
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించిన రీచాకు మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ అందుకున్నా సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది.
ఆ తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమ పెళ్లి చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రీచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో రీచా నీలం రంగు లంగావోణీలో అందంగా కనిపించింది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment