devi
-
అమ్మ అంజనాదేవితో కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథ.. కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్
‘1000 వర్డ్స్’ సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు నటి రేణూ దేశాయి. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’(1000 Words movie). ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ము ముఖ్య అతిథులుగా విచ్చేశారు. షో అనంతరం రేణూ దేశాయ్(Renu Desai) మీడియాతో మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
Christmas 2024: బిపాసా సెలబ్రేషన్స్,‘బుజ్జెమ్మ’ ఎంత బావుందో!
-
నా పార్ట్నర్ సూపర్: భార్య దేవిశాతో సూర్యకుమార్(ఫొటోలు)
-
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది. రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. -
గేదెను వదిలేసి వచ్చేదెలా?
ఉత్తరాఖండ్‌కు చెందిన 80 ఏళ్ల హీరా దేవి గతేడాది ‘పైర్’ (చితి) అనే హిందీ చిత్రంలో ‘హీరోయిన్ ’గా నటించారు. ఆ చిత్రం ‘టాలిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఇండియా నుండి అధికారికంగా పోటీకి ఎంపికైంది కూడా. విషయం ఏమిటంటే – ఉత్తర ఐరో΄ాలోని ఎస్టోనియా దేశానికి రాజధాని అయిన టాలిన్ పట్టణంలో జరుగుతున్న ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ రోజు (నవంబర్ 19) సాయంత్రం ‘పైర్’ను ప్రదర్శిస్తున్నారు. ఇక విశేషం ఏమిటంటే – చిత్ర దర్శకుడు వినోద్ కప్రీ తనతోపాటుగా హీరా దేవిని ఎస్టోనియా తీసుకువెళ్లేందుకు ఎట్టకేలకు ఆమెను ఒప్పించగలిగారు. చిత్ర బృందంతో కలిసి హీరాదేవి ఆదివారం ఎస్టోనియా విమానం ఎక్కేశారు. అదేం విశేషం అంటారా? తన బర్రెను వదలి తను వచ్చేదే లేదని హీరా దేవి మొరాయించారు మరి!అసలు ‘ఫైర్’ చిత్రంలో నటించే ముందు కూడా ఆమె ఒక పట్టాన ఊరు దాటేందుకు అంగీకరించలేదు. ‘‘షూటింగ్ కోసం రోజూ నేను మీతో వచ్చేస్తుంటే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని ఆమె ప్రశ్న. ఇప్పుడు ఎస్టోనియా వెళ్లటానికి ఆమె అడుగుతూ వచ్చిన ప్రశ్న కూడా అదే.. ‘‘మీతోపాటు విమానం ఎక్కేస్తే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని! ‘‘నేను తప్ప నా బర్రెకు ఎవరూ లేరు, నేను రాలేను..’’ అని కరాకండిగా చెప్పేశారు హీరా దేవి. ఆమె నిరాకరణ సమంజసమైనదే. హీరా దేవి ఉంటున్నది ‘గడ్టిర్’ అనే మారుమూల గ్రామంలో. ఆమె, ఆమె బర్రె తప్ప ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంట్లోనే కాదు, ఆ ఊళ్లో జనం ఉండేది కూడా తక్కువే. అంతా వేరే ఊళ్లకు వలస వెళ్లిపోయారు. హీరా దేవి కూతురు కూడా అక్కడి కి 30 కి.మీ. దూరంలోని బరణి గ్రామంలో ఉంటోంది. హీరా దేవి ఇద్దరు కొడుకులు ఢిల్లీలో స్థిరపడిపోయారు. చివరికి ఆమె పెద్ద కొడుకు చేత చెప్పించి ‘పైర్’లో హీరోయిన్పాత్రలో నటించేందుకు ఒప్పించారు చిత్ర దర్శకుడు కప్రీ.‘పైర్’ 80 ఏళ్ల వయసులో ఉన్న దంపతుల ప్రేమ కథ. ఉత్తరాఖండ్‌లోని మున్శా్యరీ గ్రామంలోని ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం స్క్రీన్ ప్లేను 2018లోనే రాసి పెట్టుకున్నారు వినోద్ కప్రీ. స్థానిక నటుల కోసం వెతకులాటతోనే ఇన్నేళ్లూ గడిచిపోయాయు. ఆఖరికి.. ‘గడ్టిర్’ గ్రామంలో పసుగ్రాసం కోసం అడవికి వెళుతుండే కొందరు మహిళల ద్వారా హీరా దేవి చలాకీగా ఉంటారని, చక్కగాపాడతారని, భావాలను ముఖంలో భలేగా ఒలికిస్తారని తెలుసుకున్న కప్రీ.. హీరోయిన్ పాత్రకు హీరా దేవిని ఎంపిక చేసుకున్నారు. హీరోగా మున్శా్యరీ గ్రామంలో నాటకాలు వేస్తుండే మాజీ సైనికుడు పదమ్ సింగ్‌ని తీసుకున్నారు. ‘పైర్’లో ఇద్దరూ చక్కగా నటించారు. చిత్రానికి మంచి ఆర్ట్ మూవీగా పేరొచ్చింది. ఆ చిత్రాన్నే ఇవాళ ఎస్టోనియాను ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ – హీరా దేవి తన బర్రెను వదిలిపెట్టి ఎస్టోనియా వెళ్లేందుకు ఎలా అంగీకరించారు?! బర్రెను తను చూసుకుంటానని తల్లికి హామీ ఇచ్చి కూతురు ఆదివారం ఉదయం ఊళ్లోకి దిగగానే... బర్రె కంఠాన్ని ప్రేమగా, మృదువుగా నిమిరి, వెనక్కు తిరిగి తిరిగి బర్రె వైపు చూసుకుంటూ ఎస్టోనియా వెళ్లటం కోసం ఊళ్లోంచి బయటకు అడుగు పెట్టారు హీరా దేవి. -
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు
కాళోజీ సెంటర్/హన్మకొండ: వరంగల్ కలెక్టర్‌గా డాక్టర్ సత్య శారదదేవి, హనుమకొండ కలెక్టర్‌గా పి.ప్రావీణ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారిని రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఆర్ఓ అయూబ్‌అలీ, డీఈఓ డి.వాసంతి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఆర్డీఓలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్డీఎం హవేలీ రాజు, కలెక్టరేట్ ఏఓలు శ్రీకాంత్, అబీద్ అలీ, తహశీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, ఫణికుమార్, విజయ్, రవిచంద్రారెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా(లోకల్ బాడీస్), వెంకట్‌రెడ్డి (రెవెన్యూ), డీ.ఆర్.ఓ. వై.వి.గణేష్ ఉన్నారు. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు. -
‘లంబసింగి’ మూవీ రివ్యూ
టైటిల్: లంబసింగి నటీనటులు: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు. నిర్మాణ సంస్థ: కాన్సెప్ట్ ఫిలింస్ నిర్మాత: ఆనంద్.టి సినిమాటోగ్రఫీ: కె.బుజ్జి సంగీతం:ఆర్ఆర్.ధ్రువన్ విడుదల తేది: మార్చి 15, 2024 ‘లంబసింగి'కథేంటంటే.. వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊర్లోకి వెళ్లిన తొలి రోజే హరిత(దివి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊరిలో సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీసు శాఖే వారికి పునరావాసం కల్పిస్తుంది. హరిత ఆ ఊరి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంది. సంతకాల పేరుతో రోజు కోనప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్ చేస్తే హరిత రిజెక్ట్ చేస్తుంది. అదే బాధలో ఉండగా.. పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ తగులుతుంది. అదేంటి? అసలు హరిత ఎవరు? వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ తెరపై అంతే కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభం స్లోగా అనిపిస్తుంది. హరిత, వీరబాబుల మధ్య పరిచయం పెరిగాక కథనంలో వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాడు. ఇక ద్వితియార్థం మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషన్స్‌గా ఉంటుంది. బరువైన హృదయంతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. వీరబాబు పాత్రలో భరత్ చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. క వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్.ఆర్.ధృవన్ నేపథ్య సంగీతం..పాటలు సినిమాకు చాలా ప్లస్ అయింది. సినిమాలోని ప్రతి పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
షూటింగ్ సమయంలో నిజంగానే పాము కరిచింది: ప్రేమ
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా, వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై నేటికి(మార్చి 12, 1999న రిలీజ్) సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి. రిస్క్ చేసి మరి ‘దేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సీన్ సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయించేవాడు. ఓక్కో సీన్‌కి 50 టేకులపైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు. గెటప్ వేశాక నా హావభావాలు ఆటోమెటిక్‌గా మారిపోయేవి. టీమ్ అంతా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. షూటింగ్ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా బతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్‌ని నిలిపివేశాం. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూటింగ్ చేయడం సవాల్‌గా మారింది. సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీలయ్యాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్లో ‘దేవి’ స్పెషల్ మూవీ’ అని ప్రేమ చెప్పుకొచ్చింది. 25 years for Blockbuster #Devi 🔥🔥 A supernatural phenomenon film which attracted the audience to theaters for a long time. 🙌 Directed by #KodiRamakrishna Produced by @MSRajuOfficial A Rockstar @ThisIsDSP musical 🎶#Prema #Shiju @Actor_Mahendran #25YearsForDevi pic.twitter.com/Xr6V5BKl0J — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 12, 2024 -
కనిపించే దేవతకు జన్మదిన శుభాకాంక్షలు: మెగాస్టార్ ట్వీట్
ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది. ఈ అవార్డ్‌తో ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ కీర్తి మరింత పెరిగింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడిగా నిలిచారు. అయితే తాజాగా మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం అంజనాదేవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ నటిస్తోన్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj — Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024 -
ని‘వేదనలు..’ ప్రజావాణికి వినతుల వెల్లువ*
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. రెండేళ్లుగా వేతనాల్లేవ్.. మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు బోర్లకు అడ్డుపడుతున్నరు మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్హత్నూర్ పట్టా చేయడం లేదు నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్ షెడ్లు కేటాయించాలి మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్ అనుమతి లేదని కూల్చేశారు సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల. -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
రిజర్వేషన్ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు
-
Bro Movie Trailer Launch : దేవి థియేటర్లో బ్రో ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు)
-
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
ఎంటర్టైన్మెంట్ కావాలా? లంచ్ టైంలో ఇవి చూసేయండిలా!
సినిమాలు చూడాలంటే ఇంట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లుగా కొంత సమయం కూడా కావాలి. రెండు, మూడు గంటలు ఓపికగా కూర్చోవాలి. అంత టైం దొరకాలంటే అది వీకెండో, హాలీడేనో అయి ఉండాలి. మరి ఆఫీస్‌లోనో లేదంటే కాలేజీలోనూ ఏదైనా సినిమా చూడాలంటే.. వారికోసం షార్ట్ ఫిలింస్ ఉండనే ఉన్నాయి. యూట్యూబ్‌లోనే కాదు ఓటీటీలోనూ లఘుచిత్రాలను అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హాట్‌స్టార్‌లో కేవలం లంచ్ టైంలో చూసేయగలిగే షార్ట్ ఫిలింస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ► మరాఠా మందిర్ సినిమా ► ఔచ్ ► దేవి ► అధీన్ ► ది స్కూల్ బ్యాగ్ ► టెరీర్ ► చట్నీ చదవండి: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
సాయం చేయాలంటూ డైరెక్టర్ రాజమౌళి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
Director SS Rajamouli Humble Request To Donate Funds For Devika: ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సహాయం కోరారు. తనతో పాటు కలిసి పనిచేసిన ఆర్టిస్ట్‌కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. 'బాహుబులి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె అనేక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేసింది. ఆమె అభిరుచి, అంకిత భావం సాటిలేనివి. కానీ దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్ క్యాన్స్‌ర్‌తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెటో(KETO)ఫండ్ రైజింగ్‌కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు దేవిక ఫోటోలను సైతం షేర్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సుమారు రూ.30-40కోట్లు తీసుకునే మీకు 3కోట్లు ఓ లెక్కనా? ఆమె ఆపరేషన్‌కు కావాల్సిన 3కోట్ల రూపాయలను నేరుగా మీరెందుకు సహాయం చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer. I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M — rajamouli ss (@ssrajamouli) January 29, 2022 -
నిజమైన వారసులు
‘నేను సమానత్వపు తరం. స్త్రీల హక్కులను గుర్తించాలి’ అని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. అందరూ కోరుకుం టున్న సమానత్వం విరాజిల్లే ప్రపంచం నిర్మించడానికి వయస్సు, జాతి, వర్ణ, మత, లింగ తేడాల్లేకుండా అందరూ సమానత్వం వైపే సాగే చర్యలు చేపట్టాలని దాని సారాంశం. సమానత్వం భావన ఎంత వెనుకబడిన వారిలో కూడా ఇంతో అంతో చేరింది. మరెందుకు తాము సమానం అని భావించలేకపోతున్నారు. స్త్రీలే కాదు. వివక్షకు గురవుతున్న సమూహాలన్నీ తమనితాము వంచితులు గానే భావించడానికి కారణం ఏమిటో దేశాధినేతలు విధానకర్తలు ఒకసారి పరికించి చూడాల్సి ఉంది. బీజింగ్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి 25 సంవత్సరాలు గడిచాక దానిపై సంతకం చేసిన దేశాలు.. సమానత్వ సూచికలో ఎక్కడుంటున్నారో సమీక్షించాలి. ఒకే పనికి ఒకే రకం అయిన వేతనం.. వేతనంలో తేడాను ఆపాలనే అతి చిన్న డిమాండ్ కూడా పూర్తికాలేదు. 34 శాతం మన దేశంలో వేతన వ్యత్యాసం ఇంకా కొనసాగుతున్నది. పైగా ఓట్ల రద్దు తరువాయి ఆర్థికమాంద్యం వలన కోల్పోయిన 3 కోట్ల 60 లక్షల ఉద్యోగాల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. దాదాపు 50–60 శాతం వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్న మహిళలు దరిద్రంలోకినెట్టివేయబడుతున్నారు. మహిళల్ని రైతులుగా గుర్తించాలనే కోరిక కూడా ఎవరి చెవికీ ఎక్కడం లేదు. చిన్న చిన్న పన్నెండు పనులు చేస్తే సమానత్వం వైపు సాగవచ్చని ఆశపడుతున్నది యూఎన్ మహిళ. దానిలో మొదటిది స్త్రీల పనిని.. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవ వంటి గుర్తింపునోచని వేతనం లేని చాకిరీని పంచుకోమని సూచిస్తున్నది. ఇది ఇంట్లో వాళ్లు పంచుకుని చేయటం ఒక తాత్కాలిక పరిష్కారం కాని ఈ చాకిరీని సమాజపరం చేయటం దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ఇంటి పనిని తేలిక చేసే పరికరాలు కొనుగోలు చేసే శక్తి కలిగిఉండటం, వంటపని, పని ప్రదేశాలకు తరలిం చడం (ఉదయం మధ్యాహ్న భోజనాలు పని దగ్గరే లభించేలా చేయటం) పిల్లలకు శిశు సంరక్షణా లయాలు (కేర్ సెంటర్లు) ఇంటి దగ్గర, పని ప్రదేశాల్లో అందుబాటులో ఉండటం...ఇక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహా రానికి వస్తే ‘మీ టూ’ వల్ల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత అత్యాచారాలకు పాల్పడ్డాడని రుజువై, 25 సంవత్సరాల శిక్షకు సిద్ధ పడుతున్నాడు. ఇంత కాలం ఎందుకు బాధితులు మౌనంగా ఉన్నారు.. అనే సవాలును కోర్టు కొట్టి పారేసింది. వారి ఉపాధి దెబ్బతింటుందనే భయంతోపాటు ఇతని బలం పట్టు సినీ పరిశ్రమపై ఉండటమే వారు ఫిర్యాదు చేయకపోవడానికి కారణంగా భావించింది. అయితే గుజరాత్లో ఒక కళాశాలలోని 63 మంది విద్యార్థినులను లోదుస్తులు విప్పించి వారు రుతుక్రమంలో ఉన్నారా లేదా అని పరీక్షిం చినవాళ్లు, నర్సు ఉద్యోగాల కోసం వెళ్లిన మహిళల్ని అమానుషమైన రెండు వేళ్ల పరీక్షతో కన్యత్వం, గర్భధారణ నిర్ధారించిన ప్రభుత్వ అధికారుల్ని మందలించిన దాఖలాలు లేవు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉండాలనే నియమం తప్పనిసరి అనికూడా చాలామంది అధికారులకు తెలియదు. భాషలోగానీ, భావాల్లోగానీ వివక్ష తగ్గుతున్న దాఖలాలు మన దేశంలో పెద్దగా కనపడటం లేదు. జెండర్ సమానత్వ సూచికలో మొదటి స్థానంలో ఉన్న నార్వే మాత్రం మరో అడుగు ముందుకేసింది. భార్యాభర్తలిద్దరికీ 7 నెలల ప్రసూతి సెలవు పూర్తి జీతంతో సహా ఇచ్చేందుకు చట్టం చేసింది. మన దేశంలో ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలనే నియమం కూడా 13 నుండి 39 శాతం కేసుల్లో (రాష్ట్రాలవారీ తేడా ఉంది) జరగటం లేదు. అమ్మా యిలకు వారి విలువ తెలియజేయాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. మహిళా ఉద్యమాలు, స్వచ్ఛంద సంస్థలు దీనిపై నిరంతరాయంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ 0–6 సంవత్సరాల వయస్సులో ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 898 మందే సగటున ఉన్నప్పుడు అమ్మాయిల విలువను దేశం గుర్తించిందా అనే ప్రశ్న అవసరం అవుతుంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు జరుగుతున్న వివాహాలు 39 శాతం ఉంటే ‘బేటీ బచావో’ చట్టాలు ఎక్కడ ముక్కు మూసుకున్నాయో తెలియదు. కనీసపక్షంగా ప్రధాన మీడియాలో ‘మూస’ల్ని ప్రశ్నించడం కూడా లేదు. అదే ‘ఛాతీ లెక్కలు’ అవే గాజులు తొడిగించుకోలేదు అనే కించపరిచే పదాలు మగతనపు వైభవాన్ని, స్త్రీత్వపు బలహీనతల్ని చాటే చిత్రాలు, దృశ్యాలుగా మనోఫలకాలపై ముద్ర వేస్తుంటే అమ్మాయిల ఆత్మగౌరవం ఎలా పెరుగుతుంది. గతంకంటే చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది కానీ 2020కి పెరగాల్సిన మోతాదులో ఉందా? బడి, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, కనీసపక్షంగా ఇల్లు అయినా అమ్మాయిలకు సురక్షిత ప్రదేశంగా భావించే స్థితి ఉందా? తమ కనీస పౌరహక్కులు కలిగి ఉండటం తమ హక్కు అని పూర్తి శాంతియుతంగా రోడ్లపైకి వచ్చిన యువతరం, మహిళలు, మైనారిటీలు, దళితులు దేశద్రోహులయ్యారు. రాజ్యాంగంపట్ల, ప్రజాస్వామ్యంపట్ల ఏ మాత్రం గౌరవం లేని పాలన ప్రభుత్వ సంస్థల్ని, న్యాయాలయాల్ని, పోలీసు యంత్రాంగాన్ని విభజించిపడేసింది. ఈ మొత్తం కల్లోలాలకు మొదటి సమిధలు మళ్లీ స్త్రీలు, పిల్లలే. ఒక వర్గం స్త్రీలను అత్యాచారం చేయొచ్చు, చంపొచ్చు అనే భావన ఏర్పడేంతగా విద్వేష ప్రచారం నడుస్తున్నది. కానీ ఎంత విభజించినా ఈ దేశ మత సామరస్యపు అల్లిక ఇంకా మిగిలే ఉందని నిరూపించిన ఢిల్లీ దాడులు.. చట్టబద్ధమైన హక్కులు పార్లమెంటులో ప్రవేశం ఇవ్వకపోతే వీధుల్లోనయినా సాధిస్తాం అన్న షహీన్‌బాగ్‌లు, మతపెద్దల సంకెళ్లను బద్ధలుకొట్టిన మైనారిటీ మహిళలు, యువతరం బాధ్యతగానే కాదు, జాగరూకతగా ఉందని చాటి చెబుతున్న అసంఖ్యాక విద్యార్థినీ విద్యార్థులు.. సమానత్వం సైన్యంలో కూడా సాధిస్తాం అంటూ కోర్టుకీడ్చి గెల్చిన మిలటరీ మహిళలు.. వీళ్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నిజమైన వారసులు, స్ఫూర్తిప్రదాతలు. దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త -
తొమ్మిదిమంది మహిళలు ఒకే గదిలో
ఏదైనా సరే, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి.. సాగదీసే వ్యవహారాలు అస్సలు గిట్టవు. ఇదీ ప్రస్తుత జనరేషన్ పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా తక్కువ సమయంలో చెప్పేయాలి. అదీ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని సినీ తారలు కూడా ఫాలో అవుతున్నారు. అందుకే కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తామని గిరిగీసుకోవట్లేదు. అవకాశాలు వస్తే ప్రయోగాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లుగా ఎదిగిన చాలామంది బుల్లితెరపై హడావుడి చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ వారి సత్తా చాటుతున్నారు. (ముగ్గురికి హెల్ప్ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి సాయం చెయ్యమనండి) ఈ క్రమంలో తొమ్మిది మంది సీనియర్ నటీమణులతో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ రానుంది. కాజోల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నేహా ధూపియా, నీనా కులకర్ణి, శృతీహాసన్, ముక్తా బావ్రే, రామా జోషీ, శివానీ రఘువంశీ, సంధ్య మాట్రే, రసశ్విని దయమ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని నామకరణం చేశారు. సోమవారం ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో భిన్న నేపథ్యాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే గదిలో ఉన్నారు. అయితే దానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇక రెండు కొప్పులు ఒక్కచోట ఉండలేవు అన్న చందంగా విభిన్న మనస్తత్వం గల వీళ్లు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగుతున్నారు. దీంతో వారికి సర్దిచెప్తూ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోంది కాజోల్. (షార్ట్ ఫిల్మ్‌లో శృతీహాసన్) తొమ్మిది మంది మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లను ఎందుకు ఒకే గదిలో నిర్భందించారు? ఎవరు ఈ పని చేసుంటారు? అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మార్చి 2 వరకు ఆగాల్సిందే. ఈపాటికే విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నటులను ఒకేసారి చూడటం నిజంగా కనుల విందేనని కామెంట్లు చేస్తున్నారు. దుర్గాదేవి తొమ్మిది అవతారాలను స్ఫూర్తిగా తీసుకుని, వాటి తత్వాలను తెలియజెప్పే పాత్రలేమోనంటూ కొందరు దేవీ సినిమా కథపై వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఏదేతైనేం, టైటిల్ పేరే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇక స్టోరీ ఇంకెంత శక్తిమంతంగా ఉంటుందో చూడాలి. (హైదరాబాద్ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు) -
మాజీ ప్రియుడిని హత్య చేసిన బుల్లితెర నటి
పెరంబూరు : వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసినందుకు దేవి అనే బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. దేవి అనే బుల్లితెర నటి తన భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మధురైకి చెందిన రవి(38) అనే వ్యక్తి 10ఏళ్ల క్రితం సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయమైంది. కొంతకాలానికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల ఆమె ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పాపెట్టకుండా కొలత్తూర్ సెమాత్తమన్ కోవిల్ వీధికి ఇల్లు మారిపోయింది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలరింగ్ వృత్తిని చేపట్టి పొట్టపోసుకుంటోంది. కాగా, ఆమె కోసం పలు చోట్ల గాలించిన రవికి దేవి చెల్లెలు లక్ష్మి ఇంటి చిరునామా తెలిసింది. దీంతో ఆదివారం రాత్రి మద్యం సేవించి లక్ష్మి ఇంటికి వెళ్లిన రవి ఘర్షణకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న దేవి తన భర్త శంకర్‌తో కలిసి లక్ష్మి ఇంటికి చేరుకుని రవిని వెళ్లిపోవాలని కోరింది. దీనికి అంగీకరించని రవి వాగ్వాదానికి దిగడంతో కోపం పట్టలేని దేవి ఇనుప రాడ్డుతో, ఆమె భర్త శంకర్ కట్టెతో దాడి చేశాడు. దీంతో రవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న కొలట్టూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కీల్పాక్కమ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన దేవి, ఆమె భర్త శంకర్, చెల్లెలు లక్ష్మి, భర్త సావరీస్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అకారణ జైలు పరిష్కారమా?
