gundu sudharani
-
కారెక్కిన గుండు సుధారాణి
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. గుండు సుధారాణి సైకిల్ను వీడి కారు ఎక్కనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో గుండు సుధారాణి పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఆమె టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. -
గుండు సుధారాణి సస్పెన్షన్కు రంగం సిద్ధం
-
గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు
వరంగల్ : టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ మారుతుండటంతో ఆమెపై తెలుగుదేశం పార్టీ గురువారం సస్పెండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండు సుధారాణి నిన్న ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా టీడీపీ నేతలు గురువారం భేటీ అయ్యారు. సుధారాణి పార్టీ వీడే అంశంపై చర్చించారు. ఆమె పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదని ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా గుండు సుధారాణి రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడి 'కారు' ఎక్కనున్నారు. అయితే పార్టీలో చేరికపై చర్చ జరిగినప్పటికీ ఆమెకు పదవుల విషయంలో స్పష్టమైన హామీ ఏదీ లభించలేదని తెలుస్తోంది. పార్టీలో చేరి కొద్దిరోజులు వేచి చూడాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. -
కారెక్కనున్న రాజ్యసభ ఎంపీ
-
వరంగల్లో చేనేత పార్కు నిర్మించాలి
* కేంద్రాన్ని కోరిన టీడీపీ ఎంపీ గుండు సుధారాణి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వరంగల్లో చేనేత పార్కు నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని టీడీపీ ఎంపీ గుండు సుధారాణి కేంద్రాన్ని కోరారు. చేనేత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్లో చేనేత పార్కు నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసిందని, కానీ కేంద్రం ఇంత వరకు చేనేత పార్కు నిర్మించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. చేనేత పార్కు నిర్మించడం ద్వారా సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. యూపీఏ పాలనలో మరమ్మతు, ఆధునీకరణ, పునరుద్ధరణ(ఆర్ఆర్ఆర్) పథకంలో నిధులు కేటాయించగా అవి కూడా బ్యాంకులో మురిగిపోయాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చేనేత పార్కుకు చొరవ చూపి ఉపాధి కల్పించాలని విన్నవించారు. -
ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధం: చౌదరి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినున్న ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించాల్సిందేననని అన్నారు. ఇంటింటి సర్వే వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి చెప్పారు. నెల రోజులపాటు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. -
చిత్రం విచిత్రం టిడిపి!
న్యూఢిల్లీ: ఈరోజు రాజ్యసభలో టిడిపి సభ్యులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. రాజ్యసభ సాక్షిగా టిడిపి బండారం బయటపడింది. ఒకరు రాష్ట్ర విభజన వద్దంటే, మరొకరు కావాలని కోరారు. అలాగే అరిచారు. నినదించారు. ఒకరు బిల్లు రాజ్యాంగ విరుద్దం అంటే, మరొకరు మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరిగేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఒక సభ్యురాలు బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతుంటే, మరో సభ్యుడు సమైక్యాంధ్ర అని ప్లకార్డు పట్టుకున్నారు. చర్చ జరిగే సమయంలో టిడిపి సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ బిల్లు రాజ్యంగ విరుద్దం - వ్యతిరేకిస్తున్నాం అని రెండు ముక్కల్లో ముగించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే విభజనకు అనుసరించిన విధానినికి వ్యతిరేకం అన్నారు. లోక్సభలో అడ్డగోలుగా బిల్లును నెగ్గించారన్నారు. 2004లోనే రాష్ట్రాన్ని ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పెట్టిన వారు విభజనను ఎందుకు ఆపారని అడిగారు. రాజ్యంగబద్దంగా విభజన చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని, అయితే అది సీమాంధ్రకు భారం కాకూడదని చెప్పారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరారు. ఆ పార్టీకే చెందిన మరో సభ్యుడు దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ బిల్లును సమర్ధించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలం అని చెప్పారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష తెలంగాణ అని ఆయన చెప్పారు. అమర వీరులకు జోహార్లు అర్పించారు. ఆ పార్టీకే చెందిన మరో సభ్యురాలు గుండు సుధారాణి కూడా బిల్లును సమర్ధిస్తున్నామని చెప్పారు. స్థానిక ప్రాతిపదికగానే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. -
పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది. నేడు తెలంగాణ బిల్లును పెద్దలో సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విభజనపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండు వర్గాలుగా చీలారు. సభలో అనుకూల-వ్యతిరేక ఫ్లకార్డులతో పోటా పోటీగా ప్రదర్శనకు దిగారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, గుండు సుధారాణి తదితరులు ఫ్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సమావేశాలను అరగంట వాయిదా వేశారు.