ఈడెన్, ఆర్తీ, సబిత మొదలగు వారు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే అందరూ నటీమణులే నటించడం. చిత్రంలో ఒక మగ పాత్ర కూడా ఉండదట. ప్రముఖ మలయాళ దర్శకుడు తులసీదాస్ దర్శకత్వం వహించిన చిత్రం తిరైకి వరాద కథై. ఎంజేడీ ప్రొడక్షన్స్ పతాకంపై కే.మణికంఠన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ చిత్ర కథ గురించి ఒక లైన్ చెప్పినా చిత్రం మొత్తం తెలిసిపోతుందన్నారు. అందుకని చాలా ఇష్టపడి, కష్టపడి ఎంజాయ్ చేస్తూ రూపొందించిన చిత్రం తిరైకి వరాద కథై అని తెలిపారు. నిర్మాత లేనిదే చిత్రమే లేదన్నారు. ఈ చిత్రానికి నిర్మాత మణికంఠన్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ, యాక్షన్, హారర్, థ్రిల్లర్ అంటూ అన్ని అంశాలు ఉంటాయన్నారు. ఇందులో నటించిన వారందరి సహకారం లేకపోతే చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులోని మూడు ప్రధాన పాత్రలకు వేరే హీరోయిన్లను నటింపజేయాలని ప్రయత్నించగా కథ విన్న వారు నటించడానికి అంగీకరించినా హీరో లేని సినిమా సాధ్యమా?అంటూ వెనక్కు తగ్గారని తెలిపారు. అలాంటిది నటి నదియా, ఉనియ, ఈడెన్, కోవైసరళ లాంటి వారు నటించడానికి సమ్మతించడం చిత్రానికి మరింత బలం పెరిగిందనే అభిప్రాయాన్ని దర్శకుడు తులసీదాస్ వ్యక్తం చేశారు.ఈ చిత్ర ఆడియోను నటి నదియా ఆవిష్కరించగా నటుడు శ్రీకాంత్ తొలి సీడీని అందుకున్నారు. -
డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!
బిరబిరా పారే నది... నదియా! ... జరీనా మొయిదు నుంచి నదియా దాకా... నదియా నుంచి మిసెస్ గోడ్బోలే దాకా... మిసెస్ గోడ్బోలే నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా... నదియా మలుపులు మన గుండెల్ని తట్టాయి. ఎన్ని మలుపులు తిరిగినా తనకు బాగా నచ్చిన పాత్ర... డెఫినెట్లీ... మిసెస్ గోడ్బోలే! * వెల్కమ్ బ్యాక్ టు ‘సుందరి ఆఫ్ సౌత్’! ఇంతకీ మీకు ఆ పేరెలా వచ్చింది? నదియా: తమిళ్లో తొలిచిత్రం ‘పూవే పూచూడవా’లో పాత్ర పేరు సుందరి. అంతకు ముందు మలయాళంలో పేరొచ్చినా, ఆ చిత్రంతో సౌత్‌లో పాపులరయ్యా. బహుశా, అందుకే ‘సుందరి ఆఫ్ సౌత్’ అని అంటారేమో. * క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? హీరోయిన్గా చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్నైన ఈ సెకండ్ ఇన్నింగ్స్నే ఆస్వాదిస్తున్నా. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని అందరూ మా అక్క, మా అత్త, మా అమ్మ ఇలా ఉంటే బాగుండుననుకుంటున్నారు. పురుషాధిక్యమెక్కువ, హీరోయిన్ల షెల్ఫ్‌లైఫ్ తక్కువ ఉండే సినీ రంగంలో నా లాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ విజయంగా దీన్ని భావిస్తున్నా. * ఇప్పటికీ మీరు అందంగా ఉన్నారు. హీరోయిన్గా కూడా చేయచ్చేమో? (నవ్వేస్తూ) ఆ మాట అన్నవాళ్ళందరితో ‘అలాగైతే, నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు కథ రాయండి’ అని అడుగుతుంటా. ఒకప్పుడు హీరోయిన్ ఒరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి! వయసును బట్టి, మారిన కాలాన్ని బట్టి మనమూ మారాలి. హీరోయిన్గా మొదలెట్టాం కాబట్టి, పాతికేళ్ళ తర్వాతా అవే పాత్రలు చేస్తామంటే ఎలా? * మీ అమ్మా నాన్నల గురించి చెప్పండి. వాళ్ళతో మీది బలమైన బంధమట? మా నాన్న గారి పేరు - ఎన్.కె. మొయిదు. ముస్లిమ్. అమ్మ పేరు- లలిత. హిందువు. ఇద్దరూ మలయాళీలే. ‘టాటాస్’ సంస్థలో పనేచేసేవారు. మా అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలం - నేను, చెల్లెలు హసీనా. నా అసలు పేరు జరీనా మొయిదు. సినిమాల్లోకి వచ్చాకా నా బాగోగులన్నీ నాన్న గారే చూసుకొనేవారు. స్క్రిప్ట్‌లు నేను, ఆయన కలసి వినేవాళ్ళం, నిర్ణయం తీసుకొనేవాళ్ళం. మరీ గ్లామరస్ పాత్రలు, వాన పాటలుంటే నో చెప్పేస్తుండేవాళ్ళం. ఒక్క మాటలో - మై ఫాదర్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మి! హి ఈజ్ వెరీ స్పెషల్ టు మి. మా అమ్మ మాకు పెద్ద సెలైంట్ సపోర్టర్! * మరి, హీరోయిన్గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకొని, స్టేట్స్ వెళ్ళిపోయారేం? ముంబయ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకూ, మా ఆయన శిరీష్ గోడ్బోలేకూ పరిచయం. ప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ వాళ్ళ బ్రదర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కాలేజ్‌లో చదువుకొంటున్నప్పుడే ఫాజిల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ, నన్ను ఆ పాత్ర చేయమన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఆయనను నమ్మి, ఈ రంగంలోకి వచ్చా. అయితే, వచ్చినప్పుడే తెలుసు... పెళ్ళి చేసుకొని, ఈ రంగానికి దూరంగా వెళ్ళిపోతానని! పద్ధెనిమిదేళ్ళ వయసులో మలయాళ చిత్రం ‘నోక్కెత్త దూరత్తు కన్నుమ్ నట్టు’ (1984)తో వచ్చా. తొలి సినిమాకే ‘ఉత్తమ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అయిదేళ్ళు హీరోయిన్గా చేశా. శిరీష్ నిలదొక్కుకోగానే, పెళ్ళి చేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయా. పదిహేనేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ (2004)తో మళ్ళీ వచ్చా. * ఇంతకీ మీ పేరును నదియా అని మార్చిందెవరు? నేను సినిమాల్లోకి వస్తున్నప్పటికే హిందీ నటి జరీనా వహాబ్ ఫేమస్. అందుకని నా పేరు మార్చారు. ఫాజిల్ గారి సోదరుడి వరుసయ్యే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పా కదా! ఆయనకు ఒక సిస్టర్ ఉండేది. నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిరంతరం ప్రవహించే నదిలా నా ప్రయాణం సాగిపోవాలని ఆమే నా పేరు ‘నదియా’ అని మార్చింది. * పెళ్ళితో హీరోయిన్గా అన్నీ వదులుకొని వెళ్ళిపోవడం కఠిన