ట్రిపుల్ తలాక్ అన్నాక భర్తను జైలులో వేస్తే ఆమె భరణం ఎవరిని అడగాలి? ఎక్కడ ఉండాలి? జైలులో ఉపాధిలేని భర్త కుటుంబాన్ని ఎట్లా పోషిస్తాడు? పోనీ అలాంటి కేసుల్లో మహిళలకు ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా? భరణం, వేతనం, ఆశ్రయం కల్పిస్తాయా? అంటే అదీ లేదు. వారిని గాలికి వదిలేయడమే. ఇది బాధితులకు ఏ రకంగా న్యాయం చేసినట్టు? ఒకవైపు స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నట్టు కనబడుతూ.. మరోవైపు మైనారిటీ పురుషుల్ని నేరస్తుల్ని చేసే ప్రయత్నం ఇది. మత ఆచారాలు, మూఢ సంప్రదాయాల వల్ల, ఇతర కారణాలవల్ల భార్యల్ని వదిలేసే పద్ధతులు ఎవరు అనుసరించినా అంటే మతంతో పర్సనల్ లా లతో సంబంధం లేకుండా.. అది ఒక సమస్య. దాని పరిష్కారానికి ఏం చేయాలి? గృహ హింస చట్టం అందరికీ వర్తింపజేసి పటిష్టంగా అమలు చేయటం ద్వారా కుటుంబ వివాదాలు పరిష్కరించాలనే అసలు ప్రశ్నలు గాలికి వదిలేసి.. ఎవరికి భద్రత చేకూరుస్తారు? బే సబాబ్ హం బే గునావోం పర్ రవా మత్ కర్ సితం/ కర్ సితం హం కోం కియా హై కతల్ క్యోం తున్ బే సబాబ్ – సిరాజ్ ఔరంగాబాదీ (1716) ‘అమాయకులపై నీ క్రూర మైన చూపెందుకు?/ ఏ నేరం, ఏ కారణం లేకుండానే నీ చూపులోని క్రూరత్వం మమ్మల్ని హత్య చేసింది’’ అని రాసిన ఈ గజల్ 18వ శతాబ్దం ప్రారంభం లోనిది... ఇది ప్రస్తుత ట్రిపుల్ తలాక్ బిల్లుకు సరిగ్గా సరిపోతుంది. ట్రిపుల్ తలాక్... ఒకేసారి మూడుసార్లు ఆ మాటంటే ఆ భార్యను వదిలేయొచ్చనేది ఇస్లాంకి వ్యతిరేకం అని అంటున్నారు ఇప్పుడు. గత పాతి కేళ్లుగా మహిళా ఉద్యమాలు మైనారిటీ మహిళల కనీస హక్కుల గురించి ప్రశ్నించినప్పుడంతా మిన్న కుండిపోయిన అధిక శాతం మతపెద్దలు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడగలేదు? ఇప్పుడు టైమి య్యండి సరిచేస్తాం అంటున్నారు. గత 70 ఏళ్లుగా మైనారిటీల్లోని అభద్రతను ఆసరా చేసుకుని మతం పట్టు బిగించడం కోసం మహిళల హక్కులకు తూట్లు పొడిచి.. ఇస్లాం వ్యతిరేక ఆచారాలను అనుమతిం చడం లేదా చూసీ చూడనట్టు పోయినదాని పర్యవసా నమే.. ఇస్లాం మహిళలను అణచివేస్తుందనే భావన బలపడటానికి కారణం. ఈరోజు మహిళల సమా నత్వం ముసుగులో మైనారిటీ పురుషుల్ని నేరస్తు లుగా బోనులో నిలబెట్టేందుకు బీజేపీకి అవకాశం లభించింది. ముస్లిం మతపెద్దలే ఈ పని చేసుంటే.. నిర్ద్వంద్వంగా ట్రిపుల్ తలాక్ ఇస్లాంకి విరుద్ధం అని నిషేధించి ఉంటే.. ఈ చట్టం అవసరం ఏముండేది అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం చాలా సముచితం. ట్రిపుల్ తలాక్ చట్టం ఆమోదింపచేసుకున్న పద్ధతి పార్లమెంటరీ సాంప్రదాయాలను అవహేళన చేసేదిగా ఉంది. జేడీయూ, టీఆర్ఎస్ వంటి పార్టీల గోడమీది పిల్లి ఆట చూడటానికి అసహ్యంగా ఉంది. బిల్లును వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వైఎస్సార్సీపీలాగ నిలబడి ఓటు వేయాలి. కానీ సభ వదిలి పోవడం అంటే బిల్లును వ్యతిరేకించినట్లు కన బడి మైనారిటీల దగ్గర పరువు కాపాడుకోవాలి. అట్లని బీజేపీతో జరిపే లాలూచీని వదులుకోకూడదు. బీజేపీ బిల్లు గెలిచేందుకు వీలు కల్పించాలి. ఇదీ వ్యూహం. ‘ట్రిపుల్ తలాక్ చెప్పడం చెల్లదు’ అని ఈ చట్టం పేర్కొన్నది అంటే వివాహం రద్దు కాదు. ఆ స్త్రీకి, బిడ్డలకు వైవాహిక హక్కులన్నీ ఉంటాయి. అతను అప్పటికీ నిరాకరించినా ఆమెకు చట్ట రక్షణ ఉంటుంది. మరి అతన్ని జైలుకు పంపే వ్యవహారం దేనికి? తలాక్‌లు చెప్పిన ముస్లిం భర్త ఆమెను వది లేస్తాడు. అతనికి చట్టంతో పనిలేదు అని వాదించ వచ్చు. భార్యను వదిలేయదల్చినవాడు ఏ మతానికి చెందినా అతనికి చట్టంతో పనిలేదు. భార్యాబిడ్డల్ని నిరాధారంగా వదిలేసేవాళ్లు (ప్రజా సేవ కోసం లేదా మోక్షం కోసం వగైరా) అందర్నీ మూడేళ్లు జైలుపాలు చేస్తామంటే అందరికీ సమంగా ఆ శిక్షలుండాలి కదా. 498ఏ.. క్రిమినల్ చట్టం. తీవ్ర హింసలు, గాయాలు, మరణాలు, మానసిక హింస, వివాహ బంధంలోని మహిళల జీవించే హక్కుపై దాడి కాబట్టి అది నేరం. అయినా ఒకసారి భర్త అరెస్టయితే తిరిగి ఆ కుటుంబం కలవదు. కనుక ఎంతటి హింసలోనైనా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్త్రీలు ముందుకు రారు. ఆర్థికంగా ఆధారపడటం, సమాజానికి భయ పడటం, పిల్లల భవిష్యత్తు, ఒంటరి మహిళకు భద్రత లేకపోవడం.. భర్తే సర్వం అనే సాంప్రదాయ భావన వగైరాలు దీనికి ప్రధాన కారణాలు. కనుకనే మహిళా ఉద్యమం కుటుంబంలో వివాదాలు సామరస్యంగా పరిష్కరించే సివిల్ చట్టం, గృహ హింస చట్టం కోసం పాతికేళ్లు పోరాడింది. 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ హింస బిల్లు మహిళా హక్కులను కాలరాసేదిగా ఉండటంతో దాన్ని అడ్డుకుని 2005లో మహిళా సంఘాలు ప్రతిపాదించిన సవరణలన్నీ ఆమోదిం చిన చట్టం.. గృహ హింస చట్టంగా, సివిల్ చట్టంగా వచ్చింది. అంటే పరిష్కారానికి వీలు కల్పించేలా కుటుంబ వివాదాలు (హింసకాదు) సివిల్ చట్టంగానే ఉండాలి. ముస్లిం మహిళలకు నిజంగా భద్రత కల్పించ తల్చుకుంటే ఇది సివిల్ చట్టంగా తెచ్చి దాని అమలు యంత్రాంగం ఏర్పాటు చేసి పటిష్టంగా అమలు చేయాలి. భర్తలపై ఆర్థికంగా ఆధారప డుతూ, వృత్తి నైపుణ్యాలు, విద్యలేని అసంఖ్యాక ముస్లిం మహిళల విద్య ఉపాధిపై శ్రద్ధ పెట్టాలి. ట్రిపుల్ తలాక్ అన్నాక భర్తను జైలులో వేస్తే ఆమె భరణం ఎవరిని అడగాలి? ఎక్కడ ఉండాలి? జైలులో ఉపాధిలేని భర్త కుటుంబాన్ని ఎట్లా పోషి స్తాడు. పోనీ అటువంటి కేసుల్లో మహిళలకు ప్రభు త్వం వక్ఫ్ బోర్డు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా? భరణం, వేతనం, ఆశ్రయం కల్పి స్తాయా? అంటే అదీ లేదు. వారిని గాలికి వదిలేయ డమే. ఇది బాధితులకు ఏ రకంగా న్యాయం చేసి నట్టు? 498ఏ క్రిమినల్ చట్టం కాబట్టి దురుపయోగం అవుతుందని గగ్గోలు పెడుతున్న మగ సంఘాలు, బీజేపీ ఎంపీలు ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు క్రిమినల్ చట్టంగా ఆమోదించారు. నిజానికి ‘సతి’ చట్టం మొదలు ‘నిర్భయ’ సవరణల దాకా స్త్రీలకు రక్షణ కల్పించే చట్టాలన్నీ కుటుంబ వ్యవస్థకు విఘా తంగా పరిగణించే బీజేపీ భావజాలం కొనసాగింపే ఈ ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు. ఒకవైపు స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నట్టు కనబడుతూ.. మరోవైపు మైనారిటీ పురుషుల్ని నేరస్తుల్ని చేసే ప్రయత్నం ఇది. మత ఆచారాలు, మూఢ సంప్రదాయాల వల్ల, ఇతర కారణాలవల్ల భార్యల్ని వదిలేసే పద్ధతులు ఎవరు అనుసరించినా అంటే మతంతో పర్సనల్ లా లతో సంబంధం లేకుండా.. అది ఒక సమస్య. దాని పరిష్కారానికి ఏం చేయాలి? గృహ హింస చట్టం అందరికీ వర్తింపజేసి పటిష్టంగా అమలు చేయటం ద్వారా కుటుంబ వివాదాలు పరిష్కరించాలనే అసలు ప్రశ్నలు గాలికి వదిలేసి ఎవరికి భద్రత చేకూ రుస్తారు.. ఎలాంటి సమానత్వం తీసుకు వస్తారు? మహిళల హక్కులు ప్రత్యేకించి ముస్లిం మహిళల హక్కులు (షాబానో కేసు దగ్గర్నుండి) రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకునే వ్యవహారానికి స్వస్తి పలకాలి. మతాలు, కులాలు, సాంప్రదాయాలు మహిళల హక్కులకు ఆటంకంగా మారితే.. వాటిని రాజ్యాంగబద్ధంగా తొలగించాలి. అనాగరికమైన కాలంచెల్లిన కుటుంబ వ్యవస్థల స్థానంలో అణచివేత లేని సమాన భాగస్వాములుండే ప్రజాస్వామ్య కుటుంబాలు.. హింసలేని కుటుంబాలు ఏర్పరచు కునేందుకు వీలు కలిగించే కుటుంబ చట్టాలు చేయాలి తప్ప రాజకీయ ప్రయోజనాలు కక్ష సాధిం పులకు కుటుంబం ఒక చట్ట సాధనం కాకూడదు. వ్యాసకర్త :సాంస్కృతిక కార్యకర్త:దేవి ఈ–మెయిల్: pa_devi@rediffmail.com -
మంచి వరుడు దొరికితే..!
నటి తమన్నా బోల్డ్ అండ్ బ్యూటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మరింత అందాన్ని సంతరించుకున్నారనే చెప్పాలి. అవకాశాలు కూడా మధ్యలో కాస్త తడబడ్డా ఇప్పుడు వరుస కడుతున్నాయి. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథ చిత్రం సైరా నరసింహారెడ్డిలో చాలా ముఖ్యమైన పాత్రను షోషిస్తున్నారు. ఇక హిందీలో ప్రభుదేవాతో జత కట్టిన ఖామోషి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా ప్రభుదేవాతో నటిస్తున్న మరో చిత్రం దేవి–2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇది ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రానికి సీక్వెల్. దేవీ–2 తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తమన్నా గురువారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు. దేవి–2 చిత్రం గురించి? దేవి–2 చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకు ముందు తెరపైకి వచ్చిన దేవి చిత్రం మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఇప్పుడు దేవీ–2 చిత్రం అంతకంటే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవి 2 చిత్రాన్ని అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? కథే ప్రధాన కారణం. దర్శకుడు విజయ్ కథ చెప్పగానే నచ్చేసింది. ఇందులో ప్రభుదేవాకు భార్యగా నటించాను. దేవి–2లోనూ డీగ్లామర్‌గా నటించారటగా? అయ్యో ఆ రూపం కోసం చాలా కష్ట పడ్డాను. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు అందరూ తమ చిత్రాల్లో అలానే కనిపించమంటున్నారు. సైరా చిత్రంలో కూడా నా గెటప్ విభిన్నంగా ఉంటుంది. అందులో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. సైరా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించారటగా? ఇకపై కూడా అలాంటి పాటల్లో నటించడం కొనసాగిస్తారా? ఖచ్చితంగా. అయితే ఆ పాటకు చిత్రంలో ప్రాధాన్యత ఉండాలి. పాట నాకు నచ్చాలి. మీపై వస్తున్న వదంతుల గురించి? అలాంటి వాటిని చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిని ఎవరు?ఎలా కల్పిస్తారో అర్థం కావడం లేదు. పెళ్లెప్పుడు చేసుకుంటారు? మంచి పెళ్లి కొడుకు దొరకాలి. దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పాను మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని. మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి, ఎంఎల్ఏలు, ఎంపీలు అవుతున్నారు.మీకూ అలాంటి ఆలోచన ఉందా? అలాంటి ఆలోచన నాకు లేదు.నిజం చెప్పాలంటే నాకు రాజకీయాలు తెలియవు. ఏమో మరో ఐదేళ్లలో రాజకీయాల గురించి నేర్చుకుని, ఆ దిశగా పయనిస్తానేమో. -
ముచ్చటగా మూడోసారి..
ముచ్చటగా మూడోసారి నటి తమన్నాను హర్రర్ చిత్రం వదలడం లేదు. వరుసగా మూడోసారి హర్రర్ చిత్రం చేయడానికి ఈ మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. అంతేకాదు కొంతకాలం డల్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు స్వీడ్ అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు వరస కట్టడం నిజంగా తమన్నా లక్కీనే. అదీ మూడు పదులు దాటిన ఈ వయసులోనూ హీరోయిన్గా బిజీగా ఉండడం అరుదైన విషయమే. ప్రస్తుతం తమన్నా ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతోంది. వీటితో పాటు మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా సమాచారం. ఇది హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటోందని తెలిసింది. దీనిని యువ దర్శకుడు రోహిన్ వెంకటేశన్ తెరకెక్కించబోతున్నారు. ఈయన ఇంతకుముందు కలైయరసన్, శివదా జంటగా నటించిన అదే కంగళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ హర్రర్ కథా చిత్రంలో తమన్నాతో పాటు యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, భగవతి పెరుమాళ్ నటించనున్నారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారు. డాని డైమండ్ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్ర షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. తమన్నా ఇంతకుముందు ప్రభుదేవాతో జతకట్టిన దేవి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కి ఫర్వాలేదనే టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం అదే జంట దేవి–2లో నటించారు. ఇదీ హర్రర్ కథా చిత్రమే. తాజాగా మూడోసారి ఈ బ్యూటీ హర్రర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్న మాట. -
బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా పేరుపొందిన మాతా మహాదేవి (70) బెంగళూరులో గురువారం కన్నుమూశారు. ఆమె కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్నారు. అనేక మఠాలకు, పీఠాలకు నెలవైన కర్ణాటకలో ఏకైక మహిళా సాధ్విగా మహాదేవి చోటు సంపాదించారు. బాగల్కోటె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా ఆమె బసవధర్మ పీఠాన్ని నిర్మించిన బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దసంఖ్యలో పీఠ శాఖలు, లక్షలాది మంది భక్తులు, అనుచరులకు ఆమె మాటే వేదవాక్కు. చిత్రదుర్గ జిల్లాలో జన్మించిన మహాదేవి కళాశాల విద్య తరువాత లింగాయత్ సన్యాస దీక్షను స్వీకరించారు. మంచి వాక్పటిమ, ధైర్యం ఆమె సొంతం. ఆమె అంత్యక్రియలను శనివారం కూడలసంగమలో లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు. -
రేపటి దీపాల్ని వెలిగిద్దాం రండి
కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభమైంది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడమే కాదు.. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు పిలుపులూ వచ్చాయి. ఒకటి స్వచ్ఛంద సంస్థల నుంచి ’’మెరుగుపడాలంటే సమతుల్యం అవసరం’’ అని. మరొకటి ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నుంచి ’’సమభావపు ఆలోచన చురుకుగా నిర్మించడం, పురోగమనం కోసం వినూత్నత’’ అనే పిలుపూ వచ్చింది. సమానం అనే ఆలోచన చేసినంత మాత్రాన సమానత్వం ఉందా, వస్తుందా.. లేక ఆలోచనతో మొదలు పెట్టి చురుకుగా సమానత్వం నిర్మించాలా అనే అనుమానం రాకుండా అలవాటైపోయిన ఈ అసమ వ్యవహార శైలిని ఛేదింది సమానత్వం సాధించే దిశగా సాగాలని దానికి వినూత్న పద్ధతులు, ప్రక్రియలు కనిపెట్టాలని ఐరాస కోరింది. ప్రతివారు సాధికారిత గురించే మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే కనీస హక్కులు అంటే చదువుకోవడం ఉద్యోగం వంటివి ఇస్తే చాలు సాధికారతే అంటూ ప్రతిపనికీ సాధికారత పేరు తగిలిస్తున్నారు. సాధికారత అంటే అధికారం కావాలి. దేనిపైన అధికారం కావాలి స్త్రీలకు? భర్తపైనా? పిల్లలపైనా? కుటుంబం పైనా? సమాజంపైనా? అంటే వందసార్లు కాదు అని చెప్పాల్సి ఉంటుంది.వారి శరీరాలపైనా, వారి చదువులు, ఉపాధి అవకాశాల పైనా, వనరులపైనా, భాగస్వామి ఎంపికపైనా మొత్తంగా చెప్పాలంటే వారి జీవితాలపై నిర్ణయాధికారం కోరుకుంటున్నారు. బీజింగ్ సదస్సు పత్రాల ఆధారంగా 2001–02లో ఐరాస ప్రత్యుత్పత్తి హక్కుల తీర్మానం ప్రతిపాదించింది. దానిపై భారతదేశం సంతకం చేసింది. కానీ ఆనవాయితీ అది అమలులో పెట్టేందుకు ఏ చర్యా తీసుకోకపోగా పరిస్థితి మరింత విషమించింది. స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఎంత ఘోరంగా నిరాకరించబడుతున్నదో ఆడపిల్లల జననాల రేటు సరోగసీ వ్యాపారాన్ని పరిశీలిస్తే చాలు. నీతిఆయోగ్ 2018లో ప్రచురించిన ’’ఆరోగ్యకరమైన రాష్ట్రాలు భారత దేశ పురోగతి’’ ప్రకారం ప్రధానమైన 17 పెద్ద రాష్ట్రాల్లో ఆడపిల్లల జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు కేవలం 914 మంది అమ్మాయిలు పుడుతుండగా (జాతీయ సగటు) అది ఇప్పుడు 900కి తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాలు బాలికా భ్రూణ హత్యల్లో మేం తక్కువ కాదు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బాలికల జననాల రేటు దారుణంగా పడిపోయిందన్న విషయం గుర్తించినట్లు గానీ మాట్లాడినట్లు గానీ కనపడదు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది 918గా ఉంది. నీతి ఆయోగ్ లెక్కప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల పుట్టుక 907 (ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు) అంటే మొత్తంమీద అమ్మాయిలను పుట్టనీయకుండా గర్భస్రావాలకు పాల్పడుతున్నారా లేక తాజా టెక్నాలజీతో పిండంగా మారకముందే ఎలిమినేట్ చేస్తున్నారా అనే అంశంపై ఏ లెక్కలూ లేవు. అమ్మాయిల సంఖ్య పడిపోవడంలో గమనించాల్సిన అంశాలు డబ్బున్న, విద్యావంతులున్న ప్రాంతాలు నగర సంస్కృతిలో అమ్మాయిల పుట్టుక రేటు అతి తక్కువ. ఆదివాసీలు అమ్మాయిల, స్త్రీల సంఖ్య ప్రకృతి నిర్దేశించిన ప్రకారం మగవాళ్ల కంటే అధికంగా అంటే 1000: 1121 (బాలలు: బాలికలు) నిష్పత్తిలో ఉంది. స్త్రీ పురుష వివక్షత ఆదివాసీల్లో చాలా తక్కువగా ఉంది. స్త్రీలపై హింస కూడా. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఆధిపత్య కులాల్లో పెళ్లికి అమ్మాయిల కొరత ఏర్పడింది. హరియాణా, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పేద రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుని ద్రౌపది ఆచారానికి తిరోగమిస్తున్నారు. హరియాణాలో పెళ్లికాని యువకులు పెరిగిపోవడం, ఫోర్న్ అందుబాటుతో రోజుకి సగటున 8 సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. సంపద పెరుగుదలకూ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికీ, అమ్మాయిల సంఖ్య బాగా పడిపోవడానికి, స్త్రీలపై హింస విపరీతంగా పెరగడానికీ మధ్యగల సంబంధం ఏమిటి? కారణాలు ఏమిటి? అనే విషయం ఈ దేశంలో కనీస చర్చకు నోచుకోలేదు. దేశం కోసం నలుగురు కొడుకుల్ని కనాలని ఒక సాధ్వి, కాదు.. 10 మందిని కనాలని వారిని సైన్యంలోకి పంపాలంటూ ఒక మహారాజు (ఇద్దరూ పార్లమెంటు సభ్యులే) వాగుతుంటే పట్టించుకోని పార్లమెంటరీ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఉందని ఒప్పుకోవడానికి నిరాకరించినట్లు కాదా? 53 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యావ్యాపారపు వనరుగా మారాక ప్రభుత్వ పాఠశాల కూడా వదిలి అన్నదమ్ముల ఫీజు కోసమో, ఇంటి పనుల భారం మోయడానికో బడి వదిలేసే ఆడపిల్లలను ఏ విద్యా హక్కు ఆదుకుంటోంది? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగాలు, వృత్తులే స్త్రీలు ఎంచుకుంటే కుటుంబాలు నడుస్తాయనే అభ్యుదయవాదులకు శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనంలో ఏర్పడుతున్న విస్తృతావకాశాల క్రీనీడలు స్త్రీపురుషుల మధ్య డిజిటల్ అగాధాలు ఏర్పరుస్తున్నాయని గమనిస్తున్నారా? గణితంలో, భౌతిక రసాయన శాస్త్రాల్లో పరిశోధనా రంగాల్లో అసలే అంతంతమాత్రంగా ఉంటున్న మహిళలు మరింత ముందుకు సాగి వారి మేధోఫలితాలు సమాజానికి అందించడానికి బదులు కుటుంబంలో కూరుకుపోవడం వల్ల దేశానికి జరిగే నష్టం ఎంతో అంచనా వేస్తున్నారా? పనిచేయగలిగే వయస్సులోని స్త్రీలకు వారు చేయగలిగే ఉపాధి ఇవ్వలేకపోవడంతో ఈ దేశం ఏటా 1.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతున్నదని ఏ అర్థశాస్త్రవేత్తలయినా పాలకుల కళ్లు తెరిపించే కాలం కోసం ఇంకెంత కాలం వేచి చూడాలో? ఈనాటికీ ఇంటా బయటా స్త్రీలు చేస్తున్న పని విలువను గుర్తించడంలో దేశాలు, సమాజాలు, కుటుంబాలు విఫలం అయ్యాయని చెప్పాలా? లేక గుర్తించ నిరాకరిస్తున్నారా? ఇంటి పనుల్లో రోజూ పురుషునికంటే కనీసం 3 నుంచి 5 గంటలు స్త్రీలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల శ్రమ స్త్రీలదేనని ఐరాస అధికారిక అధ్యయనం వెల్లడించింది. అయినా ఒక్క వెనిజులా తప్ప మరే దేశం కూడా ఇంటి చాకిరి విలువను స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా లెక్కగట్టేందుకు చొరవ చూపడం లేదు. స్త్రీలు ఉపాధుల్లో ఉండటం అన్నిరకాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిసినా స్త్రీల ప్రథమ బాధ్యత పిల్లలు, ఇల్లు అని ఎందుకు నీతులు ఎడతెగకుండా ప్రచారం చేస్తున్నారు? అలాగే స్త్రీలు పనిలో ఆదాయం పొందటం ద్వారా పెరిగే కొనుగోలు శక్తి వలన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. అయినా ఆ వైపుగా విధానాలు రూపొందించడం లేదు. స్త్రీలు సహజసిద్ధమైన పిల్లల పెంపకం నైపుణ్యాలు, సేవాభావం కలిగి ఉంటారనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేదు. పిల్లల్ని కనడం, పాలివ్వడం వంటి జైవిక ధర్మాలను పిల్లల పెంపకం, త్యాగం, ప్రేమలతో ముడిపెట్టడం ద్వారా స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం ఒక సహజ విషయంగా ప్రచారం జరుగుతోంది. స్త్రీ పురుషుల్లో ఎవరైనా నేర్చుకుంటే ఆసక్తి ఉంటే పిల్లల పెంపకం, పెద్దల సేవ చేయవచ్చు. కానీ అలాంటి భావాలకు చోటిస్తే అతి మామూలుగా జరిగిపోతున్న స్త్రీల శ్రమదోపిడీకి దెబ్బతగులుతుంది. పైగా బయట సంపాదించే బాధ్యత మగాడిదే అని చెప్పడం ద్వారా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, అసంఘటిత రంగంలో స్త్రీల ఉపాధికి పురుషుని కంటే తక్కువ వేతనం ఇచ్చి మరింత లాభాలు పొందే అవకాశం పోతుంది. ధర్మశాస్త్రాలు, రస వివేచనలు, సకల కళలు వాడి ఇంట్లో పనిముట్లు. స్వర్గానికీ నరకానికీ వాడే కామందు అంటూ ధనస్వామ్యం లాభం కోసం పవిత్రాత్మ తోక చివర ఈకలమ్ముతుందంటాడు మయకోవస్కీ. కులసతుల త్యాగాలతో సినిమాలు, మాదకద్రవ్యాల నిషాలో హింసాత్మక ఫోర్నోగ్రఫీ స్త్రీల శరీరాల సరకుపై వారు లాభాలార్జిస్తారు. కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభం అయింది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడం ఒక్కటే కాదు. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరుగుతున్నాయి. పురుగులు పడ్డ శవంలా కుళ్లి గబ్బు కొడుతున్న ఆధిపత్యం సాంస్కృతిక రంగాన్ని సైతానులాగా ఆక్రమించుకుంటోంది. స్త్రీలను రాతిబొమ్మలుగా, దేవతలుగా కొలుస్తాం తప్ప రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించం అని పురుషత్వం చిందులు దొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు, ఎటుపోవడం సరైంది, ఏది నీతి, ఏది అభివృద్ధి, ఏది అభ్యుదయం, ఏది అమ్ముడుపోవడం అర్థం కాక స్త్రీల జీవితం దళారులకు అమ్ముడుపోతోంది. తమ జీవితాలపై హక్కుకోసం సంఘటితంగా ఉద్యమించిన మహిళల పోరాట స్ఫూర్తి దినోత్సవం కూడా తార్పుడు భావాల వలలో చిక్కి ఒకరోజు ’బారు’ మహిళల కోసం దాగా ఎగబాకింది. నూనెలో తడిసిన పాలరాయి గచ్చుపై నిలుచున్నట్లున్న ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. దిక్కూ దివాణం తెలియనట్లు కకావికలంగా పరుగులు పెడుతున్న గందరగోళం మధ్య నిదానంగా, నిశ్శబ్దంగా ఒక ఉద్యమ ప్రణాళిక రేఖా చిత్రం కూడా చూడొచ్చు. సమభావన బలం పుంజుకుంటోంది కాబట్టి ఈ ఇనుప డేగలు వేట ఉధృతం చేశాయని గమనించక తప్పదు. కాబట్టి ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. జీవితం పట్ల ప్రేమతో సమానతపై అచంచల విశ్వాసంతో మన లక్ష్యంపై అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం పదండి. ఇది మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినోత్సవం. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. వ్యాసకర్త: పి.దేవి, సాంస్కృతిక కార్యకర్త -
కలకలం రేపిన ఆత్మహత్యాయత్నాలు
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించడం... వారిలో యువతి మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. తమ ప్రేమ ఫలించదనే వేదనతోనే ఆత్మహత్యకు యత్నించామని యువకుడు చెబుతుంటే... తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు మల్కాపురం, క్రాంతినగర్ ప్రాంతంలో దేవి(22) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో దేవి ఇంటికి సమీపాన అనుదీప్(24)అలియాస్ అరవింద్ అనే యువకుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9:15గంటలకు దేవి తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. అనుమానంతో గదిలోకి వెళ్లిన దేవి తల్లిదండ్రులు ఫ్యాన్ హుక్కు వేలాడుతున్న దేవిని కిందకు దించి స్థానిక సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని స్థానిక వైద్యులు నిర్థారించడంతో మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై భిన్న వాదనలు మరోవైపు 9:40 గంటల సమయంలో తన ఇంటిలో అనుదీప్ ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబ సభ్యులు గుర్తించి రక్షించారని పోలీసులకు సదరు యువకుడు చెబుతున్నాడు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, యువతి ఇంటిలో ప్రేమ విషయం తెలియడంతో వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని... అందువల్లే ఆత్మహత్యకు యత్నించామని అనుదీప్ పోలీసులకు చెబుతున్నాడు. అయితే అతని మెడపైగానీ, ఎక్కడా ఆత్మహత్యకు యత్నించిన ఆనవాళ్లు లేవని... అసలు వారిద్దరి మధ్య ప్రేమే లేదని... ప్రేమ పేరుతో దేవిని అనుదీప్ కొంత కాలంగా వేధిస్తున్నాడని... దీనిపై ఓ లేఖ కూడా దేవి రాసిందని ఆమె చిన్నాన్న మహాత్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువకుడి తల్లిదండ్రులను విచారిస్తున్న సీఐ భాస్కర్‌రావు నిజంగా వారిద్దరూ ప్రేమించుకుంటే ఒకేచోట ఆత్మహత్యకు యత్నించాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవి ఆత్మహత్య చేసుకోవడంతో తామంతా అతడిపై దాడి చేస్తామన్న భయంతో అనుదీప్ ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఫిర్యాదు మేరకు అనుదీప్‌ను, అతని తల్లిదండ్రులను మల్కాపురం పోలీసులు విచారించారు. అనంతరం సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ లంకా భాస్కర్‌రావు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
అందరూ మహిళలే...
‘మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం’ వంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేసి గ్రాండ్ రీ–ఏంట్రీ ఇచ్చారు నదియా. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘తిరైక్కు వరాద కథై’. తులసీ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘దేవి’ పేరుతో అనువాదమైంది. కె.కె.ఆర్. క్రియేషన్స్ పతాకంపై కె. ప్రియభారతి సమర్పణలో కర్రి సత్యనారాయణరెడ్డి, కె. కృష్ణ, సబ్బిళ్ళ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే స్పెషల్ సి.బి.ఐ అధికారిగా నదియా అద్భుతంగా నటించారు. కొందరు సాంకేతిక నిపుణులు మినహా మిగతా అందరూ మహిళలే పని చేసిన చిత్రం ఇది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. తమిళంలో హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో మేము అనువదించాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఈ నెలాఖర్లో చిత్రాన్ని విడుదల చేయ డానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోవై సరళ, ఇనియా, శోభికా మోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం.జి. శ్రీకుమార్ సంగీతం అందించారు. -
స్త్రీలోక సంచారం
అరవై ఐదేళ్ల ఆమ్రాదేవి నలభై ఏడేళ్ల నిరీక్షణ ఈ ఆదివారం ‘విజయ్ దివస్’ రోజున ఫలించింది. ఆమె నిరీక్షిస్తున్నది తన భర్తను చూడడం కోసం. ఆమ్రాదేవి ఉత్తరకాశీ అమ్మాయి. పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయింది. అప్పటికి ఆమె భర్త వయసు ఇరవై ఏళ్లు. అతడి పేరు సుందర్. పెళ్లయ్యే నాటికి సుందర్ భారత సైన్యంలో ‘బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్’ రెజిమెంట్‌లో సైనికుడు. పెళ్లయ్యాక ఫొటో దిగడం కోసం దగ్గరలోని దుండా పట్టణానికి పెద్దవాళ్లు ఈ దంపతుల్ని తీసుకెళ్లబోతుండగా సుందర్‌కి కబురొచ్చింది, తక్షణం వచ్చి యుద్ధంలో చేరమని! భార్య చెయ్యి వదిలి అప్పటికప్పుడు యుద్ధక్షేత్రంలోకి దుమికాడు సుందర్. 1971 ఇండో–పాక్ వార్ అది. అయితే యుద్ధానికి వెళ్లాక అతడు మళ్లీ తిరిగి రాలేదు. అతడి మృతదేహం తూర్పు పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడో గుర్తు తెలియని చోట ఖననం అయింది. ఇన్నేళ్లలోనూ భర్త ఎలా ఉంటాడో మర్చిపోయింది కానీ, భర్తతో తన బంధాన్ని మర్చిపోలేదు ఆమ్రాదేవి. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. సైన్యంలో ఉండగా అతడు తీయించుకున్న ఫొటోనైనా (ఒకవేళ తీయించుకుని ఉంటే) చూడకపోతానా అని ఎదురుచూస్తూ ఉంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. జిల్లా యంత్రాంగంలోని అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 16న.. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిన ‘విజయ్ దివస్’ రోజు ఆమ్రాదేవి చేతికి ఆమె భర్త ఫొటో అందింది. సైనికుల గ్రూప్ ఫొటోలోంచి సుందర్‌ని వేరు చేసి, అతడి ఫొటోను పెద్దదిగా చేసి, దానికి ఫ్రేమ్ కట్టించి జిల్లా అధికారులు ఆమెకు కానుకగా అందజేశారు! లక్కీ కదా! ‘‘అయితే ఆమె కాదు, మేము లక్కీ’’ అంటున్నారు సైనిక్ వెల్ఫేర్ బోర్డు డి.డి.పంత్. ‘‘ఆమ్రాదేవి అభ్యర్థన మేరకు సిపాయి సుందర్ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందా అని మావాళ్లు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక దొరకదని అనుకున్నాక సుందర్ బొమ్మను వేయించి ఆమ్రాదేవికి అందజేశాం. అయితే పోలికలు గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె అన్నారు!. మళ్లీ వెతుకులాట ప్రారంభించాం. చివరికి అతడు పని చేసిన రెజిమెంట్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రికార్డులన్నీ గాలించాం. మొత్తానికి ఓ గ్రూప్ ఫొటోలో సుందర్ దొరికాడు’’ అని పంత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఎలా ఉండేవారో, ఎలా మాట్లాడేవారు మర్చేపోయాను. కానీ ఆయన స్వరూపం లీలగా నేటికీ నా కళ్లలో కదలాడుతూనే ఉంది. యుద్ధంలో శత్రువుతో పోరాడుతూ ఆయన చనిపోయారని తెలుసుకోగానే గర్వంగా అనిపించినప్పటికీ, నా శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినట్లుగా బాధపడ్డాను’’ అన్నారు ఆమ్రాదేవి, ఫొటోలో తన భర్తను కళ్ల నిండా చూసుకుంటూ. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీలు, పార్లమెంటు అధికారులతో పాటు ఒక సాధారణ మహిళ కూడా ఆ ప్రాంగణంలో కనిపిస్తున్నారు! ఆమె పేరు పూర్ణిమా గోవిందరాజులు. వయసు 54. చేతిలో కాగితాల కట్ట పెట్టుకుని, స్పష్టతనిచ్చే ఒక ప్రజాప్రతినిధి కోసం ఆమె వెదుకుతున్నారు. అది ఆమె జీవిత సమస్యకు అవసరమైన స్పష్టత. ఈ ఏడాది అక్టోబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఒక ప్రకటన చేశారు. బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా ‘పోక్సో’ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్)– 2012 కింద ఎప్పుడైనా నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చుననీ, అందుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదన్నది ఆ ప్రకటన సారాంశం. పూర్ణిమ ప్రస్తుతం కెనడాలో కన్సర్వేషన్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు పదేళ్ల వయసులో సమీప సన్నిహితుడొకరు పూర్ణిమను లైంగికంగా వేధించి, కొన్నాళ్లపాటు నరకం చూపించాడు. అతడింకా జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతడిపై పోక్సో చట్టం కింద కేసు వేసేందుకు కెనడా నుంచి ఇండియా వచ్చారు పూర్ణిమ. అయితే పోక్సో చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన సంఘటన కనుక దానిపై పోక్సో చట్టం ప్రకారం కేసు వేయవచ్చా అన్న స్పష్టత వచ్చే వరకు కేసును స్వీకరించడం కుదరక పోవచ్చునని పూర్ణిమ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్పష్టత కోసమే పూర్ణిమ పార్లమెంటు ప్రాంగణంలో మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనకాగాంధీని సంప్రదించే ఆలోచనలోనూ ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులో ఒక ఎంపీ.. ‘బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పష్టతను కోరడంతో పూర్ణిమలో ఆశలు చిగురించాయి. 2019 జనవరి 11న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తన సమస్యకొక పరిష్కారం దొరకొచ్చని ఆమె భావిస్తున్నారు. -
గ్లామర్ సీక్రెట్స్ బయటపెట్టిన తమన్నా
సాధారణంగా హీరోయిన్లు ఎంత పెద్ద స్టార్డమ్తో వెలిగిపోతున్నా ఇప్పటికీ అమ్మ చాటు బిడ్డల్లానే ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా అమ్మ ఆలోచనలు, సలహాలే తీసుకుంటారు. అంటే వారికంటూ వ్యక్తిత్వం ఉండదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే చాలా మంది అలానే ప్రవర్తిస్తుంటారు. నటి తమన్నా విషయానికొస్తే నేనూ అంతే అని చెప్పకనే చెప్పింది. బాహుబలి చిత్రానికి ముందు పలు కమర్శియల్ చిత్రాల్లో నటించినా, ఆ చిత్రం తమన్నాకు తెచ్చి పెట్టిన ఇమేజ్ వేరు. ఇంకా చెప్పాలంటే బాహుబలితో ఈ మిల్కీబ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందనే చెప్పాలి. ప్రస్తుతం క్వీన్ చిత్ర తెలుగు వెర్షన్లో నటిస్తున్న తమన్నా, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇక తమిళంలో ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో మరోసారి రొమాన్స్ చేస్తోంది. తన అందం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ సినిమా గ్లామర్ ప్రపంచంగా పేర్కొంది. ఇక్కడ అందం ముఖ్యమని, అయితే అంతకంటే ముఖ్యం ప్రతిభ అని పేర్కొంది. ప్రతిభ ఉంటేనే ఇక్కడ నాలుగు కాలాల పాటు నిలబడగలమని అంది. తననే తీసుకుంటే 10 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తున్నానని చెప్పింది. అయినా మీ అందం ఏ మాత్రం తగ్గలేదని చాలా మంది అంటుంటారని, మీ సౌందర్య రహస్యం ఏమిటని అడుగుతుంటారని చెప్పింది. నిజం చెప్పాలంటే తాను అందానికి ఎక్కువ మెరుగులు దిద్దుకోను అని పేర్కొంది. ఇక షూటింగ్ ముగిసి ప్యాకప్ అనగానే మేకప్‌ను తుడిచేసి సాధారణ అమ్మాయిగా మారిపోతాను అని చెప్పింది. ఇంట్లో ఉంటే సాధారణ అమ్మాయిలు సౌందర్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో తానూ అంతేనని చెప్పింది. అయితే తాను నటిని కావడంతో అందాలను ఎలా కాపాడుకోవాలన్నది బాగా తెలుసుని చాలా మంది అనుకుంటారని అంది. కానీ తాను ఇప్పటికీ అందం విషయంలో తన తల్లి ఆలోచనలనే అమలు పరుస్తానని చెప్పింది. అలా అందం విషయంలో పాత పద్ధతులనే పాటిస్తానని అంది. అవి కూడా షూటింగ్ సమయంలోనే ఇతర సమయాల్లో పెద్దగా పాటించనని తమన్నా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ అమ్మడు చెప్పేవి నమ్మశక్యంగా ఉన్నాయంటారా? ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. -
మరో మంచి టీమ్‌తో...!
రెండేళ్ల క్రితం తమిళంలో రిలీజైన ‘దేవి’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా కీలక పాత్రలు చేశారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ లీడ్ రోల్‌ను తమన్నా చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలుగా నిత్యా మీనన్, నందితా శ్వేతా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారట. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా, కోవై సరళ పాల్గొనగా సీన్స్ తీస్తున్నారు. మరో బెస్ట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నానని అంటున్నారు తమన్నా. -
దబాంగ్ దేవి
దబాంగ్ అంటే నిర్భయ.. ‘భయం లేని’ అని అర్థం. దూని గ్రామంలో ఘిసీదేవిని అంతా ‘దబాంగ్ దేవి’ అని పిలుస్తారు. నిజానికది ధైర్యం కాదు. ధర్మాగ్రహం. ఎందుకొచ్చింది ఆమెకంత ఆగ్రహం?! అది రాజస్తాన్‌లోని దూని గ్రామం. ఘిసీ దేవి ఉదయాన్నే గ్రామానికి దగ్గరలోని అడవి నుంచి వంటచెరకు పోగు చేసి మోపు నెత్తిన పెట్టుకుని వస్తోంది. అదే సమయంలో ముగ్గురు ఆకతాయిలు మోటార్‌బైక్‌పై, బడి నుంచి ఇంటికి సైకిల్‌పై వెళ్తున్న ఒక బాలికను వెంబడిస్తూ, అసభ్యంగా ఏదో అంటున్నారు. వారిలో ఒకడు ఆమె మార్గాన్ని అడ్డగించి, ఫోన్ నంబర్ ఇవ్వమన్నాడు. ‘నా దగ్గర ఫోన్ లేదు’ అని అంటుంటే, ఇంకేవో ‘నంబర్లు’ చెప్పమని వెకిలిగా అడుగుతున్నాడు!ఈ దృశ్యాన్ని ఘిసీ కళ్లు చూశాయి. అంతే! ఒక్కసారిగా ఆమెను ఆగ్రహం కమ్మేసింది. ఇంకేమీ ఆలోచించలేదు. తన నెత్తిన ఉన్న కట్టెల మోపులోనుంచి ఒక లావుపాటి కర్రను బయటికి లాగి, తలా నాలుగు తగిలించింది. ‘ఇంకోసారి అమ్మాయిల జోలికి వచ్చారో, జైలుకు పంపిస్తా’ అంటూ హెచ్చరించింది. అప్పటివరకు తాము ఏమి చేసినా అడిగేవారే లేరు, తమకు తిరుగేలేదు అని విర్రవీగుతున్న ఆ పోకిరీలకు.. ఘిసీ ఇచ్చిన వార్నింగ్‌తో షాక్ తగిలినట్లయింది. చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు.ఘిíసీకి ఆ సమయంలో వాళ్లు ఉన్నత కులానికి చెందిన వారని కానీ, చదువుకున్నవారని కానీ, వారి తల్లిదండ్రులు డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లని కానీ గుర్తు రాలేదు. ఆమెకు అనిపించిందొక్కటే.. ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని ఆదుకోవడం. ఆ తర్వాత కూడా ఆమె ఎందరో అమ్మాయిల్ని కాపాడింది. పోకిరీ రాయుళ్ల పని పట్టింది. ఘిసీ పేరెత్తితే మగాళ్లకు హడల్ ఘిసీదేవి వయసు ఇప్పుడు 50 ఏళ్లు. దూని గ్రామంలో భార్యలను హింసించే వారు, అక్కచెల్లెళ్లపై చేయి చేసుకునే మగధీరులు ఘిసీ పేరెత్తితే చాలు, ఇప్పటికీ జంకుతో ఒకడుగు వెనక్కివేస్తారు. స్త్రీలపై వివక్షను గట్టిగా ప్రశ్నించింది దేవి. ఆమె అండతో ఇరుగుపొరుగు మహిళలు తమపై దౌర్జన్యం చేసే మగాడి పెత్తనాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. ఆకతాయిలకు జడిసి ఆడపిల్లల్ని బడికి, కాలేజీకి çపంపని తల్లులు ఇప్పుడు ధైర్యంగా మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. ఇక ఇల్లాళ్లయితే పాస్‌పోర్టులు, రేషన్‌కార్డులను తమ పేరుతోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఊరంతా మహిళా వలంటీర్లు అంతకు ముందు వరకు రొట్టెలు గుండ్రంగా రాలేదని భార్యని కొట్టి చంపిన పైశాచికపు సంఘటనలు దూని గ్రామంలో సర్వ సాధారణం. అంతేకాదు, ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్లగింజ వేయడమో, జిల్లేడు పాలు పోయడమో చేసే అమానవీయ ఘటనలు కూడా అక్కడ తరచూ జరిగేవి. ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక.. అంతో ఇంతో ధైర్యం ఉన్న కొందరు ఆడవాళ్లను పోగు చేసి, వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పడం మొదలు పెట్టింది ఘిసీ దేవి. దాంతో, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి, ఎన్నికలలో గెలిచి వార్డుమెంబర్లు అయిన ఆడవాళ్లు తమ భర్తల జోక్యాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. వరకట్నం కోసం బహిరంగంగా డిమాండ్ చేసే వాళ్లిప్పుడు లేనేలేరు. పురుషాహంకారంతో తమ ఇంటి ఆడవాళ్లను హింసించే మగవాళ్లు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన నాలుగు రాళ్లను నాటుసారా దుకాణాల పరం చేసి, ఒళ్లు తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడిపోయే మగవాళ్లు కనిపించడం లేదిప్పుడు. వారి బదులు, అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడు మాన్పించే మహిళా సైనికులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు! ఈ మార్పుకు కారణం ఘిసీ దేవి పోరాటాలే. ముందు... మాటల్తో చెప్తారు దేవి ఇప్పుడు 11మంది మహిళా సభ్యులున్న ‘డూన్ జమట’ అనే బృందానికి నాయకురాలు. తాగుడు, వరకట్నం, కుటుంబంలోని స్త్రీలను హింసించడం, ఆడవాళ్లను అల్లరి పెట్టే పోకిరీ మూకను అదుపు చేయడమే వారి ముందున్న లక్ష్యాలు. అందులోని అందరు సభ్యులూ.. ముందు మాటలతో చెబుతారు. మాటలతో దారిలోకి రాలేదంటే ప్రత్యేకమైన యూనిఫారమ్, ఐడీ కార్డులు, ఆ పై చేతిలో బెత్తాన్ని ధరించి అపర కాళికావతారం దాలుస్తారు. అగ్రవర్ణాలవారితోనూ అమీతుమీ కుల రక్కసిపై కూడా ఘిసీదేవి పోరాటం చేసింది. ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పాతుకుపోయి ఉన్న కుల వివక్షను కూకటి వేళ్లతో పీకే ప్రయత్నం చేసింది. ఆ గ్రామంలో వీధి కుళాయిలో వచ్చే మంచినీటిని అందరూ పట్టుకోవడానికి వీలు లేదు. ముందుగా అగ్రవర్ణాల వారు పట్టుకోవాలి, ఆ తర్వాత మిగిలిన నీటిని వీరే అట్టడుగు వారికి పోసేవారు. ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిందామె. మంచినీటిని అందరూ పట్టుకునేలా చేసింది. ఇంట కూడా గెలిచింది చివరికి ఆమె పుట్టింటి నుంచి, తన అత్తమామల నుంచి రావలసిన వాటాను కూడా రాబట్టుకుంది. తన కడుపున పుట్టిన పిల్లలు ముగ్గురినీ చక్కగా చదువుకునేలా చేసింది. ఇవన్నీ ఆమెకు సులువుగా ఏమీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఆమె అనేకసార్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఎన్నోమార్లు జైలుకెళ్లొచ్చింది. తన్నులు తినింది. అవమానాలూ భరించింది. అన్నింటినీ ధైర్యంతో, సహనంతో అడ్డుకుంది. ఇప్పుడా గ్రామం ఒక ప్రశాంత సౌధం. ఆ ఊరిలో ఆడ, మగ అందరూ సమానమే. ఏ ఇంటినుంచీ అసహాయంగా ఉన్న ఆడపిల్లల ఆర్తనాదాలు వినిపించడం లేదు. ఆత్మవిశ్వాసంతో ఆడవాళ్లు హాయిగా తీస్తున్న కూనిరాగాలు తప్ప! – డి.వి.ఆర్. పదేళ్లు అత్తింటి గడప తొక్కలేదు పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులామెను ఓ అయ్య చేతిలో పెట్టి, చేతులు దులుపుకున్నారు. భర్త పచ్చి తాగుబోతు అని, పైసాకి కూడా కొరగానివాడనీ అర్థమయ్యేలోపే ముగ్గురు ఆడపిల్లలకు తల్లయిందామె. వరకట్నం వేధింపులు, అత్తమామల ఆరళ్లు ఉండనే ఉన్నాయి. వాళ్లందరికీ దేవి పుట్టింటి ఆస్తిపై కన్నుంది. ఎందుకంటే, చిన్నప్పుడే ఇంటినుంచి వెళ్లిపోయిన దేవి తమ్ముడు ఇంతవరకూ తిరిగి రాలేదు మరి. ఆ ఒక్క ఆశతోనే ఇన్నాళ్లూ ఓపికపట్టారు కానీ, ఎప్పుడైతే మూడోసారీ ఆమెకు ఆడపిల్లే పుట్టిందో, ఇక వారామెను అనరాని మాటలు అని, మెడబట్టి గెంటేయడంతో పుట్టింటికి చేరింది దేవి. పదేళ్ల వరకూ అత్తింటి గడప తొక్కనే లేదు. భర్తను వదిలేసి వచ్చిన కూతురంటే పుట్టింటిలోనూ చులకనే కదా. దాంతో ఆమె తన పొట్ట తాను పోషించుకోవడానికి నాలుగిళ్లలో పని చేసేది. వారే ఆమెకు తిండి పెట్టడంతోపాటు పాత బట్టలు కూడా ఇచ్చేవారు. మనుగడ కోసం పోరాడే సమయంలోనే ఆమె మానసికంగా, శారీరకంగా బాగా గట్టిపడింది. కొందరిని కలుపుకుని మహిళాసైన్యాన్ని తయారు చేసింది. అలాగే అమ్మానాన్నలను పోగొట్టుకుని వీధిన పడిన ఓ ఆరుగురు పిల్లలను చేరదీసింది. వారికి తానే తిండి పెట్టింది. బట్టలు కొనిచ్చింది. దాంతో వారామెకు కళ్లూ, చెవులూ అయ్యారు. ఏ ఇంటిలో అయినా ఆడవాళ్లను హింసిస్తున్నా, భర్త, అత్తమామలు వేధిస్తున్నా ఆ విషయాన్ని ఆమె చెవిలో ఊదేవారు. ఘిసీదేవి వెంటనే కొంగు బిగించి కార్యరంగంలోకి దిగేది. -
సెక్స్ రాకెట్.. మహిళా సంఘాల మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల షికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు. టాలీవుడ్లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్, తాజాగా షికాగో సెక్స్ రాకెట్ విషయాలపై తెలుగు సినీపరిశ్రమను తాము ప్రశ్నిస్తున్నామని, మొత్తం 24 మహిళా సంఘాలు తరఫున తాము ఈ రెండు అంశాలపై మాట్లాడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాల కార్యాచరణ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో దేవీ మాట్లాడారు. సినీ పరిశ్రమకు సంబంధించి మూడుసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, టాలీవుడ్, ఎఫ్డీసీ పెద్దలతో చర్చలు జరిపామని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా క్యాష్ కమిటీ వేస్తామని సినీ నటుల అసోసియేషన్ (మా) చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దేవీ మండిపడ్డారు. క్యాష్ కమిటీలో మహిళా, సామాజిక సంఘాల ప్రతినిధులను నియమించుతామని చెప్పారని, అది జరగలేదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగుచూసిన తరువాత కో ఆర్డినేషన్ వ్యవస్థను తీసేస్తామని చెప్పారు, కానీ ఎక్కడా ఆ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులకు అవకాశాలు ఇప్పించేందుకు బ్రోకర్ వ్యవస్థ ఉండకూడదని తాము సినీ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఆఖరికీ డ్యాన్సింగ్, యాక్టింగ్ స్కూళ్లలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారని, వీటి నివారణకు తగిన నియమ నిబంధనలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని దేవి డిమాండ్ చేశారు. మహిళా హక్కుల కార్యకర్త సజయ మాట్లాడుతూ.. బాధితులకు కనీసం మాట్లాడటానికీ భయపడే పరిస్థితి నెలకొందని, కళమాతల్లికి సేవ అని చెత్త మాట్లాడుతూ.. మహిళలనే బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు ఎలా జరిగింది అని చెప్పే దమ్ము ఎవరికీ లేదని, కానీ, బాధితులను భయపెట్టి.. వారిని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, ఇది వ్యవస్థీకృత నేరమని ఆమె ధ్వజమెత్తారు. ఈ విషయమై ఇంతవరకు టాలీవుడ్ పట్టించుకోకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కేంద్రంగా జరుగుతున్న సెక్స్ రాకెట్లో సినీ పెద్దల ప్రోత్సాహం ఉందని మరో మహిళా సంఘం నేత సుజాత అన్నారు. ఈ పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలని, నిజాలు వెలికితీయాలని ఆమె అన్నారు. -
ప్రతి పిడికిలికీ వికీలో చోటు
వికీపీడియాలో ఐదు కోట్ల యాభై లక్షలకు పైగా ఎంట్రీలు ఉన్నాయి. వాటిల్లో మహిళా సాధకుల జీవిత చరిత్రలు ఇరవై శాతానిక్కూడా మించి లేవు! ఏదైనా లిఖిస్తేనే చరిత్రలో ఉంటుంది. లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది. వికీపీడియాలో ఉన్నదాన్నైతే వెతుక్కుని వెలికి తియ్యవచ్చు. కాలగర్భంలో కలిసిపోయిన దాన్ని ఏ కీవర్డ్‌తో కనిపెట్టి బయటికి తీసుకోగలం? అందుకే ఇప్పుడు వికీపీడియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి, మానవ హక్కుల కోసం పోరాడిన, పోరాడుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ‘వికీపీడియా పేజీ’ని ఏర్పాటు చేయబోతున్నాయి. ‘బ్రేవ్: ఎడిట్’ అనే పేరుతో ఈ భారీ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. వికీపీడియాలోని ‘వికీమీడియా’ విభాగం దీని బాధ్యతలను తీసుకుంది. ఎన్ని అవరోధాలు, అవాంతరాలు ఎదురైనా సమాజంలోని వివక్షలపై పోరాటాన్ని వదిలిపెట్టక, పిడికిలి బిగించిన ప్రతి మహిళా కార్యకర్తకూ ఈ సైట్లో చోటు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి మహిళా స్ఫూర్తి ప్రదాతల వివరాలను సేకరించే యజ్ఞం ఇప్పటికే మొదలైంది. దీనికి ‘గ్లోబల్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ ప్రోగ్రామ్’ అని పేరుపెట్టారు. పేరులో ఎక్కడా మహిళ అనే పదం లేకున్నా ఇది పూర్తిగా మహిళల ఘనతలను నెట్లో ‘గ్రంథస్థం’ చేసే ప్రయత్నమే. సంపత్‌పాల్ దేవి : గులాబీ గ్యాంగ్ లీడర్(సామాజిక జాడ్యాలపై కర్ర పట్టినప్రతి మహిళా కార్యకర్త జీవిత చరిత్రను వికీమీడియా ప్రత్యేక శ్రద్ధతో పొందుపరచబోతోంది). -
శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు..!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో శ్రీరెడ్డి లాగే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. సినిమాలో చిన్న చిన్న పాత్రలు పొందేందుకు కూడా మహిళలు లైంగిక ఒత్తిడులకు గురి కావాల్సి రావడం దారుణమని మహిళా కార్యచరణ ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నటి శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరిట వేధింపులు) ఆరోపణలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బుధవారం కలిసిన ఐక్యవేదిక ప్రతినిధులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సినీ నటి అపూర్వ మీడియాతో మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) శ్రీరెడ్డిని బ్యాన్ చేయడం సరికాదన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మమ్మల్ని అడగకుండానే ఆమెపై నిషేధం విధించారు. ఇంకా చెప్పాలంటే శ్రీరెడ్డిని ఈ విషయంపై సంప్రదించకుండా, ఆమె అభిప్రాయం తీసుకోకుండానే బ్యాన్ చేశారు. దీనికి నేను వ్యతిరేకం. అందుకే ’మా’ నుంచి బయటకొచ్చానని, ఇండస్ట్రీ పూర్తిగా మారాల్సి ఉందని’ అపూర్వ అభిప్రాయపడ్డారు. శ్రీరెడ్డికి న్యాయం చేయాలంటూ మహిళా కార్యచరణ ఐక్య వేదిక సభ్యులు తలసానికి మెమోరాండంను అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. శ్రీరెడ్డి ఘటన తర్వాత అనేకమంది బాధితులతో మాట్లాడి తెలుసుకున్నాం. చిన్న చిన్న పాత్రలకు కూడా లైంగిక ఒత్తిడికి మహిళలు, యువతులు గురి కావాల్సి వస్తోంది. హెల్ఫ్‌లైన్, టోల్ ఫ్రీ నెంబర్ సినీ ఇండస్ట్రీకి ఉండాలి. అవుట్ డోర్‌కి వెళ్లినప్పుడు మహిళలకు బాత్రూమ్లు కూడా ఉండవని, అనేక అవమానాలు మహిళా ఆర్టిస్టులకు జరుగుతున్నాయని మెమోరాండంలో పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త దేవి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి లాగ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో క్యాష్ కమిటీ వెయ్యాలి. ఇండస్ట్రీలో స్త్రీల మీద అత్యాచారాలు, ఇతర రకాలుగా దోపిడీ జరుగుతుంది. సినిమా రంగంలో పనిచేస్తున్న వారి బాధలను తెలియపరిచేలా కమిటీని వేయాలి. సినీ ఇండస్ట్రీ మహిళల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. శ్రీరెడ్డిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. శ్రీరెడ్డి కేవలం ఆరోపణలు మాత్రమే చేయలేదన్నది గుర్తించాలి. ఆధారాలతో శ్రీరెడ్డి బయటపెడుతున్నఅందరిపై చర్యలు తీసుకొని అలాంటి వారిని ప్రజల ముందు నిలబెట్టాలని కోరారు. -
మతోన్మాదంతో సామాన్యులకు హాని
భద్రాచలం: బీజేపీ పాలనలో మతోన్మాదం పెరుగుతుందని, దీని వల్ల సామాన్యులకు హాని జరిగే ప్రమాదం ఉందని సాంస్కృతిక ఉద్యమ కార్యకర్త దేవి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని అం బేద్కర్ సెంటర్లో జరిగిన సెమినార్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాల్గేళ్ల కాలంలో మతోన్మాదులు పెరిగారని, దీని వల్ల ముస్లిం, మైనార్టీ, ఆదివాసీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిం, దళితులు, ఆదివాసీలపై ఆర్ఎస్ఎస్ మూకలు తెగబడుతున్నాయన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, వారి మధ్య ఐక్యతను దెబ్బతీసి రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో కవులు, రచయితలపై దాడులు పెరిగిపోయాయని, భావ స్వేచ్చకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ పాలనలో పౌరహక్కులు, మానవ హక్కుల కంటే జంతు హక్కులే ఎక్కువగా రక్షించబడుతున్నాయని ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజానీకం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సెమినార్లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి, ఏజే రమేష్, మర్లపాటి రేణుక, పద్మ, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, వెంకటరామారావు, లీలావతి, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు. -
సవాలక్ష సుడిగుండాలు
కీచకుడి కాలం నుంచో ఇంకా ముందు నుంచో పనికి వెళ్లిన ప్రతి స్త్రీపైనా కామపు కళ్లు, వెకిలి మాటలు, తేళ్లై కుట్టే చేతులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులు, ఆ పైన తాయిలాలు ఆశ పెట్టి లొంగదీయడం. ఆమె బహుముఖ సామర్థ్యంతో పోటీ æపడలేక నీచమైన వ్యాఖ్యలు చేయడం, పదోన్నతి పొందకపోవడానికి తమ సోమరితనం కారణమనేది కప్పిపుచ్చి ‘ఆమె పడకలేసింది’ అనే పైశాచిక పుకార్లు.. నైపుణ్యంతో అధిగమించలేని దుగ్ధ లైంగిక వేధింపులుగా రూపాంతరం.. ఓ ‘మగతనపు ఆటవికత’. ఇంటి గడపే స్త్రీకి లక్ష్మణరేఖ.. వంటి కాలం చెల్లిన భావాలు పుణికిపుచ్చుకున్న ఆధునిక మనువులే ప్రతిచోటా. పొలాల్లో, నిర్మాణంలో, గృహ పరిశ్రమల్లో ఒకటేమిటి.. అసంఘటిత రంగం నిండా స్త్రీలే. కడుపు నింపుకోవడం కోసం, కన్నబిడ్డల కోసం... అహరహం ఒళ్లు విరిగే చాకిరీ. అతి తక్కువ వేతనం. ఆపైన లైంగిక దోపిడీ. ప్రతి నిమిషం పనిపోతుందని భయం. ఎవరేం చేసినా భరించాలి. ఆకలి, అవసరం.. అభిమానాన్ని చంపుతాయి. రెక్కల కష్టం చేసే వీరి గౌరవం కాపాడటం.. ఉపాధికి – శరీరానికి భద్రత కల్పించటం ఎవరి బాధ్యత? ‘మనిషి’గా మర్యాదగా బతికే హక్కుకు హామీ ఏదీ? భద్రమైన ఉద్యోగాలు చేసే చోట కూడా కుత్సితపు చూపుల వేటలే. ఎవరితో చెప్పుకోవాలి? ఎలా నిరూపించుకోవాలి? చెబితే నమ్ముతారా? అంతర్గత ఫిర్యాదుల కమిటీ గోప్యత పాటిస్తుందా? అందరికీ తెలిసి మరింత మందికి చులకనై మరికొందరు చెయ్యేస్తే? అతివల సంపాదనను పూర్తిగా ఆమోదించని కుటుంబం పరువు కోసం ఉద్యోగం వదిలేయమంటే? ఇపుడిపుడే విచ్చుకుంటున్న ‘స్వేచ్ఛ’ లేత రెక్కల్ని కత్తిరిస్తే? తననే అనుమానిస్తే? అసలు తానేమైనా తన దుస్తులతో హావభావాలతో ప్రవర్తనతో వాడికి అలుసిచ్చిందా? స్త్రీ కావడం వల్లే వెంటాడే ఎన్నో అపరాధ భావనలు... ఎన్నెన్నో ప్రతిబంధకాలు.. లక్షల సుడిగుండాలు. ఎలా బయటపడాలి? ఇంటా బయటా శాంతిగా బతికే దారేదీ? చట్టం కూడా అసమానతకు చుట్టమే. ‘ఫిర్యాదు చేసిన లైంగిక వేధింపు నిరూపణ కాకపోతే దండనే’. ఏ చట్టం లోపలా లేని ఈ షరతు ఈ చట్టానికే ఎందుకు? అసలు బాధితులెవరిక్కడ? ఫిర్యాదు చేయకుండా హెచ్చరించడం నిరుత్సాహపరచడం కాదా? సుప్రీంకోర్టు ‘విశాఖ తీర్పు’ స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా? సుప్రీం తీర్పు తర్వాత సాగలాగిలాగి పదిహేనేళ్లకు ఏడ్చుకుంటూ తెచ్చిన ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల (నివారణ – నిషేధం – పరిష్కార మార్గాలు, 2013) చట్టం’ ఎంతమేరకు అమలవుతోంది? అనుభవాల పాఠాలతో చట్టాన్ని తాజాపర్చుదాం. పదండి.. వేధింపులు లేని జీవితం కోసం. -
