Transformation
-
పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.టాప్ టెన్ సంపన్నుడుఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.కలిసొచ్చిన సెప్టెంబర్ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.అనిల్ అంబానీ నెట్వర్త్తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్‌వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు. -
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
Maanas: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్! (ఫోటోలు)
-
అంత సులభం కాదు.. రెండున్నరేళ్లు పట్టింది: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో నువ్వు -నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీకి అనితా సిద్ధమవుతోంది. టాలీవుడ్ సినీ ప్రియులను త్వరలోనే అలరించనుంది. అయితే ఇటీవల తన వెయిట్ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. గతంలో బాబు పుట్టినప్పుడు 76 కిలోలు ఉన్న అనితా ప్రస్తుతం 58 కిలోలకు తగ్గింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. 'ఇలా మారడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. మరో ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నా లక్ష్యం చాలా దూరంగా అనిపించడం లేదు. అంతా మనకు అనుకూలంగానే ఉందంటూ రాసుకొచ్చింది. కానీ ఇదంతా సులభం కాదని అనితా చెబుతోంది. అనితా మాట్లాడుతూ.. 'ఇది కచ్చితంగా కష్టమే. కానీ నేను మాత్రం తొందరపడలేదు. వెయిట్ లాస్ కోసం ఇంత సమయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా. నేను నా లక్ష్యానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నా. నటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించా. మనం అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టాక శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని' వివరించింది. సోషల్ మీడియాలో మీరు చాలా బరువు పెరిగారంటూ మేసేజులు పంపేవారని తెలిపింది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది. కాగా. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్ టెక్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ (Banco do Brasil) సేల్స్‌ఫోర్స్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్లను మెరుగుపరిచేందుకు హెసీఎల్ టెక్నాలజీస్‌ను ఎంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సేల్స్‌ఫోర్స్‌తో భాగస్వామ్యం ద్వారా హెచ్‌సీఎల్ టెక్.. బ్యాంకో డో బ్రెజిల్ కస్టమర్ రిలేషన్స్, సర్వీస్ సొల్యూషన్లను మెరుగుపరచనుంది. తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వనరులు, డేటా ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి కస్టమర్ సంతృప్తి, ఎంగేజ్‌మెంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థ లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ దాని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సేల్స్‌ఫోర్స్ అమలుకు హెచ్‌సీఎల్ టెక్‌ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకుంది. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) బ్యాంకో డో బ్రెజిల్ అవసరాలకు అనుగుణంగా సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్స్‌ను అమలు చేయడానికి హెసీఎల్ టెక్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే సంపూర్ణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నాలుగు సేల్స్‌ఫోర్స్ పరిష్కారాలను ఉపయోగించనుంది. అయితే ఈ భారీ ఒప్పందం విలువ ఎంత అనేది వెల్లడించలేదు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
తయారీలో డిజిటల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్‌ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్‌వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది. ‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్‌లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సవాళ్లను అధిగమించేందుకు.. నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్తఘోష్ తెలిపారు. -
194 కేజీల బరువున్న వైద్యుడు 110 కిలోల బరువు తగ్గాడు.. తన సీక్రెట్ ఇదేనంటూ...
శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని కొనసాగించడం ద్వారా ఎవరైనా బరువు తగ్గవచ్చని చెబుతుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఒక వైద్యుడు ఏకంగా 110 కిలోల బరువు తగ్గారు.ఈ వైద్యుని పేరు డాక్టర్ అనిరుద్ధ్ దీపక్. ఆయన సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. చెన్నైకి చెందిన ఈయన 5 అడుగుల 7 ఇంచుల ఎత్తు కలిగివున్నారు. డాక్టర్ అనిరుద్ధ్ బరువు ఒకప్పుడు 194 కిలోలు ఉండేది. అయితే ఇప్పుడు అతని బరువు 80 కిలోల కన్నా తక్కువగానే ఉంది. 194 కిలోల నుంచి 80 కిలోలకు తగ్గిన అతని ఫిట్ నెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ అనిరుద్ధ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూవుండటం అలవాటు. ఈ కారణంగానే నా శరీర బరువు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ విషయన్ని నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్ మొదలైనవాటిని ఎంతో ఇష్టపడేవాడిని. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ పొట్ట నింపేసేవాడిని’ అని తెలిపారు. 