bommanaboina srinivas
-
ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు?
రాజపుత్రులు యుద్ధ ప్రియులు. వీరు ధైర్య, సాహసాలకు పేరు పొందారు. శత్రువులకు వెన్ను చూపడం, ఆశ్రయం కోరి వచ్చిన శత్రువులను హింసించడం లాంటివి యుద్ధ ధర్మానికి విరుద్ధంగా భావించేవారు. హిందూ సాంస్కృతిక వికాసానికి, పటిష్టతకు ఎక్కువగా కృషి చేశారు. ఆత్మాభిమానం, దేశభక్తి, నిరాడంబరత ఎక్కువగా ఉన్న రాజపుత్రులు చాలా పురాణ గాథల్లో కథానాయకులుగా ఉన్నారు. రాజపుత్ర యుగం హర్షవర్ధనుడి మరణానంతరం క్రీ.శ. 647 నుంచి ఢిల్లీలో మహ్మదీయ సుల్తానులు అధికారంలోకి వచ్చే వరకు (క్రీ.శ. 1206) ఉన్న కాలాన్ని భారతదేశ చరిత్రలో రసపుత్ర (రాజపుత్ర) యుగంగా వ్యవహరిస్తారు. రాజపుత్రులు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను నెలకొల్పారు. వీరిలో కొందరు విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఉన్నారు. స్వజాతి పట్ల తమ సంకుచిత దురభిమానం వల్ల ఇతర రాజపుత్ర వంశ రాజులతో శత్రుత్వం పెరిగి వీరిలో ఐకమత్యం లోపించింది. ఇదే వారి బలహీనతకు కారణమై భారతదేశంలో తురుష్కుల పాలనకు ద్వారాలు తెరిచింది. ముఖ్యమైన రాజపుత్ర వంశాలు ప్రతీహారులు: వీరు ‘ఘార్జర’ జాతికి చెందినవారు. రాజపుత్రుల్లో మొదటగా రాజకీయాధికారాన్ని పొందింది వీరే. వీరు జోధ్‌పూర్ (రాజస్థాన్)లో స్థిరపడ్డారు. వీరి రాజధాని ‘కనోజ్’. రాజ్యస్థాపకుడు నాగబట్టుడు. మిహీర భోజుడు ప్రతీహారుల్లో ముఖ్యమైన రాజు. గహద్వాలులు: వీరినే ‘రాథోడ్’ (రాఠోర్)లని కూడా పిలుస్తారు. ప్రతీహార రాజ్య పతనం తర్వాత క్రీ.శ. 1085లో కనోజ్ కేంద్రంగా పాలించారు. ఈ వంశ మూల స్థాపకుడు చంద్రదేవుడు. తురుష్కుల దాడులను తిప్పికొట్టడానికి కావాల్సిన సైన్య పోషణకు అయ్యే ఖర్చు కోసం ప్రజల నుంచి ‘తురకదండు’ అనే పన్నును వసూలు చేసేవారు. రాఠోరుల్లో సుప్రసిద్ధుడు జయచంద్రుడు. చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్‌తో ఈయనకు బద్ధ శత్రు త్వం ఉండేది. చందవార్ యుద్ధం (క్రీ.శ.1193) లో ఘోరీ మహ్మద్ చేతిలో జయచంద్రుడు ఓడిపోవడంతో వీరి పాలన అంతమైంది. చౌహాన్లు: క్రీ.శ. 956లో సింహారాజ చౌహాన్ స్థాపించిన చౌహాన్ రాజ్యం రాజస్థాన్‌లోని సాంబారు ప్రాంతాల్లో విస్తరించింది. ‘అజ్మీర్’ నగరాన్ని నిర్మించిన అజయ్ చౌహాన్ ఈ వంశానికి చెందినవాడే. పృథ్వీరాజ్ చౌహాన్ మొత్తం రాజపుత్ర రాజుల్లోనే అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు. ఇతడు హిందూ జాతీయ వీరుడిగా గౌరవం పొందాడు. చాంద్ బర్దాయ్ రాసిన ‘పృథ్వీరాజ్ రాసో’ అనే గ్రంథం పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇతడు మొదటి తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1191) మహ్మద్ ఘోరీపై గెలిచాడు. రెండో తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1192) ఘోరీ చేతిలో ఓడిపోవడం వల్ల చౌహాన్ వంశం అంతరించింది. పారమారులు: ఉపేంద్రుడు క్రీ.శ. 950లో ‘ధారా’ నగరాన్ని రాజధానిగా చేసుకొని పారమార రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరిలో సుప్రసిద్ధుడు ముంజరాజు. ఇతడి ఆస్థానంలో ‘పద్మగుప్తుడు’ అనే కవి ఉండేవాడు. ఈ కవి ‘నవసాహసాంక చరిత్ర’ను రాశాడు. సాంస్కృతిక సాహిత్య చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘భోజరాజు’ ఈ వంశానికి చెందినవాడే. ఇతడు భోజ్‌పూర్ సరస్సును, ‘భోజ్‌పురి’ నగరాన్ని నిర్మించాడు. చందేలులు: బుందేల్‌ఖండ్ ప్రాంతంలో విలసిల్లిన చందేల రాజ్య స్థాపకుడు మనోవర్మ. వీరి రాజధాని ‘ఖజురహో’. చందేలరాజుల్లో ప్రధానమైనవాడు విద్యాధరుడు. ఇతడు గజనీ మహ్మద్‌ను రెండుసార్లు ప్రతిఘటించాడు. చివరికి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి వల్ల వీరి పాలన అంతమైంది. కాలచూరులు: నర్మదా, గోదావరి నదుల మధ్య భాగంలోని కొంత ప్రాంతాన్ని వీరు పాలించారు. వీరి రాజ్యాన్ని ‘చేది’ రాజ్యమని పిలిచేవారు. వీరి రాజధాని ‘త్రిపుర నగరం’. సోలంకీలు: అన్హిల్వాడ్ (గుజరాత్) రాజధానిగా క్రీ.శ. 945లో మూలరాజు సోలంకి రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరి కాలంలోనే గజనీ మహ్మద్ సోమనాథ దేవాలయాన్ని (గుజరాత్) ధ్వంసం చేశాడు. సోలంకీ వంశానికి చెందిన జయసింహుడు ‘సింహశకాన్ని’ ప్రారంభించాడు. పాలరాజులు: బెంగాల్లో స్థానిక ప్రభువులైన పాలవంశీయులు ‘ఉద్ధంతపురి’ రాజధానిగా పరిపాలించారు. మూలపురుషుడు గోపాలుడు. వీరు ఎక్కువగా బౌద్ధమతాన్ని అవలంభించారు. ధర్మ పాలుడు అనే రాజు ‘విక్రమశిల విశ్వ విద్యాలయాన్ని’ స్థాపించాడు. టిబెట్‌లో బౌద్ధమత ప్రచారానికి ఆద్యుడైన ‘అతిదీ పంకరుడు’ ఈ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పని చేశాడు. పాలరాజులు వేయించిన శిల్పాలు భారతీయ శిల్పకళా సౌందర్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. సేన వంశస్థుల వల్ల వీరి పాలన కనుగమరుగైంది. సేన వంశరాజులు: ఈ రాజ్యస్థాపకుడు విజయసేనుడు. సేనులు కర్ణాటక ప్రాంతం నుంచి వెళ్లి బెంగాల్లో స్థిరపడ్డారు. సేన వంశస్థుల్లో సుప్రసిద్ధుడు లక్ష్మణసేనుడు. ఇతడు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో ‘పంచరత్నాల’నే కవులుండేవారు. ‘గీతా గోవిందం’ రాసిన జయదేవుడు వీరిలో ఒకరు. రసపుత్ర యుగ సామాజిక పరిస్థితులు క్షేమేంద్రుడు రాసిన ‘బృహత్కథామంజరి’, కల్హణుడి ‘రాజతరంగిణి’ రాజపుత్రుల రాజకీయ, సాంఘిక పరిస్థితుల గురించి తెలియజే స్తున్నాయి. ‘కాయస్థ’ అనే ప్రభుత్వ అధికారులు ఉండేవారు. కాలక్రమంలో వీరు ప్రత్యేక సామాజికవర్గంగా మారారు. రాజపుత్రుల పాలనా కాలంలో ఆడశిశువుల పుట్టుకను తల్లిదండ్రులు భారంగా భావించేవారు. స్త్రీల విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అంతఃపుర స్త్రీలు కనీసం సూర్యున్ని కూడా చూడకూడదనే నిబంధన ఉండేది. ‘పరదా పద్ధతి’ వాడుకలో ఉండేది. యుద్ధ సమయాల్లో మహిళలు ‘జౌహార్’ను ఆచరించేవారు. భర్తలు యుద్ధంలో మరణించినప్పుడు అగ్నిలో దూకి పరపురుషుల నుంచి రక్షించుకునేందుకు స్త్రీలు ‘జౌహార్’ పద్ధతిని పాటించేవారు. రాజులు యుద్ధాలపై అతిగా దృష్టి పెట్టి పాలనను నిర్లక్ష్యం చేసేవారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థగా మారడానికి అంకురార్పణ వీరికాలంలోనే జరిగినట్లుగా చరిత్రకారులు చెబుతారు. సాహిత్యం - కళలు: ‘కల్హణుడు’ భారతదేశ మొదటి చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు రచించిన ‘రాజతరంగిణి’ భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథంగా గుర్తింపు పొందింది. రాజపుత్రులు కోటలను, భవనాలను శత్రుదుర్భేద్యంగా, అతి సుందరంగా నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో వీరు నిర్మించిన కోటలు ఇప్పటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీరు అనేక ఆలయాలను వినూత్న శైలిలో నిర్మించి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. ముఖ్యమైన ఆలయాలు: సోమనాథ్ ఆలయం (గుజరాత్) లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్) జగన్నాథాలయం (పూరీ) సూర్య దేవాలయం (కోణార్క) ఖజురాహో ఆలయం (మధ్యప్రదేశ్) అబూ ఆలయం (రాజస్థాన్) రాజపుత్ర యుగానికి చెందిన ముఖ్యమైన కవులు - వారి రచనలు: భట్టి - రావణవధ మేఘుడు - శిశుపాలవధ శ్రీహర్షుడు - నైషద చరిత్ర పద్మగుప్తుడు - నవశశాంకచరిత్ర జయదేవుడు - గీతా గోవిందం దండి - దశకుమార చరిత్ర బాణుడు - హర్షచరిత్ర భవభూతి - మాలతీ మాధవం రాజశేఖరుడు - కర్పూర మంజరి కల్హణుడు - రాజతరంగిణి బిల్హణుడు - విక్రమాంక చరిత్ర జయనకుడు - పృథ్వీరాజ విజయం క్షేమేంద్రుడు - బృహత్కథామంజరి సోమదేవుడు - కథాసరిత్సాగరం సారంగదేవుడు - సంగీత రత్నాకరం వాగ్భటుడు - అష్టాంగ సంగ్రహం భాస్కరాచార్యుడు - సిద్ధాంత శిరోమణి చాంద్ బర్దాయ్ - పృథ్వీరాజ్ రాసో మాదిరి ప్రశ్నలు 1. రాజపుత్ర రాజుల పాలన అంతమవ్వడానికి ప్రధాన కారణం? 1) ముస్లిం దండయాత్రలు 2) రాజపుత్రులు యుద్ధ బలహీనులు కావడం 3) రాజపుత్రుల మధ్య ఐక్యత లేకపోవడం 4) రాజపుత్ర రాజులపై ప్రజలకున్న వ్యతిరేకత 2. ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు? 1) పాలరాజులు 2) చందేలులు 3) చౌహానులు 4) ప్రతీహారులు 3. ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథకర్త? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) చాంద్ బర్దాయ్ 3) మిహీర భోజుడు 4) జయనకుడు 4. ‘తురకదండు’ అనే పన్నును ప్రజల నుంచి వసూలు చేసిన రాజపుత్ర రాజులు? 1) గహాద్వాలులు 2) సోలంకీలు 3) పారమారులు 4) చౌహానులు 5. చందావార్ యుద్ధం (క్రీ.శ.1193)లో ఘోరీ ఎవరిని ఓడించాడు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) హేమచంద్రుడు 3) జయచంద్రుడు 4) భోజుడు 6. తరైన్ యుద్ధాలు (క్రీ.శ. 1191, 1192) ఎవరెవరికి మధ్య జరిగాయి? 1) గజనీ మహ్మద్, జయసేనుడు 2) గజనీ మహ్మద్, ధర్మపాలుడు 3) ఘోరీ మహ్మద్, జయచంద్రుడు 4) ఘోరీ మహ్మద్, పృథ్వీరాజ్ చౌహాన్ 7. కావ్య మీమాంస, హర విలాసం అనే గ్రంథాల రచయిత? 1) కాళిదాసు 2) కల్హణుడు 3) రాజశేఖరుడు 4) బిల్హణుడు 8. భవభూతి అనే నాటక రచయిత ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 1) యశోవర్మ 2) మిహీర భోజుడు 3) ధర్మపాలుడు 4) జయచంద్రుడు 9. మౌంట్ అబూ (రాజస్థాన్)లోని దిల్వారా జైన దేవాలయాన్ని నిర్మించినవారు? 1) సోలంకీ మొదటి భీముడు 2) ప్రతీహార ఘార్జారుడు 3) ధర్మపాలరాజు 4) విజయసేనరాజు 10. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఏ రాజపుత్ర రాజు రాజ్యాన్ని సందర్శించాడు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) ధర్మపాలుడు 3) నాగభట్టు 4) మిహీర భోజుడు 11. పంచరత్నాలనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? 1) పాలరాజులు 2) సేనరాజులు 3) కాలచూర రాజులు 4) సోలంకీ రాజులు 12. ‘కనోజ్ దర్బార్’ను ఘనంగా నిర్వహించినవారు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) యశోవర్మ 3) ధర్మపాలుడు 4) మిహీర భోజుడు 13. కాళిదాసుతో పోల్చదగిన ప్రముఖ నాటక రచయిత? 1) కల్హణుడు 2) రాజశేఖరుడు 3) భవభూతి 4) సారంగదేవుడు 14. నైషధ చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన శ్రీహర్షుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 1) జయచంద్రుడు 2) విద్యాధరుడు 3) జయసేనుడు 4) విద్యాసేనుడు 15. కోణార్కలోని సూర్యదేవాలయాన్ని నిర్మించిన రాజవంశం? 1) పాలరాజులు 2) రాష్ట్రకూటులు 3) గజపతులు 4) కళింగ గాంగులు సమాధానాలు 1) 3; 2) 2; 3) 2; 4) 1; 5) 3; 6) 4; 7) 3; 8) 1; 9) 1; 10) 4; 11) 2; 12) 3; 13) 3; 14) 1; 15) 4. -
‘ రామచరితమానస్’ గ్రంథ రచయిత?
చరిత్ర 1. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులుగా గుర్తించిన ప్రాచీన మానవులు? హోమోసెఫియన్స 2. చైనాలో అతిపెద్దనది ఏది? హోయాంగ్హో 3. కాగితాన్ని కనిపెట్టినవారెవరు? చైనీయులు 4. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడెవరు? బాబర్ 5. ‘రామచరితమానస్’ గ్రంథ రచయిత? తులసీదాస్ 6. ‘ఉదయించే సూర్యుడి భూమి’గా పేరు పొందిన దేశమేది? జపాన్ 7. {పసిద్ధి చెందిన ‘మోనాలిసా’ చిత్రాన్ని వేసినవారు? లియోనార్డ డావిన్సీ 8. యూదుల పవిత్ర ప్రదేశమేది? జెరూసలేం 9. అమెరికాను కనుగొన్నవారెవరు? అమెరిగో విస్పూచి (ఇటాలియన్) 10. భూమి, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మొదటగా ప్రతిపాదించినవారు? కోపర్నికస్ 11. దాస్‌కాపిటల్, కమ్యూనిస్ట్ మెనిఫెస్టో అనే రచనలు చేసినవారు? కారల్మార్క్స 12. ‘మెయిన్‌కాంఫ్’ గ్రంథ రచయిత? హిట్లర్ 13. అలీనోద్యమ రూపశిల్పి? జవహర్ లాల్ నెహ్రూ 14. సింధులోయ నాగరికతకు చెందిన ‘మహా స్నానవాటిక’ ఎక్కడ బయట పడింది? మొహంజోదారో 15. వేదాలు ఎన్ని? 4 (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) 16. ‘మహాబలిపురం’ను నిర్మించినవారు? పల్లవ నరసింహవర్మ 17. దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది? చిదంబరం (తమిళనాడు) 18. విఠలస్వామి, హజరా రామస్వామి ఆలయా లను నిర్మించిన రాజు? } కృష్ణదేవరాయలు 19. తాజ్‌మహల్, ఎర్రకోటను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షాజహాన్ 20. గణపతి, శివాజీ ఉత్సవాలను మొదటగా నిర్వహించినవారు? బాలగంగాధర్ తిలక్ 21. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? {Mీ.శ. 1757 22. సతీసహగమన దురాచారాన్ని నిషేధించిన బ్రిటిష్ అధికారి? విలియం బెంటింక్ 23. 1857 సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది? మీరట్ 24. ‘అమృతబజార్ పత్రిక’ సంపాదకులు? శిశిర్‌కుమార్ ఘోష్ 25. ‘ది హిందూ’ పత్రిక ఎవరి సంపాద కత్వంలో ప్రారంభమైంది? సుబ్రమణ్య అయ్యర్ 26. తిలక్ సంపాదకత్వంలో ప్రారంభమైన పత్రి కలేవి? కేసరి, మరాఠా 27. పుణేసార్వజనిక సభను నిర్వహించిన వారెవరు? మహదేవ్ గోవింద రనడే 28. మద్రాస్ మహాజన సభను స్థాపించిన వారు? రాఘవాచారి, సుబ్రమణ్య అయ్యర్ 29. ‘భారత జాతీయ కాంగ్రెస్’ (1885) ఏర్పాటుకు కృషి చేసినవారు? ఎ.ఒ. హ్యూమ్ 30. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు? డబ్ల్యూసీ బెనర్జీ 31. మితవాద యుగం అని దేన్ని పిలుస్తారు? 1885 నుంచి 1905 వరకు 32. వందేమాతర ఉద్యమం (1905) ప్రారంభమవడానికి కారణమేమిటి? లార్డ కర్జన్ బెంగాల్‌ను విభజించడం 33. ‘వందేమాతరం’ నినాదం ‘మదర్ లాండ్’ గ్రంథంలోని గేయంలోది. దీన్ని రాసినవారు? బంకించంద్ర చటర్జీ 34. వందేమాతరం ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతం లో ప్రచారం చేసిన జాతీయ నాయకుడు? బిపిన్ చంద్రపాల్ 35. మద్రాస్‌లో ‘హోంరూల్‌లీగ్’ను (1915) ప్రారంభించినవారు? అనిబీసెంట్ 36. మహాత్మాగాంధీ ఎక్కడ జన్మించారు? పోర్బందర్, గుజరాత్ (1869) 37. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన సంవత్సరం? 1915 38. భారతదేశంలో గాంధీజీ మొదటగా ఎక్కడ జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు? చంపారన్, బీహార్ (1917) 39. అమృత్‌సర్‌లో జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్, 13 40. గాంధీజీ ఏ సంఘటనను తీవ్రంగా భావించి 1922లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు? చౌరీ చౌరా సంఘటన (ఉత్తరప్రదేశ్) 41. స్వరాజ్య పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు? చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ 42. పూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యమని ఎవరి అధ్య క్షతన జరిగిన సమావేశంలో నిర్ణ యించారు? జవహర్ లాల్ నెహ్రూ 43. గాంధీజీ ‘దండియాత్ర’తో (1930) ప్రారం భించిన ఉద్యమం? శాసనోల్లంఘనోద్యమం 44. మొదటి ‘ఆల్ ఇండియా ఖిలాఫత్ డే’ను ఏ రోజున జరుపుకున్నారు? అక్టోబరు, 17 45. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? కేరళ 46. లక్నో ఒడంబడిక (1916) ఎవరెవరి మధ్య జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ 47. ‘జాతిని అవమానించిన రోజు’గా నిర్వ హించాలని గాంధీజీ నిర్ణయించడానికి కారణం? రౌలత్ చట్టం 48. గాంధీజీ ఏ రోజును ‘జాతిని అవమానించిన రోజు’గా పాటించాలని పిలుపునిచ్చారు? 1919 ఏప్రిల్, 6 49. ‘పుణే ఒడంబడిక’ ఎవరెవరి మధ్య జరిగింది? గాంధీ, అంబేద్కర్ 50. క్విట్ ఇండియా ఉద్యమం (1942) సంద ర్భంగా గాంధీజీ ఇచ్చిన నినాదమేమిటి? డూ ఆర్ డై (సాధించు లేదా మరణించు) 51. భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టిన నావికుడు? వాస్కోడిగామా 52. వాస్కోడిగామాను తన రాజ్యంలోకి ఆహ్వా నించిన భారతీయ ప్రాంతీయ రాజు? జామోరిన్ 53. బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం? 1764 54. భారతీయులు నమ్మదగినవారు కాదనే అభిప్రాయమున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? కారన్‌వాలీస్ 55. శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి? కారన్‌వాలీస్ 56. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని మెదటిసారిగా అంగీకరించినవారు? హైదరాబాద్ నిజాం 57. మహిళా విద్య, భారతీయ భాషలను ప్రోత్సహించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? డల్హౌసీ 58. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రూపొందిం చిందెవరు? డల్హౌసీ 59. {బహ్మసమాజాన్ని స్థాపించినవారు? రాజారామ్మోహన్ రాయ్ 60. ఆంధ్రాలో బ్రహ్మసమాజ వ్యాప్తికి కృషి చేసినవారెవరు? కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు 61. ‘ఆర్యసమాజం’ రూపకర్త? స్వామి దయానంద సరస్వతి 62. అలీఘర్ ఉద్యమ నాయకుడు? సయ్యద్ అహ్మద్‌ఖాన్ 63. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించిన వారు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 64. ఏసియాటిక్ సొసైటీని స్థాపించినవారు? విలియం జోన్స 65. అభిజ్ఞాన శాకుంతలం (కాళిదాస్ రచన)ను ఆంగ్లంలోకి అనువదించినవారు? విలియం జోన్స 66. ముస్లింలీగ్ (1906) ఏర్పాటుకు ప్రోత్సా హాన్ని అందించిన బ్రిటిష్ అధికారి? వైశ్రాయ్ మింటో 67. హోంరూల్ ఉద్యమకాలంలో ‘స్వరాజ్యమే నా జన్మహక్కు’ అని నినదించినవారు? తిలక్ 68. గాంధీజీ రూపొందించిన నూతన విద్యా విధానం పేరు? బేసిక్ విద్య 69. మొట్టమొదటి వ్యక్తి సత్యాగ్రహి ఎవరు? ఆచార్య వినోబా భావే 70. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపకుడెవరు? సుభాష్ చంద్రబోస్ 71. సింధులోయ నాగరికతను ఎప్పుడు జరిపిన తవ్వకాల్లో మొదటగా కనుగొన్నారు? 1921-22 72. సింధులోయ నాగరికత ఏ కాలంలో విలసిల్లింది? {Mీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు 73. హరప్పా నగరం ప్రస్తుతం ఎక్కడ ఉంది? మాంటీగోయరి జిల్లా, పంజాబ్ 74. సింధు నాగరికత విశిష్ట లక్షణం? పట్టణ స్వభావం 75. వేద సాహిత్య సృష్టికర్తలు? ఆర్యులు 76. కనిష్కుడి కాలంలోని శిల్పకళ ఏది? గాంధారకళ (గ్రీకో - బౌద్ధమత కళ) 77. జైనమతంతో ప్రేరణ పొందిన కళ? మధురకళ 78. భితర్‌గావ్ ఇటుకల ఆలయం ఏ రాష్ర్టంలో ఉంది? ఉత్తరప్రదేశ్ 79. బృహదీశ్వరాలయం (తంజావూర్)ను ని ర్మించిన వారు? రాజరాజ చోళుడు 80. గంగైకొండ చోళపుర నిర్మాత? రాజేంద్ర చోళుడు 81. ఢిల్లీ సుల్తాన్ల వాస్తు, శిల్ప శైలిని ఏమంటారు? ఇండో - సర్ సేనిక్ శైలి -
పౌరశాస్త్రం
లౌకికతత్వం భారతీయ సమాజం సర్వధర్మ సమభావనతో ఐకమత్యానికి నిలయంగా ఉంది. దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు, ఆచార వ్యవహారాలకు చెందిన ప్రజలు ఒకేజాతిగా మనుగడ సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత అనే భావనలు భారతీయ సమాజానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. ప్రాచీనకాలం నుంచి భారతీయ సంస్కృతి సర్వమత సమ్మేళనంగా పరిఢవిల్లుతోంది. వివిధ మతాలకు పుట్టినిల్లయిన భారతదేశం విదేశీ మతాలకు కూడా సాదరంగా ఆశ్రయమిస్తూ లౌకికతత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. లౌకికం అంటే మతంతో సంబంధం లేనిది. లౌకికవాద పాలన అంటే ఏ మత ప్రమే యం లేకుండా పాలన నిర్వహించడం. ప్రజల మతసంబంధ విషయాల్లో జోక్యం కల్పించుకోని రాజ్యాన్ని లౌకికరాజ్యం అంటారు. సర్వమత సహనాన్ని అనుసరించి, దాని గురించి ప్రచారం చేసిన ప్రాచీన భారతదేశ చక్రవర్తి - అశోకుడు. అక్బర్ చక్రవర్తి అన్ని మతాల సారాన్ని మేళవించి, ‘దిన్-ఇ-ఇలాహీ’ అనే మతాన్ని స్థాపించాడు. మత స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కు. మన రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లౌకిక అనే పదాన్ని చేర్చారు. లౌకికతత్వాన్ని పెంపొందించే అంతిమ బాధ్యత ప్రభుత్వానిదే. భారతదేశ లౌకికతత్వ భానవలోని ముఖ్యాంశాలు పాలనా వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. దేశంలో రాజ్య (ప్రభుత్వ) మతం లేదు. అంటే భారత్ ఏ మతాన్ని అధికారికంగా గుర్తించలేదు. ప్రజల మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రతి ఒక్కరికీ మతస్వేచ్ఛ ఉంది. మత సామరస్యానికి భంగం కలిగించే విశ్వాసాలను ప్రచారం చేయకూడదు. ప్రజాధనంతో నిర్వహించే ఏ విద్యాలయంలోనూ మతవిద్య బోధించకూడదు. ఎన్నికల ప్రచారంలో మతం, మత చిహ్నాలను ఉపయోగించకూడదు. ప్రపంచ శాంతి శాంతియుత జీవనానికి ఆటంకం కలిగించే ప్రతి అంశం సమాజాభివృద్ధికి అవరోధం కలిగిస్త్తుంది. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రపంచదేశాలు శాంతియుత సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ప్రచ్ఛన్న యుద్ధానికి కాలుదువ్విన రెండు అగ్రదేశాలు అలీన దేశాల ఆసక్తులను గౌరవించి, ప్రపంచశాంతిని ప్రపంచదేశాల ఎజెండాగా మార్చాయి. శాంతి స్థాపనకు సంబంధించిన లక్ష్యాల సాధన కోసం ఏర్పడిన సంస్థలే నానాజాతి సమితి (1920), ఐక్యరాజ్య సమితి (1945). ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రపంచశాంతి పరిరక్షణకు శాయశక్తులా కృషి చేస్తోంది. భారతదేశ విదేశాంగ విధానానికి మూలసూత్రమైన అలీనవిధానం ప్రపంచశాంతి పటిష్ట తకు ఎంతగానో దోహదపడుతోంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1918లో ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు చెందిన హిరోషిమా, నాగసాకి నగరాలు బాంబుదాడికి గురై తీవ్రంగా నష్టపోయాయి. అలీన విధానం అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్య్ర విధానాన్ని రూపొందించుకుని ప్రపంచశాంతికి కృషి చేయడం. ఈ విధానాన్ని అనుసరించినవే అలీన దేశాలు. దీని రూపశిల్పి భారత ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ. ఈయనకు మార్షల్ టిటో (యుగోస్లేవియా అధ్యక్షుడు), నాసర్ (ఈజిప్ట్ అధ్యక్షుడు) సహకరించారు. భారత్, చైనా మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. దీన్ని 28 జూన్ 1954న భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్-లై సంయుక్తంగా అంగీకరించారు. ఆసియా దేశాల మొదటి, రెండో సమావేశాలు వరుసగా 1947, 1949లలో ఢిల్లీలో జరిగాయి. వీటి ఏర్పాటులో నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు. ఆసియా ఆఫ్రికా దేశాల మొదటి సమావేశం ‘బాండుంగ్’ (ఇండోనేషియా)లో 1955లో జరిగింది. ఈ సమావేశంలోనే అలీన విధానం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అలీనోద్యమ కూటమి (నామ్) 1961లో ఏర్పడింది. దీంట్లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 118. విదేశాంగ విధానం అంటే ఇతర దేశాలతో అనుసరించాల్సిన విధానాలు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తూ, కేంద్ర ప్రభు త్వం విధానాల రూపకల్పన చేస్తుంది. ప్రపంచ వ్యవహారాల్లో పోషించాల్సిన పాత్ర గురించి మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సూచించారు. భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం - క్రీ.శ. 1962 కామన్వెల్త్ కూటమి అంటే - బ్రిటిషర్లు పాలించిన వలస దేశాల కూటమి. దీంట్లో 53 సభ్యదేశాలున్నాయి. ఇది 1931లో ఏర్పాటయ్యింది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాలు జరిగిన సంవత్సరాలు - 1948, 1965, 1971, 1991. బంగ్లాదేశ్ కారణంగా 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిని ‘సార్క’ అంటారు. దీంట్లో సభ్యదేశాల సంఖ్య 8. సార్క్‌ను 1985లో స్థాపించారు. దీని మొదటి శిఖరాగ్ర సమావేశం ఢాకా (బంగ్లాదేశ్)లో జరిగింది. సార్క దేశాల ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని భారతదేశంలో, ప్రాంతీయ వ్యవసాయ సమాచార కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేశారు. మూడో ప్రపంచ దేశాలు - వలస పాలన నుంచి విముక్తి పొంది, అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దేశాలు. 1973లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (ఎన్ఐఈవో) ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఈ సమావేశం అల్జీర్స (అల్జీరియా)లో జరిగింది. ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి (ూ్ఖై) ఆవిర్భవించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క (యూఎస్ఏ)లో ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలు 6. అవి: సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక- సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శివర్గం. యూఎన్వో సాధారణ సభ సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతుంది. భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్య 15. 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం, 10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఉంది. యూఎన్వో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు - రష్యా, యూఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం - 2 సంవత్సరాలు. భద్రతామండలిలో తీర్మానం నెగ్గాలంటే 5 శాశ్వత సభ్యదేశాలు, ఏవైనా నాలుగు తాత్కాలిక సభ్యదేశాలు అంగీకరించాలి. 1948 డిసెంబర్ 10న యూఎన్వో మానవ హక్కుల ప్రకటన చేసింది. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. శాశ్వత సభ్యదేశాలకు ఉన్న ఈ అధికారాన్ని ‘వీటో అధికారం’ అంటారు. వీటో అధికారం అంటే వ్యతిరేకించే అధికారం. భద్రతా మండలికి ఏ దేశంపై అయినా సైనిక చర్యకు ఆదేశించే అధికారం ఉంది. వలస పాలన కింద కొనసాగిన భూ భాగాల ప్రయోజనాలు రక్షించేందుకు ధర్మకర్తృత్వ మండలి కృషి చేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ది హేగ్ (నెదర్లాండ్స)లో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య - 15. పదవీ కాలం 9 ఏళ్లు. యూఎన్వో ప్రధాన కార్యనిర్వహణాధికారిని ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్) అంటారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్. ప్రధాన కార్యదర్శి పదవీ కాలం 5 సంవత్సరాలు. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ (ఐబీఆర్డీ)ను ప్రపంచ బ్యాంక్‌గా పిలుస్తారు. యూఎన్వో సాధారణ సభ 1988లో నిరాయుధీకరణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సీటీబీటీ అంటే - సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం. 