వర్మకు సీసీఎస్ పోలీసుల 10 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వెబ్ సిరీస్ వివాదానికి సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు శనివారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమా ఎందుకు తీశారు. సినిమాకు పెట్టుబడి ఎక్కడిది, మహిళలను అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు?. ట్విటర్, ఫేస్బుక్లో పోస్టు చేసిన పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆమెకు డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు. సినిమాకు వాడిన ఎక్విప్ మెంట్ ఎక్కడిది...అంటూ వర్మను విచారణలో ప్రశ్నించారు. సీఎస్ పోలీసులు గతంలో ఇచ్చిన నోటీసుకి వర్మ తాను ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా అంటూ అడ్వాకేట్ ద్వారా సమాచారం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు వచ్చారు. కాగా అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారం, చర్చల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మహిళలను అగౌరవపరుస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు సంబంధించి బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు పీఏ దేవి గత నెల 25న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్ వర్మ పేరు పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సి ఉండటంతో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ముంబైలో ఉన్న రాంగోపాల్ వర్మకు గతంలో నోటీసులు పంపారు. వీటిలో పేర్కొన్న గడువు ప్రకారం వర్మ గత గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి, దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు నోటీసులు అందాయని, విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ రాంగోపాల్ వర్మ తన లాయర్ ద్వారా వర్తమానం పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వివరణ ఇచ్చారు. మరోసారి నోటీసులు ఇస్తే వచ్చే వారం విచారణకు వస్తానంటూ లాయర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో రాంగోపాల్ వర్మకు సైబర్ క్రైమ్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. -
ఆమె ఆశ్రయం గొప్పది
అనంతపురం రూరల్ మండలం కాట్నేకాలువ గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దేవి. కృష్ణమ్మ. లక్ష్మిరెడ్డిల దంపతులకు ముగ్గురు సంతానం. కాగా ఆమె రెండవ సంతానం. నిరుపేద కుటుంబం కావడంతో అప్పట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కాలంలో దేవిని పాఠశాలకు కూడా పంపించలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. బుద్ధి వచ్చేంత వరకూ ఇంటి వద్ద పనులు చేసుకుంటూ.. ఓ వయస్సు వచ్చాక తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇల్లు్ల, పొలం పనులు తప్ప మరేవిషయం తెలీదు. ఆ సంఘటనతో మలుపు అనంతపురం సెంట్రల్: 1992లో మేనమామ అయిన కృష్ణారెడ్డితో దేవికి వివాహమైంది. తొలినాళ్లలో వ్యవసాయ పనులపైనే ఆధారపడి భార్యభర్తలు జీవించారు. ఒక రోజు నగరానికి వచ్చిన కృష్ణారెడ్డి జోరువానకు వనుకుతున్న వృద్ధులను చూసి చలించారు. వారికి సపర్యలు చేసి ఇంటికి వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్లడంతో ఎందుకింత ఆలస్యమైందని దేవి అడిగింది. అప్పుడు కృష్ణారెడ్డి జరిగిన విషయాన్ని వివరించారు. వయస్సులో సత్తువ ఉన్నన్నాళ్లు కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడిన వృద్ధులు జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి రోడ్డు పాలు కావడం బాధాకరమని ఇద్దరూ చర్చించుకున్నారు. అదే వారిని సేవామార్గంలో పయనించడానికి నాంది పలికింది. కొద్దిరోజుల పాటు సేవలందించినా తర్వాత ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పి ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఓ మహిళ చేసి నిరూపిస్తోంది. అనాథ తల్లిదండ్రులకు అమ్మలా మారి సేవచేస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు కాదన్న వృద్ధులను అక్కున చేర్చుకొని వారి ఆలనపాలన చూసుకుంటున్నారు. దేవి సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఒడిదుడుకులతో ప్రారంభం దేవీ దంపతులకు స్వగ్రామంలో ఉండేందుకు చిన్న ఇల్లు్ల మాత్రమే ఉంది. ఎక్కడా ఒక్క సెంటు స్థలం కూడా లేదు. ఈ సమయంలో అనాథాశ్రమం నిర్మించాలని తలంచారు. ఏం చేయాలో తెలియక ఎవరైనా స్థలం ఇస్తారా అని ఆరా తీశారు. అయ్యావారిపల్లి వద్ద ఓ వ్యక్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రూ. 20 వేలు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ కొంతమంది వ్యతిరేకించడంతో సదరు స్థలం యజమాని అనాథాశ్రమానికి ఇవ్వనని చెప్పేశారు. దీంతో స్వగ్రామంలోనే రక్తసంబంధీకులను ఒప్పించి వృథాగా ఉన్న స్థలంలో అనాథాశ్రమం ప్రారంభించారు. అయితే సదరు స్థలంలో పెద్ద పాడుబడ్డబావి ఉండటంతో దానిని పూడ్చటానికి డబ్బులు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇళ్లు నిర్మించడానికి అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి పూర్వీకుల నుంచి వస్తున్న సొంతింటిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అనాథాశ్రమం నిర్మాణం కోసం ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించి.. మిగిలిన మొత్తంతో అనాథాశ్రమాన్ని నడపడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఎవరూ సాయం అందించకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. ఆశ్రమానికి మంచి పేరు రావడంతో ఇప్పుడిప్పుడే సేవలో పాలు పంచుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం దాతల సహకారంతోనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. ఎగతాళులూ ఎక్కువే దేవితో పాటు ఆయన భర్త చేస్తున్న సేవా కార్యక్రమాన్ని చూసిన వారి బంధువులు ఎగతాళి చేశారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ తల్లిదండ్రులైతే పట్టించుకోవాలి. ఊరందరి గురించి మీకేం అవసరం అంటూ ఎగతాళి చేశారు. అయితే వారి వాదనలను దేవి సున్నితంగా తిప్పికొట్టారు. అవసరమైతే మీరంతా మా ఇంటికి రాకున్నా పర్వాలేదు అని ఎదురించారు. సేవలోనే పరమార్థం దాగి ఉందని తెలుసుకున్న ఆమె ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. మొక్కవోని దీక్షతో అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారు. తొలుత ఒకరిద్దరితో ఆరంభమైన అనాథాశ్రమంలో నేడు 35 మంది ఆశ్రయం పొందుతున్నారు. రోజూ వారికి స్నానాల దగ్గర నుంచి అని సపర్యలు దేవీనే చూసుకుంటున్నారు. అన్నీతానై... వృద్ధాశ్రమానికి వస్తున్న వారిలో ఎక్కువశాతం జీవితచరమాంకంలో ఉన్న వారే. మొత్తం 32 మందిలో సగం మంది మంచానికే పరిమితం అయ్యారు. అలాంటి వారికి స్నానం చేయించడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, అన్నం తినిపించడం కూడా చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ 32 మందికి మూడు పూటల భోజనం చేయడం కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ ఏమాత్రం బరువుగా భావించకుండా ప్రతి రోజూ వారికి అన్ని తానై సేవలందిస్తున్నారు. ఎక్కువ మంది రోగాల బారిన పడుతుండటం, మానసికంగా ఇబ్బందులు చెందుతుండటంతో ప్రభుత్వ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్వద్ద చికిత్సనందిస్తున్నారు. ప్రతి వారం ఆయన ఆశ్రమానికి వెళ్లి వృద్ధులకు ఉచితంగా చికిత్సనందిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సేవ చేస్తా మలిసంధ్యలో ఏ తోడు లేని వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. తొలుత నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమంలో తాను తోడు అందించాలని భావించా. ఇప్పుడు 35 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాను. ఏనాడు బరువుగా భావించలేదు. నా ఊపిరి ఉన్నంత వరకూ సేవా చేయాలని అనుకుంటున్నా. నాతో పాటు నాభర్త, నా ఇద్దరు కూమారులు కూడా వీరిని చూసుకోవడానికే ఉన్నాం. – యర్రగుంట్ల దేవి,ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకురాలు సేవకు సత్కారం వృద్ధులకు సేవలందిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్న దేవీ సేవలకు గుర్తింపు లభించింది. ఆశ్రయ అనాథాశ్రమం గురించి తెలుసుకున్న పలు స్వచ్ఛంధ సంస్థలు ఆమెను సత్కరించాయి. ఇటీవల సాహితీగగన్మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంత ఆణిముత్యాలు పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు అందించారు. సహిత మహిళా సమాఖ్య, ఇన్నర్‌వీల్ సంస్థలు సంయుక్తంగా దేవీని సత్కరించాయి. బయోడేటా పేరు : యర్రగుంట్ల దేవి స్వగ్రామం : పాలచెర్ల, రాప్తాడు మండలం తల్లిదండ్రులు : కృష్ణమ్మ, లక్షీరెడ్డి కుటుంబ నేపథ్యం: నిరుపేద కుటుంబంలో జన్మించారు విద్యార్హత : పేదరికంతో చదువుకోలేదు వివాహ నేపథ్యం : 1992లో కాట్నే కాలువకు చెందిన మేనమామ కృష్ణారెడ్డితో వివాహం కుమారులు : రాజశేఖరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి (మేనరికం పెళ్లి కావడంతో బుద్ధిమాంద్యంతో జన్మించారు. దీంతో చదువు మాన్పించాల్సి వచ్చింది. ప్రసుత్తం వృద్ధులకు సేవలో కుటుంబంఅంతా పాలుపంచుకుంటున్నారు) -
రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
-
రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చా వేదికలో తనను రాంగోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రాత్రి హైదరాబాద్ చేరుకున్న వర్మను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్న విషయం తెలిసిందే. -
వర్మ వర్సెస్ దేవి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆర్జీవీపై సీసీఎస్ పోలీసులకు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆర్జీవీపై కేసు నమోదు వర్మపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని దేవి తెలిపారు. చట్టాలను గౌరవించని వ్యక్తులకు ఈ దేశంలో నివసించే హక్కులేదన్నారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను సరుకుగా వర్ణించేవిధంగా వర్మ వ్యాఖ్యలున్నాయని చెప్పారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్నారు. పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ వెనక్కు తగ్గలేదు. జనవరి 26న ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు. -
మనుషులుగా మిగులుతామా?
ఇప్పుడు వీధి సెన్సార్షిప్దే రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. పైగా దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా ప్రసార మాధ్యమాల్లో ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది. చట్టాల్ని అతిక్రమిస్తూ వీధిగూండాలు చెలరేగిపోతుంటే ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం.. అగ్నిలో ఆజ్యం పోయడం.. ఇవాళ ఇదొక నిత్యకృత్యమైపోయింది. అసలు ఉందో లేదో తెలియని ఓ రాణి. ఆమె ప్రేమ గాథను 16వ శతాబ్దంలో రాశాడొక సూఫీ ఫకీరు మాలిక్ మహమ్మద్ జయసి. సదరు కథలోని విలన్ ఖిల్జీ పాలన ముగిసిన 250 ఏళ్ల తర్వాత రాసిన కథ ఇది. రాజారతన్ సేన్‌ని కానీ, పద్మావతిని కానీ మేవాడ్ రాజు కులం జాబి తాలో చేర్చింది 19వ శతాబ్దంలో. తెల్లవారికి వ్యతిరేకంగా హిందూ రాజ్యభావనను రెచ్చగొట్టడానికి ఈ గాథను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాజపుత్ర స్త్రీల పవిత్రశీలం, పాతి వ్రత్యం, పురుషుడి ఆస్తిగా సతీసహగమనం అతి గొప్పగా కీర్తించడం ప్రారంభించారు. చారిత్రక వ్యక్తి కూడా కాని ఓ రాణి పవిత్రతను కాపాడటానికి దేశాన్ని తగలబెడతామని రాజపుత్రులు వీరావేశంతో ఊగిపోతున్నారు. భర్త ఎదుటే సామూహిక మానభంగానికి గురై పాతికేళ్ల తర్వాత కూడా న్యాయానికి నోచని భన్వరీ దేవి గురించి ఎవరికీ క్రోధావేశం కలగడం లేదు. శీలం, పవిత్రత అగ్రవర్ణ స్త్రీలకే ఉంటాయి కామోసు. అదే అగ్రవర్ణ మగాళ్ల లైంగిక దాహాల్ని భరించడం పీడిత కులాల మహిళల నుదుటిరాత అని హైకోర్టు ఆవరణలోని మనువు విగ్రహం సాక్షిగా రాజస్తాన్ హైకోర్టు 20 ఏళ్ల క్రితమే ధృవీకరించింది. చరిత్రలో లేని రాణికి వెండితెరపై కూడా మచ్చపడనీయం అంటూ మంత్రులు, ఎంపీలు జబ్బలు చరుస్తున్నారు. రూప్కన్వర్కు మత్తుమందిచ్చి భర్త చితిలో వేసి కాల్చి చంపిన ప్రదేశం ఇపుడొక ‘సతి’ ఆలయం. ఇటువంటివే మరో 125 దాకా సతుల చితులు ఆలయాలై సదరు భర్త ఇంటివారికి భుక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రూరాచారాన్ని కొలుస్తూ, కీర్తిస్తూ స్త్రీ స్వేచ్ఛను అథఃపాతాళానికి తొక్కుతున్న రాష్ట్రంలో రాణి పద్మావతి ‘జోహార్’ (రాజపుత్రుడు చనిపోతే జనానా స్త్రీలు చితిపేర్చుకుని మంటల్లో దూకి కాలిపోవడం) క్రతువును సరిగా చూపలేదని ఈ గూండా గుంపుల ఆవేదన. స్త్రీశరీరాన్ని పురుషుడి ఆస్తిగా భావించి ఆమె అత్తింటి ఆస్తిలో వాటాకు రాకుండా ఆమెను సజీవంగా కాల్చి చంపే ఫ్యూడల్ దారుణాల్ని అద్భుతాలుగా కీర్తించడం ఆధునిక క్రూరత్వం. బానిసత్వాన్ని, కుల అణచివేతను, హింసను రక్తపాతాన్ని మనిషన్నవాడెవడైనా సరే అమానవీయంగానే దృశ్యీకరించాలి. అది ఒక చారిత్రక వాస్తవమైనా సమర్థించరాదు. ఈ పద్మావతి సినిమా ’సతి’ని గ్లోరిఫై చేస్తే దాన్నీ ఖండించాల్సిందే. అల్లావుద్దీన్ ఖిల్జీ సమర్థుడైన పాలకుడు. రాజ్యం కలవాడెవడైనా అందగత్తెల్ని మోహించడం కొత్త కాదు. (మొదటి భార్య నాగమతి ఉండగా రతన్‌సేన్ పద్మావతిని కాంక్షించాడట) కాని రాజ్యప్రయోజనం చూడకుండా ఖిల్జీ ఆమెకోసమే దండెత్తి పోయాడనటం అతిశయోక్తి. హిందూ కులీన స్త్రీలు అసమాన సౌందర్యవతులు కనుకనే ముస్లిం దురాక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి బాల్య వివాహాలు వచ్చాయన్నంత అబద్ధమిది. ముస్లింలను మొత్తం గానే క్రూరులుగా, దుర్మార్గులుగా చిత్రించడం హిందుత్వ ఎజెండా. బన్సాలీ సినిమాలో ఖిల్జీని పచ్చిమాంసం తినే బర్బరుడిగా చిత్రించారని అంటున్నారు. అలా చిత్రించి వుంటే దాన్ని ఖండించాల్సిందే. ఖిల్జీ ఒక చారిత్రక వ్యక్తి. పద్మావతి కాదు. ఆమె ఒక కల్పన. ఇంతకీ ఆ సినిమా ఎవరూ చూడలేదు. పద్మావతి ఒక సూఫీ ఫకీరు కల్పించిన ప్రేమ కావ్యం. ఏ ఆధారం లేకుండా దీన్ని చరిత్రగా ఎట్లా భావించాలి? నమ్మకాలు చరిత్ర కాదు కదా! ఆధారాలు లభించిన చరిత్రపైనే విశ్లేషణా రీతినిబట్టి ఒక్కొక్క చరిత్రకారుడికీ ఒక్కో అభిప్రాయం/నిర్ధారణలు ఉంటాయి. కాల్పనిక కావ్యపు రాణి రాజ కుటుంబపు ఆస్తి, గౌరవం ఎట్లా అవుతుంది? పైగా 300ల రామాయణాలు ఉన్నట్టుగానే తరతరాలుగా ఓ వంద రకాలైన పద్మావతి గాథలు ఉన్నాయి. బెంగాలీలో, మయన్మార్‌లో కూడా భిన్న గాథలున్నాయి. వాటన్నింటినీ జానపదులు పాడుతుంటారు. దీనిలో ఒక రకానికి ప్రామాణికత నిర్ధారించి అదే సరైందనే హక్కు రాజపుత్రులకు ఉందా? అనేక గాథల్లో పద్మావతి అసలు రాజరికపు స్త్రీ కూడా కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించుకోము అని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వానికి ఖాతరు లేదు. ఇపుడు వీధి సెన్సార్షిప్ రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. అంతేకాదు దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా జాతీయ ప్రసార మాధ్యమాల్లో వారు ఆటవికత ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది. కుటుంబాలు పసివాళ్లతో సహా అప్పులు తాళలేక సామూహికంగా మరణిస్తారు. నియంత్రణ లేని లాభాల్తో ఫ్యాక్టరీల్లో, బస్సుల్లో, పడవల్లో జనం పిట్టల్లా రాలిపోతుం టారు. జీఎస్టీ చర్యను పక్కదారి పట్టించడానికి ఊహాజనిత సమస్యతో కృత్రిమ ఆడంబర గౌరవాల భంగం నెపంతో దేశవ్యాపిత బంద్.. దేశాన్ని కిడ్నాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం... వీధి గూండాల చేతుల్లో రాజ్యాంగం... ఏమైతేనేం మనకెందుకు కానీయండి అనుకుంటూ చానల్స్‌లో నిత్యం చౌకబారు కామెడీలు చూసుకుంటూ, ఆన్లైన్ షాపింగ్‌లు చేసుకుంటూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ బతికేద్దాం... దేశం ఏమైతేనేం... ఎక్కడికెళ్తేనేం.. కానీ మనం మిగులుతామా.. చివరికి? దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త మొబైల్ : 98486 22829 -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: మార్కెట్ పడిపోయింది. అవకాశాలు లేవు. ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనే టాక్ స్ప్రెడ్ అయినప్పుడల్లా నటి తమన్నాకు అవకాశాలు తలుపుతడుతూ ఆ ప్రచారం తప్పని సమాధానాన్ని ఇస్తున్నాయి. బాహుబలి–2 చిత్రంలో తమన్నా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు కదా, ఆ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో శింబుతో రొమాన్స్ చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ తీవ్రంగా నిరాశపరచింది. దీంతో విక్రమ్‌తో నటిస్తున్న స్కెచ్ పైనే ఆశలు పెట్టుకున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా మరో అవకాశం వచ్చింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం తమన్నా తలుపు తట్టింది. ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని, అందులోనూ తమన్నా, ప్రభుదేవాతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకు ముందే ఈ క్రేజీ జంట మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. రజనీకాంత్ 2.ఓ, విక్రమ్ సామి–2, సుందర్.సీ కలగలప్పు–2 చిత్రాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా విశ్వనటుడు కమలహాసన్ ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇలా మరి కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న తరుణంలో చార్లీచాప్లిన్ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 2002లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం చార్లీచాప్లిన్. ప్రభుదేవా,ప్రభు, అభిరామి,గాయత్రి రఘురామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. దీనికిప్పుడు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో ప్రభుదేవాకు జంటగా నటి తమన్నా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
పవర్ఫుల్ దేవి
పవర్ఫుల్, స్టైలిష్ అత్త–అమ్మ పాత్రలంటే నదియానే చేయాలన్నంతగా ఆమె ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించారు. తమిళంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘తిరైక్కు వరాద కథై’ అనే చిత్రం ‘దేవి’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డి.తులసిదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైనవి సమర్పణలో సువర్ణ తెలుగులోకి అందిస్తున్నారు. సువర్ణ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యం లో హారర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ఇది. నదియా పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేశారు. ఆమె పాత్ర సినిమాకే హైలెట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయను న్నాం. తమిళంలో 15 కోట్లు వసూ లు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే..
