Richa Gangopadhyay
-
మన ప్రపంచాలు వేరు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన హీరోయిన్
మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గుర్తుందా? లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రిచా. తొలి చిత్రంతోనే క్లిక్ అయిన ఈ బ్యూటీ మిర్చి, నాగవల్లి, సారొచ్చారు.. ఇలా పలు సినిమాలు చేసింది. కానీ తర్వాత పెద్దగా సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన ఈ బ్యూటీ 2019లో ప్రియుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. తాజాగా రిచా గంగోపాధ్యాయ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. 'నాలుగేళ్ల క్రితం ఓ అద్భుతమైన వ్యక్తికి నేను ఓకే చెప్పాను. మా ఇద్దరిదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. మా ప్రత్యేకమైన మార్గాలు.. ప్రేమ, పరస్పర గౌరవం, అందమైన కలలు సాకారం చేసుకునే క్రమంలో సంపూర్ణంగా కలిసిపోయాయి. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన జీవితాన్ని గడిపాం. మన భవిష్యత్తు మరింత సుమధురంగా ఉండబోతుంది. నీ జీవితాన్ని నాతో పంచుకున్నందుకు థాంక్యూ జో.. హ్యాపీ ఫోర్త్ యానివర్సరీ..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. రెండు భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అనేందుకు మీరే ప్రత్యక్ష ఉదాహరణ.. పెళ్లిరోజు శుభాకాంక్షలు అని రిచాకు అభిమానులు విషెస్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) చదవండి: పరువు తీసుకున్న తేజ.. ఆవిడే ఎలిమినేట్ అయిందా? -
'మిర్చి' హీరోయిన్ ఇప్పుడెలా ఉంది? భర్త,కొడుకును చూశారా?
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిచా ఆ తర్వాత ‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించింది. ప్రభాస్ సరసన నటించిన మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సక్సెస్‌ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది.2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన రీచా ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మథర్స్ డే సందర్భంగా కొడుకుతో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంది.అమ్మగా మారి రెండు సంవత్సరాలు అవుతోంది. తల్లి కావడం గొప్ప బహుమతి అంటూ కొడుకుతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) -
'మిర్చి' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించిన రీచాకు మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. హీరోయిన్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ అందుకున్నా సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమ పెళ్లి చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రీచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో రీచా నీలం రంగు లంగావోణీలో అందంగా కనిపించింది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిర్చి’ హీరోయిన్
నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడనే శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించారు. బాబుకు ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. తన ముద్దుల తనయుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మా చిరు సంతోషం.. లుకా షాన్. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం. లుకా ఆరోగ్యంగా, ఆనందంగా, అచ్చం తన తండ్రి పోలికలతో ఉన్నాడు. లుకా.. నీ నువ్వు మా జీవితాల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా రిచా తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను సీక్రెట్‌గా వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తను పెళ్లి చేసుకున్న విషయాన్ని కొద్ది రోజుల తర్వాత ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. అలాగే తన తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ను కూడా రహస్యంగా ఉంచిన ఆమె కొద్ది రోజుల కిందట బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి అసలు విషయం బయటపెట్టారు. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన రిచా.. గత నెల 27న పండంటి మగ బిడ్డ పుట్టాడంటు ఈ సారి కూడా కాస్త ఆలస్యంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తమకు పుట్టిన చిన్నారి ఫొటోలను కూడా రిచా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రిచా. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమా కనిపించిన రిచా ఆ తర్వా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్ స్కూల్లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) చదవండి: Adipurush: ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్! లైవ్‌లో నీ వయసు అదేనా అని అడిగిన నెటిజన్, హీరోయిన్ కౌంటర్ -
తల్లి కాబోతున్న 'మిర్చి' హీరోయిన్
'లీడర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత 'నాగవల్లి' సినిమాలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. 'మిరపకాయ్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రిచాకు తమిళ, బెంగాలీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో 'ఆరడుగుల అందగాడు నన్ను బాబీగర్ల్ అన్నాడు..' అంటూ ప్రభాస్‌తో మిర్చిలో సెకండ్ హీరోయిన్గా నటించి, అతడితో ఆడిపాడింది. ఈ సినిమాతో కుర్రకారుల మనసు దోచిన బేబీ డాల్‌గా ఉన్న ఆమె 2013లో సినిమాలకు స్వస్తి పలికింది. 2019 డిసెంబర్లో అమెరికాలోని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు జో లాంగేల్లాను పెళ్లాడింది. తాజాగా ఆమె తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కొంతకాలంగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు మీ అందరితో దాన్ని షేర్ చేసుకుంటున్నందుకు జో, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జూన్‌లో బేబీ లాంగేల్లా రాబోతోంది. ఆ క్షణం కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూడనున్న రిచాకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) చదవండి: సన్నీడియోల్ మొదట ప్రేమించింది ఎవరినంటే? సన్నీలియోన్ భర్తకు షాకిచ్చిన డ్రైవర్ -
హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ ఫోటోలు
-
ఏడడుగులకు రెడీ
సగం పెళ్లి చేసుకున్నారు కథానాయిక రిచా గంగోపాధ్యాయ్. అదేనండీ ఆమె నిశ్చితార్థం జరిగిందని సరదాగా అలా చెబుతున్నాం. ఈ విషయాన్ని రిచా అధికారికంగా వెల్లడించారు. ‘‘నా నిశ్చితార్థం పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా కాబోయే భర్త జోను నేను ఓ బిజినెస్ స్కూల్లో కలుసుకున్నాను. రెండేళ్లు అద్భుతంగా గడిచాయి. నా జీవితంలో నెక్ట్స్ ఫేజ్(పెళ్లి తర్వాతి జీవితం) గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పెళ్లి తేదీ నిర్ణయించలేదు’’ అని పేర్కొన్నారు రిచా. ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రిచా ఆ తర్వాత ‘నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి’ వంటి సినిమాల్లో నటించారు. 2013లో ‘భాయ్’ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ‘ఇక సినిమాలకు ఫుల్స్టాప్ పెడుతున్నా’ అని ప్రకటించి ఆమె అమెరికా వెళ్లిపోయారు. -
‘మిర్చి’ భామకు పెళ్లి కుదిరింది..!
రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తరువాత మిరపకాయ్, మిర్చి సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే భాయ్ సినిమా తరువాత నటనకు బ్రేక్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తరువాత అభిమానులకు దూరమైన ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. తనకు బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్) అవార్డును అందుకున్నారు. Just wanted to share that I am engaged ❤! Joe and I met in business school and it has been two wonderful years! Looking forward to the next phase of my life. Wedding date not set yet!😊 pic.twitter.com/7ozwry8Zg9 — Richa Gangopadhyay (@richyricha) 15 January 2019 -
నటన మానేసి, వేరే లెవల్‌కు వెళ్లిపోయా..
సాక్షి, తమిళసినిమా: తాను నటనకు టాటా చెప్పి చాలా కాలం అయిందని నటి రిచా గంగోపాధ్యాయ చెప్పింది. ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషల్లో చాలా తక్కువ చిత్రాలే చేసింది. అయితే మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ నటించింది యువ స్టార్స్‌తోనే అయినా పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయింది. తమిళంలో ధనుష్‌కు జంటగా మయక్కం ఎన్న, శింబుతో ఓస్తీ చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు రిచాను చాలా నిరాశ పరచాయనే చెప్పాలి. తెలుగులో రానాతో కలిసి లీడర్ చిత్రంతో పరిచయం అయిన ఈ బ్యూటీ, ఆ తరువాత రవితేజకు జంటగా మిరపకాయ్, నాగార్జునతో భాయ్, ప్రభాస్‌కు జంటగా మిర్చి వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించినా ఎందుకనో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. మధ్యలో ప్రేమ వ్యవహారంలో పడటంతో కేరీర్ వెనకపడిందనే ప్రచారం జరిగింది. మొత్తం మీద నాలుగేళ్లు సినిమాల్లో నటించిన రిచా గంగోపాధ్యాయ నటనకు గుడ్‌బై చెప్పి నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. యూఎస్ఏకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేసిందట. తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ అమ్మడిని మళ్లీ ఎప్పుడు నటిస్తారన్న అభిమానుల ప్రశ్నకు బదులుగా.. ‘నటనకు గుడ్‌బై చెప్పి దాదాపు ఐదేళ్లు అయింది. ఇప్పుడు వేరే లెవల్‌కు వెళ్లా. ఇకపై నటించాలన్న ఆశ లేదు..’అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రిచా ఆ వేరే లెవల్ ఏమిటబ్బా అని ఆరా తీసే పనిలో పడ్డాయి సినీ వర్గాలు. -
ఆశలొద్దు: నటనకు హీరోయిన్ గుడ్ బై!
సాక్షి, సినిమా: తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నటి రిచా గంగోపాధ్యాయ్. నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. కానీ అవకాశాలు రావడం లేదనో, లేక ప్రాధాన్యమున్న పాత్రలు దక్కడం లేదనో గానీ గత నాలుగేళ్లుగా సినీ ఇండస్ట్రీకి రిచా దూరంగా ఉంటున్నారు. నటనకు గుడ్ బై చెప్పానని తనమీద ఇక ఆశలు పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 'లీడర్'తో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆపై ప్రభాస్‌తో మిర్చి, రవితేజతో సారొచ్చారు, మిరపకాయ్ మూవీలు.. వెంకటేశ్‌తో నాగవల్లి మూవీలో నటించారు. చివరగా నాగార్జునతో భాయ్ చిత్రంలో నటించారు. 2013లో భాయ్ విడుదలైంది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయారు. ఇటీవల ట్విట్టర్ ద్వారా రిచా తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు స్వయంగా తెలిపారు. ఆమె ఫాలోయర్లు కొందరు.. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి.. మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారు అంటూ హీరోయిన్ రిచాకు తెగ ట్వీట్లు చేస్తున్నారట. దీంతో తన అభిమానులు, ట్విట్టర్ ఫాలోయర్లకు ఆమె వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. 'నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. కానీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చివరి మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. నా వివరాలు గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో వేరే దశలో ఉన్నాను. ఇందులో నటన అనే అంశమే లేదంటూ' సినిమాలకు గుడ్ బై చెప్పేశానని నటి రిచా గంగోపాధ్యాయ్ వరుస ట్వీట్లు చేశారు. Cont’d....Short answer: I am in a new phase of life, no acting ambitions in it :) — Richa Gangopadhyay (@richyricha) 22 October 2017 For those still asking “when is my next movie” after almost 5 years of my exit from films...Google is your friend ;). Also see pinned tweet — Richa Gangopadhyay (@richyricha) 22 October 2017 -
కథ పాతదే... కొత్తగా 'భాయ్' !
తెలుగు చలన చిత్ర సీమలో ఇటీవల కాలంలో ఏ నటుడు చేయనన్ని ప్రయోగాలు చేసి అక్కినేని నాగార్జున అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలు నటుడిగా నాగార్జున అభిరుచికి, తపనకు అద్దపట్టాయి. నాగార్జున టెస్ట్ కు అనుగుణంగా టాలీవుడ్ లో దర్శకులు కూడా ఆయననొక ప్రయోగశాలగా చేసుకున్నారు. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేయడం శివతో ప్రారంభించి.. ఇంకా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఎప్పటికప్పడూ ట్రెండ్ బేరీజు వేసుకుంటూ తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నాగార్జున తాజాగా వీరభద్ర చౌదరీ దర్శకత్వంలో భాయ్ గా ఓ ఢిఫెరెంట్ లుక్, స్టైల్ తో ముందుకు వచ్చాడు. ఇప్పటికే దర్శకుడు వీరభద్ర చౌదరీ రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుని.. హ్యట్రిక్ ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో భాయ్ చిత్రం ద్వారా ముందుకు వచ్చాడు. అత్తారింటికి దారేది ద్వారా సూపర్ హిట్ ఆడియోను అందించిన దేవి శ్రీ ప్రసాద్, నాగార్జున, వీరభద్ర చౌదరీ కాంబినేషన్ లో వచ్చిన భాయ్ ఎలా ఉన్నాడో చూసొద్దాం! హంకాంగ్ లో మాఫియా కార్యక్రమాలు నిర్వహించే డాన్ (ఆశిష్ విద్యార్ధి)కు విజయ్ అలియాస్ భాయ్ (నాగార్జున) ఎల్లవేళలా కుడిభుజంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలకు అండర్ కవర్ ఆపరేషన్ తో అడ్డుతగిలిన పోలీసాఫిసర్ (ప్రసన్న)ను మట్టుపెట్టడానికి భాయ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు. అండర్ కవర్ ఆపరేషన్ తో మాఫియాకు అడ్డుతగిలిన పోలీసాఫిసర్ తన తమ్ముడే అని తెలుసుకోవడం