2018లో అతని ఎంబీబీఎస్ పూర్తయ్యింది. అయితే ఇంతలోనే అనిరుద్ధ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఆ సమయంలో వైద్యులు అనిరుద్ధ్తో ఇదే శరీర బరువుతో ఉంటే మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. బరువు తగ్గాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నారు. తాను బరువు తగ్గిన విధానం గురించి అనిరుద్ధ్ మాట్లాడుతూ ‘ఒక ట్రైనర్ నాకు డైట్, వర్కవుట్ ప్లాన్ చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా అనుసరిస్తూ రెండేళ్లలో 110 కిలోల బరువు తగ్గాను. రోజులో కేవలం 5 మిల్లీలీటర్ల వంట నూనెను మాత్రమే తీసుకునేవాడిని. 2000 కేలరీలు మాత్రమే ఉండేలా చూసుకున్నాను.బ్రేక్ ఫాస్ట్‌లో పోహా లేదా చపాతీ, సోయా చంక్స్, సలాడ్ తీసుకునేవాడిని. స్నాక్స్‌లో పండ్లు, బాదాం మాత్రమే తినేవాడిని. మధ్యాహ్నం భోజనంలో రైస్ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకున్నాను.ఈవెనింగ్ స్నాక్స్‌లో ప్రొటీన్, రాత్రి ఆహారంలో రైస్ లేదా రోటీ, పన్నీర్, కూర ఉండేలా చూసుకునేవాడిని. నేను ఫిట్నెస్ జర్నీ ప్రారంభించినప్పుడు లాక్డౌన్ నడుస్తోంది.దీంతో హోమ్ వర్క్అవుట్ మాత్రమే చేయగలిగాను. ఈ సమయంలో నేను డంబెల్స్, ఫ్లోస్‌తో వ్యాయామాలు చేసేవాడిని. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, జంప్ రోప్, సర్కిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ మొదలైనవి చేసేవాడిని’ అని డాక్టర్ అనిరుద్ధ్ తెలిపారు. -
ఏడు నెలల అజ్ఞాతం.. ఫ్యామిలీకి పెద్ద సర్ప్రైజ్
మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటారు పెద్దలు. కానీ, గొప్ప విజయాలు ఆగిపోయేది ప్రయత్న లోపం వల్లే!. అది గ్రహించిన ఓ వ్యక్తి.. కష్టంతో తాను అనుకున్నది సాధించాడు. అదీ ఏడు నెలల కఠోర సాధన.. ఇంటికి, స్నేహితులకు దూరంగా అజ్ఞాతవాసంలో ఉంటూ! ఐర్లాండ్ కోర్క్కు చెందిన బ్రయాన్ ఓ కీఫ్ఫె.. పాతికేళ్ల ఈ యువకుడు అతిబరువు సమస్యతో బాధపడేవాడు. 2021లో అతని బరువు అక్షరాల 154 కేజీలు. బరువు తగ్గేందుకు అతగాడు ఎంతో ప్రయత్నించాడు. ఏదీ వర్కవుట్ కాలేదు. అసలు సమస్య ఏంటో అతనికి అర్థమైంది. అది ఇంటి ఫుడ్.. తాను ఎలా ఉన్నా ఫర్వాలేదనుకుంటూ అభిమానించే అయినవాళ్లు. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దేశం విడిచాడు. సముద్రాలు దాటాడు.. స్పెయిన్‌కు చేరుకున్నాడు. బరువు బాగా తగ్గిపోవాలి. అతని ముందు ఒకే ఒక్క టార్గెట్. ఆ లక్ష్య సాధనలో కఠోర ప్రయత్నాలకు దిగాడు. ఏడు నెలలపాటు విరామం లేకుండా వ్యాయామాలు చేశాడు. ఆ క్రమంలో ఎన్నో గాయాలు. అయినా ప్రయత్నం ఆపలేదు. వాకింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. ఇలా అన్నింటిని ప్రయత్నించాడు. నెమ్మది నెమ్మదిగా వర్కవుట్లకు సమయం పెంచుకుంటూ పోయాడు. ఒకానొక టైంలో భారీ కాయంతోనే ఐదు కిలోమీటర్లను 35 నిమిషాల్లోపు పూర్తి చేశాడు కూడా. మరోవైపు బ్రయాన్ డైట్లోనూ ఎన్నో మార్పుల చేసుకున్నాడు. కేలరీలను తగ్గించుకున్నాడు. రోజుకు ఐదు గంటలపాటు వ్యాయామం చేసే స్టేజ్‌కి చేరాడు. ఏడు నెలల కఠోర ప్రయత్నం తర్వాత అతని బరువు 91 కేజీలకు చేరింది. అంటే.. 63 కేజీల బరవు తగ్గాడన్న మాట. ఆ రూపాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయాడు అతను. ఈ ఏడు నెలల కాలంలో తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరంగా ఉన్నాడతను. కేవలం క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా తెలియజేశాడే తప్ప.. వాళ్లతో వీడియో కాల్స్ సంభాషణలు, తాను ఎలా కష్టపడుతున్నాడనేది చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు వాళ్లను వీడాడో అసలు కారణమే చెప్పలేదట!. ఏడు నెలల తర్వాత బరువు తగ్గిన బ్రయాన్ ఇంటికి చేరాడు. బరువు తగ్గిన అతని రూపం.. ఇంట్లో వాళ్లను షాక్‌కు గురి చేసింది. స్నేహితులను సర్ప్రైజ్ చేసింది. ఆనందం పట్టలేకపోయారంతా. ఇప్పుడు బ్రయాన్.. తగ్గిన బరువును అలాగే కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాదు.. తన ప్రయత్నాలను వివరిస్తూ తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తున్నాడు. -
AP: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం: ‘రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన వినూత్నం.. ల్యాబ్ టూ ల్యాండ్ సాంకేతికత అద్భుతం’ అంటూ ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. వ్యవసాయాధారిత దేశాలన్నీ తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిన, ఆచరించాల్సిన సాంకేతికత పరిజ్ఞానం ఇదని వారు కితాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ సింపోజియంలో ‘వ్యవసాయ వ్యవస్థల పరివర్తన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్బీకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదవండి: మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఏపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలపై ఆ దేశాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సింపోజియంకు భారత్ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సుభాఠాకూర్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య హాజరయ్యారు. సదస్సు రెండో రోజైన శుక్రవారం మిల్లెట్ మిషన్ ఆఫ్ ఇండియాపై సుభాఠాకూర్ ప్రసంగించగా, ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, అమలుతీరుపై పూనం మాలకొండయ్య పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే.. సీఎం జగన్ ఆలోచన నుంచి పుట్టినవే.. పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యం తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నాం. పరిశోధనా ఫలితాలను నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు (ల్యాబ్ టూ ల్యాండ్) తీసుకెళ్తున్నాం. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు చేప, రొయ్య సీడ్, ఫీడ్, పశువుల దాణాలనూ ఆర్బీకేల్లో బుక్ చేసుకున్న గంటల్లోనే రైతులకు సరఫరా చేస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పుతున్నాద్దాం. ఈ–క్రాప్, ఈ–ఫిష్ బుకింగ్ ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లతోపాటు ప్రతీ ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.17వేల కోట్లతో గ్రామస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పిస్తున్నాం’.. అని పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ప్రతినిధులు త్వరలో తమ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆమె ఈ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. మా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం ఇక గేమ్ చేంజర్‌గా నిలిచిన ఆర్బీకేలు అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయని ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఆర్బీకేల గురించి తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆచరింపజేసేందుకు కృషిచేస్తామన్నారు. భారత్ వచ్చేందుకు తామూ ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ అబ్దుర్ రజాక్ కూడా చెప్పారు. థాయ్‌లాండ్‌తో పాటు యూకే, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, జపాన్, సింగపూర్, హాంకాంగ్, కంబోడియా, టాంగో, కుక్, సోలోమోన్ ఐలాండ్స్ దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, శాస్త్రవేత్తలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. అట్టడుగు స్థాయికి సేవలు సూపర్ ‘ఏపీలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అట్టడుగు స్థాయి రైతులకూ సమస్త సమాచారం, ప్రభుత్వం నుంచి సహకారం అద్భుతంగా అందుతున్నాయి. ఇది నిజంగా రైతులకు మంచి ఫలితాలిస్తోంది. అలాగే, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) కూడా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం అభినందనీయం’.. అని జర్మనీలోని హాంబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు జూలియా, రాబీర్, కార్మన్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎఫ్‌పీవోలను వారు శుక్రవారం పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. తెల్లదోమ ఆశించిన కొబ్బరి ఆకుకు డ్రైకోక్రైసా బదనికల గుడ్లు ఉన్న పేపర్ అతికించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. మన దేశంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై అధ్యయనం చేసేందుకు వారు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌పీవోలు బాగా పనిచేస్తున్నాయి జర్మనీలో సహకార వ్యవస్థ మాత్రమే ఉందని.. అదే భారత్‌లో సహకార వ్యవస్థతో పాటు ఎఫ్‌పీవోలు కూడా బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు.. వీటిని ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా నిరోధించగలదనే అంశంపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చామన్నారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, ఎఫ్పీఓల ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు.. రైతుల నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరడం మంచి పరిణామమని చెప్పారు. ఈ సందర్భంగా ఎఫ్పీఓల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబీ), వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు వై. ఆనందకుమారి, ఎన్.మల్లికార్జునరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎలియాజర్‌లతో వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలను, సన్న, చిన్నకారు రైతులు వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్ర అధికారి శ్రీకర్ దాసరి, మద్రాస్ ఐఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి రుషీకా, టాటా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సోషల్ సెక్షన్ విద్యార్థి పునీత్ పాల్గొన్నారు. -
ఎయిరిండియా.. టాటా గ్రూపు సంచలనం..కొత్త..కొత్తగా!
సాక్షి, ముంబై: ఎయిరిండియాకు సంబంధించి టాటా గ్రూపు కీలక ప్రకటన చేసింది. కొత్తపేరు, కొత్త ప్రణాళికలతో ప్రయాణికుల ముందుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘విహాన్ ఎయిరిండియా’ అనే ప్లాన్స్‌తో దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో, ఐదు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుంది. (రెసిషన్ భయాలు:రుపీ మరోసారి క్రాష్) కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమప్రతిభ, పరిశ్రమ నాయకత్వం, వాణిజ్య సామర్థ్యం అనే ఐదు కీలక లక్ష్యాలతో ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. దాని పేరు విహాన్ ఏఐ ... విహాన్ అంటే సంస్కృతంలో కొత్త శకానికి నాంది అని అర్థం. దీంతోపాటు రాబోయే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. దేశీ మార్కెట్లో ప్రస్తుతం 8 శాతంగా ఉన్న తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేలా అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచాలని భావిస్తోంది. ఇందులోనే భాగంగా నెట్వర్క్, ఫ్లీట్ రెండింటి వృద్ధిపైనా మరింత దృష్టిపెట్టనుంది. ఎయిరిండియాను దారిలో పెట్టడమే ఈ ప్లాన్ లక్ష్యమంటూ ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి, వర్క్‌ప్లేస్, వర్చువల్ కమ్యూనికేషన్ ఎంగేజ్ మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొత్తం సంస్థ ప్లాన్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక మార్పునకు నాంది ఇదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త శకానికి తొలి అడుగు.. అద్భుతమైన ఉత్సాహంతో కొత్త వృద్ధికి పునాది వేస్తున్నామని ప్రకటించారు. ఈ ట్రాన్సఫర్మమేషన్ ఇప్పటికే మొదలైంది, విమాన క్యాబిన్స్ పునరుద్ధరణ, సౌకర్యవంతమైన సీట్లు, భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ నిరంతరం యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆన్-టైమ్ పనితీరును మెరుగు, క్రియాశీల నిర్వహణ, విమాన షెడ్యూల్‌లను మెరుగుపరుస్తామని ఆయన ప్రకటించారు. -
గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: ప్రతాప్‌సింగ్.. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్.. షార్ప్ కిల్లర్ కూడా. జైలు జీవితం అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. పరివర్తన చెందిన అతడు ఇప్పుడు యోగా గురువుగా మారి ఎందరికో యోగా నేర్పుతూ.. తనలా ఎవరూ కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నాడు. అతడి గతాన్ని పరికిస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్ గఢ్ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జన్మిచాడు ప్రతాప్‌సింగ్. తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్ కలలుకన్నా నెరవేరలేదు. చదవండి: అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం పోలియో వల్ల వచ్చిన అవిటితనం కారణంగా కలని నెరవేర్చుకోలేకపోయాడు. దానికి తోడు సవితి తల్లి సూటిపోటి మాటల్ని భరించలేక ఇంటినుంచి పారిపోయి చిన్నతనంలోనే ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్ సింగ్ గ్యాంగ్ ఆగడాల కారణంగా ఢిల్లీ కల్యాణ్‌పూర్‌లో అడుగుపెట్టాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్టే. అతీ సమీపానికి వెళ్లి గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్తుందనే పేర్కొంది. జైలులోనే పరివర్తన పదహారు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌సింగ్ ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఖైదీలలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. అందులో ఇంటర్మీడియెట్, టెన్త్ చదివిన 30 మందిని ఎంపిక చేశారు. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ప్రతాప్‌సింగ్ తాను యోగా నేర్చుకుంటానని పట్టుపట్టడంతో అతడికీ యోగా నేర్పించారు. 9 నెలల శిక్షణలో ధ్యానం, జపం నేర్చుకుని పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి నూతన జీవితం వైపు ప్రయాణిస్తానని, తిరిగి ఎప్పుడూ అటూవైపు వెళ్లనని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే శిక్షా కాలం పూర్తయ్యాక నలుగురికీ యోగా నేర్పుతూ అదర్శప్రాయంగా ఉంటున్నాడు. గుంటూరులో కలెక్టర్ తన యోగా విన్యాసాలను చూసి మెచ్చుకున్నారని.. తాను గ్యాంగ్‌స్టర్‌ని అయినా.. తనలో వచ్చిన మార్పు చూసి కలెక్టర్ మెచ్చుకోవడం కంటే సంతృప్తి తనకు ఏముంటుందని ప్రతాప్‌సింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అనర్థాలను వివరిస్తూ.. ఇప్పుడు యోగా శిక్షకుడుగా పలువురికి యోగా నేర్పుతూ తనలా ఎవరి జీవితం చీకటి కోణంలోకి వెళ్లకూడదని ప్రతాప్‌సింగ్ హితవు చెబుతున్నాడు. యోగాతోపాటు చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురిలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ రాజమహేంద్రవరంలోని అనం కళా కేంద్రంలో మంగళవారం ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్‌సింగ్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ సన్మానించారు. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు. -
మౌలిక మార్పులే లక్ష్యంగా...
ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్ జగన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత -
'మిర్చి' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించిన రీచాకు మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. హీరోయిన్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ అందుకున్నా సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమ పెళ్లి చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రీచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో రీచా నీలం రంగు లంగావోణీలో అందంగా కనిపించింది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
శింబు: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్..ఫోటో వైరల్
కోలీవుడ్ హీరో శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'వెందు తానింధుడు కాదు'. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గిన శింబు సరికొత్త లుక్‌లో అలరిస్తున్నారు. లేటెస్ట్గా తన ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో క్లీన్‌షేవ్‌తో స్టైలిష్ లుక్‌లో శింబు కనిపిస్తున్నారు. కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
కథ డిమాండ్ చేస్తే నేను తగ్గడానికి రెడీ: షాలినీ పాండే
విజయ్ దేవరకొండను స్టార్‌ని చేసిన ‘అర్జున్ రెడ్డి’ని గుర్తుకు తెచ్చుకోండి. అదే సినిమాతో హీరోయిన్గా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు షాలినీ పాండే. ఆ సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందుకు ఉదాహరణ ఇక్కడున్న ఫొటో. హిందీ సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం ఇలా సన్నబడ్డారు షాలిని. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్‌గా చేశారు. ఈ పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గారు. ఈ విషయం గురించి షాలినీ పాండే మాట్లాడుతూ – ‘‘బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా మన శరీరాన్ని కష్టపెడతాం. కఠినమైన వర్కవుట్స్‌తో పాటు ఆహారం విషయంలోనూ చాలా నియమాలు పాటిస్తాం. అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే నేను తగ్గడానికి రెడీ.. పెరగడానికి కూడా రెడీయే. మనం ఎంత బాగా నటించినా, క్యారెక్టర్‌కి తగ్గట్టుగా శరీరాకృతి లేకపోతే చూడ్డానికి బాగుండదు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం నేనెక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. వేరే వర్కవుట్స్, ప్రత్యేకమైన డైట్‌తో పాటు ఈ ప్రాక్టీస్ కూడా నేను సన్నబడ్డానికి హెల్ప్ అయింది’’ అన్నారు. ఇంకా అమ్మాయిల శరీరాకృతి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని చెబుతూ – ‘‘అమ్మాయిలంటే ఇలా ఉండాలనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకని కొందరు అమ్మాయిలు ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే నా మటుకు నేను ఎలా ఉన్నా ఒత్తిడి ఫీల్ కాను. ఇప్పుడు తగ్గానంటే సినిమాలో క్యారెక్టర్ కోసమే. పాత్రకు తగ్గట్టు ఒదిగిపోగలిగినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు షాలిని. ఆ సంగతలా ఉంచితే చక్కనమ్మ చిక్కినా చక్కనే అన్నట్లుగా షాలినీ ఉన్నారు కదూ. -
బాప్రే.. గుర్తుపట్టలేనంతలా మారిపోయిన హీరో
వయసుపైబడే కొద్దీ హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక హీరోల్లో కూడా కొందరుపడే తాపత్రయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, సినిమా కోసం ఎంతటి కష్టానినైనా ఒర్చుకునే ‘డెడికేటెడ్ యాక్టర్స్’ కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రాజర్ ఒకరు. మమ్మీ సిరీస్ సినిమాలతో మనదగ్గరా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గుర్తుపట్టలేనంతలా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రెండన్ ఫాజర్.. జార్జ్ ఆఫ్ ది జంగిల్, మమ్మీ, బ్రేక్ అవుట్ లాంటి సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 52 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్ శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘నో సడన్ మూవ్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యాడు. అయితే బయట ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయనెవరో అనుకుని చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి.. నటుడు డాన్ చెడల్ ఆయన దగ్గరికి రావడంతో.. అప్పుడు విషయం తెలుసుకుని ఫ్రాజర్‌ను క్లిక్ మనిపించారు. ఫ్రాజర్ ప్రస్తుతం ‘ది వేల్’ అనే ప్రాజెక్టు చేస్తున్నాడు. కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నించే తండ్రి క్యారెక్టర్ అందులో ఆయనది. తన పార్ట్నర్ చనిపోయాక ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడే ఛార్లీ పాత్రలో ఫ్రాజర్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసమే ఇంత భారీగా లావుగా తయారయ్యాడు ఫ్రాజర్. 2018లో ఓ ఇంటర్వ్యూలో బ్రెండన్ ఫ్రాజర్ తన ఫెయిల్యూర్ ఫిట్నెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రియల్ స్టంట్లకు కోసం తన ఒళ్లు హూనం చేసుకున్నానని, ఇకపై అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. ఇక ఆరోగ్య సమస్యలతోనే 2014 నుంచి ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఫ్రాజర్. అంతేకాదు గతంలో తనకు చాలా సర్జరీలు జరిగాయని, వెనుక పిరుదుల దగ్గర భాగం తొలగించుకోవడం, వెన్నెముకకు సర్జరీ, మోకాలి చిప్ప రిప్లేస్మెంట్, గొంతు భాగంలో ఆపరేషన్లు చేయించుకున్నానని, వాటి ప్రతికూల ప్రభావమూ తన శరీరంపై పడిందని గుర్తు చేసుకుని బ్రెండన్ ఫ్రాజర్ బాధపడ్డాడు. చదవండి: జస్టిస్ లీగ్.. పోర్న్ సినిమానా? -
Virtual Fashion Week: వర్చువల్ ఎంపిక
కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగినప్పటికీ నిశితంగా పరిశీలిస్తే మొత్తం లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాలు 8 నుండి 10 శాతం మాత్రమే ఉందని నిపుణుల అంచనా. ఫలితంగా ప్రఖ్యాత డిజైనర్లు సైతం వర్చువల్‌కి మారారు. ర్యాంప్వాక్లతో ధగధగలాడే ఫ్యాషన్ షోలు సైతం వర్చువల్ దారిలోకి వచ్చేశాయి. అటు నుంచి టైలరింగ్, డిజైనింగ్‌లో శిక్షణ కూడా డిజిటల్లో వెలుగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత డిజైనర్లు మనీష్ మల్హోత్రా, రితుకుమార్, రీనా ఢాకా, బినా రమణి, సమంతా చౌహాన్,.. వంటి వారెందరో వర్చవల్ వేదికకు రంగం సిద్ధం చేసుకున్నారు. విదేశాలలో ఊపందుకున్న వర్చువల్ రియాలిటీ ఇప్పుడు దేశీయంగానూ ఫ్యాషన్ రంగంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఫ్యాషన్ షోలు ఫ్యాషన్ షో అనగానే జిగేల్మనే లైట్లు, మోడళ్ల మెరుపులు, ర్యాంప్‌వాక్‌లు, ఆహుతుల చప్పట్ల హోరు గ్రాండ్‌గా కళ్ల ముందు నిలుస్తుంది. మహమ్మారి కారణంగా ర్యాంప్ వేదికలు వర్చువల్‌గా మారాయి. ర్యాంప్‌లను గ్రీన్ స్క్రీన్లతో రియల్ టైమ్ కంపోజిషన్స్ భర్తీ చేశారు. ఇప్పుడు ఎవ్వరైనా తమ గదిలో కూర్చునే డిజిటల్లో ఈ ర్యాంప్ షోలను వీక్షించవచ్చు. ఇండియా కొచర్ వీక్, బ్లెండర్స్ ఫ్యాషన్ ప్రైడ్, ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ షో కూడా వర్చువల్‌లోనే నడిచింది. ఇవన్నీ దేశ విదేశాల నుండి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవే. వర్చువల్‌లో లో దుస్తులు, ఇతర సౌందర్య సాధనాలు, మేకప్ లుక్స్ కూడా ప్రదర్శించడం, వాటిని కోట్లాదిమంది వీక్షించడం ప్రస్తుత ట్రెండ్‌కు నిదర్శనంగా ఉంది. షాపింగ్ లగ్జరీ డిజైన్స్ సృష్టించే డిజైనర్లు్ల కేవలం ఆన్లైన్ అమ్మకాల ద్వారా ప్రయోజనం పొందలేమని గుర్తించారు. కస్టమర్లు నేరుగా షాప్‌ను సందర్శించి, డిజైన్లు చూసే అనుభూతిని పొందుతారని, అప్పుడే వారు ఆర్డర్లు ఇవ్వడానికి, కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని గ్రహించారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం వినియోగదారుడిని నేరుగా షాప్‌కి రప్పించలేని పరిస్థితి. ఫలితంగానే భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ కొనుగోలు విధానంలో వర్చువల్ మార్పు బాణంలా దూసుకొచ్చింది. ఇండియాలో మొదటిసారి పూర్తి వర్చువల్ స్టోర్‌ను మనీష్ మల్హోత్రా ప్రారంభించాడు. ఆ తర్వాత అదే దారిలో ప్రఖ్యాత డిజైనర్లు ప్రయాణిస్తున్నారు. గ్రాండ్‌గా డిజైన్ చేసే బ్రైడల్ దుస్తుల డిజైనర్లు ఇదే కోవలో పయనిస్తున్నారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్‌బాటలో నడుస్తోందన్నది డిజైనర్ల అభిప్రాయం. డిజైనింగ్ క్లాసులు టైలరింగ్‌కు వర్చువల్ క్లాసులు తలుపులు తెరిచాయి. సాధారణ స్థానిక టైలరింగ్ నుంచి ప్రసిద్ధ డిజైనర్ల వరకు ఆన్లైన్ వేదికగా క్లాసులు తీసుకుంటున్నారు. ఫ్యాషన్ అకాడమీలు కూడా ఇదే బాట పట్టాయి. విద్యార్థులకు ఇచ్చే క్లాసులన్నీ ఆన్లైన్ వేదిక అయినట్టుగానే ఫ్యాషన్ క్లాసులూ డిజిటల్ అయ్యాయి. డ్రెస్ డిజైన్స్, ఇలస్ట్రేషన్లు, ఎంబ్రాయిడరీ, కటింగ్ పద్ధతులు.. వంటివి వర్చువల్ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి డిజైనర్‌ను బట్టి కొంత మొత్తం చెల్లించి, అటెండ్ అవ్వచ్చు. ఒక రోజు నుంచి మొదలయ్యే ఆన్లైన్ వర్క్‌షాప్స్‌కి అటెండ్ అయ్యి డిజిటల్లోనే నేర్చుకోవచ్చు. ఆసక్తిగా డిజైనింగ్ ప్రస్తుత కాలం ఫ్యాషన్ షోలు, షాపింగ్ కొంతవరకు సరైనదే. అయితే, సాధారణంగా మనం ఫ్యాబ్రిక్‌ని టచ్ చేస్తే ఉండే ఫీల్ డిజిటల్లో చూస్తే రాదు. డిజిటల్లో ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తెలుసుకోవడమూ కష్టమే. కాకపోతే డిజిటల్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు అవతలి వ్యక్తి అటెన్షన్ ఏ విధంగా ఉందనే విషయం అంతగా తెలియడం లేదు. అవతలి వ్యక్తి మనం చెప్పే విషయం పట్ల ఎంతసేపు అటెన్షన్ పెట్టగలుగుతున్నారనేది ముఖ్యం. క్లాస్ చెబుతున్నప్పటికీ వర్చువల్‌గా కమ్యూనికేషన్ అంతగా జరగడం లేదు. అందుకే, డిజిటల్లో క్లాస్ తీసుకునేప్పుడు సదరు వ్యక్తి తక్కువ టైమ్ కేటాయించి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. క్లాస్ బోర్ ఉండకూడదు. నేర్చుకునేవాళ్లు కూడా వాళ్లకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండాలి. రొటీన్‌గా చెబుతూ పోతే ఇటు మాస్టర్‌కి, అటు విద్యార్థికీ ఆసక్తి ఉండదు. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్ -
ఆ నియమం పెట్టుకున్నా : హీరోయిన్ తాప్సీ
అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ పన్ను. తన సినిమాల్లో మహిళ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ మరోవైపు విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో సడన్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చిన తాప్సీ.. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూ బిజీబిజీగా మారారు. ప్రస్తుతం ఆమె 'రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోకస్ పెడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు పెద్దగా జిమ్‌లో గడపని ఆమె..ఈ చిత్రం కోసం ప్రత్యేక కసరత్తులు నేర్చుకున్నారు. (తాప్సీకి ఛలానా విధించిన పోలీసులు) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) సినిమా ప్రారంభానికి ముందే 'నో స్టెరాయిడ్స్' అనే నియమం పెట్టుకున్నానని, సహజమైన పద్దతుల ద్వారా తన శరీరాన్ని ఎంత ధృడంగా మార్చుకుందో తెలియచేస్తూ.. దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ వీడియోను తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆర్డినరీ మనుషులు ఎక్స్ట్రార్డినరీ పనులు చేయాల్సి ఉంటుందంటూ ట్యాగ్‌లైన్‌ను జతచేస్తూ చిన్నప్పటి నుంచి తాను క్రీడల్లో పాలుపంచుకున్న విశేషాలను షేర్ చేశారు. ఈ సినిమా కోసం తాప్సీ ప్రత్యేక డైట్ తీసుకుంటూ అనేక వ్యాయామాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఇక రష్మి రాకెట్ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో ప్రియాన్షు పెన్యూలీ నటించారు. (వైరలవుతున్న పవన్ భార్య ఫోటోలు) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
ఫిజిక్ ఫేమ్... ట్రాన్స్‌ఫార్మ్!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు అధికబరువు ఉండేవాళ్లు బరువు తగ్గితే చాలు అనుకునేవారు. తర్వాత స్కిన్ టోనింగ్ కావాలని, శరీరం మంచి షేప్ కావాలని.. అలా అలా వారి ఆకాంక్షలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కోరుకుంటున్నారు. ఫిట్నెస్ ప్రియులను ట్రాన్స్ఫార్మేషన్ ట్రెండ్ పట్టి కుదిపేస్తోంది. ఆద్యంతం తమ రూపాన్ని మార్చేసుకునేలా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తి ఇంతింతై విస్తరిస్తోంది. ఈ ఆసక్తి, అభిరుచి వల్ల కొన్ని నెలల గ్యాప్‌లోనే ఓ వ్యక్తి పూర్తిగా కొత్త రూపంలో దర్శనమిస్తుండడం పరిచయస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిటీలో ఇటీవలే ప్రారంభమైన ట్రాన్స్ఫార్మేషన్ ట్రెండ్ మరింత మందిని రూపాంతరం చెందించే దిశగా దూసుకుపోతోంది. బీపీ పేషెంట్ టూ సూపర్ ఫిట్ ‘పని ఒత్తిడి, అధిక బరువు వంటి వాటి వల్ల నాకు 28 ఏళ్ల వయసులోనే బి.పి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి రోజూ 40 ఎం.జి వరకూ బీపీ టాబ్లెట్ వేసుకునేవాడ్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు కొంపల్లి నివాసి నర్వీర్ జాదవ్. జహీరాబాద్ నివాసి అయిన నర్వీర్...తనకు బీపీ సమస్య ప్రారంభమైన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు 28 ఏళ్ల కుర్రాడిలా మారారు. ‘అధికబరువుతో పాటు నన్ను వదలకుండా వెంటాడిన రక్త పోటు సమస్య పూర్తిగా దూరమైంది. ఇప్పుడు కనీసం రోజుకు 10 కి.మీ అవలీలగా పరిగెత్తగలను...’అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. యుక్తవయసులో పేషెంట్‌గా మారిన ఆయనను మధ్య వయసులో ఆరోగ్యవంతుడిగా మార్చిన మార్గం ట్రాన్స్ఫార్మేషన్. ఆరు నూరైనా ఆరోగ్యం సాధించాలనుకున్నా...అంటూన్న నర్వీర్ తన ట్రాన్స్ఫార్మేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ‘చిన్న వయసులో బీపీ రావడం వల్ల బరువు తగ్గాల్సిందేనని వైద్యులు గట్టిగా చెప్పారు. వెంటనే న్యూట్రిషనిస్ట్ డా.అశ్వినిని కలిసి, డైట్ చార్ట్ తీసుకున్నా. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత నెమ్మదిగా కొత్త డైట్‌కి అలవాటు పడ్డా. రెండు నెలల్లోనే 8కిలోలు తగ్గా. ఆ తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్‌ని కలిశా. వెయిట్ తగ్గాలని, కాస్త బాడీ షేప్ రావాలని అనుకుంటున్నట్టు చెప్పా. అప్పుడే ఆయన ఫుల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి చెప్పారు. తొలుత కొంచెం సంశయించినా...ఆయన ఇచ్చిన ధైర్యంతో సరే అన్నా. అక్కడి నుంచి ఏడాదిలో 86 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గిపోయాను. దశలవారీగా వర్కవుట్స్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ కఠినమైన వర్కవుట్స్, ఫుడ్ చార్ట్‌తో ఫిజిక్‌ని మార్చుకున్నాను. అదే ఊపులో మూడు నెలల కాలం టార్గెట్గాపెట్టుకుని సిక్స్‌ప్యాక్ కూడా సాధించాను. రోజుకి 20 వైట్ ఎగ్స్, స్టీమ్డ్ ఫిష్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, 2.30గంటల వ్యాయామం, యోగా...ఇవన్నీ నా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగం అయ్యాయి’’ అంటూ వివరించారు నర్వీర్. ఆద్యంతం.. అపు‘రూపం’.. శరీరం మొత్తాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు లోపాలన్నీ తొలగించుకోవడం ద్వారా పూర్తి కొత్త రూపాన్ని సంతరించుకోవడమే ‘ట్రాన్స్ఫార్మేషన్’గా ఫిట్నెస్ పరిశ్రమ నిర్వచిస్తోంది. దీని కోసం ఏడాది ఆ పైన వ్యవధి నిర్ణయిస్తోంది. ‘వర్కవుట్ ప్రారంభించేటప్పుడు ఒక రకమైన లక్ష్యంతో ఉండి, ఆ తర్వాత అది వదిలేసి ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి..ఇలా మార్పు చేర్పులు చేయడం సర్వసాధారణం. అలాంటివేమీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక ఫిట్నెస్ అజెండా రూపొందించుకుని అమలు చేసి రిజల్ట్స్ సాధించేలా చేస్తుంది ట్రాన్స్ఫార్మేషన్’ అని చెప్పారు టార్క్ ఫిట్నెస్ స్టూడియోకు చెందిన ట్రైనర్ ఎమ్.వెంకట్. ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా నిర్ణీత వ్యవధి నిర్ణయించుకుని దాని ప్రకారం ఓ వైపు బరువు తగ్గడం, మరోవైపు శరీరాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా దీని కోసం సంపూర్ణమైన డైట్, వర్కవుట్, అన్నీ ముందే నిర్ణయించుకుని రంగంలోకి దిగుతారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేవరకూ అందులో మరీ అవసరమైతే తప్ప మార్పు చేర్పులు చేయరు. ఈ తరహా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ఎంచుకుని విజయాలు సాధిస్తున్నవారు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రకాలుగా...కొత్తగా హోల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ వల్ల కేవలం రూపంలో మాత్రమే కాదు ఆలోచనా ధోరణిలో కూడా బాగా మార్పు వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ కాదు కాబట్టి వ్యక్తి జీవనశైలి కూడా మారిపోతుంది. ఒక 15ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ వయసు తగ్గినట్టు కనిపిస్తాం. తద్వారా యుక్తవయసులో మాత్రమే కనిపించే అద్భుతమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. –ఎమ్.వెంకట్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
అందాల నటి.. గుర్తుపట్టలేనంతగా..!
