
దాతియాలోని పీతాంబర పీuŠ‡లో అభిషేకం చేస్తున్న రాహుల్ గాంధీ
దాతియా/న్యూఢిల్లీ: పేదలను పట్టించుకోని ప్రధాని మోదీకి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ వంటి వ్యాపార వేత్తలతో మాత్రం భాయి అనుకునేంత సన్నిహిత సంబంధాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘బడా వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, అనిల్ అంబానీలను భాయి అని మోదీ సంబోధిస్తుంటారు. అదే ఒక కార్మికుడు, ఒక పేద, ఒక రైతును భాయి అని పిలవడం గానీ, హత్తుకోవడం గానీ మోదీ చేయలేరు. ఎందుకంటే ఆయన హృదయంలో అలాంటి వారికి స్థానం లేదు’ అని అన్నారు.
ఆలయంలో రాహుల్ పూజలు
మధ్యప్రదేశ్‌లోని దాతియాకు చేరుకున్న రాహుల్ ముందుగా ప్రఖ్యాత మా పీతాంబర పీఠ్ ఆలయంలో పూజలు చేశారు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత రాహుల్ నానమ్మ ఇందిర(1979లో), తండ్రి రాజీవ్ గాంధీ(1984లో) ప్రధానమంత్రులు అయ్యారని కాంగ్రెస్ నేత పంకజ్ తెలిపారు.
ప్రజల ఆకలినీ తీర్చలేని మోదీ
ప్రసంగాలు ఇస్తూ, జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న మోదీ ప్రజల ఆకలి గురించి మర్చిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 119 దేశాల్లో భారత్ స్థానం 103కు పడిపోవటంపై విమర్శించారు. యోగాసనాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మోదీ ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యతను విస్మరించారని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment