bhai
-
స్కూల్ డేస్ గుర్తొచ్చాయి – వంశీ పైడిపల్లి
లక్ష్య, వినయ్ వర్మ, సాహితి, నీరజ్ ప్రధాన పాత్రల్లో అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్’. ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించారు. శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి సహనిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమా సెట్లో విడుదల చేశారు. అనంతరం వంశీ మాట్లాడుతూ– ‘‘టైటిల్ నాకు బాగా నచ్చింది. బాయ్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. హైస్కూల్ యూనిఫామ్‌లో ఉన్న స్టూడెంట్ కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అమర్‌కి సినిమా అంటే ప్యాషన్. పోస్టర్ విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసి ఉంటారని అర్థం అవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలని ఉంది. టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. ఇక మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
సూటుబూటు ఉంటేనే మోదీకి భాయి
దాతియా/న్యూఢిల్లీ: పేదలను పట్టించుకోని ప్రధాని మోదీకి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ వంటి వ్యాపార వేత్తలతో మాత్రం భాయి అనుకునేంత సన్నిహిత సంబంధాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘బడా వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, అనిల్ అంబానీలను భాయి అని మోదీ సంబోధిస్తుంటారు. అదే ఒక కార్మికుడు, ఒక పేద, ఒక రైతును భాయి అని పిలవడం గానీ, హత్తుకోవడం గానీ మోదీ చేయలేరు. ఎందుకంటే ఆయన హృదయంలో అలాంటి వారికి స్థానం లేదు’ అని అన్నారు. ఆలయంలో రాహుల్ పూజలు మధ్యప్రదేశ్‌లోని దాతియాకు చేరుకున్న రాహుల్ ముందుగా ప్రఖ్యాత మా పీతాంబర పీఠ్ ఆలయంలో పూజలు చేశారు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత రాహుల్ నానమ్మ ఇందిర(1979లో), తండ్రి రాజీవ్ గాంధీ(1984లో) ప్రధానమంత్రులు అయ్యారని కాంగ్రెస్ నేత పంకజ్ తెలిపారు. ప్రజల ఆకలినీ తీర్చలేని మోదీ ప్రసంగాలు ఇస్తూ, జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న మోదీ ప్రజల ఆకలి గురించి మర్చిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 119 దేశాల్లో భారత్ స్థానం 103కు పడిపోవటంపై విమర్శించారు. యోగాసనాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మోదీ ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యతను విస్మరించారని ట్వీట్ చేశారు. -
ఆశలొద్దు: నటనకు హీరోయిన్ గుడ్ బై!
సాక్షి, సినిమా: తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నటి రిచా గంగోపాధ్యాయ్. నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. కానీ అవకాశాలు రావడం లేదనో, లేక ప్రాధాన్యమున్న పాత్రలు దక్కడం లేదనో గానీ గత నాలుగేళ్లుగా సినీ ఇండస్ట్రీకి రిచా దూరంగా ఉంటున్నారు. నటనకు గుడ్ బై చెప్పానని తనమీద ఇక ఆశలు పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 'లీడర్'తో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆపై ప్రభాస్‌తో మిర్చి, రవితేజతో సారొచ్చారు, మిరపకాయ్ మూవీలు.. వెంకటేశ్‌తో నాగవల్లి మూవీలో నటించారు. చివరగా నాగార్జునతో భాయ్ చిత్రంలో నటించారు. 2013లో భాయ్ విడుదలైంది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయారు. ఇటీవల ట్విట్టర్ ద్వారా రిచా తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు స్వయంగా తెలిపారు. ఆమె ఫాలోయర్లు కొందరు.. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి.. మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారు అంటూ హీరోయిన్ రిచాకు తెగ ట్వీట్లు చేస్తున్నారట. దీంతో తన అభిమానులు, ట్విట్టర్ ఫాలోయర్లకు ఆమె వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. 'నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. కానీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చివరి మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. నా వివరాలు గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో వేరే దశలో ఉన్నాను. ఇందులో నటన అనే అంశమే లేదంటూ' సినిమాలకు గుడ్ బై చెప్పేశానని నటి రిచా గంగోపాధ్యాయ్ వరుస ట్వీట్లు చేశారు. Cont’d....Short answer: I am in a new phase of life, no acting ambitions in it :) — Richa Gangopadhyay (@richyricha) 22 October 2017 For those still asking “when is my next movie” after almost 5 years of my exit from films...Google is your friend ;). Also see pinned tweet — Richa Gangopadhyay (@richyricha) 22 October 2017 -
గీత స్మరణం
సాకీ: ఆమె: ఆలిండియాకే మంటపెట్టే ఐటం నేనురా నాయాంటెన్నాకే అంటుకోని సిగ్నల్లేదురా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా ॥ర య్య॥ పల్లవి : ఆ: మోస్టు వాంటెడు అందగత్తె నేను కంచు కత్తి నేను నా కంటిచూపుతో సునామీ పుట్టిస్తాను ॥ర య్య॥ మోస్టు వాంటెడు ఫేసుబుక్కు నేను మాసు లుక్కు నేను నా పైట చెంగులో దునియానే చుట్టేస్తాను ॥ర య్య॥ స్వీటు స్వీటుగున్న హాటు కేకు నేను చీమల్ని కోరే బెల్లం ముక్క నేను కోట్ల ఫ్యాన్సుకే డ్రీమ్ గర్ల్నయ్యాను తాడులేని ఆడ బొంగరం నేను మీసకట్టు చూసి నీకు పడ్డాను యాడికైన నన్ను ఎత్తుకెళ్లమంటాను ॥ర య్య॥ అతడు: మోస్టు వాంటెడూ ఈ అందగాడు నీకు అందనోడు నీనైసు గోకుడూ ఇష్టంలే వాట్ టూ డూ నీ కోక జారుడు ఎక్కినాది రోడ్డు అది వెరీ బ్యాడ్డూ నా ఫొటోఫ్రెములో నీ బొమ్మకు చోటేలేదు ॥ర య్య॥ చరణం : 1 ఆ: హే... మిడ్డీనా మెరిసే శారీనా ఏది నీకు ఇష్టమైన డ్రెస్సు అది కట్టుకొచ్చి ఇచ్చుకుంట కిస్సూ హే... ఇండోరా అదిరే ఔట్ డోరా ఏది నీకు ఇష్టమైన ప్లేసు చలో ఆడికెళ్లి చేసుకో రొమాన్సు అ: గ్లామరే మన బ్యాంకు బాలెన్సు ఇవ్వలేనె పోరి నీకు బ్లాంకు చెక్సూ టైము లాసు టాక్సుమాని పిండ్రాపు సెలైన్సుగుంటే బెస్టు ॥ర య్య॥॥వాంటెడు॥ చరణం : 2 ఆ: నే ఫుల్ మూను నువ్వే సన్షైను ఎంత బాగా మ్యాచయ్యిందో పెయిరు నాతో పెట్టుకోర ముద్దుగా ఎఫైరు నే ఐఫోను నువ్వే రింగుటోను ట్రింగు ట్రింగు మంది లవ్వు సీను ఎప్పుడెప్పుడెప్పుడంది హనీమూను అ: చాకొలెట్టు ఏజు చంటగాణ్ణి కాను ఐసుపెట్టి నాకు ఎయ్యమాకె లైను నాకు నేను సోలో మేను మీ ట్రిక్సు వర్కౌటు కానివ్వను ॥ర య్య॥॥వాంటెడు॥ చిత్రం : భాయ్ (2013), రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : నరేంద్ర, మమతా మోహన్‌దాస్ - నిర్వహణ: నాగేశ్ -
స్పెషల్ సాంగ్స్‌కే కాదు...ఆర్ట్ సినిమాలకూ రెడీ!
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ‘ఈగ’లో అతిథి పాత్రకు అంగీకరించినప్పుడు హంసానందిని కూడా తన కెరీర్‌కి అది మంచి మలుపు అవుతుందని ఊహించలేదు. ‘ఈగ’ తర్వాత వరుసగా మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారామె. ఈ ఆరడుగుల అందం అసలు పేరు పూనమ్. ‘అనుమానాస్పదం’తో కథానాయికగా పరిచయం చేసినప్పుడు సీనియర్ దర్శకుడు వంశీ ఆమె పేరుని హంసానందినిగా మార్చారు. ఆ పేరంటే తనకెంతో ఇష్టమంటున్న హంసానందినితో జరిపిన ఇంటర్వ్యూ... ఈ మధ్య అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్స్‌కు మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినట్టున్నారు. ఈ పరిణామం ఎలా అనిపిస్తోంది? లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే, నేను స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోతున్నాను. హంసా చాలా స్టయిలిష్‌గా ఉందనీ గ్లామరస్‌గా ఉందనీ అభినందిస్తున్నారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌కే పరిమితమైపోవాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. నేను చేసేవి ఐటమ్ సాంగ్స్ కాదు... స్పెషల్ సాంగ్స్ అనాలి. ఎందుకంటే, మీరిప్పటివరకు నేను చేసిన పాటలను చూస్తే కథలో భాగంగానే అవి ఉంటాయి. అలాగే, పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా ఉంటాను కదా. స్పెషల్ సాంగ్స్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. అలాగని పాటలకే పరిమితమైతే నాకు నేను బోర్ కొట్టడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తాను. అందుకే లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. ‘ఈగ’ ఒప్పుకున్నప్పుడు గెస్ట్ రోల్స్ పరంగా మీకు డిమాండ్ పెరుగుతుందనుకున్నారా? అస్సలు ఊహించలేదు. ఆ సినిమాకి రాజమౌళిగారు అడిగినప్పుడు, మీ పాత్ర తెరపై కనిపించేది కాసేపే... ఎక్కువసేపు కనిపిస్తే అంత ఇంపాక్ట్ ఉండదన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజం. ‘ఈగ’లో నేను తక్కువ సమయం కనిపించినా, మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు ఫోన్ చేసి, చిన్న పాత్ర అయినా క్యూట్‌గా ఉందన్నారు. వంశీ ‘అనుమానాస్పదం’లో కథానాయికగా చేశారు.. ఆ తర్వాత హీరోయిన్గా రాణించలేకపోవడానికి కారణం ఏంటి? వంశీగారు ఎంత మంచి దర్శకులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో కథానాయికగా చేసే అవకాశం రావడం ఓ అదృష్టం. ఆ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో తప్పు జరిగింది. దానివల్ల కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. ఇప్పుడు హీరోయిన్గా ఏమైనా సినిమాలు చేస్తున్నారా? నేను చేసే అతిథి పాత్రలకు ఎంత పేరొచ్చినా, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసినప్పుడు లభించే సంతృప్తి వేరు. అందుకే, లీడ్ రోల్స్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది పడితే అది కాకుండా మంచి ప్రాజెక్ట్‌ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఇందులో నా పాత్ర పేరు ‘మధానికా’. ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. ఏడెనిమిది లుక్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓ లుక్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను. గ్లామరస్ రోల్స్ మాత్రమేనా.. డీ-గ్లామర్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నారా? నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తాను. కథ, కేరక్టర్ బాగుంటే ఆర్ట్ ఫిల్మ్‌లో చేయడానికి కూడా రెడీ. అలాగే మంచి ఫైట్స్ డిమాండ్ చేసే యాక్షన్ మూవీస్‌లో చేయడానికి కూడా సిద్ధమే. -
కథ పాతదే... కొత్తగా 'భాయ్' !
తెలుగు చలన చిత్ర సీమలో ఇటీవల కాలంలో ఏ నటుడు చేయనన్ని ప్రయోగాలు చేసి అక్కినేని నాగార్జున అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలు నటుడిగా నాగార్జున అభిరుచికి, తపనకు అద్దపట్టాయి. నాగార్జున టెస్ట్ కు అనుగుణంగా టాలీవుడ్ లో దర్శకులు కూడా ఆయననొక ప్రయోగశాలగా చేసుకున్నారు. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేయడం శివతో ప్రారంభించి.. ఇంకా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఎప్పటికప్పడూ ట్రెండ్ బేరీజు వేసుకుంటూ తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నాగార్జున తాజాగా వీరభద్ర చౌదరీ దర్శకత్వంలో భాయ్ గా ఓ ఢిఫెరెంట్ లుక్, స్టైల్ తో ముందుకు వచ్చాడు. ఇప్పటికే దర్శకుడు వీరభద్ర చౌదరీ రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుని.. హ్యట్రిక్ ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో భాయ్ చిత్రం ద్వారా ముందుకు వచ్చాడు. అత్తారింటికి దారేది ద్వారా సూపర్ హిట్ ఆడియోను అందించిన దేవి శ్రీ ప్రసాద్, నాగార్జున, వీరభద్ర చౌదరీ కాంబినేషన్ లో వచ్చిన భాయ్ ఎలా ఉన్నాడో చూసొద్దాం! హంకాంగ్ లో మాఫియా కార్యక్రమాలు నిర్వహించే డాన్ (ఆశిష్ విద్యార్ధి)కు విజయ్ అలియాస్ భాయ్ (నాగార్జున) ఎల్లవేళలా కుడిభుజంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలకు అండర్ కవర్ ఆపరేషన్ తో అడ్డుతగిలిన పోలీసాఫిసర్ (ప్రసన్న)ను మట్టుపెట్టడానికి భాయ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు. అండర్ కవర్ ఆపరేషన్ తో మాఫియాకు అడ్డుతగిలిన పోలీసాఫిసర్ తన తమ్ముడే అని తెలుసుకోవడం ఇంటర్వెల్ ట్విస్ట్. తండ్రి కోసం చేయని నేరాన్ని తనపై వేసుకుని కుటుంబానికి దూరంగా బతుకుతున్న విజయ్, డాన్ కోసం తమ్ముడి చంపుతాడా? లేక మాఫియా బారి నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం డాన్ కు ఎదురు నిలిస్తాడా? తన కుటుంబాన్ని మాఫియా ఎలా రక్షించుకుని ... తండ్రికి ఎలా దగ్గరయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'భాయ్'. భాయ్ గా నాగార్జున మరోసారి చాలా ఫ్రెష్ గా కనిపించాడు. క్యాస్ట్యూమ్స్, న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు. భాయ్, విజయ్, వెడ్డింగ్ ప్లానర్ లాంటి మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. ఇలాంటి పాత్రలు పోషించడం కెరీర్ లో నాగార్జున లాంటి స్టార్ కు కొట్టిన పిండే. భాయ్ గా కొత్త లుక్ తో కనిపించిన నాగ్ అభిమానుల్లో ఆనందం నింపాడు. హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయకు మరోసారి ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. రిచా కెరీర్ కు ఎలాంటి ఉపయోగపడదని చెప్పవచ్చు. అతిధి పాత్రలో కామ్న జెఠ్మలానీ మెప్పించలేకపోయింది. నటాలియా కౌర్, హంసా నందిని ఐటమ్ సాంగ్స్ తో ఆలరించారు.. నాగార్జున తండ్రిగా నాగినీడు, తమ్ముడిగా తమిళ నటుడు (ఫైవ్ స్టార్ ఫేం), నటి స్నేహ భర్త ప్రసన్న పోలీసాఫిసర్ గా తమ పాత్రల మేరకు పరిమితమయ్యారు. డాన్ గా కొడుకులుగా సోన్ సూద్, అజయ్ లు నటించారు. మాన్షన్ రాజుగా ఎమ్మెస్, విక్రం డోనర్ గా బ్రహ్మనందం, వదిలేయ్ బాబాగా రఘుల కామెడీ పర్వాలేదనిపించింది. అత్తారింటికి దారేది హిట్ తో మంచి ఊపు మీద ఉన్న దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంలో ఆయన మార్కు కనిపించలేదనే చెప్పాలి. అయితే రీరికార్డింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్ గా నిలిచింది. మమతా మోహన్ దాస్ పాడిన 'మోస్ట్ వాంటెడ్', భాయ్ టైటిల్ సాంగ్, రామసక్కనోడు మాస్ అకట్టుకునేలా ఉంటే..నెమ్మదిగా నెమ్మదిగా అనే పాట మెలోడియస్ గా సాగింది. ఇక దర్శకుడు వీరభద్ర చౌదరీ వరస హిట్లతో హ్యట్రిక్ కోసం భాయ్ తో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే పంచ్ డైలాగ్స్, స్టైలిష్ గా తీయాలనే తాపత్రయంలో అసలు కథను పక్కన పెట్టడమే కాకుండా.. పేలవమైన స్క్రీన్ ప్లే ను అందించాడు. మంచి బ్యానర్, భారీ తారాగణంలాంటి అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమైనారనే చెప్పవచ్చు. రొటిన్ కథ తో కొత్త గ్లాస్ లో పాత సారాను అందించాడనే అపవాదును మూటగట్టుకోవచ్చు. మలయాళ చిత్రం ''పోకిరి రాజా'' ఆధారంగా రూపొందిన అక్షయ్ కుమార్ 'బాస్' చిత్రానికి 'భాయ్' కథ చాలా దగ్గరగా ఉంది. ఏది ఏమైనా పాత కథతో రూపొందించిన భాయ్ చిత్రం విమర్శల ప్రశంసలకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మాస్, క్లాస్ ప్రేక్షకుల ఆదరణ మేరకే భాయ్ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. -
గీత స్మరణం
పల్లవి : B...H...A...I... భాయ్... చీకటి పడితే Playboy వీడు మాసు వీడు క్లాసు దొరబాబు of Dubai అటు గన్సూ ఇటు గర్ల్సూ మన కింగ్ డం డం మనదే వయొలెన్సూ రొమాన్సూ టూ ఇన్ వన్ ఫన్ మనదే ైెహ ఫైగా గాల్లో తేలే సొమ్ముందే వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే సూర్యుళ్లా డేటైం బ్యూటీ షూటౌటే చంద్రుళ్లా నైట్ టైం పక్కా ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్లౌటే ॥B...H...A...I...॥ చరణం : 1 చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు ఇది భాయీ స్టైల్ నట్టింట్లో స్విమ్మింగ్ పూలు ఫుల్ వెన్నెల్లో జలకాలు విత్ కన్నెందాలు ఎవ్రీడే ధంధా ఆఫ్ కోర్స్ మామ్మూలే నౌ ఎండ్ దెన్ కొంచెం రీఛార్జ్ క క్క క్క క్క కావాల్లే ॥B...H...A...I...॥ చరణం : 2 గాడ్ బ్లెస్ యు మై ఎనిమీసూ నాకెదురొస్తే నో చాన్సూ మీ టిక్కెట్ కన్ఫర్మ్ గురిపెట్టానో నా లెన్సూ ఇక కౌంట్ డౌనే మీ డేసూ మీ బతుకే భస్మం రివాల్వర్ మేరా ప్యారా ట్విన్ బ్రదర్ వాటెవర్ నాలో సత్తా నా నా నా నా గాడ్ ఫాదర్ ॥B...H...A...I...॥ చిత్రం: భాయ్ (2013) రచన: రామజోగయ్యశాస్త్రి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: సుచిత్ సురేశన్ నిర్వహణ: నాగేశ్ -
నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!
‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ విజయాలతో క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకున్న వీరభద్రమ్ ‘భాయ్’తో హ్యాట్రిక్ కొడతానంటున్నారు. తన మూడో సినిమానే నాగార్జునలాంటి అగ్ర హీరోతో చేసే అవకాశం రావడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వీరభద్రమ్ సంతోషం వెలిబుచ్చారు. ‘భాయ్’ ఈ 25న విడుదలవుతున్న సందర్భంగా వీరభద్రమ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. *** మరో మూడు రోజుల్లో ‘భాయ్’ రిలీజ్‌కి రెడీ. ఎలా అనిపిస్తోంది? పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్‌లా ఉంది నా పరిస్థితి. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వంద శాతం ఉంది. అయితే ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలనే ఉద్వేగం ఎక్కువగా ఉంది. *** దర్శకుడిగా ఇప్పటికి రెండు పరీక్షలు రాసి, పాసయ్యారు. కానీ, ఇది పెద్ద పరీక్ష కదా? నిజమే! నాగార్జునగారు హీరోగా నటించడానికి అంగీకరించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై ఆయనే నిర్మించారు. ఇది చిన్న విషయం కాదు. పైగా, నా గత చిత్రాలకన్నా ఇది పెద్ద బడ్జెట్ చిత్రం. అందుకే ‘భాయ్’ని ఓ సవాల్‌గా తీసుకున్నా. కచ్చితంగా ఈ పెద్ద పరీక్ష కూడా నాకు మంచి అనుభూతినే మిగులుస్తుంది. నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను గ్యారంటీగా హిట్ అనే నమ్మకంతో ఉండేవాణ్ణి. కానీ, అందరూ ‘ఓకే.. మాములుగా ఆడుతుంది’ అనుకునేవాళ్లు. అయితే, అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పూలరంగడు’ సూపర్ హిట్ అవుతుందన్నాను. అప్పుడూ ‘ఓకే... ఏదో హిట్ అవుతుంది’ అనుకున్నారు. అది కూడా ఘనవిజయం సాధించింది. దాంతో నా ఆలోచనలు, నా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయనే నమ్మకం రెట్టింపు అయ్యింది. *** మీకు మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసని నాగార్జున అన్నారు. ఆ మాస్ పల్స్ ఎలా పట్టుకోగలిగారు? నేను విలేజ్ నుంచి వచ్చినవాణ్ణి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అందుకని అటు విలేజ్, ఇటు సిటీ లైఫ్ నాకు తెలుసు. మాస్, క్లాస్.. రెండు రకాల వ్యక్తులతో నాకు పరిచయాలున్నాయి. అందుకని వాళ్ల మనసులను తెలుసుకునే వీలు కలిగింది. పైగా నాలోనూ ఓ మాస్ ప్రేక్షకుడు ఉన్నాడు. ఆ విధంగా నాకు మాస్ పల్సే కాదు. క్లాస్ పల్సూ తెలుసు! *** నాగార్జున గారితో పనిచేయడం గురించి? నాగార్జునగారు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండు, మూడు రోజులు స్వీట్షాక్లో ఉండిపోయాను. మొదటి షెడ్యూల్ బ్యాంకాక్‌లో చేశాం. ఓ మూడు, నాలుగు రోజులు బెరుగ్గా చేశాను. కానీ, నాగార్జునగారు ఇచ్చిన స్వేచ్ఛతో ఆ తర్వాత బెరుకుతనంపోయింది. దాంతో బాగా చేయగలిగాను. ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చారు నాగార్జునగారు. *** ఏడేళ్ల క్రితమే ‘భాయ్’ కథ అనుకున్నానని చెప్పారు... మరి, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందా? నేను ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కి కో-డెరైక్టర్‌గా చేశాను. హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’కి అది రీమేక్. ఆ టైటిల్లోని ‘భాయ్’ నాకు క్యాచీగా అనిపించింది. అప్పుడే ఆ టైటిల్ అనుకుని, స్టోరీలైన్ తయారు చేసుకున్నా. నాకు తెలిసి కొత్త కథలంటూ పుట్టవు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో వచ్చిన కథలే రిపీట్ అవుతున్నాయి. కాకపోతే కథనం, కథలోని ఎమోషన్స్, డైలాగ్స్, సాంగ్స్ పరంగా ట్రెండ్ మారుతుందని నా ఫీలింగ్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ‘భాయ్’ చేశాను. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది. నాగార్జునగారి స్టయిల్‌కి అనుగుణంగా కథను మలిచాను. *** ఏడేళ్ల క్రితం అనుకుని, ఈ మధ్యే నాగార్జునని అప్రోచ్ అయ్యారెందుకని? దర్శకుడిగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే, రెండు విజయాల తర్వాత నాగార్జునగార్ని కలిశాను. ఆయన ‘షిరిడీ సాయి’ సినిమా చేస్తున్న సమయంలో, సాయిబాబా గెటప్‌లో ఉండగా, కలిశాను. టైటిల్ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. దాదాపు గంటన్నర కథ విని, చేద్దాం అన్నారు. *** ‘మొదట ట్రెండ్ సెట్ చేసింది నువ్వే కదన్నా..’ అనే డైలాగ్ ఈ సినిమాలో పెట్టడానికి కారణం? ఇది ఏ హీరోనీ ఉద్దేశించి పెట్టింది కాదు. ఈ డైలాగ్ కూడా ఎప్పుడో అనుకున్నదే. అప్పట్లో ‘శివ’తో నాగార్జునగారు ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాకి కనెక్ట్ చేసి, ఈ డైలాగ్ రాశాను. *** మీ తదుపరి చిత్రాలు? రెండు పెద్ద సినిమాలున్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతా. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే ॥ అతడు: హే... వెనీలా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాల మత్తిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా ఆ: గ్లామర్‌లో బిర్లా బిర్లా రొమాంటిక్ ఏరోప్లేన్లా అమాంతం గుండెల్లో ఎటాక్ చేస్తే ఎల్లా అ: లూజ్ కంట్రోల్ అనేలా నా మనసుకు నువ్వే టకీలా ఆ: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నీ కన్నెదురున్నా కూకీలా అ: నీ చెంప డింపుల్లో సెటిలయిపోతా ఇవ్వాళ ॥పిల్లా పిల్లా॥॥ చరణం : 1 అ: ఏం తిని పెంచిన యవ్వనమే ఇది ఎడాపెడా అదిరిందే మక తికా మకా పెరిగిందే ఆ: కమాన్ కమాన్ పురుషా కలిసినది అమీతుమీ వరసా అ: నీ కొనచూపుల తాకిడిలో మది కసాబిసా కదిలిందే తెగ ఎగాదిగా నలిగిందే ఆ: కమాన్ కమాన్ మదనా పిలిచినది యమ్మీ యమ్మీ పులస అ: ఏం మేగ్నెట్టో ఏం టాలెంటో రెండేసి కళ్లేసి వలేసి లాగావే హంసా ॥పిల్లా పిల్లా॥ చరణం : 2 అ: న్యూటను ఎరుగని యాపిలువై నువు ఒళ్లోకిలా ఫ్రీ ఫాలింగ్ నా మనస్సుకే స్పిన్ బౌలింగ్ ఆ: హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సంథింగ్ అ: నాసా చూడని ప్లానెటువై నా చుట్టూ చెలీ నీ రోమింగ్ ఫుల్ ఘుమా ఘుమా పెర్ఫ్యూమింగ్ ఆ: చలో చలో మై కింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్ అ: నా గుడ్‌మార్నింగ్ నా గుడ్నైటింగ్ ఏదైనా నువ్వేలే ఎన్నాళ్లు నాకింక వెయిటింగ్ ॥పిల్లా పిల్లా॥॥ చిత్రం : భాయ్ (2013) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : డే విడ్ సిమోన్, రీటా నిర్వహణ: నాగేష్ -
వాటికి ధీటుగా ‘భాయ్’ పాటలుంటాయి - నాగార్జున
‘‘అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయాలనుకున్న ‘భాయ్’ పాటల్ని ఇలా సింపుల్‌గా విడుదల చేయడం బాధగా ఉంది. వేదికపై ఈ సినిమా టైటిల్ సాంగ్‌కి డాన్స్ చేయాలని ప్రిపేర్ అయ్యాను కూడా. కొన్ని కారణాల వల్ల అది కూడా కుదర్లేదు’’ అన్నారు నాగార్జున. వీరభద్రమ్ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘భాయ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగార్జున ఆడియో సీడీని ఆవిష్కరించారు. ప్రచార చిత్రాలను శభాసిష్ సర్కార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున ఇంకా మాట్లాడుతూ- ‘‘ఇటీవలే దేవిశ్రీ స్వరాలందించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా చూశాను. అందులో ఓ పాటలో తను కనిపించాడు కూడా. తన పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాకు పాటలు కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఆ పాటలకు ధీటుగా ‘భాయ్’ పాటలుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. రిచా గంగోపాధ్యాయ నటన, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు వీరభద్రమ్. తనకు కచ్చితంగా ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. సినిమాలో విషయం ఉంటే పైరసీ కూడా ఏమీ చేయలేదని ‘అత్తారింటికి దారేది’ సినిమా నిరూపించింది. ఆ స్ఫూర్తితోనే మేం కూడా ముందుకు సాగుతున్నాం’’ అన్నారు. ‘‘‘భాయ్’ టైటిల్ రివీల్ చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి. నాగార్జునకి, కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. యాక్షన్ సన్నివేశాల్లో నాగార్జున పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తాం’’ అని వీరభద్రమ్ తెలిపారు. నాగార్జునతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని రిచా గంగోపాధ్యాయ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అనంతశ్రీరామ్, సాయిబాబు, విజయ్మాస్టర్ తదితరులు కూడా మాట్లాడారు. -
'అత్తారింటికి దారేదీ' కంటే 'భాయ్' పాటలు బాగుంటాయి
'అత్తారింటికి దారేది' పాటలు కంటే 'భాయ్' సినిమా పాటలు బాగున్నాయని నటుడు నాగార్జున తెలిపారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని నాగార్జున వివరించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగూ భాయ్
-
స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేదీ' సినిమా పరిశ్రమకు ఒక దారి చూపించిందని 'కింగ్' నాగార్జున అన్నారు. మంచి సినిమాను పైరసీ ఆపలేదని ఈ చిత్రం నిరూపించిందన్నారు. నేడు జరిగిన 'భాయ్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. హీరోయిన్లు కూడా రెడీ అయ్యారని అన్నారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని వివరించారు. 'భాయ్' సినిమాను 25న విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్.. బ్యాంకాక్‌లో మ్యూజిక్ సిట్టింగ్‌లో ఉండడం వల్ల ఆడియో ఫంక్షన్ రాలేకపోయాడని తెలిపారు. అత్తారింటికి దారేదీలో దేవీశ్రీ ప్రసాద్ ఒక పాటలో బాగా నటించాడని నాగార్జున కితాబిచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు -
‘హలోబ్రదర్’ని తలపించే భాయ్
దర్శకునిగా ఈవీవీ సత్యనారాయణలోని గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ ఒంటబట్టించుకున్న సరైన శిష్యుడు వీరభద్రమ్. మూడో సినిమాకే నాగార్జున వంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారంటే... కారణం ఆ లక్షణాలే. ఈవీవీ ‘హలోబ్రదర్’ని తలపించేలా ‘భాయ్’ ఉంటుందని ధైర్యంగా చెబుతున్నారు వీరభద్రమ్. దీన్ని బట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అవగతం అవుతోంది. నాగార్జున నటించిన మాస్ చిత్రాల్లో ‘భాయ్’ది ఓ కొత్తకోణం అని యూనిట్ వర్గాలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్.. ఇంకోటి భాయ్’, ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’, ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’.. ఇటీవల విడుదలైన టీజర్లలో నాగార్జున చెబుతున్న ఈ డైలాగులు యువతరం ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ ప్రచార చిత్రాలు పెద్ద పాత్రనే పోషించాయని చెప్పాలి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు సమాచారం. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, హేమ, రజిత, సంధ్య జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు. -
నాగార్జున 'భాయ్' రెడీ
హైదరాబాద్‌కు చెందిన మాఫియా డాన్... హాంగ్కాంగ్లోలా ఓ భాయ్‌కి రైట్ హ్యాండ్.. ఓ సాదా సీదా వ్యక్తి. ఈ మూడూ నాగార్జునే. మూడు పాత్రల్లోనూ వ్యత్యాసం చూపించేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా నాగార్జున మూడు పాత్రల్లో అలరించబోతున్న చిత్రం ‘భాయ్’. ఇందులో నాగార్జున పాత బస్తీ మాండలికంలో కూడా కొన్ని డైలాగులు మాట్లాడారు. అహ నా పెళ్లంట, పూలరంగడులాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు వీరభద్రం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటించారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను అక్టోబర్ 1న, సినిమాని 11న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. యాక్షన్, రొమాన్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాలవారు చూసే విధంగా ఉంటుందని వీరభద్రం అంటున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. సాయిబాబు. -
రిచాతో నాగార్జున ఆట పాట!
నాగార్జున, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న 'భాయ్' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వీరభద్ర చౌదరీ. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో నాగార్జున, రిచాలపై పాటను చిత్రీకరించారు. -
రిచాతో నాగ్ డ్యూయెట్
కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. ‘భాయ్’ చిత్రం విషయంలో అదే జరుగుతోంది. ఇందులో నాగార్జున ఆహార్యం, టీజర్లో నాగ్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించడం, దర్శకుడు వీరభద్రం చౌదరి గత విజయాలు... ఇవన్నీ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు. తొలి, మలి విజయాలను అందుకున్న వీరభధ్రం... తప్పకుండా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే టాకీ పూర్తయిన ఈ చిత్రం డబ్బింగ్‌ని కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆఖరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నేటి నుంచి నాగ్, కథానాయిక రిచా గంగోపాథ్యాయ, వందమంది డాన్సర్లపై నృత్యదర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో ఓ మాస్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు వీరభద్రం. భాస్కరభట్ల రాసిన ఈ పాట కోసం 60 లక్షలతో అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్‌ని నిర్మించారు. ఈ నెల 20న పాటలను విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. -
24 గంటల్లో 2 లక్షల 50వేల హిట్స్ సాధించిన భాయ్
‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్. ఇంకోటి భాయ్’ ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’ ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’ ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ‘భాయ్’ ప్రచార చిత్రంలో నాగార్జున ఆధునిక శైలిలో పలికిన సంభాషణలివి. విడుదల చేసిన 24 గంటల్లో రెండు లక్షల 50 వేల హిట్స్ ఈ ప్రచార చిత్రానికి లభించాయని ఈ చిత్రదర్శకుడు వీర భద్రం చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘అభిమానులే కాక, యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఈ సంభాషణలు ఆనందింపజేస్తుండటం ఆనందంగా ఉంది. అంచనాలకు ఈ సినిమా ఏ మాత్రం తగ్గదని నమ్మకంగా చెప్పగలను. దర్శకునిగా నా మూడో సినిమానే అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం, గొప్ప కథానాయకుడైన నాగార్జునకు నేను దర్శకత్వం వహించడం నా అదృష్టం. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 1, అదే నెలలో సినిమా కూడా విడుదల చేస్తాం’’ అన్నారు. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. బహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయగ్రాహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు. -
న్యూలుక్‌తో ‘భాయ్’
మంచి పాత్రలు ఎన్ని పోషించినా... ఇంకా కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతుంటారు. నాగార్జున. తన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. ఇటీవలే విడుదల చేసిన ‘భాయ్’ ఫస్ట్‌లుక్ చూస్తే... అది నిజమని ఎవరైనా అంగీకరించాల్సిందే. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఆహార్యమే కాదు, పాత్ర చిత్రణ కూడా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నేడు ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక నిర్మాత ఎన్.సాయిబాబు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దర్శకునిగా ఆయనకిది మూడో సినిమా. కచ్చితంగా హేట్రిక్ విజయాన్ని సాధిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే సినిమా ఇది. ‘భాయ్’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. నేటి సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియో వారి అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 1న పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియాకౌర్, కామ్నాజఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, డా.బ్రహ్మానందం, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, సయాజీషిండే, రాహుల్‌దేవ్, ఆదిత్యమీనన్, సుప్రీత్, అజయ్, నాగినీడు, గీతాంజలి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్. -
‘భాయ్’ స్టిల్స్
నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, ఫేస్బుక్ పేజ్, అన్నపూర్ణ స్టూడియో వెబ్‌సైట్‌ను నాగార్జున ఆవిష్కరించారు. -
'భాయ్' ఫస్ట్ లుక్ స్టిల్స్
అక్కినేని నాగార్జున తాజా చిత్రం భాయ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వైవిధ్యంగా ఉన్న మూడు స్టిల్స్ కూడా ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకర్సిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న భాయ్ చిత్రానికి దర్శకుడు వీరభద్రం. భాయ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Courtesy: https://www.facebook.com/AnnapurnaStudios -
700 ఏళ్ల కోటలో 'భాయ్' ఆట
అది అందమైన కోట. ఆ కోటకు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కోటలో నాగార్జున హుషారుగా డాన్స్ చేశారు. ఈ కోటను, నాగ్ చేసిన డాన్స్‌ని ‘భాయ్’లో చూడొచ్చు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఈ పాటను చిత్రీకరించారు. స్లోవేనియాలోని ప్రెజామా కాజిల్‌లో చిత్రీకరించిన ఈ పాట కనువిందుగా ఉంటుందని, కోటలో షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని నాగార్జున పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించాలనుకున్నారట. కానీ పాట సీక్వెన్స్‌కి ఆ లొకేషన్ నప్పకపోవడంతో స్లోవేనియాలో చిత్రీకరించారు. త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రంలో కామ్న జెఠ్మ లానీ ప్రత్యేక పాత్ర చేశారు. అలాగే ఓ ఐటమ్ సాంగ్‌కి నథాలియా కౌర్ కాలు కదపగా, మరో ఐటమ్ సాంగ్‌కి హంసానందిని నర్తించారు. నాగార్జున సోదరిగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా పరిచయమైన జరా షా నటించారు. తమిళ నటుడు, స్నేహ భర్త ప్రసన్న ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరిచారు. నాగార్జున, ఇతర టీమ్ సభ్యులు అందించిన సహకారంతో ఈ సినిమాని అనుకున్నట్లుగా తీయగలిగానని, బాగా వచ్చిందని వీరభద్రం చౌదరి పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారట. -
విదేశాల్లో చక్కర్లు కొడుతున్న 'భాయ్ '
నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ చిత్ర సన్నివేశాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యే కొన్ని చిత్ర సన్నివేశాలను స్లొవేనియా దేశంలో 700 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఒక కోటలో నిర్మించారు. కాగా, కొన్ని పాటలను ఐస్లాండ్లో చిత్రీకరించారు. కోట సన్నివేశాల గురించి హీరో నాగార్జునతో మాట్లాడితే.. ఆ పురాతణమైన కోటలో నిర్మించిన పాట చిత్రీకరణ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. అక్కడ షూటింగ్ చేయడం ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్నారు. దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఇప్పటికే టాకీని ముగించాడు. ఇంకోవైపు డబ్బింగ్ జరుగుతోంది. కామ్నజఠ్మలానీ ఇందులో తెలంగాణా యాసలో మాట్లాడనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాఫియా నేపథ్యమైనా అది ఎక్కువగా ఉండదని అంటున్నారు. రిచా, హంసానందిని, కామ్న, నథాలియాకౌర్ వంటి వారు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈనెల 16న ఆడియోను విడుదలచేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం మరియు జయప్రకాశ్ రెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జునలోని మాస్ యాంగిల్‌ని క్లాస్‌గా ప్రెజెంట్ చేస్తూ వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంభాషణలు చాలా శక్తిమంతంగా ఉంటాయనేది యూనిట్ వర్గాల సమాచారం. కామెడీ, యాక్షన్ కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటాయని చెబుతున్నారు.