
సంపత్‌పాల్ దేవి
వికీపీడియాలో ఐదు కోట్ల యాభై లక్షలకు పైగా ఎంట్రీలు ఉన్నాయి. వాటిల్లో మహిళా సాధకుల జీవిత చరిత్రలు ఇరవై శాతానిక్కూడా మించి లేవు! ఏదైనా లిఖిస్తేనే చరిత్రలో ఉంటుంది. లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది. వికీపీడియాలో ఉన్నదాన్నైతే వెతుక్కుని వెలికి తియ్యవచ్చు. కాలగర్భంలో కలిసిపోయిన దాన్ని ఏ కీవర్డ్‌తో కనిపెట్టి బయటికి తీసుకోగలం? అందుకే ఇప్పుడు వికీపీడియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి, మానవ హక్కుల కోసం పోరాడిన, పోరాడుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ‘వికీపీడియా పేజీ’ని ఏర్పాటు చేయబోతున్నాయి. ‘బ్రేవ్: ఎడిట్’ అనే పేరుతో ఈ భారీ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. వికీపీడియాలోని ‘వికీమీడియా’ విభాగం దీని బాధ్యతలను తీసుకుంది.
ఎన్ని అవరోధాలు, అవాంతరాలు ఎదురైనా సమాజంలోని వివక్షలపై పోరాటాన్ని వదిలిపెట్టక, పిడికిలి బిగించిన ప్రతి మహిళా కార్యకర్తకూ ఈ సైట్‌లో చోటు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి మహిళా స్ఫూర్తి ప్రదాతల వివరాలను సేకరించే యజ్ఞం ఇప్పటికే మొదలైంది. దీనికి ‘గ్లోబల్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ ప్రోగ్రామ్’ అని పేరుపెట్టారు. పేరులో ఎక్కడా మహిళ అనే పదం లేకున్నా ఇది పూర్తిగా మహిళల ఘనతలను నెట్‌లో ‘గ్రంథస్థం’ చేసే ప్రయత్నమే.
సంపత్‌పాల్ దేవి : గులాబీ గ్యాంగ్ లీడర్(సామాజిక జాడ్యాలపై కర్ర పట్టినప్రతి మహిళా కార్యకర్త జీవిత చరిత్రను వికీమీడియా ప్రత్యేక శ్రద్ధతో పొందుపరచబోతోంది).