social
-
అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు
-
వైఎస్సార్సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ!
వినుకొండ (నూజెండ్ల): పోలింగ్ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని, పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్ తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్ జగన్ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
‘స్కిల్’ స్కామ్ సామాజిక, ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్‌లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్‌లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్‌లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. రిమాండ్ తిరస్కరణ సరికాదు.. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
ఛత్తీస్‌గఢ్‌లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తే.. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్ ఆదివాసీ సమాజ్ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. రాయ్‌పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. చదవండి: ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
ట్రెండీ లుక్‌లో అషు రెడ్డి అందాలు.. పర్వతాల్లో జాన్వీ కపూర్ ఫోజులు!
►అమెరికా వీధుల్లో అషు రెడ్డి అందాలు ►బ్లాక్ డ్రెస్‌లో దసరా బ్యూటీ కీర్తి సురేశ్ లుక్స్ ►పర్వత ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న దేవర భామ జాన్వీ కపూర్ ►శారీలో అందాలు ఒలకబోస్తున్న టిక్ వెడ్స్ షేరు భామ అవనీత్ కౌర్ ►బ్లాక్ డ్రెస్‌లో కాబోయే పెళ్లికూతురు పరిణీతి చోప్రా పోజులు View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) -
ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!
అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్‌కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్. ఈ మూడింటిలో పాస్ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్జీ ఇన్వెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది... ప్రపంచవ్యాప్తంగా ఈఎస్జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్జీ. ఇప్పుడు ఈఎస్జీ అనుకూలం. ఈఎస్జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్జీ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు భిన్నం.. కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్జీ ఆధారిత యూఎస్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్సీఐ వరల్డ్ ఈఎస్జీ ఇండెక్స్ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్‌జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు. అసలు ఈఎస్జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్జీ ఈక్విటీ ఫండ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్ ఈఎస్జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం. కొంచెం జాగ్రత్త అవసరం.. ఈఎస్జీ స్టాక్స్‌కు మార్కెట్ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్జీ థీమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్జీ రేటింగ్ కోసం థర్డ్ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్ మార్క్ లేదా పద్ధతి అనేది ఈఎస్జీ రేటింగ్‌లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్జీ థీమ్ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం. ఈఎస్జీ స్కోర్ ఎలా? ఎన్విరాన్మెంట్ కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్జీ స్కోర్‌కు ముందు థర్డ్ పార్టీ సంస్థలు చూస్తాయి. సోషల్ ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గవర్నెన్స్ కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌ను కూడా పరిశీలిస్తారు. దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే దేశీయంగా ఈఎస్జీ థీమ్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్జీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్ఈఎస్ (స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్జీ ఆధారిత థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్‌గా (ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్జీ పథకంగా లేదు. దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్‌జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్ కంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్‌జీలో రెండు అంశాల్లో టిక్ మార్క్‌లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్ 1 నుంచి బిజినెస్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ సస్టెయిన్‌బిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో (పీఎంఎస్) ఎస్బీఐ ఈఎస్జీ పోర్ట్‌ఫోలియో, అవెండస్ ఈఎస్జీ ఫండ్స్ పీఎంఎస్, వైట్ ఓక్ ఇండియా పయనీర్స్ ఈక్విటీ ఈఎస్జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలంలోనే రాబడులు..? ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్జీ ఇండెక్స్ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్ 9 శాతం నుంచి ప్లస్ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్ ఫండ్స్.. ఫార్మా (12 శాతం డౌన్), ఐటీ (15 శాతం డౌన్) కంటే ఈఎస్జీ ఫండ్స్ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు. పోర్ట్‌ఫోలియో భిన్నమేమీ కాదు.. ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్జీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్ 200 వరకు, ఇంటర్నేషనల్ స్టాక్స్ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్ ఫండ్స్ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్జీ థీమ్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ప్రముఖ స్టాక్స్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్జీ పథకాల్లోనూ టాప్–10 హోల్డింగ్స్‌లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్ ఉన్నాయి. -
ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!
డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం. సామాజిక న్యాయానికి విఘాతం ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, హీరేన్ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్: ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?) అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు -
మౌలిక మార్పులే లక్ష్యంగా...
ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్ జగన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత -
శ్రమ విలువ తెలుసు కాబట్టే...
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్. – కె.వి. రమణ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ -
తెలంగాణ మున్సి‘పోల్స్’: భౌతిక దూరం పాటించని ఓటర్లు
-
కరోనా పడగ నీడ
‘కరోనా’ వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా ఈ మహమ్మారి తాకిడి నుంచి తేరుకోలేదు. ‘లాక్డౌన్’, ‘అన్‌లాక్’ ప్రక్రియలు ఎలా ఉన్నా, దేశంలో పండుగ పబ్బాల సందడి దాదాపు కనిపించకుండా పోయింది. పండుగల వేళ పిల్లలకు ఆటవిడుపు లేకుండాపోయింది. ఇళ్లకు బంధుమిత్రుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే అన్నట్లుగా జనాలు ఒంటరిద్వీపాల్లా బతుకులీడుస్తున్నారు. ‘కరోనా’ మహమ్మారి దెబ్బకు సామాజిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. సహజంగా సంఘజీవులైన మనుషులకు ఈ పరిస్థితి మింగుడుపడనిదిగా ఉంటోంది. మనుషుల సామాజిక, మానసిక పరిస్థితులపై ‘కరోనా’ మహమ్మారి ప్రభావాన్ని గురించి ఒక పరిశీలన... ‘కరోనా’ వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న వార్తలు ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చాయి. మన దేశంలో తొలి కేసు కేరళలో జనవరిలోనే నమోదైంది. ఇది జరిగిన రెండు నెలలకు పరిస్థితి అదుపుతప్పే సూచనలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఐదు విడతల లాక్డౌన్ తర్వాత జూన్ 8న మొదటి విడత ‘అన్‌లాక్’ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలో ‘కరోనా’ కేసులు ఆరు లక్షలు దాటిన తర్వాత జూలై 1న రెండో విడత ‘అన్‌లాక్’ ప్రక్రియ మొదలైంది. కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలులో ఉండగానే ప్రధానమైన పండుగల్లో చాలా గడిచిపోయాయి. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, రథయాత్ర వంటి ప్రధానమైన పండుగలన్నీ కళాకాంతులు లేకుండాగానే జరిగిపోయాయి. రేపు రాబోయే రాఖీ పూర్ణిమతో పాటు ఏటా అట్టహాసంగా జరిగే వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు కూడా పెద్దగా సందడి లేకుండానే, జనాలు నామమాత్రంగా జరుపుకొనే సూచనలే కనిపిస్తున్నాయి. వచ్చేనెలలో జరగనున్న వినాయక నవరాత్రులకు సంబంధించి పలుచోట్ల ఇప్పటి నుంచే ఆంక్షలు కూడా మొదలయ్యాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా వీధుల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులకు మించరాదని, ఇళ్లల్లో పూజించే విగ్రహాల ఎత్తు రెండడుగులకు మించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నవరాత్రులు పూర్తయిన వెంటనే విగ్రహాలను నిమజ్జనం చేయకుండా, వచ్చే ఫిబ్రవరిలో రానున్న ‘మాఘి గణేశ చతుర్థి’ రోజున లేదా వచ్చే ఏడాది వినాయక నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయాలని ఆదేశించింది. వీధుల్లో ఏర్పాటు చేసే బహిరంగ మండపాలకు వచ్చే జనాలు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రుల వేడుకలపై కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగపబ్బాలు, వేడుకలపై ఆంక్షలు వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ‘కరోనా’ వ్యాక్సిన్ జనాలకు అందుబాటులోకి వచ్చి, మహమ్మారి పరిస్థితులు సద్దుమణిగేంత వరకు జనాలు ధైర్యంగా బహిరంగ వేడుకలు జరుపుకొనే పరిస్థితులు లేవు. పెద్దలు కొంతలో కొంతవరకు ఈ పరిస్థితులకు ఎలాగోలా సర్దుకుపోతున్నా, పిల్లలు మాత్రం నిరాశ చెందుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలే కాదు, ఇదివరకటిలా తోటి పిల్లలతో వీధుల్లో ఆడుకునే పరిస్థితులూ లేకపోవడంతో దిగులుతో కుంగిపోతున్నారు. పెరుగుతున్న మానసిక సమస్యలు ‘కరోనా’ వైరస్ ఉధృతి కంటే, దీని పర్యవసానంగా తలెత్తిన లాక్డౌన్, మనుషుల మధ్య భౌతికదూరం, అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యాక మరింతగా పెరుగుతున్న రోగుల సంఖ్య వంటి పరిణామాలు మనుషుల్లో మానసిక సమస్యలను పెంచుతున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగా మనుషుల్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముందే అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడంతో ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇంకొందరు ఉద్యోగాల్లో కొనసాగుతున్నా, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని భయంతో బితుకుబితుకుమంటున్నారు. మహమ్మారి కారణంగా అనుకోకుండా వచ్చిపడ్డ ఆర్థిక సమస్యల నుంచి ఎప్పటికి గట్టెక్కుతామో తెలియని ఆందోళనతో చాలామంది దిగులుతో కుంగిపోతున్నారు. గత ఏడాది చివర్లో చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి దావానలంలా దేశదేశాలకు వ్యాపించింది. చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన సుమారు నెల్లాళ్ల వ్యవధిలోనే 26.4 కోట్ల మంది మానసిక కుంగుబాటుకు లోనైనట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) మే 14న విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. మన దేశంలో ఇదీ పరిస్థితి మహమ్మారి కాలంలో మన దేశంలో ప్రజల మానసిక పరిస్థితులపై ఒక చిన్న ఉదాహరణ. ‘కారిటాస్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్‌లో ఒక హెల్ప్‌లైన్ నంబరును ప్రారంభించింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు పలువురు ఈ నంబరుకు కాల్ చేశారని, వారిలో ఏడేళ్ల చిన్నారులు మొదలుకొని ఎనభయ్యేళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వెల్లడించింది. ఎక్కువ కాల్స్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారివేనని, అస్సాం, బీహార్ తదితర ప్రాంతాల నుంచి కొద్ది మంది నిత్యావసరాలు, మందులు పంపాలని కూడా ఫోన్ చేసినవారు ఉన్నారని ‘కారిటాస్ ఇండియా’ వాలంటీర్ ఒకరు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమకు కాల్స్ వస్తుంటాయని, కాల్స్ వచ్చిన ప్రాంతాలకు చెందిన తమ ప్రతినిధులను అప్రమత్తం చేసి, ఆందోళనతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటామని వివరించారు. ‘లాక్డౌన్’ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటి ‘అన్‌లాక్’ ప్రక్రియ కొనసాగుతున్న రోజుల వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య దాదాపు 20 శాతానికి పైగా పెరిగినట్లు ‘ఇండియన్ సైకియాట్రీ సొసైటీ’ (ఐపీఎస్) వెల్లడించింది. అంతేకాదు, ‘కరోనా’ మహమ్మారి ఫలితంగా దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిపింది. మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోవడం, జీవన భద్రత కొరవడటం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి సమస్యలు చాలామందిలో మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు కలిగిస్తున్నాయని, అక్కడక్కడా కొద్దిమంది వ్యాధి సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై వార్తలు వెలువడుతున్నాయని, దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ సౌమిత్రా పథారే చెబుతున్నారు. మన దేశంలో మానసిక సమస్యల తీవ్రత ‘కరోనా’ తాకిడికి ముందు నుంచే ఉంది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘లాన్సెట్’ అధ్యయన నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చేమో గాని, వారిలో సమస్యలేవీ లేవని తోసిపుచ్చలేమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలో దాదాపు 19.73 కోట్ల మంది రకరకాల మానసిక వ్యాధులతో ఉన్నారు. వీరిలో దాదాపు 4.57 కోట్ల మంది డిప్రెషన్తోను, 4.49 కోట్ల మంది యాంగై్జటీ సమస్యలతోను సతమతమవుతున్నారు. ‘కరోనా’ మహమ్మారి తాకిడి కారణంగా ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య మరో ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో కనీసం 15 కోట్ల మందికి సత్వర మానసిక చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్’ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే మన దేశంలోని మెజారిటీ జనాభాకు సరైన మానసిక చికిత్స లభించే అవకాశాలు అందుబాటులో లేవు. నగర, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మానసిక వైద్య నిపుణుల సంఖ్య చాలినంతగా లేదు. మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే చొరవ కూడా మన జనాభాలో చాలామందికి లేదు. రకరకాల భయాలు, అపోహల కారణంగా తమ ఇంట్లో ఎవరికైనా మానసిక సమస్యలు తలెత్తినా, మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు వెనుకాడే జనాలే ఎక్కువ. దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం ‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయమేదీ లేని పరిస్థితుల్లో వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడిచారు. చిన్నా చితకా వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలామంది గిరాకీల్లేక వ్యాపారాలను మూసేసుకున్నారు. ‘కరోనా’ దెబ్బకు మూతబడిన వ్యాపారాల్లో చిన్న చిన్న టీస్టాల్స్ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. కొన్ని దుకాణాలను తెరిచినా, ఇదివరకటి స్థాయిలో గిరాకీల్లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిలోనూ చాలామందికి జీతాల్లో కోతలు పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. రవాణా వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం మరో ఆరునెలల వరకు ఉన్నచోటును విడిచి ప్రయాణాలకు బయలుదేరేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. కోరుకుంటే విదేశాలకు విమానాల్లో వెళ్లగలిగే స్థోమత ఉన్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలో సైతం దాదాపు 35 శాతం మంది మరో ఆరునెలల వరకు విమాన ప్రయాణాల జోలికి వెళ్లబోమని కరాఖండిగా చెబుతున్నారు. వీరంతా రూ.12 లక్షలకు పైబడిన వార్షికాదాయం గలవారేనని ‘యాక్సెస్ మీడియా ఇంటర్నేషనల్’ వెల్లడించింది. మెరుగైన ఆదాయం గల సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే, ‘కరోనా’ ధాటికి సామాన్యుల బతుకులు ఇంకెంతలా చితికిపోయాయో ఊహించుకోవాల్సిందే! అధిగమించడం ఎలాగంటే... ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించని పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తలెత్తే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. తోటి పిల్లలతో కలసి మెలసి ఆడుతూ పాడుతూ గడపడం ద్వారానే పిల్లలు మానవసంబంధాలను మెరుగుపరచుకుంటారు. ఇళ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, ఇంట్లో ఉండే తాత బామ్మలు వంటి వారితో తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. మనుషులకు దూరమయ్యే పరిస్థితుల్లో వారు వస్తువులకు దగ్గరవుతారు. టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటి వాటితోనే ఎక్కువగా కాలక్షేపం చేయడం మొదలుపెడతారు. ‘లాక్డౌన్’ పరిస్థితులు ఇంటిల్లిపాదీ ఒకేచోట చేరి కాలం గడిపే పరిస్థితిని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు పూర్తిగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో మునిగిపోకుండా పిల్లలతో కబుర్లు చెప్పడం, ఆటలాడటం చేస్తున్నట్లయితే, వాళ్లల్లో ఒంటరితనం దూరమవుతుంది. ‘కరోనా’ ఫలితంగా ఉపాధి పోవడం, ఉద్యోగాల్లో అభద్రత వంటి పరిస్థితులు చాలామందిలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతున్నాయి. ‘కరోనా’ తర్వాత మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. రోగ నిరోధకత పెంచుకునేందుకు పోషకాహారంతో పాటు విటమిన్–సి, విటమిన్–డి మాత్రలు తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. అప్పటికీ మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, కుంగుబాటు ఇబ్బందిపెడుతున్నట్లయితే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే. – డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై .. మానసిక వైద్య నిపుణులు, ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ -
ర్యాలీలో చంద్రబాబు భౌతిక దూరం పాటించలేదు
-
సోషల్ వైరస్
-
నవ దశాబ్ద నారీమణి
ఉద్యమాల్లో మహిళలు.. చట్ట సభల్లో మహిళలు.. సదస్సులలో మహిళలు.. సమాలోచనల్లో మహిళలు! ఈ ఏడాది మొత్తం ప్రతి రంగంలోనూ, ప్రతి సందర్భంలోనూ మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. 2019లో కూడా ఈ ఒరవడి కొనసాగబోతోంది. కొన్ని గంటల్లో రాబోతున్న కొత్త సంవత్సరం.. ఒక కొత్త మహిళా దశాబ్దపు ‘మార్చ్’కి తొలి అడుగు అయినా ఆశ్చర్యం లేదు. తక్కెడ సమానంగా ఉండాలి. సూచీ నిటారుగా ఆకాశాన్ని చూస్తుండాలి. అదే సరైన కొలమానం. సూచీ అటు వైపుకో ఇటువైపుకో వంగిందీ.. అంటే అది సమతూకం కానే కాదు. సమతూకం వ్యాపార సంబంధాల్లోనే కాదు, సామాజిక సంబంధాల్లోనూ ఉండాలి. సమతూకం లేని చోట సమన్యాయం జరగదు. వ్యవస్థ అవ్యవస్థీకృతంగా జడలు విప్పుతుంది. సమాజంలో మహిళ పరిస్థితీ అలాగే ఉంది. అందుకే ఇన్ని సదస్సులు, సమావేశాలు, చర్చలు, తీర్మానాలూ ఇంకా అవసరమవుతూనే ఉన్నాయి.‘ ‘వేకువ జామున లేచాను. ఇంటెడు చాకిరీ. చేస్తూనే ఉన్నాను. ఇంకా చేయాల్సిన పనులెన్ని ఉన్నాయో, ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడు, ఒక ముద్ద తిని నడుం వాల్చేదెప్పుడు..’’ ఇది మధ్య తరగతి ఇల్లాలి ఆవేదనలాగానే కనిపిస్తుంది. కానీ ఇది సగటు ప్రపంచ మహిళ ఆవేదన. తాను ఇప్పటికే చక్కబెట్టిన పనులను తృప్తిగా కళ్ల నిండుగా చూసుకుందామనేలోపు కాలం తరుముతూ ఉంటుంది ఇంకా మిగిలిపోయి ఉన్న పనులను గుర్తు చేస్తూ. మహిళ పరిస్థితీ అంతే. ఒకమ్మాయి ఒక పతకం గెలిచిందని సంతోషంగా ఆకాశానికి ఎత్తేస్తుంటుంది మీడియా. ఆమె స్ఫూర్తితో ముందడుగు వేయండి... అని వెన్నుతడుతుంది. ఆ ప్రోత్సాహాన్నందుకుని ఒక అడుగు వేద్దామని సమాయత్తమయ్యే లోపు మరో పేజీలో మహిళల మీద హింస, లైంగిక దాడులు... ఆడపుట్టుకకు ఎన్ని కష్టాలో అని వికటాట్టహాసం చేస్తుంటాయి. ఇది సంఘర్షణ మహిళాభివృద్ధి, మహిళల స్థితిగతుల మీద ఏటా సింహావలోకనం ఉంటుంది. ఆ పునశ్చరణలో ‘సాధించింది ఎంత; సాధించాల్సింది ఎంత’ అనే తులనాత్మకమైన అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. మహిళల పోరాటాన్ని ‘సమానత్వ సాధన పోరు’ అంటుంది అభ్యుదయ సమాజం. ‘ఆధిక్యత కోసం ఆరాటం’ అంటుంది పురుషాధిక్య భావజాలం. ‘ఇది మా అస్తిత్వ వేదన, మనుగడ కోసం గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణ మాత్రమే, అర్థం చేసుకోండి’ అంటోంది స్త్రీ ప్రపంచం . తప్పని ఆత్మగౌరవ పోరు మహిళ వంటింటికి పరిమితం కావడం లేదిప్పుడు. తనను తాను నిరూపించుకోవడానికి కత్తిమీద సాము చేస్తోంది. ఆమె విజయాలను చూపిస్తూ ‘చూశారా! మేము మహిళలకు ఎన్ని అవకాశాలిచ్చామో’ అంటోంది మేల్ చావనిజం. ‘ఇవ్వడానికి మీరెవరు? మా జీవితాన్ని మా చేతుల్లో ఉంచుకోనివ్వకుండా దోపిడీ చేసిందే మీరు కదా’ అని మహిళ మనసు రోదిస్తూనే ఉంటుందా మాటలు విన్న ప్రతిసారీ. ‘అయినా సరే... మేమేంటో మళ్లీ నిరూపించుకుంటాం. మీ చేతుల్లో చిక్కుకున్న మా జీవితాలను మా వెన్నెముక మీద నిలబెట్టుకుంటాం’ అని తిరిగి స్వీయనిరూపణ కోసం స్వయంశక్తిని అర్పించడానికి ప్రతిరోజూ కొత్తగా సిద్ధమవుతూనే ఉంటుంది మహిళ. అప్పుడు బయటపడుతోంది మరో మేల్ కోణం. ‘మీరు అర్పించాల్సింది మేధను కాదు, శ్రమను కాదు. జస్ట్ దేహాన్ని’ అంటూ పురుషాధిక్యత తన అమానవీయ కోణాన్ని అలవోకగా బయటపెడుతోంది. ఇన్ని అరాచకాల మధ్య... మహిళ అస్తిత్వ పోరాటంలో ఆత్మగౌరవ పోరాటం అనివార్యంగా వచ్చి చేరింది. ఆ పోరాటమే లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలను నిరసిస్తూ భారతీయ మహిళ కదం తొక్కుతున్న ‘డిగ్నిటీ మార్చ్’. ఈ ఏడాది డిసెంబర్ 20న ముంబయిలో మొదలైన ఈ మార్చ్ వచ్చే ఫిబ్రవరి 22న న్యూఢిల్లీకి చేరనుంది. అయినా.. మహిళావాదం, మహిళ అవసరాలు, స్థితిగతులు.. అంటూ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేని రోజు ఎప్పటికి వస్తుంది? ఎప్పుడైనా, ఎక్కడైనా... అది ప్రాచ్యమైనా, పాశ్చాత్యమైనా సరే... పురుషవాదం జడలు విప్పినప్పుడే మహిళావాదం పురుడు పోసుకుంటుంది. అప్పటి వరకు ఉండేది వ్యక్తివాదమే. సమన్యాయం లేని సమాజంలో సమతూకం కోసం, వ్యక్తివాద సమాజం కోసం మహిళలు తరంగంలా కదిలి వస్తున్నారు. ‘మాతోపాటు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాం’ అని నినదిస్తున్నారు. వ్యక్తివాద సమాజం ఎప్పటికి వచ్చినా అది మహిళల పోరాటంతోనే వస్తుంది. ఆ పోరాటం ఎన్నేళ్లనేదే అంతుచిక్కని ప్రశ్న. – వాకా మంజులారెడ్డి -
వీడియో ఆపద్బాంధవి
కెమెరాకు షూట్ చేసే శక్తి మాత్రమే ఉంటుంది.స్పందించే హృదయాలు మనుషులకే ఉంటాయి.ఈ మనుషుల్లో తడి మిగిలే ఉంది.ఆర్ద్రత మిగిలే ఉంది. మానవత్వం మిగిలే ఉంది. కావలసిందల్లా కదిలించే కన్ను.కేరళ అమ్మాయి జిన్షా బషీర్ కెమెరాతో లోకంలో ఉన్న కష్టాన్ని చెబుతుంది.వెంటనే దానికి లభిస్తున్న స్పందన ఆమెను ఆపద్బాంధవిగా మారుస్తోంది. కేరళలోని అలెప్పీకి చాలామంది బ్యాక్‌వాటర్స్‌లో హౌస్‌బోట్ విహారం కోసం వెళతారు.కానీ ఇప్పుడు ‘జిన్షా బషీర్’ను చూడటానికి వెళుతున్నారు.శిరస్సు మీద ఇస్లామీయ వస్త్రాన్ని చుట్టుకొని, జీన్స్ ప్యాంట్ ధరించి, క్లాసిక్ మోడల్ బుల్లెట్‌ను బటన్ స్టార్ట్ చేసి రివ్వున దూసుకుపోతూ కనిపించే జిన్షా బషీర్‌ను చూడటం, ఆమెకు కరచాలనం ఇవ్వడం చాలా తృప్తినిచ్చే పని. ఒక మంచి పనికి మద్దతు ఇచ్చే పని.ఎందుకంటే ఇవాళ కేరళలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వలే జిన్షా కూడా స్టార్.ఆ స్టార్డమ్ ఆమెకు సినిమాల నుంచి రాలేదు.కేవలం ఫేస్బుక్ నుంచి వచ్చింది.అందులో ఆమె పెట్టే వీడియోల ద్వారా వచ్చింది. ఆ వీడియోల నుంచి ఆశించే మంచి ద్వారా వచ్చింది.పెట్రోల్‌బంక్ మోసాన్ని చూసిదాదాపు సంవత్సరం క్రితం. జిన్షా ఆ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఒక సగటు ఉద్యోగిగా పని చేస్తోందిదారిన పోతూ తన టూ వీలర్లో పెట్రోల్ పోయించుకోవడం కోసం ఆగింది. అందరూ పెట్రోలు పోయించుకుని పోతున్నారు. తన వంతు వచ్చింది. అయితే పెట్రోల్ పోసే వ్యక్తి మీటర్‌ను ట్యాంపర్ చేసి పెట్రోల్ పోస్తున్నట్టు జిన్షా గమనించింది.ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అంది.ఇదిక్కడ రోజూ మామూలే. నోరు మూసుకొని పోయించుకుని పో’ అన్నాడా వ్యక్తి. అందరిలా జిన్షా కూడా నోరు మూసుకొని పెట్రోలు పోయించుకుని పోయి ఉంటే ఇవాళ ఆమె గురించి రాయడానికి ఉండేది కాదు. కానీ జిన్షా ఊరుకోలేదు. టూ వీలర్ దిగి తన సెల్‌ఫోన్ ద్వారా అప్పటికప్పుడు జరుగుతున్నది రికార్డ్ చేసింది. అక్కడ పెట్రోల్ పోయించుకుంటున్న వాళ్లతో మాట్లాడి ‘మీరెందుకు ఈ అన్యాయాన్ని నిలదీయరు’ అని ఇంటర్వ్యూ చేసింది. అదంతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. వెంటనే ఐదు వేల లైకులు వచ్చాయి.జిన్షా చాలా ఆశ్చర్యపోయింది. అన్యాయాలు అందరికీ తెలుసు. కానీ వాటిని నలుగురి దృష్టికి తెచ్చి ప్రశ్నించేవారే కావాలి అని అర్థం చేసుకుంది. సోషల్ మీడియాలో బ్లాగర్స్ చాలామందే ఉన్నారు. కానీ వీడియోల ద్వారా సమాజానికి సందేశాలిచ్చే ‘వ్లోగర్స్’ కూడా ఉన్నారని తెలుసుకుని తాను కూడా ‘వ్లోగర్’గా మారాలని నిశ్చయించుకుంది.ఉద్యోగాన్ని వదిలి సమాజ హితం కోరే వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సహాయాల పరంపర జిన్షాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతని పేరు షాన్ షాహుల్. పేదవాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. వెళ్లిన ఇరవై అయిదు రోజులకే దురదృష్టవశాత్తు మరణించాడు. జిన్షా వెంటనే అతడి కుటుంబాన్ని కలిసింది. అది ఎంత పేదరికంలో ఉందో షూట్ చేసి తన వ్యాఖ్యానంతో ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసింది. ‘ఇంటి పెద్ద లేకుండాపోయే దురదృష్టం ఎవరికీ వద్దు. ఈ కుటుంబానికి మనమంతా ఉన్నాం అనే ధైర్యం చెబుదాం’ అని పిలుపు ఇచ్చింది. దీనికి వెంటనే సౌదీలోని ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించింది. షాన్ షాహుల్ కుటుంబానికి 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. ఇది కేవలం జిన్షా వీడియో వల్లే సాధ్యమైంది. జిన్షా ఫేస్బుక్ పేజీకి లైకులు పెరుగుతున్నాయి. ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అటువంటి సమయంలోనే ఆయేషా అనే ఒక సంవత్సరం పాప గురించి జిన్షా ఒక వీడియో పెట్టింది. ‘ఈ పాపను చూశారా? బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఈ పాప బోన్ మేరోతో చావు బతుకుల మధ్య ఉంది. ఈమె పెదాల మీద చిరునవ్వును పూయించే శక్తి మీ సహాయానికి ఉంది. ఈమెను బతికించే శక్తి మీకే ఉంది’ అని అప్పీల్ చేసింది. ఆశ్చర్యం... ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల రూపాయలు ఆ పాప సహాయానికి అందాయి. వ్యతిరేకత మొదలు ఏ పనికైనా వ్యతిరేకత ఉంటుంది. జిన్షాకు కూడా వ్యతిరేకత మొదలైంది. ఆమె ఉద్దేశాలను తప్పు పట్టేవారు మెల్లగా గొంతు విప్పడం మొదలుపెట్టారు. ‘ఇది సంఘసేవ కాదు గాడిద గుడ్డూ కాదు. పేరు కోసమే ఆమె ఇలా చేస్తోంది’ అనే విమర్శలు వచ్చాయి. ‘ఇస్లాంలో పుట్టిన ఆడపిల్ల ఇలా రోడ్డున పడి తిరగడం బుల్లెట్ నడపడం ఏమిటి?’ అని సొంత బంధువులు కూడా నొసలు చిట్లించారు. ఇవన్నీ చీప్‌ట్రిక్స్ అని మరికొందరు కొట్టిపారేశారు. ఫేస్బుక్ పేజీలో బూతులు రాసి ఆమెను హేళన చేసినవారు కూడా ఉన్నారు. ఇదంతా చూసి జిన్షా తల్లి, సోదరి హడలిపోయారు. మనకెందుకు ఈ గోలంతా... ఇదంతా మానేయ్ అని ఆమెకు హితవు చెప్పారు. అయితే ఆమె తండ్రి, భర్త తోడు నిలిచారు. గతంలో మిలట్రీలో పని చేసిన జిన్షా తండ్రి ‘మరేం పర్లేదమ్మా... నీకు ఏది అనిపిస్తే అది చెయ్’ అని ధైర్యం చెప్పాడు. ‘నువ్వు ఏ దారిలో నడిచినా నా మద్దతు నీకే’ అని భర్త హామీ ఇచ్చాడు. ఇక జిన్షాకు లోకానికి వెరవాల్సిన అవసరం లేకపోయింది. తనను తిట్టే వాళ్ల కామెంట్స్‌ను స్క్రీన్ షాట్స్ తీసి తిరిగి ఫేస్బుక్లో పెట్టింది జిన్షా. చాలామంది వాటిని అసహ్యించుకున్నారు. మరోవైపు క్షణక్షణానికి ఆమె ఫేస్బుక్ పేజీ మీద లైక్ బటన్ నొక్కేవాళ్లు పెరిగారు. జిన్షా బుల్లెట్ మరింత స్పీడందుకుంది. పెళ్లి చేసిన పుణ్యం వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ జిన్షా ఒక వీడియో పెట్టి చాలా సులువుగా ఒక పెళ్లి చేయగలిగింది. మునీర్ అనే ఒక నిరుపేద ఆమె దృష్టిలో పడ్డాడు. అతనికి సొంత ఇల్లు లేదు. ఉపాధి లేదు. పెళ్లికెదిగిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లకు అతను జన్మలో పెళ్లి చేయలేడు. జిన్షా అతని పరిస్థితిపై వీడియో చేసి పోస్ట్ చేసింది. స్పందన చెప్పాలా? ఒక అమ్మాయి పెళ్లి క్షణాల్లో జరిగిపోయింది. ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగింది. అంతేకాదు దాతలు స్పందించి ఒక నాలుగు లక్షలు సహాయం చేశారు. మునీర్‌కు ఇప్పుడొక సొంత గూడు ఉంది. వాక్కే ఆకర్షణ జిన్షాకు వాక్కే ఆకర్షణ. అనర్గళంగా మాట్లాడుతుంది. ఎదుటివారిని ఒప్పించే విధంగా విషయాన్ని విశదీకరిస్తుంది. ఆమె చేసిన తెలివైన పని ఏమిటిరా అంటే మతాన్ని, రాజకీయాలను దూరంగా పెట్టడం. ‘వాటి గురించి నా వీడియోలు ఉండవు’ అంటుందామె. జిన్షా చేసే ముఖ్యమైన పని తన పేజీలో ఉపాధి అవకాశాల ప్రకటనలు విరివిగా పోస్ట్ చేయడం. గల్ఫ్ దేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలను ఆమె నలుగురి దృష్టిలోకి తెస్తుంది కనుక ఆ విషయంగా కూడా ఆమె పేజీని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య మూడున్నర లక్షలు. ఈ పాపులారిటీ చూసి సంస్థలే ఆమెకు తమ వద్ద ఉన్న ఉపాధి అవకాశాల ప్రకటనలు పంపిస్తుంటాయి. ఇవే కాదు జిన్షా తన పేజీలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను కూడా ఇస్తుంటుంది. తనలా మంచి పనులు చేసేవారి వివరాలు కూడా. జిన్షాను తమతో కలిసి పని చేయమని చాలా ఎన్జీఓలు కోరాయి. ‘అయితే అవన్నీ ఎంతోకొంత లాభాపేక్షతో పని చేస్తాయి. నేను వ్యక్తిగతంగా చేయగలిగింది చేస్తాను’ అంటుంది జిన్షా.జిన్షాకు ‘బెస్ట్ సోషల్ మీడియా బ్లాగర్ అవార్డ్ 2018’ వచ్చింది. ఆమె చేయాలనుకుంటున్న మంచి పనుల ముందు అదేమి పెద్ద విశేషం కాదు.ఇవాళ సమాజానికి జిన్షాల అవసరం చాలానే ఉంది.ఈ జిన్షా చాలామందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం. సామాన్యురాలిగా ఆగిపోవద్దు స్త్రీలు చాలా శక్తిమంతులు. వారు తమ సంస్కృతిని గౌరవించాల్సిన మాట నిజమే కానీ అన్నిసార్లు పురుషులను వెంబడించాల్సిన పని లేదు. తాము స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. నేను కూడా సామాన్యురాలినే. కానీ ఇవాళ చాలా సంతృప్తికరమైన పని చేస్తున్నాను. ఇలా వీలైన స్త్రీలందరూ చేయవచ్చు. – జిన్షా బషీర్ -
రారండోయ్
కాలువ మల్లయ్య ‘కులరహిత భారతం’, ‘ద జర్నీ టువర్డ్స్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు హిమాయత్ నగర్‌లోని బీసీ భవన్లో జరగనుంది. నిర్వహణ: సమాంతర పబ్లికేషన్స్ ఎన్.గోపి ‘జలగీతం’కు ఎం.నారాయణశర్మ సంస్కృత అనువాదం ‘జలగీతమ్’; ‘జలగీతం– కావ్యసమాలోచనమ్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం ఆరింటికి రవీంద్ర భారతిలో జరగనుంది. ఆవిష్కర్తలు: రమణాచారి, జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి. నిర్వహణ: దక్కన్ సాహిత్య సభ. ‘సినారె సాహితీ వైజయంతి’లో భాగంగా జూన్ 12న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘సినారె యాత్రా సాహిత్య విశిష్టత’పై ఆర్.అనంత పద్మనాభరావు ప్రసంగిస్తారు. నిర్వహణ: ఆచంట కళాంజలితో పాటు భావ సారూప్య సాహిత్య సాంస్కృతిక సంస్థలు. శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్ 14న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ జూన్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో’ ఆవిష్కరణ జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాంలో జరగనుంది. ఆవిష్కర్త: మల్లాడి కృష్ణారావు. నిర్వహణ: కవిసంధ్య, స్ఫూర్తి సాహితి బాలాంత్రపు రజనీకాంతరావు సంస్మరణ సభ జూన్ 17న సాయంత్రం 5:30కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరగనుంది. నిర్వహణ: ఛాయ. మల్లెతీగ పురస్కారాల ప్రదానం జూన్ 17న సాయంత్రం 6 గంటలకు మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరగనుంది. ప్రధాన పురస్కార గ్రహీత: ర్యాలి రైతు కష్టాలు వస్తువుగా వచ్చిన కవిత్వంతో తేనున్న సంకలనానికి తమ కవితలు పంపాల్సిందిగా కవులను కోరుతున్నారు బన్న అయిలయ్య. చిరునామా: 2–7–1261/1, విజయపాల్ కాలనీ, హన్మకొండ–506370. ఫోన్: 9949106968 -
చౌకబారు ప్రచారం, పేటీఎం ఫౌండర్‌పై మండిపాటు
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మపై సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా ఆయన అందించిన సహకారం సోషల్ మీడియా యూజర్లలో మండిపాటుకు గురిచేసింది. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా తన వంతు సహకారంగా రూ.501ను అందిస్తున్నట్టు పేర్కొన్న విజయ్ శేఖర్ శర్మ, దాన్ని తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో షేర్ చేశారు. బిలియన్ డాలర్ కంపెనీకి అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ, కేవలం రూ.501నే సాయుధ దళాలకు అందించడంపై సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం రూ.501ను అందించడమే కాకుండా.. తానేదో పెద్ద మొత్తంలో నగదు అందించిన మాదిరిగా ట్విట్టర్లో షేర్ చేయడాన్ని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా చౌక బారు ప్రచారమని, ఈ రోజుల్లో సాధారణ గ్రామీణ ప్రజానీకమే సరస్వతి పూజకు రూ.500 విరాళంగా ఇస్తున్నారని, అలాంటిది ఒక పెద్ద టైకూన్ అయి ఉండి కేవలం రూ.501 అందించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సహకారం వస్తుందని అంచనా వేయడం లేదని పేర్కొంటున్నారు. కోట్లలో సంపద ఆర్జిస్తూ... కేవలం రూ.500నే విరాళంగా అందించడం చాలా చెత్తగా ఉందన్నారు. ఇది రక్షణ దళాలను కించపరచడమేనని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం భారీ ఎత్తున్న సంపదను ఆర్జించింది. 1.47 బిలియన్ డాలర్లకు అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ సాయుధ దళాలకు కేవలం రూ.501నే అందించడంపై సోషల్ మీడియా ప్రశ్నలు కురిపించడం తప్పేమీ కాదంటున్నారు కొందరు. ఈ వారమంతా సాయుధ దళాల వారోత్సవంగా ఆర్మీ సెలబ్రేట్ చేస్తోంది. సాయుధ దళాల విలువను విశ్వవ్యాప్తం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్‌ను లాంచ్చేసింది. Just sent ₹501 to Armed Forces Flag Day Fund. #🇮🇳 @DefenceMinIndia pic.twitter.com/B5KD7wcdb9 — Vijay Shekhar (@vijayshekhar) December 1, 2017 What a cheap publicity stunt. These days common rural citizens give this much money for Saraswati Pooja. Our tycoons are so miser. CSR must have a burden for you. Didn't expect this from you! https://t.co/FEEXnJRYIl — Mayank Shandilya (@ShandiMayank) December 2, 2017 This is somewhere an insult to the defence forces sir. You are owner of PayTM and 501 amount is just an Insult. Please put this tweet down. This will backfire sir. — Gaurav Pandey (@PandeyTweets) December 2, 2017 -
సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా
ఇప్పటికే హీరోగా, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన యువనటుడు రానా, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెట్టాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియా కారణంగా ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో థ్రిల్లింగ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో రానా ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న 'సోషల్ ' కంపెనీ సీఈఓ విక్రమ్ సంపత్ గా కనిపిస్తున్నాడు. ఏ క్లిక్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. -
రానా మరో ప్రయోగం..!
కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యంగ్ హీరో రానా ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించిన భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఈ ప్రయోగం చేస్తున్నాడు. నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. -
ఆద్యంతం.. నవరసభరితం
- అలరిస్తున్న నంది నాటకోత్సవాలు – సామాజిక, కుటుంబ అంశాలే ఇతివృత్తాలు – ఆకట్టుకున్న క్రైమ్‌స్టోరీ - సైకతశిల్పం రేపటికి వాయిదా కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికలు కుటుంబసమస్యలు, సామాజిక అంశాల ఇతివృత్తాలతో సాగాయి. రాత్రి ఉద్యోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పే ‘కొత్తబానిసలు’, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ప్రాప్తమా లేక మాయా మంత్రాలా అనే ఇతివృత్తంతో సాగే ‘నియతి’, గెస్ట్‌హౌస్‌లో జరిగే హత్య నేపథ్యంలో సాగే ‘మిస్టరీ’, కుమారుడిపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపే ‘రుణాబంధ రూపేణా’, ఆస్తి కంటే అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ హృదయాన్ని హత్తుకుంటాయి. మంగళవారం మొత్తం ఏడు నాటికలు జరగాల్సి ఉండగా కళాకారులు, టెక్నీషియన్లు రాకపోవడంతో నాయకురాలు నాగమ్మ రద్దు కాగా, సైకతశిల్పం 26వ తేదీకి వాయిదా పడింది. రాత్రి ఉద్యోగానికి భాష్యం చెప్పే ‘కొత్త బానిసలు’ భార్యాభర్తలిద్దరూ రాత్రి ఉద్యోగాలు చేస్తే వారి మనసులు ఎలా స్పందిస్తాయో...చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవలు పెరిగిపోతాయో ‘కొత్త బానిసలు’ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో సంబంధం లేని గృహహింస చట్టాన్ని ఆశ్రయించి బతుకుని రోడ్డు మీదకు తెచ్చేలా భార్య ప్రవర్తించి విడాకుల వరకు వెళ్తుంది. వీరి సమస్యకు రాత్రి ఉద్యోగమేనని తెలుసుకున్న మానసిక వైద్యుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ‘నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న ఓ రాత్రి ఉద్యోగులురా..!! ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పం ఉంటేనే రాత్రి ఉద్యోగాలు చేయండి, లేదంటే ప్రతి చిన్నదానికీ అతిగా స్పందించి జీవితాన్ని బలిచేయాల్సి ఉంటుంది జాగ్రత్త’ అని వైద్యుడు బదులిస్తాడు. అటు హాస్యం, ఇటు సందేశాత్మకంగా ఉన్న ఈ నాటికను హుజూరాబాద్‌లోని ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య ప్రదర్శించింది. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం కొలుగూరి దేవయ్య. పాత్రదారులు కొలుగూరి దేవయ్య, ఎం. ప్రకాశ్, కుడికాల ప్రభాకర్, ముదం కుమారస్వామి, దేవసేన నటించారు. ఆకట్టుకున్న ‘నియతి’ మంత్రాలు, మహత్తులు ఉన్నాయా..? ఉంటే వాటి సాయంతో మనం జీవితంలో కావాలనుకున్నవి సాధించగలమా..?, అది సాధ్యపడేటట్లయితే జీవితంలో మనకు ఎదురయ్యే ఆటు–పోట్ల సంగతేమిటి.?, మనం కోరుకోకపోయినా అవి జరుగుతున్నాయే...!, అందుకు కారణం నియతి అంటే ప్రాప్తం అంటారే..!, అది ఎంత వరకు నిజం..?. ఆనందంగా తృప్తిగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదురుచూడని సంఘటనలు ఈ సమస్యను, సందేహాన్ని ఎంత వరకు తీరుస్తాయంటూ ఆలోచింపజేసే నాటిక ఈ ‘నియతి’. హైదరాబాద్‌లోని శ్రీ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన చిట్టాశంకర్, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ. పాత్రదారులు చిట్టాశంకర్, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, విజయలక్ష్మి నటించారు. ఉత్కంఠ భరిత మలుపులతో ‘మిస్టరి’ హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహతి క్రియేషన్స్ వారు ‘మిస్టరి’ అనే నాటికను ప్రదర్శించారు. ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన హత్యకు సంబంధించిన ఇతి వృత్తమే మిస్టరీ. సూర్యం, సునీత దంపతులు భీమిలిలో గెస్ట్‌హౌస్ ప్రారంభిస్తారు. అందులో సైకాలజీ లెక్చరర్ సుకుమార్, రిటైర్డ్ జడ్జి జగన్నాథం, రిటైర్డ్ ఆర్మీ మేజర్ మిత్రకాంత్, బిజినెస్‌మ్యాన్ చక్రధర్ రూములు అద్దెకు తీసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి విశాఖపట్టణంలో దుర్గమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు టీవీ న్యూస్‌లో వారు తెలుసుకుంటారు. ఆ హత్యకు, గెస్ట్‌హౌస్‌కు సంబంధం ఉందంటూ స్థానిక సీఐ గిరిధర్ విచారణ చేసేందుకు వస్తారు. దర్యాప్తు జరుగుతుండగానే జగన్నాథం హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటి..?, హంతకులు ఒకరా..