ఇంటర్వెల్ ట్విస్ట్. తండ్రి కోసం చేయని నేరాన్ని తనపై వేసుకుని కుటుంబానికి దూరంగా బతుకుతున్న విజయ్, డాన్ కోసం తమ్ముడి చంపుతాడా? లేక మాఫియా బారి నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం డాన్ కు ఎదురు నిలిస్తాడా? తన కుటుంబాన్ని మాఫియా ఎలా రక్షించుకుని ... తండ్రికి ఎలా దగ్గరయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'భాయ్'. భాయ్ గా నాగార్జున మరోసారి చాలా ఫ్రెష్ గా కనిపించాడు. క్యాస్ట్యూమ్స్, న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు. భాయ్, విజయ్, వెడ్డింగ్ ప్లానర్ లాంటి మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. ఇలాంటి పాత్రలు పోషించడం కెరీర్ లో నాగార్జున లాంటి స్టార్ కు కొట్టిన పిండే. భాయ్ గా కొత్త లుక్ తో కనిపించిన నాగ్ అభిమానుల్లో ఆనందం నింపాడు. హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయకు మరోసారి ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. రిచా కెరీర్ కు ఎలాంటి ఉపయోగపడదని చెప్పవచ్చు. అతిధి పాత్రలో కామ్న జెఠ్మలానీ మెప్పించలేకపోయింది. నటాలియా కౌర్, హంసా నందిని ఐటమ్ సాంగ్స్ తో ఆలరించారు.. నాగార్జున తండ్రిగా నాగినీడు, తమ్ముడిగా తమిళ నటుడు (ఫైవ్ స్టార్ ఫేం), నటి స్నేహ భర్త ప్రసన్న పోలీసాఫిసర్ గా తమ పాత్రల మేరకు పరిమితమయ్యారు. డాన్ గా కొడుకులుగా సోన్ సూద్, అజయ్ లు నటించారు. మాన్షన్ రాజుగా ఎమ్మెస్, విక్రం డోనర్ గా బ్రహ్మనందం, వదిలేయ్ బాబాగా రఘుల కామెడీ పర్వాలేదనిపించింది. అత్తారింటికి దారేది హిట్ తో మంచి ఊపు మీద ఉన్న దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంలో ఆయన మార్కు కనిపించలేదనే చెప్పాలి. అయితే రీరికార్డింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్ గా నిలిచింది. మమతా మోహన్ దాస్ పాడిన 'మోస్ట్ వాంటెడ్', భాయ్ టైటిల్ సాంగ్, రామసక్కనోడు మాస్ అకట్టుకునేలా ఉంటే..నెమ్మదిగా నెమ్మదిగా అనే పాట మెలోడియస్ గా సాగింది. ఇక దర్శకుడు వీరభద్ర చౌదరీ వరస హిట్లతో హ్యట్రిక్ కోసం భాయ్ తో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే పంచ్ డైలాగ్స్, స్టైలిష్ గా తీయాలనే తాపత్రయంలో అసలు కథను పక్కన పెట్టడమే కాకుండా.. పేలవమైన స్క్రీన్ ప్లే ను అందించాడు. మంచి బ్యానర్, భారీ తారాగణంలాంటి అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమైనారనే చెప్పవచ్చు. రొటిన్ కథ తో కొత్త గ్లాస్ లో పాత సారాను అందించాడనే అపవాదును మూటగట్టుకోవచ్చు. మలయాళ చిత్రం ''పోకిరి రాజా'' ఆధారంగా రూపొందిన అక్షయ్ కుమార్ 'బాస్' చిత్రానికి 'భాయ్' కథ చాలా దగ్గరగా ఉంది. ఏది ఏమైనా పాత కథతో రూపొందించిన భాయ్ చిత్రం విమర్శల ప్రశంసలకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మాస్, క్లాస్ ప్రేక్షకుల ఆదరణ మేరకే భాయ్ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. -
'అత్తారింటికి దారేదీ' కంటే 'భాయ్' పాటలు బాగుంటాయి
'అత్తారింటికి దారేది' పాటలు కంటే 'భాయ్' సినిమా పాటలు బాగున్నాయని నటుడు నాగార్జున తెలిపారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని నాగార్జున వివరించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘హలోబ్రదర్’ని తలపించే భాయ్
దర్శకునిగా ఈవీవీ సత్యనారాయణలోని గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ ఒంటబట్టించుకున్న సరైన శిష్యుడు వీరభద్రమ్. మూడో సినిమాకే నాగార్జున వంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారంటే... కారణం ఆ లక్షణాలే. ఈవీవీ ‘హలోబ్రదర్’ని తలపించేలా ‘భాయ్’ ఉంటుందని ధైర్యంగా చెబుతున్నారు వీరభద్రమ్. దీన్ని బట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అవగతం అవుతోంది. నాగార్జున నటించిన మాస్ చిత్రాల్లో ‘భాయ్’ది ఓ కొత్తకోణం అని యూనిట్ వర్గాలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్.. ఇంకోటి భాయ్’, ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’, ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’.. ఇటీవల విడుదలైన టీజర్లలో నాగార్జున చెబుతున్న ఈ డైలాగులు యువతరం ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ ప్రచార చిత్రాలు పెద్ద పాత్రనే పోషించాయని చెప్పాలి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు సమాచారం. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, హేమ, రజిత, సంధ్య జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు. -
రిచాతో నాగార్జున ఆట పాట!
నాగార్జున, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న 'భాయ్' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వీరభద్ర చౌదరీ. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో నాగార్జున, రిచాలపై పాటను చిత్రీకరించారు. -
రిచాతో నాగ్ డ్యూయెట్
కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. ‘భాయ్’ చిత్రం విషయంలో అదే జరుగుతోంది. ఇందులో నాగార్జున ఆహార్యం, టీజర్లో నాగ్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించడం, దర్శకుడు వీరభద్రం చౌదరి గత విజయాలు... ఇవన్నీ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు. తొలి, మలి విజయాలను అందుకున్న వీరభధ్రం... తప్పకుండా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే టాకీ పూర్తయిన ఈ చిత్రం డబ్బింగ్‌ని కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆఖరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నేటి నుంచి నాగ్, కథానాయిక రిచా గంగోపాథ్యాయ, వందమంది డాన్సర్లపై నృత్యదర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో ఓ మాస్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు వీరభద్రం. భాస్కరభట్ల రాసిన ఈ పాట కోసం 60 లక్షలతో అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్‌ని నిర్మించారు. ఈ నెల 20న పాటలను విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. -
విదేశాల్లో చక్కర్లు కొడుతున్న 'భాయ్ '
నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ చిత్ర సన్నివేశాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యే కొన్ని చిత్ర సన్నివేశాలను స్లొవేనియా దేశంలో 700 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఒక కోటలో నిర్మించారు. కాగా, కొన్ని పాటలను ఐస్లాండ్లో చిత్రీకరించారు. కోట సన్నివేశాల గురించి హీరో నాగార్జునతో మాట్లాడితే.. ఆ పురాతణమైన కోటలో నిర్మించిన పాట చిత్రీకరణ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. అక్కడ షూటింగ్ చేయడం ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్నారు. దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఇప్పటికే టాకీని ముగించాడు. ఇంకోవైపు డబ్బింగ్ జరుగుతోంది. కామ్నజఠ్మలానీ ఇందులో తెలంగాణా యాసలో మాట్లాడనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాఫియా నేపథ్యమైనా అది ఎక్కువగా ఉండదని అంటున్నారు. రిచా, హంసానందిని, కామ్న, నథాలియాకౌర్ వంటి వారు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈనెల 16న ఆడియోను విడుదలచేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం మరియు జయప్రకాశ్ రెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జునలోని మాస్ యాంగిల్‌ని క్లాస్‌గా ప్రెజెంట్ చేస్తూ వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంభాషణలు చాలా శక్తిమంతంగా ఉంటాయనేది యూనిట్ వర్గాల సమాచారం. కామెడీ, యాక్షన్ కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటాయని చెబుతున్నారు.