కాలువ మల్లయ్య ‘కులరహిత భారతం’, ‘ద జర్నీ టువర్డ్స్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు హిమాయత్ నగర్‌లోని బీసీ భవన్‌లో జరగనుంది. నిర్వహణ: సమాంతర పబ్లికేషన్స్ ఎన్.గోపి ‘జలగీతం’కు ఎం.నారాయణశర్మ సంస్కృత అనువాదం ‘జలగీతమ్’; ‘జలగీతం– కావ్యసమాలోచనమ్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం ఆరింటికి రవీంద్ర భారతిలో జరగనుంది. ఆవిష్కర్తలు: రమణాచారి, జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి. నిర్వహణ: దక్కన్ సాహిత్య సభ. ‘సినారె సాహితీ వైజయంతి’లో భాగంగా జూన్ 12న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘సినారె యాత్రా సాహిత్య విశిష్టత’పై ఆర్.అనంత పద్మనాభరావు ప్రసంగిస్తారు. నిర్వహణ: ఆచంట కళాంజలితో పాటు భావ సారూప్య సాహిత్య సాంస్కృతిక సంస్థలు.
శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్ 14న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ జూన్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్.
సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో’ ఆవిష్కరణ జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాంలో జరగనుంది. ఆవిష్కర్త: మల్లాడి కృష్ణారావు. నిర్వహణ: కవిసంధ్య, స్ఫూర్తి సాహితి బాలాంత్రపు రజనీకాంతరావు సంస్మరణ సభ జూన్ 17న సాయంత్రం 5:30కు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. నిర్వహణ: ఛాయ. మల్లెతీగ పురస్కారాల ప్రదానం జూన్ 17న సాయంత్రం 6 గంటలకు మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరగనుంది. ప్రధాన పురస్కార గ్రహీత: ర్యాలి రైతు కష్టాలు వస్తువుగా వచ్చిన కవిత్వంతో తేనున్న సంకలనానికి తమ కవితలు పంపాల్సిందిగా కవులను కోరుతున్నారు బన్న అయిలయ్య. చిరునామా: 2–7–1261/1, విజయపాల్ కాలనీ, హన్మకొండ–506370. ఫోన్: 9949106968
Comments
Please login to add a commentAdd a comment