1995లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలనకు కృషిచేస్తున్న సంస్థ - యునెస్కో. అంతర్జాతీయ కార్మిక మండలి (ఐఎల్వో) లో మనదేశం శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి వ్యూహాలను విల్లీబ్రాంట్ కమిషన్ (1980లో) రూపకల్పన చేసింది. యూఎన్వో రాజ్యాంగంలో 111 అధికరణలు, 19 అధ్యాయాలు ఉన్నాయి. ప్రారంభంలో యూఎన్వోలో 50 దేశాలకు సభ్యత్వం ఉండేది. దీంట్లో ప్రస్తుతం 193 సభ్యదేశాలుగా ఉన్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ దేశంగా చేరింది. యూఎన్వో ధర్మకర్తృత్వ మండలి కార్యకలాపాలను 1994 నుంచి నిలిపివేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం భవనాన్ని శాంతి భవనం (పీస్ ప్యాలెస్)గా పిలుస్తారు. డాగ్హామర్స (మాజీ సెక్రటరీ జనరల్) యూఎన్వోను ‘ప్రజలను స్వర్గానికి తీసుకెళ్లేందుకు కాకుండా, వారిని నరకం నుంచి కాపాడేందుకు ఏర్పడిన సంస్థ’గా అభివర్ణించాడు. ఇండియా... యూఎన్వోలో 1945లో సభ్యదేశంగా చేరింది. యూఎన్వో గుర్తించిన అధికార భాషలు ఆరు. అవి: ఇంగ్ల్లిష్, చైనీస్, రష్యన్, స్పానీష్, ఫ్రెంచ్, అరబిక్. యూఎన్వో చిహ్నం - రెండు ఆలీవ్ కొమ్మలు (శాంతికి చిహ్నం), యూఎన్వో పతాకంలో తెలుపు, లేత నీలం రంగులు ఉంటాయి. యూఎన్వో ఆర్థిక సంవత్సరం - జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. యూఎన్వో లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం, అంతర్జాతీయ సహకారాన్ని అందించడం. యూఎన్వో మొదటి సమావేశం 1945లో లండన్‌లో జరిగింది. -
సోషల్
ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లిష్‌లో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదానికి మూలం గ్రీకుభాషలోని ‘డెమోస్’, ‘క్రేషియా’ అనే పదాలు. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పరిపాలన, డెమోక్రసీ అంటే ప్రజాపాలన. {పజలందరి చేతిలో సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వమే అత్యుత్తమ ప్రభుత్వం అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ప్రజలు తమకోసం తాము ఏర్పాటు చేసుకుని తామే నడుపుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా (గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్) అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ నిర్వచించాడు. {పజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవి స్వేచ్ఛాపూరిత ఎన్నికలు, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు, పాలనా యంత్రాంగం, చైతన్యవంతులైన ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ అధికారం. ప్రజాస్వామ్యం రెండు రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో స్పార్టా, ఏథెన్‌స (గ్రీక్రాజ్యాలు)ల్లో ఉండేది. భారతదేశం, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలు. పౌర హక్కులు నైతిక హక్కు: వృద్ధులు తమ పిల్లల సేవలను పొందే హక్కు. చట్టపరమైన హక్కు: చట్టం రక్షణ కలిగిన హక్కులు, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులు. రాజకీయ హక్కులు: ఓటుహక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కు, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు. సామాజిక హక్కులు: జీవించేహక్కు, మాట్లాడేహక్కు, కుటుంబహక్కు, మతస్వేచ్ఛ హక్కు, ఆరోగ్య రక్షణ హక్కు, సంఘాలను ఏర్పర్చుకునే హక్కు. ఆర్థికహక్కులు: పనిహక్కు, వేతనం కోరే హక్కు, పింఛన్ పొందే హక్కు. భారత రాజ్యాంగం 6 ప్రాథమిక హక్కులను నిర్దేశించింది. అవి. 1. సమానత్వపు హక్కు, 2. స్వాతంత్య్రపు హక్కు, 3. పీడనాన్ని నిరోధించే హక్కు, 4. మత స్వాతంత్య్రపు హక్కు, 5. సాంస్కృతిక విద్యా విషయక హక్కులు, 6. రాజ్యాంగ పరిహారాల హక్కు. నైతిక విధులు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలపట్ల విధేయత, సోదరుల పట్ల ప్రేమాభిమానాలు, మహిళలపట్ల గౌరవం, వికలాంగుల పట్ల ఆదరణ చట్టపరమైన విధులు: రాజ్యాంగాన్ని గౌరవించడం, పన్నులు చెల్లించడం, రాజ్యంపట్ల విధేయత, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం (ఈ విధులు పాటించని వారు శిక్షార్హులు) భారత రాజ్యాంగం పౌరులకు 11 రకాల ప్రాథమిక విధులను నిర్ణయించింది. ఐతే వీటికి న్యాయ సంరక్షణ లేదు. చైనా, తైవాన్ దేశాల్లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉంది. ఉత్తమ జీవనాన్ని సమకూర్చడానికి రాజ్యం కొనసాగుతుంది అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ఇది రద్దు కాదు. అందువల్ల దీన్ని శాశ్వత సభ అంటారు. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. లోక్‌సభ శాశ్వత సభ కాదు. ఎలక్టోరేట్ అంటే ఓటర్ల సముదాయం (అర్హతగల 18 ఏళ్లు నిండిన వయోజనులు) దేశంలో మొదటిసారి క్రీ.