ఇద్దరా..? హంతకుడు పట్టబడతాడా లేదా ..? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ నాటిక సాగుతుంది. ఈ నాటికకు రచన డీఏ సుబ్రహ్మణ్యశర్మ, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ వహించారు. పాత్రదారులు ఏకే శ్రీదేవి, నిట్టల శ్రీరామ్మూర్తి, ఆర్. ప్రేమ్‌సాగర్, సతీష్‌కుమార్, చిట్టా శంకర్, పి. సుబ్బారావు, పుండరీక శర్మ, జానకీనాథ్, మల్లికార్జున నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధమే ‘రుణానుబంధ రూపేణా’ అనంతపురం లలిత కళాపరిషత్ వారి ‘రుణానుబంధరూపేణా’ నాటిక కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కడుతుంది. కథలోకి వెళ్తే మధ్యతరగతికి చెందిన రంగనాథం కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాడు. ఆయన భార్య తులసి అర్దంతరంగా మరణిస్తుంది. ఇదే సమయంలో కోడలు భేషజాలకు పోయి రంగనాథాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కోడలు పట్ల కొడుకు నిర్లక్ష్యంతో చివరకు ఆయన వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓసారి రంగనాథం కుమారుని కిడ్నీలు పాడై అసహాయస్థితిలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి తెలియకుండానే తండ్రి వైద్యుని సహాయంతో కిడ్నీలు దానం చేసి ప్రాణం నిలబెడతాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కోడలు కూడా తన తప్పును తెలుసుకుని రంగనాథాన్ని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ తనకు ఇంటికన్నా వృద్ధాశ్రమంలోనే చాలా అవసరం ఉందని తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ నాటికకు రచన సి. రాము, దర్శకత్వం డి. మస్తాన్‌సాహెబ్. అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ మీకోసమే వారి ‘పంపకాలు’ అనే సాంఘిక నాటిక అన్నదమ్ములు ఆస్తి పంపకాల ఇతివృత్తం గురించి ప్రదర్శించారు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్ తన పొలాన్ని భాగం వేయించుకుని, దాన్ని అమ్మి పట్నంలో ఇళ్లు కొందామని సొంతూరు బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి, అన్నయ్య ఇంట్లో ఉండరు. విషయాన్ని ప్రభాకర్ తన వదినతో ప్రస్తావిస్తాడు. వారి మధ్య పిల్లల చదువులు, పెంపకం ప్రస్తావనకు వస్తాయి. ‘పొలాన్ని పంచడమంటే శరీర భాగాలను పంచినట్లే’ అని వదిన చెబుతుంది. తర్వాత అన్న రాఘవ తమ్మునిపై ప్రేమతో పంపకాలు ఏమీ ఉండవు ఆస్తి అంతా నువ్వే అనుభవించు అని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. పెద్దకుమారుని వెంటే తండ్రి కూడా వెళ్లిపోతుండటంతో ప్రభాకర్‌కు జ్ఞానోదయం అవుతుంది. ఆస్తి పంపకాల కంటే అనుబంధాలే ముఖ్యమని గ్రహించడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబంలో జరిగే ఇలాంటి సంఘటనలను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం ఎంఎస్కె ప్రభు. పాత్రదారులు ఎంఎస్కె ప్రభు, డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, రవికుమార్, హసీనాజాన్ నటించారు. నేటి నాటికలు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి డ్రమెటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ‘విముక్త’, ఉదయం 10.30 గంటలకు శ్రీ కృష్ణతెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా’, సాయంత్రం 4.30 గంటలకు లలిత కళా సమితి వారి ‘నిష్క్రమణ’, రాత్రి 7 గంటలకు కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’, రాత్రి 8.30 గంటలకు గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటికలు ప్రదర్శితమవుతాయి. -
ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు
కోటగుమ్మం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని సామాజిక హక్కుల వేదిక చైర్మన్ వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ తాటిపాక మధు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా¯న్ నిధులు దుర్వినియోగం చేయవద్దని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కు వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ నుంచి జీపు జాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ జెండాలు పక్కనపెట్టి దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ సమస్యలపై పోరుబాట పట్టామన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కృష్ణా ప్రాజెక్టు, ఆర్ అండ్ బీ రహదారులకు, పార్కులకు ఖర్చు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. రంపచోడవరం గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ప్రకటించాలని కోరారు. జీపుజాతా ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఇతర వర్గాల ప్రముఖులు హాజరవుతారని వివరించారు. నవంబర్ 9న కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
తెలంగాణ జాగృతి జిల్లా శాఖకు అవార్డు
హన్మకొండ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గోదావరి పుష్కరాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలోను వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లుగా సేవలు అందించారు. సేవలను గుర్తించిన తెలంగాణ జాగృతి ఆధినాయకత్వం వరంగల్ జిల్లా శాఖకు బెస్ట్ జిల్లా శాఖగా ఎంపిక చేసి ఆవార్డు అందించింది. వరంగల్ జిల్లా శాఖ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉంది. నల్లగొండలో జరిగిన 10 వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు సలాం పోలీసు లఘుచిత్రా దర్శకుడు వంశీకి ప్రోత్సాహక అవార్డుకు వచ్చింది. జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న రాణి,లతకు ప్రోత్సాహక అవార్డు లభించింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాకు ఉత్తమ అవార్డు రావడానికి కృషి చేసిన జాగృతి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.