Director Veerabhadram
-
లవ్... యాక్షన్... థ్రిల్!
మాస్‌ని మెప్పించే యాక్షన్... ప్రేక్షకుల్ని నవ్వించే కామెడీ సీన్స్‌తో దర్శకుడు వీరభద్రమ్ సినిమాలు తీస్తుంటారు. ‘అహ నాపెళ్లంట’, ‘పూల రంగడు’, ‘చుట్టాలబ్బాయి’ వంటి కామెడీ అండ్ యాక్షన్ సిన్మాలతో హిట్స్ అందు కున్నారీయన. తాజాగా వీరభద్రమ్ దర్శకత్వంలో జేవీఆర్ సినిమాపై జల్లేపల్లి వెంకటేశ్వరరావు (జేవీఆర్) ఓ సినిమా నిర్మించనున్నట్లు ఉగాది నాడు ప్రకటించారు. లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో థ్రిల్లర్ జానర్లో యువ హీరోతో ఈ సినిమా రూపొందించనున్నట్టు జేవీఆర్ తెలిపారు. ఆర్కే గౌడ్ ఈ చిత్రానికి ఓ నిర్మాత. -
వెటకారమే నా సక్సెస్ కారణం
దర్శకుడు వీరభద్రమ్ కడియం : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది. ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు. హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు. ఇక్కడే బాగుంది : నమిత మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు. -
‘హలోబ్రదర్’ని తలపించే భాయ్
దర్శకునిగా ఈవీవీ సత్యనారాయణలోని గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ ఒంటబట్టించుకున్న సరైన శిష్యుడు వీరభద్రమ్. మూడో సినిమాకే నాగార్జున వంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారంటే... కారణం ఆ లక్షణాలే. ఈవీవీ ‘హలోబ్రదర్’ని తలపించేలా ‘భాయ్’ ఉంటుందని ధైర్యంగా చెబుతున్నారు వీరభద్రమ్. దీన్ని బట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అవగతం అవుతోంది. నాగార్జున నటించిన మాస్ చిత్రాల్లో ‘భాయ్’ది ఓ కొత్తకోణం అని యూనిట్ వర్గాలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్.. ఇంకోటి భాయ్’, ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’, ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’.. ఇటీవల విడుదలైన టీజర్లలో నాగార్జున చెబుతున్న ఈ డైలాగులు యువతరం ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ ప్రచార చిత్రాలు పెద్ద పాత్రనే పోషించాయని చెప్పాలి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు సమాచారం. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, హేమ, రజిత, సంధ్య జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు.