కోల్ కతాః పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమెకు.. గురువారం నుంచీ ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అయినా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె మూత్రపిండాలు రెండూ సరిగా పనిచేయడం లేదని, గురువారం రాత్రి డయాలసిస్ నిర్వహించినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపించడం లేదని వైద్యులు చెప్తున్నారు.
90 ఏళ్ళ వయసున్నశ్వేతాదేవి వివిధ ఆరోగ్య సమస్యలతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తగిన వైద్యం అందిస్తున్నామని, అయినా పరిస్థితి విషమిస్తుండటంతో వెంటిలేషన్ పై శ్వాసను అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. 1996 లో జ్ఞానపీఠ అవార్డు పొందిన మహా శ్వేతాదేవి.. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1926 లో జన్మించారు. శ్వేతాదేవి తల్లిదండ్రులు సైతం రచయితలే.
మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం..
Published Fri, Jul 15 2016 12:07 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement