
పవర్‌ఫుల్ దేవి
పవర్‌ఫుల్, స్టైలిష్ అత్త–అమ్మ పాత్రలంటే నదియానే చేయాలన్నంతగా ఆమె ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించారు. తమిళంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘తిరైక్కు వరాద కథై’ అనే చిత్రం ‘దేవి’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డి.తులసిదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైనవి సమర్పణలో సువర్ణ తెలుగులోకి అందిస్తున్నారు.
సువర్ణ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యం లో హారర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా ఇది. నదియా పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర చేశారు. ఆమె పాత్ర సినిమాకే హైలెట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయను న్నాం. తమిళంలో 15 కోట్లు వసూ లు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.