నిర్ణయమేనే! జీవితంలో తీసుకున్న కీలకమైన, తెలివైన నిర్ణయమదే. ఎందుకంటే, కెరీర్లో ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా వ్యక్తిగత జీవితమూ బాగుండాలి. అయామ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ రైట్ ఛాయిస్. * మరి, సినిమాల్లోకి మళ్ళీ ఎలా? దర్శకుడు రాజా ఎలా ఒప్పించారు? ఒకసారి సెలవులకి ముంబయ్‌కి వచ్చా. ఎలా తెలిసిందో ఏమో దర్శకుడు ‘జయం’ రాజా వాళ్ళు ఫోన్ చేసి, ఆ పాత్ర ఆఫర్ చేశారు. ముంబయ్ వచ్చి, తెలుగు మాతృక ‘అమ్మ.నాన్న..ఒక తమిళమ్మాయి’ సీడీ ఇచ్చారు. అందులో హుందాగా ఉన్న తల్లి పాత్ర చూసి, ఒప్పుకున్నా. * సినిమాల్లో కొనసాగినప్పుడు నిజజీవితంలో తల్లిగా ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మేము ముంబయ్‌కి షిఫ్ట్ అయిపోయాం. సినిమాల్లో నటిస్తున్నా, సెట్స్‌లో లేనంటే, ముంబయ్‌లో అందరు అమ్మల్లాగే ఇంటా, బయట పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పటికీ చాలా సెలెక్టివ్. ఏడాదికి ఒకటో, రెండో ఫిల్మ్స్ చేస్తున్నా. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ నా 41వ సినిమా. * పదిహేనేళ్ళ గ్యాప్ మాట అటుంచితే, 31 ఏళ్ళ కెరీర్లో ఇన్ని సినిమాలేనా? చేసినవి కొన్నే అయినా, టైటిల్ రోల్స్. రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి లాంటి అగ్ర హీరోలతో, గుర్తుండిపోయే పాత్రలు చేశా. అప్పట్లో నా సమకాలీన హీరోయిన్లయిన రాధ, రాధిక, అంబిక, రేవతి వందల సినిమాలు చేశారు. అయామ్ స్టిల్ ఎ జూనియర్! (నవ్వులు) * హిందీ హీరోయిన్గా చాన్స వస్తే వదిలేశారట? సుభాష్ ఘయ్ సహా కొంతమంది సంప్రతించారు. సల్మాన్‌ఖాన్ తొలినాళ్ళ సూపర్‌హిట్ ‘మై నే ప్యార్ కియా’కు హీరోయిన్గా నన్ను అడిగారు. నిర్మాతలైన బర్జాత్యాలు మా ఇంటికి కూడా వచ్చారు. కానీ, పెళ్ళికి సిద్ధమవుతున్న నేను వద్దనేశా. ఇప్పటికీ ఆ విషయం మా పిల్లలతో సరదాగా చెబుతూ, ‘సల్మానా? మీ డాడీనా?’ అంటే, ‘మీ డాడీకి ఓటేశా’ అంటూ ఉంటా. ‘మైనే క్యా కియా’ అని ఆట పట్టిస్తుంటా. * శిరీష్ గోడ్బోలేతో మీ ప్రేమకథ చెప్పలేదు! మేము ముస్లిమ్‌లం. వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణులు. ముంబయ్‌లో మా ఇళ్ళు కొద్ది దూరంలోనే ఉండేవి. కామన్ ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. అప్పటికి నాకు 17 ఏళ్ళు. ఆయనకు 20 ఏళ్ళు. నేనింకా చదువుకుంటున్నా. చదువు, ఉద్యోగం కోసం శిరీష్ అమెరికా వెళ్ళినా మా ప్రేమ, స్నేహం కొనసాగింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేయాలి. లేదంటే, ఉత్తరాలు. అలా మేము చాలా ఉత్తరాలే రాసుకున్నాం. మా ప్రేమ రెండువైపులా తెలిసింది. మా పెళ్ళి అయింది. * కులమతాలు తేడా. రాజీపడాల్సి వచ్చిందా? నేను, ఆయన ముంబయ్‌లో పెరిగినవాళ్ళం. మెట్రోపాలిటన్ ఆలోచనా దృక్పథం, మా సోషల్ సెటప్ ఒకేలా ఉండేవి. అందుకే, కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నేను మరాఠీ ధారాళంగా మాట్లాడతా. మావారి ఇంట్లో చేసే ప్రతి పండుగ మనస్ఫూర్తిగా చేస్తా. మా అత్తమామల్ని ‘మాయి’ (అమ్మ), డాడీ అనే పిలుస్తా. * మరి, ఇంతకీ మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా నాన్న గారు ముస్లిమ్ అయినా, మాకు ముస్లిమ్ పేర్లు పెట్టినా, మేమెప్పుడూ ఒకే మత ధర్మాన్ని అనుసరించలేదు. ఇప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మా నాన్న గారు నేర్పిన ఖురాన్‌లోని ప్రార్థనలు, మా అత్త గారింట్లో నేర్చుకున్న గణేశ్ హారతి, చిన్నతనంలో పారసీ స్కూల్లో నేర్చుకున్న పారసీ ప్రార్థనలు చేసి కానీ పడుకోను. అల్లా బిజీగా ఉంటే వినాయకుడు, ఆయన బిజీగా ఉంటే మరో పారసీ దేవుడు కాపాడతారని మా వాళ్ళతో సరదాగా అంటుంటా. * అప్పటికీ, ఇప్పటికీ పెంపకంలో తేడా? అప్పట్లో పిల్లలం అమ్మానాన్న ఏం చెబితే అది, ప్రశ్నలు వేయకుండా వినేవాళ్ళం. కానీ, ఈ తరం పిల్లలు ప్రశ్నలడుగుతారు. వాళ్ళకు లాజికల్‌గా జవాబివ్వాలి. అప్పటి తల్లితండ్రులు మంచి వక్తలైతే, ఇప్పటివాళ్ళు మంచి శ్రోతలవాలి. పిల్లల కష్టసుఖాలు విని, జవాబివ్వాలి. * మీ అందం, ఆహార, వ్యాయామ సీక్రెట్స్? (నవ్వేస్తూ) అనేక అంశాల కలయిక. ప్రధానంగా అమ్మానాన్నల జీన్స్ నుంచి వచ్చింది. బాగా వండుతా. బాగా తింటా. అందుకు తగ్గట్లే వ్యాయామం చేస్తా.రోజూ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్, యోగా - మూడూ చేస్తా. నెగటివ్ ఎనర్జీకీ దూరంగా ఉంటా. వాట్సప్ మినహా ఏ సోషల్ మీడియాలోనూ లేను. ఐ కీప్ మై లైఫ్ సింపుల్. * మీ తాజా సినిమా గురించేం చెబుతారు? త్రివిక్రమ్ ‘అ...ఆ...’లో చేస్తున్నా. ఆయన సూపర్డెరైక్టర్. ఇది ఆయన శైలి మంచి రొమాంటిక్ కామెడీ. సమంతకు తల్లిగా మహాలక్ష్మిపాత్ర కొత్తగా ఉంటుంది. * జరీనాకూ, తెర జీవిత నదియాకూ తేడా? నటినైనా నేల విడిచి సాము చేయను. అందరిలా మామూలు మనిషిలా ఉంటా. ఒక్క మాటలో జరీనా, మిసెస్ గోడ్బోలే- ఒరిజినల్ జీవితం. నదియా - తెరపై అందరినీ నమ్మించే కల్పన. - రెంటాల జయదేవ అమ్మ-నాన్న-ఇద్దరు మరాఠీ అమ్మాయిలు * మా ఆయన శిరీష్ గోడ్బోలే అమెరికాలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’కి మేనేజింగ్ డెరైక్టర్. మా పెద్దమ్మాయి సనమ్‌కి 19 ఏళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో లిబరల్ ఆర్ట్స్, ఆంత్రొపాలజీతో డిగ్రీ చేస్తోంది. ఇక, జానాకి 14 ఏళ్ళు. నైన్త్ గ్రేడ్ చదువుతోంది. * పెద్దమ్మాయి వెస్ట్రన్ మ్యూజిక్ సింగర్. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. చిన్నమ్మాయికి డ్యాన్స్ ఇష్టం. హిప్హాప్, జాజ్ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతానికైతే పిల్లల దృష్టి చదువు మీదే! -
మహేష్‌కు అక్కగా నటీస్తోన్న నదియా?