అదే నా సక్సెస్‌కు కారణం మాండలిన్ శ్రీనివాస్ గురువు కావడం నా అదృష్టం త్వరలోనే హీరోగా కనిపిస్తా నాన్న సజీవంగా ఉండాలనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ ఏర్పాటు – సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఆయన స్వరపరిచిన పాటలు సంగీతాభిమానుల నోళ్లలో నిత్యం నానుతూనే ఉంటాయి. ఆయన అందించిన సంగీతం కొన్ని సినిమాలను విజయాల బాట పట్టించిందనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవీశ్రీప్రసాద్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో సుమారు 80 సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే సక్సెస్‌కు మార్గమంటున్నారు ఆయన. నాన్నపై ప్రేమతోనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. రాయవరం మండలం వెదురుపాక వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆవిశేషాలు ఆయన మాటల్లోనే.. - వెదురుపాక(మండపేట) ఆయన గురువు కావడం నా అదృష్టం.. మాండలిన్ శ్రీనివాస్‌ను ప్రేమతో అన్నయ్యా అని పిలుస్తాను. ఆయన నా గురువు కావడం ఎంతో పుణ్యం, అదృష్టం. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటారు. నాన్న సత్యమూర్తి నుంచి ఆత్మస్థైర్యం, అమ్మ శిరోమణి నుంచి కష్టించేతత్వాన్ని అలవర్చుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే నా సక్సెస్‌కి కారణం. సక్సెస్‌ను నిలబెట్టుకోవడం ఒక పోరాటమే.. సక్సెస్‌ను నిలబెట్టుకోవడం కూడా ఒక పోరాటమే. ప్రతి సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. మొదటి సినిమాను ఎలా ప్రేమిస్తానో ఇప్పుడు నా చేతిలో ఉన్న సినిమాలను అలాగే ప్రేమిస్తాను. సంగీతం, డాన్స్ నాకు రెండు కళ్లు. నా విజయం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇప్పటి వరకు 80 సినిమాలు.. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు 80 సినిమాల వరకు సంగీతాన్ని అందించాను. ప్రస్తుతం జై జానకి నాయకా.., జై లవకుశ, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు, దిల్‌రాజు బ్యానర్‌పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు, తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న సినిమా సామి–2 తదితర సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాను. త్వరలో హీరోగా వస్తున్నా.. నన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలని చాలా మంది అడిగారు. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే హీరోగా సినిమా చేసే అవకాశం ఉంది. దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి నిర్మాతలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు హీరోగా చేయాలని అడిగారు. సినిమా చేద్దామనుకున్న తరుణంలో నాన్న సత్యమూర్తి దూరమవ్వడంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. సంగీతం నా ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు. చేతినిండా సినిమాలున్న ఈ పరిస్థితుల్లో..ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన నాకు లేదు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచిద్దాం అని సమాధానమిచ్చారు. నాన్నకు ప్రేమతో.. నాన్నపై ప్రేమతోనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఉంది. ప్రస్తుతం రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా విద్యాపరంగా పేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తాం. కష్టపడితే విజయం మీదే... రామచంద్రపురం : ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడూ.. అంటూ యువతను ఉర్రూగలూగించిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ విద్యలోను, లక్ష్య సాధనలోను యువత కుమ్మేయాలంటూ ప్రసంగించి వారిలో స్ఫూర్తిని నింపారు. పట్టణానికి చెందిన డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ నేతృత్వంలో ఆదివారం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దేవీశ్రీప్రసాద్, ఆయన తమ్ముడు ప్రముఖ గాయకుడు సాగర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. పదో తరగతి పరీక్షల్లో మంచి పాయింట్లు సాధించిన 115 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.ఐదు వేలు చొప్పున వారు బెస్ట్ స్టూడెంట్ అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయుడు అరవ విస్సూ వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో దేవీశ్రీప్రసాద్ మాట్లాతూ విద్యార్థి దశంలో పదో తరగతి, ఇంటర్ అత్యంత కీలకమైనవిగా ఆయన చెబుతూ ప్రతి వారు లక్ష్యసాధనతో కష్టపడి పనిచేసినప్పుడే విజయం వరిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తులుగా మారాలన్నారు. తమతో పాటుగా ప్రతి వారికీ చేయూతనందిస్తూ, తల్లిదండ్రుల సూచనలతో ముందుకు సాగాలన్నారు. నాన్న సత్యమూర్తి జ్ఞాపకార్థం ఆయన ఆదర్శాల కోసం సత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశామని, విద్యను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందిస్తున్నామన్నారు. చివరిగా ఆయన అమ్మడు లెట్స్‌గో కుమ్ముడు అనే పాటను పాడి యువతను ఉర్రూతలూగించారు. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ యువత చదువులో తమ కుమ్ముడు చూపాలని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ తమ్ముడు, ప్రముఖగాయకుడు సాగర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గోల్ పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఆర్డీఓ కె సుబ్బారావు, డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కే శ్రీదర్, డోనర్స్‌క్లబ్ కన్వీనర్ తాడాల సత్యనారాయణ, కరస్పాండెంట్ తొగరుమూర్తి, ఆచంట రాంబాబు, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన డోనర్స్‌క్లబ్ సభ్యులు 24 మందిని దేవీశ్రీప్రసాద్, సాగర్లు మెమెంటోలతో సత్కరించారు. -
హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం
జీవకళ ఉట్టిపడుతున్న శిల్పం రాజ్‌కుమార్ శిల్పశాలలో రూపకల్పన కొత్తపేట : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో నెలకొల్పేందుకు రాణి రుద్రమదేవి విగ్రహాన్ని కొత్తపేట నుంచి బుధవారం తరలించారు. హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రుద్రమదేవి విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పగించింది. దీంతో వుడయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విగ్రహాన్ని రూపొందించారు. రుద్రమదేవి విగ్రహం ద్వారా ‘ఆచార్య’ పురస్కారం తాను రుద్రమదేవి విగ్రహాన్ని తొలిసారి 2004లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి తయారు చేశానని శిల్పి రాజ్‌కుమార్ తెలిపారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అప్పటి గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే ద్వారా ’ఆచార్య’ గౌరవ పురస్కారాన్ని ఆ యూనివర్సిటీ తనకు అందజేసిందని చెప్పారు. తరువాత రుద్రమదేవి పరిపాలన సాగించిన వరంగల్ కోట వద్ద, 2005లో వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నెలకొల్పిన విగ్రహాలను తానే రూపొందించానన్నారు. ఇది నాల్గవ విగ్రహమన్నారు. సజీవ శిల్పాల రూపశిల్పి రాజ్‌కుమార్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజ్‌కుమార్ నెలకొల్పిన విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి వి.ఎస్.ఆర్.గాంధీ అభినందించారు. తెలంగాణలో రాజ్‌కుమార్ తయారు చేసిన రుద్రమదేవి, జయశంకర్, చాకలి ఐలమ్మ తదితరుల అనేక విగ్రహాలు పరిశీలించిన తరువాత ఈ విగ్రహం బాధ్యతను ఆయనకే అప్పగించామన్నారు.77.15 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతానికి 2012లో కాకతీయ హిల్స్‌గా నామకరణం చేశామని తెలిపారు. ముఖద్వారంలో 72 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తులో ఆర్చ్ నిర్మించామని, అక్కడే ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ నెలలోనే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
విజయం దేవిదే!
ముక్కోణపు పోటీలో పెద్ద విజయం దేవి చిత్రానిదేనని ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. సుమారు 12 ఏళ్ల తరువాత డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా తమిళంలో కథానాయకుడిగా నటించి తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మించిన త్రిభాషా (తమిళం,తెలుగు, హిందీ) చిత్రం దేవి. ఐసీ గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తమన్నా నాయకిగా ిహ ంది నటుడు సోనూసూద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం మూడు భాషల్లోనూ విడుదలైంది.ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ దర్శకత్వం వహిస్తూ నటించడం చాలా కష్టం అన్నారు. ఇతరుల దర్శకత్వంలో నటించడం సులభం అని పేర్కొన్నారు. ఈ దేవి చిత్రాన్ని తొలి రోజు ప్రేక్షకుల మధ్య చిత్రం చూడడానికి కాస్త భయం అని పించిందన్నారు. కారణం వారు తనను హీరోగా ఎలా రిసీవ్ చేసుకంటారన్నదేనని తెలిపారు. అయితే చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, చిత్ర యూనిట్ శ్రమకు దక్కిన మంచి ఫలితం ఇదని పేర్కొన్నారు. చిత్రాన్ని విడుదల చేసిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్ మాట్లాడుతూ ఇరుముగన్ చిత్రం తరువాత తమ సంస్థకు దక్కిన అంత మంచి విజయం దేవి చిత్రం అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన రెమో, రెక్క చిత్రాలతో పాటు విడుదల చేశామని అన్నారు. అప్పుడు కొందరు ఆ చిత్రాలకు పోటీగా విడుదల చేస్తున్నారా? అని పరిహాసం ఆడారు. భయపెట్టారని అన్నారు. అయితే వాటికంటే పెద్ద విజయాన్ని దేవి చిత్రం సాధించిందని పేర్కొన్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల కావడంతో తమిళనాడులో మొదట 190 స్క్రీన్లోనే విడుదల చేశామని, చిత్రం ఇప్పుడు మంచి విజయం సాధించడంతో అదనంగా మరో 75 స్క్రీన్లను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్, నటుడు ఆర్జే.బాలాజి పాల్గొన్నారు. -
లలితాదేవికి మహాభోగ నివేదన
దుర్గాడ (గొల్లప్రోలు) : స్థానిక ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని లలితాదేవికి 108 రకాలతో తయారు చేసిన పిండివంటలతో మహాభోగ నివేదన చేశారు. గ్రామంలోని మహిళలు వీటిని తయారుచేసి ప్రసాదంగా అందజేశారు. ఆలయ పండితుడు చెరుకూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆహారం, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ ఈ భోగ నివేదన చేసినట్టు తెలిపారు. అమ్మవారికి సోమవారం పండ్లతో, మంగళవారం పూలతో అభిషేకం చేయనున్నట్టు చెప్పారు. -
విజయం ఎవరిని వరిస్తుందో?
విజయదశమికి నాలుగు రోజుల ముందుగానే కోలీవుడ్‌కు పండగ వచ్చేసింది. సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మ్స్, సంక్రాంతి పర్వదినాల్లో ప్రజల్లో ఎంత పండగ వాతావరణం నిండుకుంటుందో, అంతే సందడి చిత్ర పరిశ్రమలోనూ ఏర్పడుతుంది. ఆయా రోజులు సెలవు దినాలు కావడంతో జనం ముఖ్యంగా యువత సినిమాలు చూడడానికి అధిక ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే సినీ దర్శక నిర్మాతలు తమ చిత్రాలు ఆ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు.ప్రత్యేకించి దసరాకు పాఠశాలలు అధిక సెలవులు రావడంతో చదువుకునే పిల్లలు కూడా సినిమాలపై దృష్టి పెడతారు. ఇక సినిమా ప్రియులు ఉండనే ఉంటారు. దీంతో థియేటర్లు పిన్నపెద్దలతో కళకళలాడుతుంటాయి. నిర్మాతలు, బయ్యర్ల గల్లాపెట్టెలు గలగలలాడుతుండడానికి ఇన్ని కారణాలున్నాయి. అలా కలెక్షన్లను దోచుకోవడానికి ఈ దసరా పండగను పురస్కరించుకుని రెమో, రెక్క, దేవి మూడు తమిళ చిత్రాలతో పాటు ప్రేమమ్ అనే తెలుగు చిత్రం కూడా సిద్ధం అయ్యింది. ఇక వీటి వివరాలు చూస్తే.. రెమో... నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఇది.పలు ప్రత్యేకతలతో శుక్రవారం తెరపైకి రానుంది. శివకార్తికేయన్ అందమైన నర్సుగా కనిపించడం రెమోలోని ప్రధాన ప్రత్యేకత. ఇక రజనీమురుగన్ చిత్రం తరువాత మరో సారి చిరునవ్వుల చిన్నది కీర్తీసురేశ్ శివకార్తికేయన్‌తో జత కట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.అనిరుద్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ వంటి ప్రముఖ చాయాగ్రహకుడు ఈ చిత్రానికి పని చేయడం మరో విశేషం. రెమో చిత్రంపై ఇటు పరిశ్రమలోనూ,అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో చిత్రం రెక్క. నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం రెక్క. ఇందులో ఆయనకు జంటగా నటి లక్ష్మీమీనన్ తొలి సారిగా జత కట్టారు. రతన్‌శివ దర్శకుడు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. విజయ్‌సేతుపతి నటించిన పక్కా మాస్ కథా చిత్రం కనుక సహజంగానే రెక్కపై అంశనాలు భారీగానే ఉంటాయి. ఇక మూడో చిత్రం దేవి. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సుధీర్ఘ విరామం తరువాత కథానాయకుడిగా నటించి, ఐ.గణేశ్‌తో కలిసి సొంతంగా నిర్మించిన చిత్రం దేవి. ఇందులో మిల్కీబ్యూటీ నాయకిగా నటించారు. విజయ్ దర్శకత్వం వహించిన తొలి హారర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం దేవి. దీంతో దేవి చిత్రం కూడా రెమో, రెక్క చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ ముక్కోణపు పోటీలో ఏ చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడతారో అన్నది మరి కొద్ది గంటల్లోనే తెలిపోనుందన్నమాట. ఇక నాలుగో చిత్రంగా తెలుగు చిత్రం ప్రేమమ్ తమిళనాట ఇదే రోజు విడుదల కానున్నదన్నది గమనార్హం. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఇది మలయాళంలో ఇదే పేరుతో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది చెన్నైలోనూ అధిక థియేటర్లలో విడుదల కానండడం విశేషం. -
జగన్మాత నమోస్తుతే..
వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయంలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి శైలపుత్రీక్రమంలో పూజలు జరిపారు. అనంతరం వృషభవాహనంపై ఊరేగించారు. -
మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం..
కోల్ కతాః పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమెకు.. గురువారం నుంచీ ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అయినా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె మూత్రపిండాలు రెండూ సరిగా పనిచేయడం లేదని, గురువారం రాత్రి డయాలసిస్ నిర్వహించినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపించడం లేదని వైద్యులు చెప్తున్నారు. 90 ఏళ్ళ వయసున్నశ్వేతాదేవి వివిధ ఆరోగ్య సమస్యలతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తగిన వైద్యం అందిస్తున్నామని, అయినా పరిస్థితి విషమిస్తుండటంతో వెంటిలేషన్ పై శ్వాసను అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. 1996 లో జ్ఞానపీఠ అవార్డు పొందిన మహా శ్వేతాదేవి.. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1926 లో జన్మించారు. శ్వేతాదేవి తల్లిదండ్రులు సైతం రచయితలే. -
'నా కూతురుది..ముమ్మాటికీ హత్యే'
హైదరాబాద్: తన కూతురు రోడ్డు ప్రమాదంలో మతి చెందిందన్నది పూర్తిగా కట్టు కథ అని.. లోతుగా విచారణ జరిపితే నిందితులు దొరుకుతారని.. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున కారు ప్రమాదంలో మతి చెందిన కట్కూరి దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తన కూతురు మరణం వెనుక మిస్టరీని ఛేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు కారులో భరతసింహారెడ్డి ఒక్కడే లేడని మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆ ఇద్దరు ఎవరో గుర్తించాలని కోరారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. వాస్తవాలు వెలికి వస్తాయని అన్నారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే కారును అక్కడి నుంచి ఎలా తొలగిస్తారని నిలదీశారు. ప్రమాదం జరిగినప్పుడు కారును తీయడానికి గంటల సమయం పట్టే ఈ రోజుల్లో అరగంటలోనే తొలగించడం, ఇక్కడ కాకుండా ఎక్కడో రహ్మత్‌నగర్‌కు తరలించడం వెనుక అనుమానాలు చాలా ఉన్నాయన్నారు. అసలు నిందితులు పట్టుబడే దాకా ఉద్యమిస్తామని చెప్పారు. నిందితులపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. నిర్భయచట్టం కింద కేసు నమోదు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్కౌంటర్ చేయాలి: మానస తన సోదరి మతిపట్ల చాలా అనుమానాలున్నాయని దేవి సోదరి మానస తెలిపింది. 'ఆ రోజు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. చాలాసేపు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో అందరం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ కూర్చున్నాం. రోడ్డు ప్రమాదంలో మతి చెందినట్లు తెలియగానే నిశ్చేష్టులమయ్యాం. ఇందుకు కారకులైన వారిని ఊరికే వదిలి పెట్టవద్దు, నా స్నేహితులు డిమాండ్ చేస్తున్నట్లు ఎన్కౌంటర్ చేయాలి' నఅఇ ఉద్వేగంగా అంది. -
దేవి మృతిపై అనుమానాలు!
నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థిని దేవి మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.. రెండు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నట్లు చెప్పిన కన్నకూతురు.. కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహితుడు భరత్‌తో కలిసి షెవ్రోలె క్రూయిజర్ కారులో వస్తుండగా తెల్లవారుజామున అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి.. చెట్టును ఢీకొంది. ఆ సమయంలో కారులో డ్రైవర్ సీటు వద్ద ఉన్న బెలూన్ మాత్రమే తెరుచుకుంది. దాంతో భరత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దేవి మాత్రం తీవ్రంగా గాయపడింది. పోలీసులు దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందింది. ప్రమాదానికి రెండు నిమిషాల ముందే దేవి తమతో మాట్లాడిందని, ఆమె మృతిపై పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో భరత్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, అతడు ఎంత మద్యం తాగాడన్న రికార్డు చూపించడం లేదని, అలాగే కారు ఢీకొట్టినట్లు చెబుతున్న చెట్టు కూడా ప్రమాదంలో ధ్వంసమైనట్లు కాకుండా.. ఎవరో కావాలని నరికినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇలా దేవి మరణంపై పలురకాల అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. -
‘నీలి’ విహారం అయ్యేనా స్వేచ్ఛ?
