హైదరాబాద్: తన కూతురు రోడ్డు ప్రమాదంలో మతి చెందిందన్నది పూర్తిగా కట్టు కథ అని.. లోతుగా విచారణ జరిపితే నిందితులు దొరుకుతారని.. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున కారు ప్రమాదంలో మతి చెందిన కట్కూరి దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తన కూతురు మరణం వెనుక మిస్టరీని ఛేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు కారులో భరతసింహారెడ్డి ఒక్కడే లేడని మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆ ఇద్దరు ఎవరో గుర్తించాలని కోరారు.
సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. వాస్తవాలు వెలికి వస్తాయని అన్నారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే కారును అక్కడి నుంచి ఎలా తొలగిస్తారని నిలదీశారు. ప్రమాదం జరిగినప్పుడు కారును తీయడానికి గంటల సమయం పట్టే ఈ రోజుల్లో అరగంటలోనే తొలగించడం, ఇక్కడ కాకుండా ఎక్కడో రహ్మత్‌నగర్‌కు తరలించడం వెనుక అనుమానాలు చాలా ఉన్నాయన్నారు. అసలు నిందితులు పట్టుబడే దాకా ఉద్యమిస్తామని చెప్పారు. నిందితులపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. నిర్భయచట్టం కింద కేసు నమోదు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్కౌంటర్ చేయాలి: మానస
తన సోదరి మతిపట్ల చాలా అనుమానాలున్నాయని దేవి సోదరి మానస తెలిపింది. 'ఆ రోజు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. చాలాసేపు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో అందరం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ కూర్చున్నాం. రోడ్డు ప్రమాదంలో మతి చెందినట్లు తెలియగానే నిశ్చేష్టులమయ్యాం. ఇందుకు కారకులైన వారిని ఊరికే వదిలి పెట్టవద్దు, నా స్నేహితులు డిమాండ్ చేస్తున్నట్లు ఎన్‌కౌంటర్ చేయాలి' నఅఇ ఉద్వేగంగా అంది.
'నా కూతురుది..ముమ్మాటికీ హత్యే'
Published Thu, May 5 2016 9:29 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement