సాంఘిక శాస్త్రం
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక
‘‘భౌగోళిక పరిస్థితుల కారణంగా భవిష్యత్‌లో అంతర్జాతీయ వేదికపై భారతదేశం విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంటుంది’’. - లార్‌డ కర్జన్ (బ్రిటిష్ గవర్నర్ జనరల్)
ఎన్నో ప్రత్యేకతలతో, మరెన్నో విభిన్నతలతో విశాల భారత భౌగోళిక క్షేత్రం ప్రపంచంలోనే విశిష్ట లక్షణాలను కలిగి తన ఉనికిని చాటుకుంటోంది. సారవంతమైన మృత్తికలు, సమృద్ధికరమైన పంటలు, అనేక ఖనిజ నిక్షేపాలను భారత భూమి కలిగి ఉంది. పురాతన కాలం నుంచే వివిధ మతాలు, భాషలు, కులాలు, తెగలు, ఆచారాలు, అలవాట్లు, సంస్కృతులతో విలసిల్లుతోంది. ఏకత్వంలో భిన్నత్వం-భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రధాన బలంగా మారింది.
ఉనికి : 32,87,263 చ.కి.మీ. వైశాల్యం ఉన్న భారతదేశం ప్రపంచంలో 7వ స్థానం కలిగిఉంది. భౌగోళికంగా 8ని4’ నుంచి 37ని6’ వరకు ఉన్న ఉత్తర అక్షాంశాలు, 68ని7’ నుంచి 97ని25’ వరకు ఉన్న తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
ఉత్తరం నుంచి దక్షిణం వరకు 3214 కి.మీ. పొడవు, తూర్పు నుంచి పడమర వరకు 3000 కి.మీ. వెడల్పుతో వ్యాపించి ఉంది.
దేశ ఉత్తర భాగం చివరన మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలు, దక్షిణ భాగం చివరన కన్యాకుమారి (తమిళనాడు), పశ్చిమ చివరన ఉప్పునీటి చిత్తడి నేలలున్న రాణా ఆఫ్ కచ్ (గుజరాత్), తూర్పు చివరన దట్టమైన అడవులు, కొండలున్న మయన్మార్ (బర్మా), చైనాలు మన దేశ సరిహద్దు భాగాలు.
సరిహద్దు రేఖలు:
1. మెక్‌మోహన్ రేఖ: భారత్, చైనా మధ్య ఉన్న విభజన రేఖ.
2. రాడ్‌క్లిఫ్ రేఖ: వాయవ్య సరిహద్దు రేఖ భారత్, పాకిస్థాన్‌లను వేరు చేస్తోంది.
3. డ్యూరాండ్ రేఖ: భారత్, అఫ్ఘానిస్తాన్‌లను విభజిస్తోంది.
తీర రాష్ట్రాలు (9):1. కేరళ, 2. కర్ణాటక, 3. గోవా, 4. మహారాష్ర్ట, 5. గుజరాత్, 6. పశ్చిమబెంగాల్, 7. ఒడిశా, 8. ఆంధ్రప్రదేశ్, 9. తమిళనాడు.
గుజరాత్ అతి పొడవైన (1058 కి.మీ.) తీరరేఖ ఉన్న రాష్ర్టం. గోవా అతిచిన్న తీరరేఖ ఉన్న రాష్ర్టం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ.
తమిళనాడుకు మూడు సముద్రాలతో (హిందూమహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం) తీరరేఖ ఉంది.
దీవులు: భారతదేశంలో మొత్తం 247 దీవులున్నాయి. టెర్షియరీ యుగానికి చెందిన శిలలతో ఏర్పడ్డ అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. వీటి విస్తీర్ణం 8248 చ.కి.మీ.
పగడపు దీవులైన లక్షదీవులు 32 చ.కి.మీ.ల విస్తీర్ణంతో అరేబియా సముద్రంలో ఉన్నాయి.
శిలా ఉపరితలం కలిగిన ‘పంబన్ దీవి’ భారత్, శ్రీలంకల మధ్య ఉంది.
భారతదేశం - ఇండియా: పూర్వం మన దేశాన్ని భరతుడనే రాజు పాలించడంతో ‘భారతదేశం’ అనే పేరు వచ్చింది.
గ్రీకులు సింధు నదిని ‘ఇండస్’గా, దాని వెంట నివసించే ప్రజలను ‘ఇండోయి’లుగా పిలిచేవారు. తర్వాత కాలంలో బ్రిటిషర్లు ‘ఇండస్’ను ‘ఇండియా’గా పిలవడం ప్రారంభించారు.
భారతదేశం - ఉపఖండం: సాధారణంగా ఖండానికి ఉండే లక్షణాలున్న ప్రాంతాన్ని ‘ఉపఖండం’గా పిలుస్తారు. అలాంటి విశిష్ట లక్షణాలు, భౌగోళిక విస్తీర్ణం ఉన్న భారతదేశం కూడా ‘ఉపఖండం’గా పేరుగాంచింది.
భారతదేశ ఉపఖండ లక్షణాలు : విస్తీర్ణపరంగా 7వ స్థానం, జనాభా పరంగా 2వ స్థానంతో భారతదేశం ప్రపంచంలోనే విభిన్న భౌతిక పరిస్థితులను కలిగి ఉంది.
అనేక పెద్ద నదులు దేశాన్ని భౌతికంగా విభజిస్తున్నాయి.
రకరకాల శీతోష్ణస్థితులు, మృత్తికలు దేశంలో విస్తరించి ఉన్నాయి.
పంటలు, అటవీ, జంతు, ఖనిజ సంపదలు అపారంగా ఉన్నాయి.
భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.
ముఖ్యాంశాలు: భారతదేశానికి 15200 కి.మీ. పొడవైన భూభాగ సరిహద్దు, 6100 కి.మీ. పొడవైన తీరరేఖ ఉన్నాయి.
{పస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. విస్తీర్ణపరంగా రాజస్థాన్ పెద్ద రాష్ర్టం. గోవా చిన్న రాష్ర్టం. కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది అండమాన్ - నికోబార్ దీవులు, చిన్నది లక్షదీవులు.
దేశంలో మొదట సూర్యోదయమయ్యే రాష్ర్టం : అరుణాచల్‌ప్రదేశ్
గుజరాత్‌లోని ద్వారకా నగరం కంటే అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు అంచున సుమారు రెండు గంటల ముందు సూర్యోదయమవుతుంది.