‘హలోబ్రదర్’ని తలపించే భాయ్
‘హలోబ్రదర్’ని తలపించే భాయ్
Published Sat, Oct 12 2013 10:49 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
దర్శకునిగా ఈవీవీ సత్యనారాయణలోని గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ ఒంటబట్టించుకున్న సరైన శిష్యుడు వీరభద్రమ్. మూడో సినిమాకే నాగార్జున వంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారంటే... కారణం ఆ లక్షణాలే. ఈవీవీ ‘హలోబ్రదర్’ని తలపించేలా ‘భాయ్’ ఉంటుందని ధైర్యంగా చెబుతున్నారు వీరభద్రమ్. దీన్ని బట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అవగతం అవుతోంది. నాగార్జున నటించిన మాస్ చిత్రాల్లో ‘భాయ్’ది ఓ కొత్తకోణం అని యూనిట్ వర్గాలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్.. ఇంకోటి భాయ్’, ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’, ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’.. ఇటీవల విడుదలైన టీజర్లలో నాగార్జున చెబుతున్న ఈ డైలాగులు యువతరం ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ ప్రచార చిత్రాలు పెద్ద పాత్రనే పోషించాయని చెప్పాలి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు సమాచారం.
రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, హేమ, రజిత, సంధ్య జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు.
Advertisement