24 గంటల్లో 2 లక్షల 50వేల హిట్స్ సాధించిన భాయ్
24 గంటల్లో 2 లక్షల 50వేల హిట్స్ సాధించిన భాయ్
Published Mon, Aug 19 2013 11:55 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్. ఇంకోటి భాయ్’ ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’ ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’
ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ‘భాయ్’ ప్రచార చిత్రంలో నాగార్జున ఆధునిక శైలిలో పలికిన సంభాషణలివి. విడుదల చేసిన 24 గంటల్లో రెండు లక్షల 50 వేల హిట్స్ ఈ ప్రచార చిత్రానికి లభించాయని ఈ చిత్రదర్శకుడు వీర భద్రం చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘అభిమానులే కాక, యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఈ సంభాషణలు ఆనందింపజేస్తుండటం ఆనందంగా ఉంది.
అంచనాలకు ఈ సినిమా ఏ మాత్రం తగ్గదని నమ్మకంగా చెప్పగలను. దర్శకునిగా నా మూడో సినిమానే అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం, గొప్ప కథానాయకుడైన నాగార్జునకు నేను దర్శకత్వం వహించడం నా అదృష్టం. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 1, అదే నెలలో సినిమా కూడా విడుదల చేస్తాం’’ అన్నారు. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
బహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయగ్రాహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు.
Advertisement
Advertisement