
ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధం: చౌదరి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినున్న ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టం అమలుకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించాల్సిందేననని అన్నారు.
ఇంటింటి సర్వే వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి చెప్పారు. నెల రోజులపాటు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు.