సోషల్
ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లిష్‌లో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదానికి మూలం గ్రీకుభాషలోని ‘డెమోస్’, ‘క్రేషియా’ అనే పదాలు.
డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పరిపాలన, డెమోక్రసీ అంటే ప్రజాపాలన.
{పజలందరి చేతిలో సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వమే అత్యుత్తమ ప్రభుత్వం అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.
ప్రజలు తమకోసం తాము ఏర్పాటు చేసుకుని తామే నడుపుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా (గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్) అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ నిర్వచించాడు.
{పజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవి స్వేచ్ఛాపూరిత ఎన్నికలు, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు, పాలనా యంత్రాంగం, చైతన్యవంతులైన ప్రజలు
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ అధికారం.
ప్రజాస్వామ్యం రెండు రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో స్పార్టా, ఏథెన్‌స (గ్రీక్‌రాజ్యాలు)ల్లో ఉండేది.
భారతదేశం, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలు.
పౌర హక్కులు
నైతిక హక్కు: వృద్ధులు తమ పిల్లల సేవలను పొందే హక్కు.
చట్టపరమైన హక్కు: చట్టం రక్షణ కలిగిన హక్కులు, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులు.
రాజకీయ హక్కులు: ఓటుహక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కు, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు.
సామాజిక హక్కులు: జీవించేహక్కు, మాట్లాడేహక్కు, కుటుంబహక్కు, మతస్వేచ్ఛ హక్కు, ఆరోగ్య రక్షణ హక్కు, సంఘాలను ఏర్పర్చుకునే హక్కు.
ఆర్థికహక్కులు: పనిహక్కు, వేతనం కోరే హక్కు, పింఛన్ పొందే హక్కు.
భారత రాజ్యాంగం 6 ప్రాథమిక హక్కులను నిర్దేశించింది. అవి. 1. సమానత్వపు హక్కు, 2. స్వాతంత్య్రపు హక్కు, 3. పీడనాన్ని నిరోధించే హక్కు, 4. మత స్వాతంత్య్రపు హక్కు, 5. సాంస్కృతిక విద్యా విషయక హక్కులు, 6. రాజ్యాంగ పరిహారాల హక్కు.
నైతిక విధులు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలపట్ల విధేయత, సోదరుల పట్ల ప్రేమాభిమానాలు, మహిళలపట్ల గౌరవం, వికలాంగుల పట్ల ఆదరణ
చట్టపరమైన విధులు: రాజ్యాంగాన్ని గౌరవించడం, పన్నులు చెల్లించడం, రాజ్యంపట్ల విధేయత, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం (ఈ విధులు పాటించని వారు శిక్షార్హులు)
భారత రాజ్యాంగం పౌరులకు 11 రకాల ప్రాథమిక విధులను నిర్ణయించింది. ఐతే వీటికి న్యాయ సంరక్షణ లేదు.
చైనా, తైవాన్ దేశాల్లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉంది.
ఉత్తమ జీవనాన్ని సమకూర్చడానికి రాజ్యం కొనసాగుతుంది అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.
ఎన్నికల నిర్వహణ బాధ్యతను స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.
రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ఇది రద్దు కాదు. అందువల్ల దీన్ని శాశ్వత సభ అంటారు. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. లోక్‌సభ శాశ్వత సభ కాదు.
ఎలక్టోరేట్ అంటే ఓటర్ల సముదాయం (అర్హతగల 18 ఏళ్లు నిండిన వయోజనులు)
దేశంలో మొదటిసారి క్రీ.శ.1884లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు.
మొదటి సాధారణ ఎన్నికలు 1952లో నిర్వహించారు.
వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని మన రాజ్యాంగంలోని 326వ అధికరణ పేర్కొంటోంది.
నియోజకవర్గ ఎన్నికల అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు.
పోలింగ్ కేంద్రం అధికారిని ‘ప్రిసైడింగ్ అధికారి’ అని పిలుస్తారు.
రెఫరెండమ్ అంటే ప్రజాభిప్రాయసేకరణ
పునరాయనం (రీకాల్) అంటే వెనుకకు పిలవడం.
భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్.
మనదేశంలో మొదటిసారిగా 1892లో ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు నిర్వహించారు.
ఎగువ సభను రాజ్యసభ, పెద్దల సభ , రాష్ట్రాల పరిషత్తు , శాశ్వత సభ అని పిలుస్తారు.
దిగువ సభను లోక్‌సభ , ప్రతినిధుల సభ, శాసనసభ అని పిలుస్తారు.
రాజకీయ పార్టీ అంటే ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజ్యాధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సమూహం.
ప్రతిపక్షపార్టీ అంటే ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి రావడానికి ప్రయత్నించే రాజకీయ పార్టీ. ఐతే సంబంధిత సభలో ఆ పార్టీ కనీసం ఒక సీటైనా గెలవాలి.
{పస్తుతం మనదేశంలో ఆరు పార్టీలు జాతీయపార్టీలుగా గుర్తింపులో ఉన్నాయి. అవి... కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలు.
మనదేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు.
15వ లోక్‌సభ సాధారణ ఎన్నికలను 2009లో నిర్వహించారు.
సామ్యవాదం
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం బలంగా ఉండాలంటే వాటికి సామ్యవాద పునాదులు అవసరం. ఈ సామ్యవాదం దోపిడీ, అణచివేత, అసమానత, అన్యాయానికి వ్యతిరేకం. పెట్టుబడిదారీ విధానానికి కూడా వ్యతిరేకం. ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వాధీనంలో ఉంచి సమాజశ్రేయస్సుకు వినియోగించడమే సామ్యవాదం (సోషలిజం). ప్రజాస్వా మ్యం పౌరుల సమానత్వంపై ఆధారపడితే, సామ్యవాదం వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య సమానత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తోంది.
మన రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చారు.
మన రాజ్యాంగ పీఠిక (ప్రవేశిక) ‘భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’ అని తెల్పుతోంది.
మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడుతున్నాయి.
ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు సంఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశిక సూత్రాలే అధిక్యత పొందుతాయి.
కాంగ్రెస్ పార్టీ ఆవడి (మద్రాస్-1955)లో నిర్వహించిన మహాసభలో సామ్యవాద తరహా సమాజ నిర్మాణమే తన గమ్యంగా నిర్ణయించింది.
జాతీయీకరణ అంటే దేశంలోని ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ యాజమాన్య పరిధిలోకి తెచ్చి, నిర్వహించే విధానం.