సందర్భం ఇంటర్నెట్ స్వేచ్ఛ మరోమా రు చర్చనీయాంశంగా మారిం ది. నెట్లో నీలి చిత్రాల సైట్ల విశృంఖలత్వానికి సంకెళ్లు వేయడమంటే నెట్ స్వేచ్ఛను హరించడమేనా? అనేది ప్రస్తు త చర్చకు కేంద్ర బిందువు. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం నేప థ్యంలో ప్రభుత్వం ఇటీవల 875 సైట్లను నిషేధించడం తో ఈ చర్చ మొదలైంది. వెబ్ సైట్లను నిషేధించే హక్కు ను ప్రయోగించడం అలవాటైతే అది చివరికి సోషల్ మీడియాలో ప్రభుత్వాలపై విమర్శలను అణగదొక్కే ఆయుధంగా మారుతుందనే ఆందోళన నిరాధారమైన దేంకాదు. ఇంతకూ నీలి చిత్రాలు లైంగిక నేరాలకు కార ణమవుతున్నాయా? వాటిపై నిషేధంతో ఇక లైంగిక నేరాలు ఆగిపోతాయా? బూతు సినిమాల ద్వారా లైం గిక ప్రేరణను పొంది చట్టబద్ధంగా లైంగిక వాంఛలను తీర్చుకోవడం తప్పవుతుందా? నిషేధం అలాంటి వారి స్వేచ్ఛను హరించడం లేదా? నెట్‌లోని నాలుగు కోట్లకుపైగా నీలిసైట్లను నిషేధిం చడం సాధ్యం కాని పని. పాతవి నిషేధిస్తే కొత్తవి పుట్టు కొస్తూనే ఉంటాయి. ఆ విషయాన్ని పక్కనబెడితే ఐక్య రాజ్యసమితి సహా ప్రపంచంలోని అత్యధిక దేశాలు చైల్డ్ పోర్న్ (బాలల నీలిచిత్రాల) సైట్లపై నిషేధం విషయం లో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. చైల్డ్ పోర్న్ సైట్లకు చేర్చే లక్ష పదాల్ని సెర్చ్ ఇంజన్ల నుంచి తొలగించారు. చాలా దేశాలు బాలల నగ్న, అర్ధనగ్న చిత్రాలను, నీలి చిత్రా లను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయి. ఈ సైట్లు బాలల అక్రమ రవాణా, వ్యభిచారాలకు ప్రచార, సమాచార సాధనాలుగా మారాయి. బాలలపై లైంగిక దాడులు పెరగడానికి చైల్డ్ పోర్న్ ముఖ్య కారణమనేది అన్ని దేశా ల అనుభవం. నీలి చిత్రాలకు, లైంగిక దాడులకు సంబం ధంలేదని వాదిస్తున్న వారు ఇది విస్మరిస్తున్నారు. నిర్భ య ఘటన తదుపరి ఢిల్లీలోనే చాక్లెట్ ఇస్తామని 5 ఏళ్ల బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నేరస్తులు... రోజంతా నీలిసైట్లను చూశారని తెలిసింది. ఇటీవలే కర్నూలులో రంజాన్ రోజునే జరిగిన దుర్మార్గం కూడా సరిగ్గా అలాంటిదే. చైల్డ్‌పోర్న్ సైట్లపై నిషేధంతో ఆ దాడులు ఆగిపోలేదు కదా? అనే వారూ ఉన్నారు. అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులపై ఎన్నో ప్రభావాలు అప్పటికే పనిచేస్తున్నా, నీలిచిత్రాలు పలు సందర్భాల్లో లైంగిక దాడులకు పాల్పడేలా చేసే ట్రిగ్గర్లా పనిచేస్తు న్నాయనేది వాస్తవం. అది గుర్తించ నిరాకరిస్తూ చైల్డ్ పోర్న్ నిషేధం నా స్వేచ్ఛకు భంగమనడం అర్థరహితం. ఎదిగే పిల్లలలో లైంగికపరమైన ఆసక్తి సహజం. వారికి శాస్త్రీయమైన లైంగిక విద్యను అందించడంలో సమాజం విఫలం అవుతోంది. పైగా, తెలిసీ తెలియని వయసులో విశృంఖల, వికృత శృంగారం, ఉన్మత్త హిం స, క్రూరత్వం నెట్ ద్వారా అందుబాటులోకి వస్తున్నా యి. ఫలితంగా అపరిణత హృదయాల్లో నిజానికి, కల్ప నకూ మధ్య అంతరాలు, ఊహలకు ఉండే హద్దులూ తుడిచిపెట్టుకు పోతున్నాయి. ఇలాంటి వాతావర ణంలో వయసు పెరిగినా పలువురిలో పరిణతికి బదులుగా విప రీత ధోరణులు పెరిగే అవకాశాలే ఎక్కువ. ‘‘మీ లైంగిక సాహసాలను అందరితో పంచుకోం డి’’ అని పిలిచే నీలి సైట్లలో తమ ‘ప్రతాపం’ చూపడం కోసం సామూహిక రేపిస్టులు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుండటం తరచూ వార్తలకెక్కుతోంది. అంతేకాదు, నమ్మిన మహిళలను వంచించి వారితో గడిపిన వీడియో లను నెట్లో పెట్టడమూ పెరిగిపోయింది. నీలి చిత్రాల వికృత ప్రభావం స్త్రీ, పురుష సహజ లైంగిక వాంఛను లైంగిక దాడుల స్థాయికి దిగజారుస్తున్నదనే కఠోర వాస్త వాన్ని గ్రహించాలంటే మహిళా సంఘాల లీగల్ సెల్స్ వద్ద ఉన్న వేలాది కేసులను ఒక్కసారి చూస్తే చాలు. సంసారం నాలుగ్గోడల మధ్య పేట్రేగిపోతున్న లైంగిక హిం సకు నీలి చిత్రాలు ఎలా ప్రత్యక్ష ప్రేరణ అవుతున్నాయో కనబడుతుంది. సంప్రదాయక వైవాహిక బంధంలో శృం గారం ఎక్కువగా మగాడి ఇష్టాయిషాలకు లోబడే ఉం టుంది. దీనికి తోడు బూతు మరిగిన ఆధునిక మగతనం ప్రదర్శించే అసహజ, వికృత, హింసాత్మక లైంగిక క్రీడకు మహిళలు బెంబేలెత్తి పోతున్నారు. నీలిచిత్రాలు మగా ళ్లను కాముక యంత్రాలుగానూ, మహిళలను మగాడు ఎంత హింసాత్మకంగా, వికృతంగా శృంగారం సాగిస్తే అంతగా సంతృప్తి చెందేవారుగానూ చూపుతాయని అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. అదే పడక గదుల్లోకి దిగుమతై మహిళలకు నరకం చూపిస్తోంది. ఇక చట్టబద్ధమైనవిగానే, గౌరవనీయమైనవిగానే మీడియాలో ైస్వైర విహారం చేస్తున్న వ్యాపార ప్రకట నలు మోడల్స్ శరీరాలను సాఫ్ట్ పోర్న్ (అర్ధ బూతు) సరుకులుగా మార్చి నిత్యమూ అమ్మేస్తూనే ఉన్నాయి. మితిమీరిన హింస, శృంగారం, అర్ధనగ్నత్వాలకు చిరు నామాలుగా మారిన టీవీ కార్యక్రమాలు, సినిమాలు వీక్ష కులలోని మగాడిని మరింత ‘గొప్ప మగాడి’గా మార మని ప్రబోధిస్తున్నాయి. అసలు నీలి చిత్రాల కృత్రిమ ప్రేరణ అవసరం ఎవ రికి? ఏ పనీ లేకుండానే కావాల్సినంత సంపద, డబ్బు, అధికారం ఉన్న కుటుంబాల్లోని వారికి సాధారణ సంసా రిక సుఖం చాలదు. విశృంఖల లైంగిక సంబంధాలు, వికృత లైంగిక క్రీడ, వాటికోసం నీలి చిత్రాల ప్రేరణ అవసరం. అలాంటి కొద్ది మంది అవసరాల కోసం నీలిై సెట్లపై ఎలాంటి నియంత్రణ ఉండరాదనడం అసమం జసం. ‘‘నీలిచిత్రాల వీక్షణం ఒక చాయిస్’’ అనే మహా మేధావులు ఆ కొద్ది మంది ప్రయోజనాలను కాచేవారు కావడం కాకతాళీయం కాదు. అలా అని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థా నైతిక పరిరక్షకులుగా ఏది నీలి చిత్రం? ఏది కాదు? అని నిర్ధారించడమూ అనర్థదాయకమే. నీలి సైట్ల నియంత్రణను అర్హతగలిగిన, నిపుణుల స్వతంత్ర సంస్థలకు అప్పగించాలి. అంతకుమించి ఆ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండటం అవసరం. - దేవి (వ్యాసకర్త సామజిక కార్యకర్త) 98486 22829 -
ఆటో బోల్తా: 11 మందికి గాయాలు
మొయినాబాద్: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన మండల పరిధిలోని చిలుకూరు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గురువారం సాయంత్రం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం రాత్రి 9 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆటోలో ఎక్కారు. చిలుకూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 11 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన దశరథ, దేవి, నితీష్, అనితలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన రాములమ్మ, నితిన్, రాజశేఖర్, రాజ్‌కుమార్, రాములు, సుభిక్ష, ప్రవళికలను స్థానిక భాస్కర ఆస్పత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ రవిచంద్ర తెలిపారు. -
ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’?
పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. పారిశుద్ధ్యం పనుల సమర్థ నిర్వహణకు తగినన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. అది విస్మరించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం పేరిట సాగుతున్న ఈ శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా? అంబానీల నుండి గల్లీ లీడర్ల దాకా మీడియా కవ రేజీకి అనువుగా చీపుర్లు పట్టి సుతారంగా రోడ్లు ఊడ్చేస్తుంటే... అర్థరాత్రి, అపరాత్రి అనక రోజూ ఆ పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ము క్కున వేలేసుకోవాల్సి వ స్తోంది. ఇదీ ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రదర్శితమ వుతున్న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ అనే ప్రహస నం. ప్రభుత్వ ప్రచారార్భాటానికి తోడు భారీ తారా గణంతో దాని హవా సాగుతోంది. మన నగరాలు, పట్టణాలు మురికి కూపాలుగా ఉంటున్న మాట వాస్తవం. నిరంతర పారిశుద్ధ్యానికి హామీని ఇవ్వగలిగినంత మంది పారిశుద్ధ్య కార్మి కులు ఏ మునిసిపాలిటీకీ, కార్పొరేషన్‌కూ లేకపో వడమే ఇందుకు ప్రధాన కారణం. పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. కానీ తగినంత మంది కార్మికులను నియ మించడానికిగానీ, సాధన సంపత్తిని సమకూర్చడా నికిగానీ వాటి వద్ద నిధులు లేవనేది వాస్తవం. పారి శుద్ధ్యం పనులు సమర్థవంతమైన నిర్వహణకు తగి నన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. ఆ పని చేయకుండా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, వారిని భాగస్వాములను చేయడం పేరిట శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా? ఈ కార్యక్రమంలో అతి కీలకమైనవి, నిరంతర పాత్రధారులు కావాల్సినవి స్థానిక సంస్థలే. వాటిని బలోపేతం చేసి అమలులో ముందునిలిపి, ప్రజ లను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. సినిమా తారలు, క్రీడాకారుల వంటి సెలబ్రిటీలు, రాజకీయ నేతల ప్రచారం అందుకు తోడైతే ఉప యోగం ఉంటుంది. అంతేగానీ తాత్కాలికమైన ఈ శుద్ధ ప్రచార కార్యక్రమం వల్ల ఒరిగేదేమిటి? పట్ట ణాల్లో పర్వతాల్లా పేరుకు పోతున్న చెత్త అతి పెద్ద సమస్య. రీసైక్లింగ్ ఏర్పాట్లు శూన్యం. ఇక మురుగు నీరు, వాన నీరు ఎక్కడికి పోవాలి? మురుగు నీటిని శుద్ధి చేసే సాంకేతికత ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? కాంక్రీటు అరణ్యాలుగా మారిన, మారుతున్న పట్టణ ప్రాం తాల్లో వాన నీటితో చేసే సాగు అత్యావశ్యకం, అనేక సమస్యలకు పరిష్కారం. అందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలను ఎప్పుడు కదిలించాయి? ప్రతి నీటిబొట్టును జాగ్రత్తగా వాడాలని, భద్రపర చుకోవాలని ప్రజలకు ఏ పాటి అవగాహన కల్పిం చాం? అది తెలిసి వాళ్లు ఎంతవరకు దాన్ని ఆచర ణలో పెడుతున్నారు? ఇక బహిరంగ మల విసర్జన మరో పెద్ద సమ స్య. ‘‘మరుగు దొడ్డి లేకుంటే పెళ్లి నిరాకరించు’’ అం టూ అన్ని భారాల్లాగే దీన్ని కూడా మహిళల నెత్తికే ఎత్తారు! మరి కట్నం అడిగితే పెళ్లికి నిరాకరించమని ఎందుకు పిలుపునివ్వలేదో? గ్రామాల్లో 60%, పట్టణాల్లో 20% ఇళ్లల్లో మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రాబోయే ఐదేళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో 11 కోట్ల మరుగుదొడ్లను కట్టాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. గతంలో చేపట్టిన నిర్మల్ గ్రామ్ అభియాన్, టోటల్ శానిటేషన్ కార్యక్రమాలకు కొత్త పేరు పెట్టి చేస్తున్న కొత్త ఖర్చు ఇది. గతంలో చేపట్టిన కార్య క్రమాలలోని లోపాలను, అవినీతిని పట్టించుకో కుండా చేపట్టిన ఇది కూడా వాటిలాగే విఫలం కాక తప్పదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 1986 నుండి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు దాదాపు ఇంతే మొత్తాన్ని ఖర్చు చేశాయి. 2001 తర్వాత 9.7 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు ప్రభు త్వ లెక్కలు చెబుతున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలోని మొత్తం మరుగు దొడ్ల సంఖ్య 11.5 కోట్లు. అంటే మధ్య, ఉన్నత తరగతుల వారంతా కట్టించుకున్నవి కేవలం 2 కోట్లేనా? ప్రభుత్వ నిధు లతో కట్టిన మరుగుదొడ్లలో ఎక్కువ భాగం కాగి తాల మీద కట్టినవే. ఉదాహరణకు ఈ పద్దు కింద అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత పదేళ్లలో అది రూ. 3,209 కోట్లు ఖర్చు చేసినా 64% ఇళ్లలో మరుగు దొడ్లు లేవు. అలాగే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 50.4% ఇళ్లకు ఇంకా మరుగుదొడ్లు లేవు. గత వైఫల్యాలకు కారణాలను వెతకకుండా, తప్పులను సరిదిద్దకుండా, కొన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలలో పాతుకుపోయి ఉన్న అలవాట్లను, సంప్ర దాయాలను మార్చకుండా, ప్రజల చురుకైన భాగ స్వామ్యం లేకుండా చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల మళ్లీ బాగు పడేది కాంట్రాక్టర్లే. కడు పేద దేశం బంగ్లాదేశ్‌లో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3% కాగా, మనకంటే తక్కువ తలసరి ఆదాయ దేశం పాకి స్థాన్లో 23%. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని ప్రచార ఆర్భాటాలు కట్టిపెట్టి, ఆచరణాత్మక స్వచ్ఛ భారత్‌గా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతారని ఆశి ద్దాం. లేకపోతే పేరుకుపోతున్న చెత్త, మురుగు పేద లకే కాదు అన్ని వర్గాల వారికి వినాశకరంగా పరిణ మించక తప్పదు. సందర్భం: దేవి (వ్యాసకర్త సామాజిక కార్యకర్త) -
ఈ మేడమ్ మాకొద్దు!
శంషాబాద్ రూరల్ : చాలీచాలని భోజనం పెట్టడమే కాదు.. నిత్యం వేధింపులు. కాస్మొటిక్స్, యూనిఫాంలు అడిగితే.. మీ ముఖాలకు అవి అవసరమా అంటూ హేళన. అంతేకాదు.. హాస్టల్‌కు వచ్చిన సరుకులను పక్కదోవ పట్టించి సొమ్ము చేసుకోవడం.. ఇన్నాళ్లూ వీటన్నింటినీ మౌనంగా భరించిన పాల్మాకుల క స్తూర్బాగాంధీ గిరిజన బాలికల విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మాకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళనలో విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి, అకౌంటెంట్ వీరమణిలు కుమ్మక్కై సరుకులను బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువ చూపి మిగిలిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ డీలరుకు ఈ సరుకులను ఎవరికీ తెలియకుండా రాత్రి వేళ విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ నెల 12న రాత్రి ఉపాధ్యాయులను అందరినీ ఇంటికి పంపించిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ దేవి విద్యార్థులను కూడా టీవీ చూడమంటూ గదిలోకి పొమ్మందని, చదువుకుంటామని కొందరు చెప్పినా వినకుండా టీవీ గదిలోకి వెళ్లగొట్టిందని ఆరోపించారు. అనంతరం హాస్టల్లో ఉన్న మూడు క్వింటాళ్ల బియ్యం, 30 లీటర్ల మంచినూనె, 30 కిలోల కందిపప్పు, 25 కిలోల చక్కెర, 63 ఖాళీ గోనె సంచులను ఓ ఆటోలో ఎక్కించిందన్నారు. విషయం పసిగట్టి అక్కడికి చేరుకుని.. సరుకులు ఎక్కడికి పంపిస్తున్నారని ప్రశ్నిస్తే స్పెషల్ ఆఫీసర్ మమ్ములను బెదిరించిందని వెల్లడించారు. అదేరోజు రాత్రి ఆందోళనకు దిగడంతో విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన స్పెషల్ ఆఫీసర్.. సరుకులను మరుసటి రోజు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పాఠశాలకు తెప్పించారన్నారు. పాఠశాల నిర్వహణ తీరుపై నిలదీస్తే.. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని విద్యార్థులు వాపోయారు. నీచంగా మాట్లాడుతోంది.. స్పెషల్ ఆఫీసర్ దేవి మా పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కించపరుస్తూ ఇష్టంవచ్చినట్టు తిడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ గుడ్డు ఇవ్వాల్సి ఉండగా రోజువిడిచిరోజు ఇస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుంచి కూరగాయలు వండకుండా కేవలం సాంబారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రారంభం అయినప్పటినుంచి కేవలం మూడు సార్లు మాత్రమే పండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా తనిఖీకి వస్తే అంతా సవ్యంగా ఉందని చెప్పాలంటూ బెదిరిస్తున్నదని ఆరోపించారు. తప్పు జరిగింది క్షమించండి విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న విలేకరులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో స్పెషల్ ఆఫీసర్ దేవి ‘తప్పు జరిగింది.. ఈ ఒక్కసారికి క్షమించండి’ అంటూ విద్యార్థులను వేడుకున్నారు. ‘నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.. నన్ను వదిలేయండి’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల నిర్వహణ ఎలాగో తనకు తెలియదని, అకౌంటెంట్ చెబితేనే సరుకులను బయటకి పంపించానని చెప్పారు. ‘దేవి మేడమ్ విద్యార్థుల హాజరును ఎక్కువగా చూపించాలని చెబితేనే తాను అలా చేశాన’ని అకౌంటెంట్ వీరమణి వివరణ ఇచ్చారు. ఇంతలో స్థానిక నాయకులు కొందరు రంగంలోకి దిగి విద్యార్థులకు, అధ్యాపక బృందానికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
గతాన్ని ఇష్టపడినవాడే..భవిష్యత్తుని మలుచుకోగలడు!
అరుంధతి, అంజి, అమ్మోరు... ఎలాంటి మనిషి ఈయన? అంటే?! దేవి, దేవుళ్లు, దేవీపుత్రుడు... ఏమీ స్పెషల్‌గా అనిపించడం లేదా? అన్నీ స్పెషలే కదా! అవన్నీ స్పెషలే. కోడి రామకృష్ణలో స్పెషలేమిటని? సెంటిమెంట్లు ఎక్కువలా ఉంది. పూర్వజన్మలపై మక్కువలా ఉంది. రెండూ కరెక్టే. మొదటిది ఇంకా కరెక్టు! రామకృష్ణ జననం పెద్ద సెంటిమెంటు. దాసరిగారి కారెక్కడం సెంటిమెంటు. చిరంజీవి పెట్టిన పరీక్ష సెంటిమెంటు. తలకు చుట్టుకున్న తుండుగుడ్డ సెంటిమెంటు. దేవతలపైనే కాదు, మనుషుల మీదా సినిమాలు తీశారు రామకృష్ణ. ఈ ఏడాది మరో రెండుమూడు రాబోతున్నాయి. మనుషులవా? దేవతలవా? ఏవైనా కావచ్చు. ఏడాదికొక్కటైనా సినిమా తియ్యాలన్న సెంటిమెంట్ అయనకుందో లేదో కానీ... ఆయన చిత్రం ఏడాదికొక్కటైనా రిలీజ్ అయితే బాగుంటుందనుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. కోడి లైఫ్‌లో కొత్త సినిమా కనిపిస్తుంది. మీ జీవితాన్ని ఓ పుస్తకం అనుకుంటే.. దానిలో పేజీలన్నీ దాదాపు అందరూ చదివినవే. మీకు తెలిసి చదవని పేజీలు ఏమైనా ఉన్నాయా? కోడి రామకృష్ణ: ఎందుకుండవ్.. ఉంటాయి. నాన్న జ్ఞాపకాలు, అమ్మ ఉత్తరాలు, స్కూల్‌డేస్‌లో తోటి విద్యార్థుల ఫిర్యాదులు, ఊళ్లో వేసిన నాటకాలు.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో. అలా అయితే... కొన్ని చెప్పండి? ముందు మీ బాల్యం. కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న పేరు కోడి నరసింహమూర్తి, అమ్మపేరు చిట్టెమ్మ. మా అమ్మానాన్నలకు నేనంటే చాలా ఇష్టం. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ పెద్ద సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున సాయంత్రం చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ ఒక్కసారిగా కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! మా వీధిలో సెంటిమెంట్లు ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి ఓ సరదా ఇన్సిడెంట్ చెబుతా. మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ గొడవ మానలేదు. శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణస్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అని బ్రాహ్మలామె. నాకేమో అంతా వింతగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లలమీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్నా... ‘ఇది నా పిల్లల్ని తిట్టింది బావగారూ..’ అని ఆమె... ‘తిడితే చావగొడదాం సరేనా..’ అని నాన్న. ఎట్టకేలకు శాంతించిందామె. ‘ఓ అరటిపండు పెట్టండి వెళతా’ అంది. అమృతపాణీ తెప్పించి నాన్నే స్వయంగా వలిచి పెట్టారు. ఆ క్షణంలో నాన్న కళ్లలో నీళ్లు చూశా. ఆ పండు తినగానే.. ఆమెకు స్పృహ తప్పింది. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి. అమ్మానాన్నలతో మీ అనుబంధం? కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సెలైంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని. కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా? కోడి రామకృష్ణ: అప్పట్లో మాకు ఆత్మీయత తెలుసు, అందం తెలుసు. మా ఆలోచనలు అంతవరకే. పరిధులు దాటేవి కావు. మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్కొచ్చేవారు. అందరూ లవ్లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటిపేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తానూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి? కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ప్రొజెక్టర్ దగ్గర నిలబడి, నా స్లయిడ్ పడేదాకా ఉండి, తెరపై నా పేరును చూసుకొని అప్పుడు షాప్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. పసుపు, కుంకుమ, బొగ్గు, పౌడర్లతో మేకప్ చేసుకొని... వీధి మధ్యలో ఓ నులక మంచాన్ని నిలబెట్టి, దానికో తెరకట్టి పిల్లలందరం నాటకాలు వేసేవాళ్లం. రైటర్ని, డెరైక్టర్ని, హీరోని నేనే. మా వీధిలో కొన్ని కుటుంబాల్లో జరిగిన సంఘటనల్నే స్ఫూర్తిగా తీసుకొని కథల్ని, పాత్రల్ని సృష్టించేసేవాణ్ణి. లైవ్‌లో డైలాగులు చెప్పించేసేవాణ్ణి. తర్వాత ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. నా ఫ్రెండ్ లైఫ్‌ని ప్రేరణగా తీసుకొని రాసిన ‘రేపు సెలవు’ నాటిక నాకు మంచి పేరు తెచ్చింది. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. నాకూ ఫస్ట్‌లో ఆర్టిస్ట్ అవ్వాలనే ఉండేది. అలాంటి టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలి సినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా సంచలనం చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డెరైక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డెరైక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డెరైక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. ఇదే నా ఆలోచన. మరి ఎలా కలిశారు? కోడి రామకృష్ణ: గురువుగార్ని నా చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నాను. ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్ రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డెరైక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ఆర్టిస్ట్ అయితే క్రేజ్ ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు... అదంతా నా అదృష్టమే అనుకున్నా. ఆ సినిమా యాభై రోజుల పండుగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లే వస్తున్నారనే సంగతి తెలిసింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం నడుస్తోంది. పైగా ‘తాతామనవడు’ రిలీజైన థియేటర్ వాళ్లకు, మా స్టూడెంట్లకు పడదు. అలాంటి వేడి వాతావరణంలో ఫంక్షన్. ఎలాగైనా ఫంక్షన్ పాడుచేయాలని స్టూడెంట్లందరూ కంకణం కట్టుకున్నారు. పైగా అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే.నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. తోటి విద్యార్థులేమో.. ఫంక్షన్ పాడు చేయాలంటున్నారు. ఇక నేను అందర్నీ రిక్వెస్ట్ చేసుకున్నా. ‘గురువుగారు వస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. అవకాశం అడగాలి. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు.. ప్లీజ్’ అని బతిమాలుకున్నాను. దాంతో ఓ షరతుపై వాళ్లు ఒప్పుకున్నారు. అదేంటంటే... ‘మేం థియేటర్‌కి వస్తాం. నేల టికెట్లో కూర్చుంటాం. ఆ థియేటర్ ఓనర్గాడు.. ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం కొట్టేస్తాం. అందుకు నువ్వు ‘ఓకే’ అయితే.. మేమూ ‘ఓకే’ అని. నాకేమో టెన్షన్. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. సన్మానపత్రం రాసి స్వయంగా చదివాను. అంతా ప్రశాంతంగా జరిగిపోతోంది అనుకుంటుండగా... ఆ థియేటర్ ఓనర్ మైక్‌లో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘పాలకొల్లుకే పేరు తెచ్చిపెట్టారు దాసరి. యువతరం దాసరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనలా ఎదగాలి. అంతే కానీ... మీలా కుక్కల్లా, పందుల్లా వీధుల్లో తిరగడం కాదు కుర్రాళ్లు చేయాల్సింది’ అనేశాడు. ఇంకేముంది? వాతావరణం రణరంగాన్నే తలపించింది. ఏదిఏమైనా గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రెలైక్కాను. వెళ్లగానే దాసరిగారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? కోడి రామకృష్ణ: ఆయన రిసీవింగ్ గమ్మత్తుగా జరిగింది. నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వచ్చి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను. మీ తొలిచిత్రం ఇంట్లో ‘రామయ్య-వీధిలో కృష్ణయ్య’ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? కోడి రామకృష్ణ: ఆ కథను నిర్మాత కె.రాఘవగారికి, చిరంజీవిగారికి చెప్పి, ఒప్పించే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే... విపరీతంగా టెన్షన్ పడ్డ సంఘటన ఒకటుంది. ఆ సినిమా షూటింగ్‌ని గోదావరి ఒడ్డున ప్లాన్ చేశాం. చిరంజీవి.. బోట్లో కూర్చొని కమలాపండు తింటున్నారు. నేనేమో నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను. చిరంజీవిగారు కమలా పండు తొనలు వొలుస్తూ... ‘రామకృష్ణా.. ఈ తొన నీపై విసురుతున్నా.. నువ్వు దాన్ని నోటితో క్యాచ్ చేయాలి. పట్టుకుంటే... సినిమా హిట్. మిస్ చేశావా.. సినిమా ఫ్లాప్’ అన్నారు. తొలి సినిమా. పైగా నాకు సెంటిమెంట్లు ఎక్కువ. ‘సార్... ఇది అన్యాయం’ అని మొత్తుకుంటున్నా ఆయన వినలేదు. తొనను విసిరారు. ఆ తొనను ప్రాణాలను సైతం పణంగా పెట్టి నోటితో క్యాచ్ పట్టుకున్నాను. ఆ తొనను నేను పట్టుకున్న తీరు గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. చిరంజీవిగారు ఇప్పటికీ అంటుంటారు. ‘భలే పట్టుకున్నావ్ రామకృష్ణా.. అప్పుడు ఏదో అనేశాను కానీ.. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది.. నువ్వెంత టెన్షన్ పడ్డావో’ అని. ‘మంగమ్మగారి మనవడు’లో భానుమతిని మంగమ్మగా తీసుకోవడం మీ ఆలోచనేనా? కోడి రామకృష్ణ: అవును. ఆ ఆలోచన నాదే. అప్పటికి భార్గవ్ ఆర్ట్స్ బేనర్లో ‘ముక్కుపుడక’ సినిమా చేశాను. అది పెద్ద హిట్. రెండోసినిమా బాలకృష్ణతో చేద్దాం అన్నారు గోపాలరెడ్డి. కొంతమంది భయపెట్టారు. ‘ఎందుకు హీరోలతో తీయడం. ‘ముక్కుపుడక’లా మంచి కథల్తో వెళ్లొచ్చు కదా..’ అని. కానీ మొండిధైర్యంతో బాలయ్యతో వెళ్లాం. మంగమ్మ పాత్ర కథకు కీలకం. అందుకే భానుమతిగారైతే... కరెక్ట్ అని చెప్పాను. ఆమెతో తలనొప్పి అని, నచ్చకపోతే మధ్యలో వెళ్లిపోతుందని, పైగా మర్యాద లేకుండా మాట్లాడుతుందని ఏవేవో చెప్పారు. అవేమీ లెక్క చేయకుండా గోపాలరెడ్డిగారు, నేను భానుమతిగారిని కలిశాం. ‘మన్వాసనే’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని, అందులో కాంతిమతి చేసిన పాత్రను తమరు చేయాలని చెప్పాను. భానుమతిగారితో కంపేర్ చేస్తే.. కాంతిమతి చాలా చిన్ననటి. ఆమె పాత్రకు భానుమతిగార్ని అడిగేసరికి ఆమె మొహంలో రంగులు మారాయి. ‘కాంతిమతి పాత్ర నేను చేయాలా?’ అన్నారు సీరియస్‌గా. ‘అమ్మా... పాత్రను మీకు తగ్గట్టుగా డెవలప్ చేశాం. మీరు చేస్తే తప్ప ఈ ప్రాజెక్ట్‌కి నిండుదనం రాదు’ అని బతిమాలాను. ఎలాగో ఒప్పుకున్నారు. ‘అది సరేకానీ... నిన్ను ఏమని పిలవాలయ్యా... మా వారిపేరు నీ పేరు ఒకటే. నిన్ను పేరు పెట్టి పిలవలేను. అందుకే ‘డెరైక్టర్’ అని పిలుస్తా సరేనా’ అన్నారు. అలాగేనమ్మా అన్నాను. ఆ విధంగా ‘మంగమ్మగారి మనవడు’ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ అందులో హీరో అంటే భానుమతి ఎలా రియాక్టయ్యారు? కోడి రామకృష్ణ: ఎనీఆర్గారంటే భానుమతిగారికీ అభిమానమే. ‘భానుమతిగారు కారు దిగగానే.. ముందు నువ్వే వెళ్లి డోర్ తీయ్’ అని ఎన్టీఆర్‌గారే బాలయ్యకు చెప్పారట. తండ్రి మాట ప్రకారం భానుమతిగారి కారు ఆగగానే.. స్వయంగా బాలయ్యే వెళ్లి డోర్ తీశారు. ఆ క్షణం భానుమతిగారిలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘మీ నాన్నలోని సంస్కారం మొత్తం నీలో ఉందిరా అబ్బాయ్’ అని పొంగిపోయారు. ఆమె ఎంత బోళామనిషో చెప్పడానికి ఇంకో ఇన్సిడెంట్ చెబుతాను. ‘మంగమ్మగారి మనవడు’లో కొన్ని డైలాగుల్ని కాస్త ఘాటుగానే రాశారు గణేశ్‌పాత్రో. భానుమతిగారిపై తొలి షాట్. ‘బావగారొచ్చారని బట్టలేసుకోకుండా నిలబడిందంట.. నీ లాంటి భయంగల బల్లి’ అనేది డైలాగ్. అది చదివి.. మరీ డైలాగు ఇంత ఘాటుగా ఉంటే ఎలాగురా.. నేను చెప్పను’ అనేశారు. ‘అమ్మా.. ప్లీజ్’ అని బతిమాలినా వినలేదు. ‘కొంచెం సరళంగా మార్చుకొని చెబుతా’ అన్నారు. సరే... అని ‘యాక్షన్’ చెప్పా... అంతకు ముందు చదివి ఉన్న డైలాగునే ఠకీమని చెప్పేశారు. ఆ సినిమా తీసింది ఓ పల్లెటూరిలో. దాంతో భానుమతిగారిని చూడటానికి తండోపతండాలుగా జనాలొచ్చేశారు. భానుమతిగారు ఈ డైలాగ్ చెప్పగానే... విజిల్సూ, కేకలు. ‘చూశారా.. మీరు మచ్చుకు ఒక్క డైలాగు చెబితేనే రెస్పాన్స్ ఎలా ఉందో. అదే ఇందులోని డైలాగులన్నీ ఇదే మూడ్‌తో చెప్పారంటే, స్పందన ఎలా ఉంటుందో అర్థంచేసుకోండి’ అన్నాను. ‘అంతేనంటావా.. సరే చెప్పేద్దాం’ అన్నారు. ఇక అప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగుల్నే చెప్పారు. అంతటి బోళా మనిషి ఆమె. భానుమతిగారితో చేయగలగడం నేను చేసుకున్న అదృష్టం. మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమామయ్య.. ఈ చిత్రాల్ని పక్కనపెట్టి బాలకృష్ణ కెరీర్‌ని ఊహించలేం. ఉన్నట్టుండి ఇద్దరూ ఎందుకు బ్రేకయ్యారు? కోడి రామకృష్ణ: మేం బ్రేక్ అవలేదండీ... అన్నీ కుదిరితే మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. ‘భార్గవ్ ఆర్ట్స్’లో బాలయ్యతో నిజంగా గొప్ప సినిమాలే తీశాను. ఎస్.గోపాల్రెడ్డిగారిక్కూడా బాలయ్య అంటే అమితమైన అభిమానం. ‘మంగమ్మగారి మనవడు’ తర్వాత ఆయన టాప్‌స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్టే.. బాలయ్యతో ఏ సినిమా తీసినా.. అడక్కుండానే పారితోషికం పెంచేసేవారు గోపాల్‌రెడ్డి. ‘ముద్దులమావయ్య’ తర్వాత బాలయ్య దాదాపు నంబర్‌వన్ అయ్యారు. ఆయన పారితోషికం కూడా చాలా పెరిగిపోయింది. ‘ఇప్పుడు బాలయ్యతో మనం సినిమా తీస్తే... మనకోసం ఆయన పారితోషికం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి నా బాలయ్యకు రాకూడదు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం’ అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మళ్లీ భార్గవ్ ఆర్ట్స్‌లో మా ముగ్గురి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. మీ కాంబినేషన్లో ఓ జానపదం మొదలై, మధ్యలో ఆగిపోయింది. దానివిషయంలో గొడవలు జరిగాయని టాక్? కోడి రామకృష్ణ: అలాంటిదేం లేదు.. మేం ముగ్గురం పరస్పరం అభిమానించుకునేవాళ్లమే. కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్తయింది. రెడ్డిగారు బతికుంటే..పూర్తి చేసేవాళ్లం. మీ నిర్మాతలు.. మరొకరితో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కారణం? కోడి రామకృష్ణ: ప్రొడ్యూసర్‌కు తెలియకుండా నేను ఏదీ చేయను. నిర్మాత అభిరుచికి తగ్గట్టే కథల్ని ఎంచుకుంటాను. అభిరుచి లేని వ్యక్తులతో పనిచేయను. నా సినిమాల్లో కచ్చితంగా నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటాను. ‘మీరు చూసిన పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన కథ ఏంటి? వాటిల్లో ఒక కథను ఎంచుకొని సినిమా తీయాల్సి వస్తే... ఏ కథను ఎంచుకుంటారు? అని మురారి గారిని అడిగాను. ‘ఆత్మీయులు సినిమా కథంటే ఇష్టం. దాన్ని మళ్లీ తీయాలని ఉంది’ అని చెప్పారు. వెంటనే ఆ రాత్రి ఆత్మీయులు సినిమా చూసి, ‘శ్రీనివాసకల్యాణం’ కథ చేశాను. ఇలా తొలినుంచి నిర్మాతను బట్టే నడుచుకుంటున్నా. అమ్మోరు, అరుంధతి సినిమాలను కూడా శ్యామ్ అభిరుచికి తగ్గట్టే తీసిపెట్టాను. ‘దేవి’ చేసినా, ‘దేవుళ్లు’ చేసినా అన్నీ నిర్మాతల అభిరుచికి తగ్గట్టే ఉంటాయి. సినిమా రషెస్ చూసి.. ‘మనం అనుకున్నదానికంటే సినిమా బాగా తీశారండీ..’ అని నిర్మాత అన్నప్పుడే నేను దర్శకునిగా సక్సెస్ సాధించినట్లు. నా సినిమా నిర్మాతకు నచ్చాలి. తర్వాతే జనాలకి. తలకు గుడ్డ కట్టుకుంటారు. చేతికి దారాలు. ఎందుకని? కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కొవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘సార్ మీకు కట్టాక అనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు.. ప్రీవియస్ బర్త్ది. నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంతబాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నా ఫ్రెండ్సందరూ ఆస్ట్రాలజర్స్. వారందరూ ప్రతినెలా కొన్ని తాళ్లు, ఉంగరాలు పంపిస్తుంటారు. అవి కట్టుకోకపోయినా, ఉంగరాలు తొడుక్కోకపోయినా వాళ్లూరుకోరు. అందుకే వారికోసం అవన్నీ కట్టుకుంటా. ఒకవేళ అవన్నీ తీసేసినా... యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు వచ్చి కట్టి వెళుతుంటారు. నిజంగా ఇది విచిత్రమే. సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసుంటారు? కోడి రామకృష్ణ: అంకె ఎవరికీ చెప్పలేదు. మీకే చెబుతున్నా. ప్రస్తుతం అర్జున్‌తో చేస్తున్న సినిమా, అవతారం, పుట్టపర్తి సాయిబాబా చిత్రాలను మినహాయిస్తే... ఇప్పటికి 138 అయ్యాయి. ‘వందవ సినిమా ఫలానా’ అని చెప్పుకోవడం నాకిష్టంలేదు. అందుకే ఎవరికీ చెప్పలేదు. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అని ఓ సినిమా చేయబోతున్నాను. వెరైటీ కాన్సెప్ట్. ఆంజనేయుడు, నలుగురు పిల్లలు కథ ఇది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది. త్వరలోనే గురువుగార్ని క్రాస్ చేయబోతున్నారన్నమాట? కోడి రామకృష్ణ: ఆ మాటనకండి. ఆయనెక్కడ... నేనెక్కడ! - బుర్రా నరసింహ మీతో మాట్లాడుతుంటే అర్థమవుతోంది... మీరు గతాన్ని బాగా ఇష్టపడతారని..! కోడి రామకృష్ణ: గతాన్ని ఇష్టపడినవాడు మాత్రమే భవిష్యత్తుని అందంగా మలచుకోగలడు. నా సినిమా కథలన్నీ నా జీవితంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులే. మీకో విషయం తెలుసా? నా కెరీర్ ప్రారంభంలో మా అమ్మరాసిన ఉత్తరాలు ఇప్పటికే నేను చదువుతుంటాను. ‘పెద్దోడా... నిన్ను ఓసారి నానమ్మ చూడాలంటోంది రా, అమ్మమ్మావాళ్లు మొన్న ఇంటికొచ్చి వెళ్లారు. నిన్ను పదే పదే అడిగారు. మామయ్య వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తాం అంటున్నారు’ అంటూ మా ఇంటి విషయాలన్నీ ఉత్తరాల్లో రాసేది. ఆ ఉత్తరాలు తీసి అప్పుడప్పుడు చదువుతుంటాను. అవి చదివినప్పుడల్లా... ఆ కేరక్టర్లన్నీ మళ్లీ నా దగ్గరకు వచ్చి వెళుతుంటాయి. నన్ను పలకరిస్తుంటాయి. మీకోవిషయం తెలుసా? వాళ్లల్లో ఎవరూ బతికిలేరు. చివరకు మా అమ్మతో సహా. 150 సినిమాలు తీసిన దాసరి నుంచి 138 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ లాంటి గ్రేట్ డెరైక్టర్ బయటకొచ్చారు. మరి మీ నుంచి గొప్ప దర్శకులు రాకపోవడానికి కారణం? కోడి రామకృష్ణ: గ్రేట్ డెరైక్టర్ అనిపించుకోవాలంటే... పట్టుదల అవసరం. పరిశీలనాత్మక దృష్టి అవసరం. నేను ఇరవైనాలుగ్గంటలూ గురువుగార్నే అబ్జర్వ్ చేస్తుండేవాణ్ణి. అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గురువుగారిలా నేను కూడా నాటకరంగం నుంచే వచ్చినవాణ్ణి. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది. పైగా మా భావాలను ధైర్యంగా మా గురువుగారికి చెప్పేవాళ్లం. అప్పట్లో గురువుగారి షూటింగ్‌లు రోజుకు నాలుగైదు జరుగుతుండేవి. ఓసారి స్క్రిప్ట్‌లో ఓ సన్నివేశం తృప్తిగా రాకపోవడంతో దాన్ని షూట్ చేయకుండా పక్కన పెట్టేశారు గురువుగారు. నేను ఆ సన్నివేశం గురించి అర్ధరాత్రి దాకా ఆలోచించి, అందులో ఓ చిన్న ఛేంజ్ చేసి, ఆ అర్ధరాత్రే గురువుగారి రూమ్ తలుపు తట్టాను. పద్మగారు తలుపు తీశారు. ‘ఏంటి రామకృష్ణ?’ అనడిగారు. ‘రేపు తీయబోయే సీన్ గురించి గురువుగారితో మాట్లాడాలి’ అన్నాను. ‘ఆయనతో పని చేసి ఆ పిచ్చి మీకూ తగులుకుంది. అర్ధరాత్రుళ్లు కూడా సినిమాల గోలేంట్రా’అని మందలించి, లోపలికి పంపించారు. ఆ టైమ్‌లో నేను రావడం చూసి ఎవరికైనా ఏమైనా జరిగిందేమోనని గురువుగారు కంగారు పడిపోయారు. ‘ఏంటి రామకృష్ణా..’ అన్నారు కంగారుగా. సీన్ గురించి చెప్పాను. ‘చాలా బాగుంది’ అని అభినందించారు. అయితే.. తెల్లారితే ఆ సీన్ తీయాలి. దానికి ఓ ముసలి మాస్టారు, 40 మంది పిల్లలు అవసరం. మాస్టారి పాత్రకు మా డెరైక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే దుర్గా నాగేశ్వరరావుగారిని తీసుకున్నాం. 40 మంది పిల్లల కోసం ఆ రాత్రి మొత్తం ఊరంతా తిరిగి, తెల్లారేసరికి 40 మంది పిల్లల్ని పోగు చేశాను. ఒక సహాయ దర్శకుణ్ణి అయ్యుండి, సినిమా కోసం అంత కష్టపడేవాణ్ణి. అంతగా ఆలోచించేవాణ్ణి. సినిమాను అంతగా ప్రేమించేవాణ్ణి. పైగా ‘ఇగో’ అంటే తెలీని గొప్ప గురువు మాకు దొరికారు. ‘స్వర్గం-నరకం’ ఎడిటింగ్ టైమ్‌లో అనుకుంటా... గురువుగారు ఓ డైలాగ్ చెప్పారు. మేం పగలపడి నవ్వాం. ‘ఏమయ్యా.. మీ గురువు... దర్శకుడిగా ఫెయిలైపోయాడనుకో.. డైలాగులు రాస్కునైనా బతకొచ్చు కదా’ అన్నారు. అంతగా కలిసిపోయేవారాయన. నా శిష్యులతో కూడా నేనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తా. ఒక మనిషి పైకి రావాలంటే.. ప్రతిభ, అదృష్టంతో పాటు పదిమంది సహకారం కూడా అవసరం. -
మాచినేనిపేట సర్పంచ్ భర్త రాములు ఏమయ్యాడు..?
మాచినేనిపేట (జూలూరుపాడు), న్యూస్‌లైన్: మాచినేనిపేట గ్రామ సర్పంచ్ దేవి భర్త, వైఎస్ఆర్ సీపీ నాయకుడు సపావట్ రాములు జాడ శుక్రవారం నాటికి కూడా తెలీలేదు. ఆయన బుధవారం మాచినేనిపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రాములు భార్య దేవిని కూడా వారు ప్రశ్నించారు. సాగర్ కాల్వలో గాలింపు రాములును హత్య చేసి, మృతదేహాన్ని ఏన్కూరులోని సాగర్ కాల్వలో పడేశారన్న సమాచారంతో కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు గురువారం రాత్రి వరకు ఏన్కూరు నుంచి కల్లూరు వరకు గాలించారు. పాత కక్షల నేపథ్యంలోనే... పాత కక్షల నేపథ్యంలోనే సపావట్ రాములును కొందరు ‘మాయం’ చేసి ఉండవచ్చని స్థానికు లు భావిస్తున్నారు. ఐదేళ్ల కిందట రాములుకు, గురవాగుతండాకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్ష ణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పం చాయతీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వా రిద్దరి మధ్య స్నేహం కుదిరిందని, ఎన్నికలలో కలిసి పనిచేశారని అంటున్నారు. రాములు బుధవారం తన ఇంటి నుంచి 20వేల రూపాయలు తీసుకుని, ఆ వ్యక్తితో కలిసి ఏన్కూరు వెళ్లారని (రాములు) కుటుంబీకులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో ‘రాములును హత్య చేసి సాగర్ కాల్వలో మృతదేహాన్ని పడేసినట్టయితే ఈ రెండు రోజుల్లో ఎక్కడో ఒకచోట మృతదేహం కనిపించేది. శవాన్ని మరోచోట ఉంచి.. కావాలనే పోలీసులను, గ్రామస్తులను నిందితులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రాములు కుటుంబీకులు, బంధువులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఏఎస్పీకి ఫిర్యాదు రాస్తారోకో సాగుతున్న సమయంలోనే ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఏఎస్పీ నాగేశ్వరరావు వాహనం వచ్చింది. పోలీసుల తీరుపై ఏఎస్పీకి ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. రాములు ఆచూకీ త్వరగా తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఎస్ఐ ఆర్.అంజయ్య తన సిబ్బందితో కలిసి ఏన్కూరు సాగర్ కాల్వ వెంట గాలించి పోలీస్ స్టేషన్‌కు తిరిగొస్తుండగా ఆందోళనకారులు అడ్డగించి, రాస్తారోకోకు దిగారు. అటుగా వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృ ష్ణారెడ్డికి వారు సమస్యను వివరించారు. ఆయన ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.