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్ ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్ మరెవరో కాదు.. తెలుగు తెరకు హర్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయిన అదా శర్మయే ఈ కూరగాయలమ్మే అమ్మాయి. హర్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ అదా శర్మ. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ లాంటి సినిమాల్లో కనిపించిన అదా.. హీరోయిన్గా స్టార్ ఇమేజ్ను మాత్రం అందుకోలేకపోయారు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ తో పాటు అదా శర్మకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తరువాత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ బాట పట్టారు. ఇటీవల ఎక్కువగా ఫొటోషూట్స్తోనే కాలం గడిపేస్తున్న ఈ బ్యూటీ త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసమే అదా ఈ డీగ్లామర్ లుక్‌లో ఫొటో షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అదా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రారండోయ్
కాలువ మల్లయ్య ‘కులరహిత భారతం’, ‘ద జర్నీ టువర్డ్స్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు హిమాయత్ నగర్‌లోని బీసీ భవన్లో జరగనుంది. నిర్వహణ: సమాంతర పబ్లికేషన్స్ ఎన్.గోపి ‘జలగీతం’కు ఎం.నారాయణశర్మ సంస్కృత అనువాదం ‘జలగీతమ్’; ‘జలగీతం– కావ్యసమాలోచనమ్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం ఆరింటికి రవీంద్ర భారతిలో జరగనుంది. ఆవిష్కర్తలు: రమణాచారి, జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి. నిర్వహణ: దక్కన్ సాహిత్య సభ. ‘సినారె సాహితీ వైజయంతి’లో భాగంగా జూన్ 12న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘సినారె యాత్రా సాహిత్య విశిష్టత’పై ఆర్.అనంత పద్మనాభరావు ప్రసంగిస్తారు. నిర్వహణ: ఆచంట కళాంజలితో పాటు భావ సారూప్య సాహిత్య సాంస్కృతిక సంస్థలు. శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్ 14న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ జూన్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో’ ఆవిష్కరణ జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాంలో జరగనుంది. ఆవిష్కర్త: మల్లాడి కృష్ణారావు. నిర్వహణ: కవిసంధ్య, స్ఫూర్తి సాహితి బాలాంత్రపు రజనీకాంతరావు సంస్మరణ సభ జూన్ 17న సాయంత్రం 5:30కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరగనుంది. నిర్వహణ: ఛాయ. మల్లెతీగ పురస్కారాల ప్రదానం జూన్ 17న సాయంత్రం 6 గంటలకు మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరగనుంది. ప్రధాన పురస్కార గ్రహీత: ర్యాలి రైతు కష్టాలు వస్తువుగా వచ్చిన కవిత్వంతో తేనున్న సంకలనానికి తమ కవితలు పంపాల్సిందిగా కవులను కోరుతున్నారు బన్న అయిలయ్య. చిరునామా: 2–7–1261/1, విజయపాల్ కాలనీ, హన్మకొండ–506370. ఫోన్: 9949106968 -
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో జీడీపీకి 154 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జోరు కనిపిస్తోంది. 2021 నాటికి భారత్ జీడీపీకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల 154 బిలియన్ డాలర్లు సమకూరుతాయని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్, ఐడీసీ సంయుక్తంగా ‘అన్లాకింగ్ ద ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆసియా పసిఫిక్’ పేరుతో సర్వే నిర్వహించాయి. ఇందులో ఇండియా, ఆసియా–పసిఫిక్ దేశాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించింది. ‘2017లో దేశ జీడీపీలో దాదాపు 4 శాతం డిజిటల్ ప్రొడక్ట్స్ సహా మొబిలిటీ, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి డిజిటల్ టెక్నాలజీల వినియోగం ద్వారా ఏర్పడిన సర్వీసుల వల్ల వచ్చింది’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో దేశ జీడీపీలో దాదాపు 60 శాతం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రెండ్‌తో అనుబంధం కలిగి ఉంటుందని అంచనా వేశారు. ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇండియా దూసుకెళ్తోంది. వివిధ ఆర్గనైజేషన్లు ఏఐ వంటి వర్ధమాన టెక్నాలజీల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీనివల్ల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో బలమైన వృద్ధి నమోదు కానుంది’ అని పేర్కొన్నారు.