శ.1884లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి సాధారణ ఎన్నికలు 1952లో నిర్వహించారు. వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని మన రాజ్యాంగంలోని 326వ అధికరణ పేర్కొంటోంది. నియోజకవర్గ ఎన్నికల అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు. పోలింగ్ కేంద్రం అధికారిని ‘ప్రిసైడింగ్ అధికారి’ అని పిలుస్తారు. రెఫరెండమ్ అంటే ప్రజాభిప్రాయసేకరణ పునరాయనం (రీకాల్) అంటే వెనుకకు పిలవడం. భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్. మనదేశంలో మొదటిసారిగా 1892లో ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు నిర్వహించారు. ఎగువ సభను రాజ్యసభ, పెద్దల సభ , రాష్ట్రాల పరిషత్తు , శాశ్వత సభ అని పిలుస్తారు. దిగువ సభను లోక్‌సభ , ప్రతినిధుల సభ, శాసనసభ అని పిలుస్తారు. రాజకీయ పార్టీ అంటే ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజ్యాధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సమూహం. ప్రతిపక్షపార్టీ అంటే ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి రావడానికి ప్రయత్నించే రాజకీయ పార్టీ. ఐతే సంబంధిత సభలో ఆ పార్టీ కనీసం ఒక సీటైనా గెలవాలి. {పస్తుతం మనదేశంలో ఆరు పార్టీలు జాతీయపార్టీలుగా గుర్తింపులో ఉన్నాయి. అవి... కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలు. మనదేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. 15వ లోక్‌సభ సాధారణ ఎన్నికలను 2009లో నిర్వహించారు. సామ్యవాదం ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం బలంగా ఉండాలంటే వాటికి సామ్యవాద పునాదులు అవసరం. ఈ సామ్యవాదం దోపిడీ, అణచివేత, అసమానత, అన్యాయానికి వ్యతిరేకం. పెట్టుబడిదారీ విధానానికి కూడా వ్యతిరేకం. ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వాధీనంలో ఉంచి సమాజశ్రేయస్సుకు వినియోగించడమే సామ్యవాదం (సోషలిజం). ప్రజాస్వా మ్యం పౌరుల సమానత్వంపై ఆధారపడితే, సామ్యవాదం వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య సమానత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తోంది. మన రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చారు. మన రాజ్యాంగ పీఠిక (ప్రవేశిక) ‘భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’ అని తెల్పుతోంది. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడుతున్నాయి. ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు సంఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశిక సూత్రాలే అధిక్యత పొందుతాయి. కాంగ్రెస్ పార్టీ ఆవడి (మద్రాస్-1955)లో నిర్వహించిన మహాసభలో సామ్యవాద తరహా సమాజ నిర్మాణమే తన గమ్యంగా నిర్ణయించింది. జాతీయీకరణ అంటే దేశంలోని ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ యాజమాన్య పరిధిలోకి తెచ్చి, నిర్వహించే విధానం. -
సాంఘిక శాస్త్రం
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక ‘‘భౌగోళిక పరిస్థితుల కారణంగా భవిష్యత్‌లో అంతర్జాతీయ వేదికపై భారతదేశం విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంటుంది’’. - లార్డ కర్జన్ (బ్రిటిష్ గవర్నర్ జనరల్) ఎన్నో ప్రత్యేకతలతో, మరెన్నో విభిన్నతలతో విశాల భారత భౌగోళిక క్షేత్రం ప్రపంచంలోనే విశిష్ట లక్షణాలను కలిగి తన ఉనికిని చాటుకుంటోంది. సారవంతమైన మృత్తికలు, సమృద్ధికరమైన పంటలు, అనేక ఖనిజ నిక్షేపాలను భారత భూమి కలిగి ఉంది. పురాతన కాలం నుంచే వివిధ మతాలు, భాషలు, కులాలు, తెగలు, ఆచారాలు, అలవాట్లు, సంస్కృతులతో విలసిల్లుతోంది. ఏకత్వంలో భిన్నత్వం-భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రధాన బలంగా మారింది. ఉనికి : 32,87,263 చ.కి.మీ. వైశాల్యం ఉన్న భారతదేశం ప్రపంచంలో 7వ స్థానం కలిగిఉంది. భౌగోళికంగా 8ని4’ నుంచి 37ని6’ వరకు ఉన్న ఉత్తర అక్షాంశాలు, 68ని7’ నుంచి 97ని25’ వరకు ఉన్న తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 3214 కి.మీ. పొడవు, తూర్పు నుంచి పడమర వరకు 3000 కి.మీ. వెడల్పుతో వ్యాపించి ఉంది. దేశ ఉత్తర భాగం చివరన మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలు, దక్షిణ భాగం చివరన కన్యాకుమారి (తమిళనాడు), పశ్చిమ చివరన ఉప్పునీటి చిత్తడి నేలలున్న రాణా ఆఫ్ కచ్ (గుజరాత్), తూర్పు చివరన దట్టమైన అడవులు, కొండలున్న మయన్మార్ (బర్మా), చైనాలు మన దేశ సరిహద్దు భాగాలు. సరిహద్దు రేఖలు: 1. మెక్‌మోహన్ రేఖ: భారత్, చైనా మధ్య ఉన్న విభజన రేఖ. 2. రాడ్‌క్లిఫ్ రేఖ: వాయవ్య సరిహద్దు రేఖ భారత్, పాకిస్థాన్‌లను వేరు చేస్తోంది. 3. డ్యూరాండ్ రేఖ: భారత్, అఫ్ఘానిస్తాన్‌లను విభజిస్తోంది. తీర రాష్ట్రాలు (9):1. కేరళ, 2. కర్ణాటక, 3. గోవా, 4. మహారాష్ర్ట, 5. గుజరాత్, 6. పశ్చిమబెంగాల్, 7. ఒడిశా, 8. ఆంధ్రప్రదేశ్, 9. తమిళనాడు. గుజరాత్ అతి పొడవైన (1058 కి.మీ.) తీరరేఖ ఉన్న రాష్ర్టం. గోవా అతిచిన్న తీరరేఖ ఉన్న రాష్ర్టం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ. తమిళనాడుకు మూడు సముద్రాలతో (హిందూమహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం) తీరరేఖ ఉంది. దీవులు: భారతదేశంలో మొత్తం 247 దీవులున్నాయి. టెర్షియరీ యుగానికి చెందిన శిలలతో ఏర్పడ్డ అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. వీటి విస్తీర్ణం 8248 చ.కి.మీ. పగడపు దీవులైన లక్షదీవులు 32 చ.కి.మీ.ల విస్తీర్ణంతో అరేబియా సముద్రంలో ఉన్నాయి. శిలా ఉపరితలం కలిగిన ‘పంబన్ దీవి’ భారత్, శ్రీలంకల మధ్య ఉంది. భారతదేశం - ఇండియా: పూర్వం మన దేశాన్ని భరతుడనే రాజు పాలించడంతో ‘భారతదేశం’ అనే పేరు వచ్చింది. గ్రీకులు సింధు నదిని ‘ఇండస్’గా, దాని వెంట నివసించే ప్రజలను ‘ఇండోయి’లుగా పిలిచేవారు. తర్వాత కాలంలో బ్రిటిషర్లు ‘ఇండస్’ను ‘ఇండియా’గా పిలవడం ప్రారంభించారు. భారతదేశం - ఉపఖండం: సాధారణంగా ఖండానికి ఉండే లక్షణాలున్న ప్రాంతాన్ని ‘ఉపఖండం’గా పిలుస్తారు. అలాంటి విశిష్ట లక్షణాలు, భౌగోళిక విస్తీర్ణం ఉన్న భారతదేశం కూడా ‘ఉపఖండం’గా పేరుగాంచింది. భారతదేశ ఉపఖండ లక్షణాలు : విస్తీర్ణపరంగా 7వ స్థానం, జనాభా పరంగా 2వ స్థానంతో భారతదేశం ప్రపంచంలోనే విభిన్న భౌతిక పరిస్థితులను కలిగి ఉంది. అనేక పెద్ద నదులు దేశాన్ని భౌతికంగా విభజిస్తున్నాయి. రకరకాల శీతోష్ణస్థితులు, మృత్తికలు దేశంలో విస్తరించి ఉన్నాయి. పంటలు, అటవీ, జంతు, ఖనిజ సంపదలు అపారంగా ఉన్నాయి. భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యాంశాలు: భారతదేశానికి 15200 కి.మీ. పొడవైన భూభాగ సరిహద్దు, 6100 కి.మీ. పొడవైన తీరరేఖ ఉన్నాయి. {పస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. విస్తీర్ణపరంగా రాజస్థాన్ పెద్ద రాష్ర్టం. గోవా చిన్న రాష్ర్టం. కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది అండమాన్ - నికోబార్ దీవులు, చిన్నది లక్షదీవులు. దేశంలో మొదట సూర్యోదయమయ్యే రాష్ర్టం : అరుణాచల్‌ప్రదేశ్ గుజరాత్‌లోని ద్వారకా నగరం కంటే అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు అంచున సుమారు రెండు గంటల ముందు సూర్యోదయమవుతుంది. -
సోషల్
1. రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి కారణం? భూభ్రమణం 2. గ్రామీణ రహదారులు అధికంగా విస్తరించిన జిల్లా? కడప 3. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యుడు కన్పించకుండా భూమికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు 4. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన పథకం? TRYSEM 5. మన రాష్ర్టంలో అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం? ఉత్తర తెలంగాణ 6. అసైన్డ భూమి అంటే? ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన భూమి 7. రైతుమిత్ర గ్రూపులో గరిష్ఠంగా ఎంతమంది రైతులు సభ్యులుగా ఉండాలి? 15 8. NABARDను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982 9. కిసాన్ క్రెడిట్ కార్డులను అతి ఎక్కువగా తీసుకున్నవారు ఏ రాష్ర్టంలో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ 10. మన రాష్ర్టంలో ఈశాన్య రుతుపవన కాలం? అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 11. బంగాళాఖాతంలో ఎక్కువగా ఏ కాలంలో వాయుగుండాలు ఏర్పడతాయి? ఈశాన్య రుతుపవన కాలం 12. కరువు రావడానికి కారణం? అనావృష్టి 13. ‘బూడిద విప్లవం’ వేటి ఉత్పత్తికి సంబంధించింది? ఎరువులు 14. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పథకాలకు అయ్యే వ్యయంలో ప్రభుత్వం ఎంత శాతం సబ్సిడీగా ఇస్తుంది? 80 15. రోజూ ‘తినడానికి తిండి’ పొందే హక్కు మొదటిసారిగా ఏ రాష్ర్టంలో అమల్లోకి వచ్చింది? కర్ణాటక 16. చౌకధరల దుకాణాలకు బియ్యాన్ని ఎవరు సరఫరా చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 17. భూ సంస్కరణల ప్రధాన లక్ష్యం? వ్యవసాయాభివృద్ధి 18. గ్రామీణ బ్యాంకులు రైతులకిచ్చే స్వల్పకాలిక రుణాల చెల్లింపునకు గరిష్ఠ కాల పరిమితి? 15 నెలలు 19. భూగర్భ జలశాఖ కరువు ప్రాంతాల అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది? గొట్టపు బావులు నిర్మించడం ద్వారా 20. బీడీ ఆకులు లభించే అడవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? తెలంగాణ 21. కోడిమాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం? ఆంధ్రప్రదేశ్ 22. చాలాకాలం వరకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఉన్న మృత్తికలు? నల్లరేగడి 23. ‘/\‘ - ఈ వాతావరణ స్థితి సంకేతం దేన్ని సూచిస్తుంది? వడగండ్లు 24. మూఢాచారాలు, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఉపయోగపడేది? అక్షరాస్యత 25. ఆదర్శప్రాయమైన స్థానిక సంస్థలను నిర్వహించిన రాజులు? చోళులు 26. ‘దీపం పథకం’ లబ్దిదారులు? మహిళలు 27. పంట దిగుబడిని ఆధారంగా చేసుకొని శిస్తు వసూలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? విలియంబెంటింక్ 28. {బిటిష్ పాలనా కాలంలో మద్రాస్ రాష్ర్టం లో అమలు చేసిన భూమి శిస్తు పద్ధతి? రైత్వారీ పద్ధతి 29. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్య తిరేకంగా తూర్పు భారతదేశంలో జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారు? రైతులు 30. మన దేశ వ్యవసాయ రంగం వెనుకబడటానికి ప్రధాన కారణం? చిన్న భూకమతాలు 31. {బిటిషర్లు కల్పించిన నీటిపారుదల సౌకర్యాల వల్ల ఆహార పదార్థాల దిగుబడి పెరిగింది. అయినప్పటికీ వాటి ధరలు పెరగడానికి కారణం? నీటిపై విధించిన అధిక శిస్తు 32. పోస్టు ద్వారా ఉత్తరాలు పంపే సౌకర్యాన్ని కల్పించిన బ్రిటిష్ అధికారి? డల్హౌసీ 33. గ్రామీణ నాగరికత కలిగినవారు? ఆర్యులు 34. కాలువలను తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచిన ఢిల్లీ సుల్తాన్? ఫిరోజ్ షా తుగ్లక్