సోషల్
1. రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి కారణం?
భూభ్రమణం
2. గ్రామీణ రహదారులు అధికంగా విస్తరించిన జిల్లా?
కడప
3. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
సూర్యుడు కన్పించకుండా భూమికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు
4. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన పథకం?
TRYSEM
5. మన రాష్ర్టంలో అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం?
ఉత్తర తెలంగాణ
6. అసైన్‌డ భూమి అంటే?
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన భూమి
7. రైతుమిత్ర గ్రూపులో గరిష్ఠంగా ఎంతమంది రైతులు సభ్యులుగా ఉండాలి?
15
8. NABARDను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1982
9. కిసాన్ క్రెడిట్ కార్డులను అతి ఎక్కువగా తీసుకున్నవారు ఏ రాష్ర్టంలో ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్
10. మన రాష్ర్టంలో ఈశాన్య రుతుపవన కాలం?
అక్టోబరు నుంచి డిసెంబరు వరకు
11. బంగాళాఖాతంలో ఎక్కువగా ఏ కాలంలో వాయుగుండాలు ఏర్పడతాయి?
ఈశాన్య రుతుపవన కాలం
12. కరువు రావడానికి కారణం?
అనావృష్టి
13. ‘బూడిద విప్లవం’ వేటి ఉత్పత్తికి సంబంధించింది?
ఎరువులు
14. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పథకాలకు అయ్యే వ్యయంలో ప్రభుత్వం ఎంత శాతం సబ్సిడీగా ఇస్తుంది?
80
15. రోజూ ‘తినడానికి తిండి’ పొందే హక్కు మొదటిసారిగా ఏ రాష్ర్టంలో అమల్లోకి వచ్చింది?
కర్ణాటక
16. చౌకధరల దుకాణాలకు బియ్యాన్ని ఎవరు సరఫరా చేస్తారు?
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
17. భూ సంస్కరణల ప్రధాన లక్ష్యం?
వ్యవసాయాభివృద్ధి
18. గ్రామీణ బ్యాంకులు రైతులకిచ్చే స్వల్పకాలిక రుణాల చెల్లింపునకు గరిష్ఠ కాల పరిమితి?
15 నెలలు
19. భూగర్భ జలశాఖ కరువు ప్రాంతాల అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది?
గొట్టపు బావులు నిర్మించడం ద్వారా
20. బీడీ ఆకులు లభించే అడవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి?
తెలంగాణ
21. కోడిమాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం?
ఆంధ్రప్రదేశ్
22. చాలాకాలం వరకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఉన్న మృత్తికలు?
నల్లరేగడి
23. ‘/\‘ - ఈ వాతావరణ స్థితి సంకేతం దేన్ని సూచిస్తుంది?
వడగండ్లు
24. మూఢాచారాలు, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఉపయోగపడేది?
అక్షరాస్యత
25. ఆదర్శప్రాయమైన స్థానిక సంస్థలను నిర్వహించిన రాజులు?
చోళులు
26. ‘దీపం పథకం’ లబ్దిదారులు?
మహిళలు
27. పంట దిగుబడిని ఆధారంగా చేసుకొని శిస్తు వసూలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్?
విలియంబెంటింక్
28. {బిటిష్ పాలనా కాలంలో మద్రాస్ రాష్ర్టం లో అమలు చేసిన భూమి శిస్తు పద్ధతి?
రైత్వారీ పద్ధతి
29. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్య తిరేకంగా తూర్పు భారతదేశంలో జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారు?
రైతులు
30. మన దేశ వ్యవసాయ రంగం వెనుకబడటానికి ప్రధాన కారణం?
చిన్న భూకమతాలు
31. {బిటిషర్లు కల్పించిన నీటిపారుదల సౌకర్యాల వల్ల ఆహార పదార్థాల దిగుబడి పెరిగింది. అయినప్పటికీ వాటి ధరలు పెరగడానికి కారణం?
నీటిపై విధించిన అధిక శిస్తు
32. పోస్టు ద్వారా ఉత్తరాలు పంపే సౌకర్యాన్ని కల్పించిన బ్రిటిష్ అధికారి?
డల్హౌసీ
33. గ్రామీణ నాగరికత కలిగినవారు?
ఆర్యులు
34. కాలువలను తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచిన ఢిల్లీ సుల్తాన్?
ఫిరోజ్ షా తుగ్లక్