పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా | Parliament Session On Dec 19th Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా

Published Thu, Dec 19 2024 10:43 AM | Last Updated on Thu, Dec 19 2024 1:08 PM

Parliament Session On Dec 19th Live Updates

Parliament Session Live Updates..

👉పార్లమెంట్‌ వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. 

తోపులాట ఇలా జరిగింది.. 
👉ఇండియా బ్లాక్‌, బీజేపీ నేతలు ఒకరిపైపు ఒకరు దూసుకెళ్లారు. నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో గుంపు ఏర్పడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతోనే ఆయన కింద పడిపోయినట్టు తెలుస్తోంది. 

 

పార్లమెంట్‌ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయం

  • పార్లమెంట్‌ బయట కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
  • ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగీ కింద పడిపోయారు. దీంతో, ఆయనకు కంటి వద్ద గాయమై స్వలంగా రక్తం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 
  • ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ సారంగి మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ తోసివేసినట్టు చెప్పారు. రాహుల్‌ కారణంగానే తాను గాయపడినట్టు ఆరోపించారు. 

     

  • అనంతరం, రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్‌ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను లాగే ప్రయత్నం జరిగింది. అనంతరం, లోపులాట చోటుచేసుకుంది. 

 

లోక్‌సభ వాయిదా


రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం  2 గంటలకు వాయిదాపడ్డాయి.

పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు

  • పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.
  • రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్‌
  • అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌
  • నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు
  • కాంగ్రెస్‌ పార్టీనే అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన

 

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇంకా బీజేపీ చేసేదేమీ లేదు. అమిత్‌ షా దేశానికి హోంశాఖ మంత్రి. అంబేద్కర్‌పై అలా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. ఆయన అంబేద్కర్‌కు క్షమాపణలు చెప్పడం నేరమేమీ కాదు కదా?. అంబేద్కర్‌ది దేవుడి లాంటి వ్యక్తిత్వం.  దేశంలోని వెనుకబడిన వారికి గౌరవం అందించిన వ్యక్తి. అంబేద్కర్‌ విషయంలో అమిత్‌ షా తప్పుడు పదాలు ఉపయోగించారు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement