
గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు
వరంగల్ : టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ మారుతుండటంతో ఆమెపై తెలుగుదేశం పార్టీ గురువారం సస్పెండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుండు సుధారాణి నిన్న ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా టీడీపీ నేతలు గురువారం భేటీ అయ్యారు. సుధారాణి పార్టీ వీడే అంశంపై చర్చించారు. ఆమె పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదని ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
కాగా గుండు సుధారాణి రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడి 'కారు' ఎక్కనున్నారు. అయితే పార్టీలో చేరికపై చర్చ జరిగినప్పటికీ ఆమెకు పదవుల విషయంలో స్పష్టమైన హామీ ఏదీ లభించలేదని తెలుస్తోంది. పార్టీలో చేరి కొద్దిరోజులు వేచి చూడాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.