నటన మానేసి, వేరే లెవల్‌కు వెళ్లిపోయా.. | I am in a new phase of life twitts Richa | Sakshi
Sakshi News home page

నటన మానేసి, వేరే లెవల్‌కు వెళ్లిపోయా..

Published Thu, Oct 26 2017 5:21 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

I am in a new phase of life twitts Richa - Sakshi

సాక్షి, తమిళసినిమా: తాను నటనకు టాటా చెప్పి చాలా కాలం అయిందని నటి రిచా గంగోపాధ్యాయ చెప్పింది. ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషల్లో చాలా తక్కువ చిత్రాలే చేసింది. అయితే మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ నటించింది యువ స్టార్స్‌తోనే అయినా పెద్దగా సక్సెస్‌ అందుకోలేక పోయింది. తమిళంలో ధనుష్‌కు జంటగా మయక్కం ఎన్న, శింబుతో ఓస్తీ చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు రిచాను చాలా నిరాశ పరచాయనే చెప్పాలి.

తెలుగులో రానాతో కలిసి లీడర్‌ చిత్రంతో పరిచయం అయిన ఈ బ్యూటీ, ఆ తరువాత రవితేజకు జంటగా మిరపకాయ్, నాగార్జునతో భాయ్, ప్రభాస్‌కు జంటగా మిర్చి వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో కొన్ని హిట్‌ చిత్రాల్లో నటించినా ఎందుకనో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. మధ్యలో ప్రేమ వ్యవహారంలో పడటంతో కేరీర్‌ వెనకపడిందనే ప్రచారం జరిగింది.

మొత్తం మీద నాలుగేళ్లు సినిమాల్లో నటించిన రిచా గంగోపాధ్యాయ నటనకు గుడ్‌బై చెప్పి నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. యూఎస్‌ఏకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేసిందట. తాజాగా ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ అమ్మడిని మళ్లీ ఎప్పుడు నటిస్తారన్న అభిమానుల ప్రశ్నకు బదులుగా.. ‘నటనకు గుడ్‌బై చెప్పి దాదాపు ఐదేళ్లు అయింది. ఇప్పుడు వేరే లెవల్‌కు వెళ్లా. ఇకపై నటించాలన్న ఆశ లేదు..’అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రిచా ఆ వేరే లెవల్‌ ఏమిటబ్బా అని ఆరా తీసే పనిలో పడ్డాయి సినీ వర్గాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement