నాగార్జున 'భాయ్' రెడీ
హైదరాబాద్‌కు చెందిన మాఫియా డాన్... హాంగ్‌కాంగ్‌లోలా ఓ భాయ్‌కి రైట్ హ్యాండ్.. ఓ సాదా సీదా వ్యక్తి. ఈ మూడూ నాగార్జునే. మూడు పాత్రల్లోనూ వ్యత్యాసం చూపించేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా నాగార్జున మూడు పాత్రల్లో అలరించబోతున్న చిత్రం ‘భాయ్’. ఇందులో నాగార్జున పాత బస్తీ మాండలికంలో కూడా కొన్ని డైలాగులు మాట్లాడారు.
అహ నా పెళ్లంట, పూలరంగడులాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు వీరభద్రం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటించారు.
దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను అక్టోబర్ 1న, సినిమాని 11న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. యాక్షన్, రొమాన్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాలవారు చూసే విధంగా ఉంటుందని వీరభద్రం అంటున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. సాయిబాబు.